Menu

వరల్డ్ సినిమా నిజంగా అంత గొప్పదా???

World Cinemaచాలామంది దగ్గర వింటూ ఉంటాం!! మన సినిమా ఎప్పుడు విదేశీ సినిమాల స్థాయిని అందుకుంటుంది?

ఎప్పుడు మన సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది?

మనకి ఎంతకాలం ఈ కధాబలం లేని కమర్షియల్ సినిమాలు చూస్తాం? అని.

అసలు పులిని చూసి నక్క వాత పేట్టుకోవాలా? లేదా నక్కని చూసి పులి చర్మాన్ని సాపు చేసుకునే ప్రయత్నం చేయ్యాలా? ఏది చేయనక్కరల్లేదు.

మనం గొప్పగా పోగుడుతున్న వరల్డ్ సినిమా లోని గొప్పతనమంతా దాని Diversification..లోనే ఉంది. Experimentation దానికి ఊపిరి పోస్తోంది. కొత్త కధలతో జరిగినా పాత కధలతో జరిగినా ఇవే సినిమాని నిలబెడతాయి. అలాగే కళ సమాజ ప్రతిబింబంగా ఉన్నంత కాలమే దానికి ఆదరణ ఉంటుంది. విదేశీ సినిమాల్లో మనం గొప్పగా మెచ్చుకునేవి Iranian–European—అలాగే ఏ దేశానికి చెందినవైనా.. ఏ ప్రాంతానికి చెందినవైనా మంచి కధాబలమున్న సినిమాలు, అరుదైన కధలతో లేదా కధనంతో, చరిత్రలో చెప్పకుండా మిగిలిపోయిన కధలుతో వచ్చే సినిమాలు. మనం సాధించాలనుకునేది American(Hollywood) సినిమాల స్ధాయి ఖ్యాతి, వ్యాపారం. అవన్ని కూడా తమ దేశ పరిస్థితులను, నమ్మకాలను ప్రతిబింబిస్తూ వచ్చిన సినిమాలే.

కానీ ఆ వైవిధ్యం మనని కట్టి పడేస్తుంది. ఒక సినిమాలో పిల్లవాడి అత్యంత ప్రితిపాత్రమైన బూటు పోవడమే కధ. మరో సినిమాలో హిట్లర్ ని చంపబోయి భంగపడిన వారి కధ. ఇంకో సినిమాలో క్యాసినోవా కల్చర్ కనబడోచ్చు. హ్యారీపోట్టర్ లాంటి సినిమాల్లో గ్రాఫిక్ మాయాజాలమే కధ. ఒక సినిమాలోనైతే కేవలం అద్భుతకల్పనల హీరో చేసిన సాహసాలే కధ. ఈ మాత్రానికే అవి మన సినిమాల కన్నా గొప్పవి అయిపోతాయా? అవ్వవు……..ఇక్కడ మనకి ఉన్నట్టే అక్కడా కమర్షియల్ సినిమాలకే పట్టం కట్టే ఆచారం ఉంది. మనకంటే ఎక్కువగా ఉంది. మనవి ఒక్కసారి కధలే కొనసాగింపులు ఉండవు…….అక్కడ కొనసాగింపుకి నోచుకునే సినిమాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ తీసిన సినిమాలు తీస్తూన్న సినిమాలు ఉన్నాయి. అన్ని మనం అక్కడ నుంచీ నేర్చుకున్నవే.

మన సినిమాల్లో ముందు రోజుల్ని అంటే 50-68 మధ్యకాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తాం. అప్పుడూ కమర్షియాల్టికి విలువ ఎక్కువ. అయినా అప్పటివి గొప్ప సినిమాలు కావడానికి కారణం వాటిల్లో ఉన్న వైవిధ్యం. అంతే!!

కమర్షియల్ గా ఆలోచించకూడదు కేవలం కళగా ఆదరించాలి అని అందరూ ఆనాడూ అనుకోలేదు. ఆర్టు సినిమాలుగా ముద్రపడ్డవీ ఉన్నాయి…..కేవలం కమర్షియల్స్ అని చీదరించుకున్న సినిమాలూ ఉన్నాయి. అయినా గుర్తుండడానికి కారణం, అవి సమాజాన్ని దాటిపోలేదు. మంచి ఎదో అదే చేప్పాయి.. చూపించాయి. రుగ్మతల్ని ఎత్తిపోడిచాయి. జనాదరణకు పట్టం కట్టాయి. ఏ సినిమా ప్రపంచంలోనైనా జరిగేది ఇదే. ఏవ్వరూ సినిమాని తమ కోసం తీయ్యారు జనం కోసమే తీస్తారు. గుర్తింపు కోసం తీస్తారు.

మన తరువాత కాలంలో అప్పుడప్పుడు మాత్రమే వైవిధ్యాన్ని చూడగలిగాం. ఇప్పుడు అస్సలు చూడటం లేదు. దీనికి కారణం మనలో ఉన్న భయం. మనకి తెలియని శక్తి అంటే భయం, విజయం గురించి భయం, పడుకుంటే లేస్తామా లేదా అనే భయం. పైగా డబ్బు పేడుతున్నవారు తమ భవిష్యత్తును తాకట్టుగా పేడుతున్నారు, తీస్తున్నవారి పరిస్థితి అంతే. ఇదే భయం ఒకరోజు మనకి పాఠాలు నేర్పింది. కొత్తదనం వైపు నడిపింది. కానీ ఇవాళ భయానికి లోంగిపోయి, కృంగిపోతున్నాం. అది మారనంత వరకూ మనం ఇంతే……………

వరల్డ్ సినిమాలో గొప్పతనం కన్నా నిబ్ధత ఉంది. దాన్నే మనం అనుసరించాలి. వారి భారీతనాన్ని అనుకరించకపోయినా ఫర్వాలేదు. నిబ్ధత మనలో పెరిగిన నాడు మన సినిమా వరల్డ్ సినిమాని మించుతుంది.

అందుకే వరల్డ్ సినిమా అంత గొప్పదేమీ కాదు. దాన్ని నిలబెడుతున్న వారి నిబ్ధతే గొప్పది.

సమాజాన్ని ప్రతిబింబిస్తూ, వైవిధ్యానికి కట్టుబడి ఉంటే మన సినిమానే వరల్డ్ సినిమా అవుతుంది!!

–నరేష్ కోట

6 Comments
    • నరేష్ కోట August 28, 2009 /
  1. Yadhu August 28, 2009 /
    • naresh August 28, 2009 /
  2. కొత్తపాళీ August 28, 2009 /
    • naresh August 28, 2009 /