Menu

హోమ్ సినిమా-what an idea!

ఔత్సాహిక సినిమా దర్శకుడిగా దాదాపు ప్రతి రోజూ నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కలుస్తూనే వుంటాను. వారిలో ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఆ తర్వాత కొనాళ్ళకి సినిమా ఛాన్స్ కొట్టేద్దామనుకునే వాళ్ళతో పాటు మనమే స్వంతంగా ఎలాగైన సినిమా తీసి మన టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అవే వస్తాయనే వాళ్ళూ ఉన్నారు. అయితే సొంతంగా సినిమా తీయడమంటే మాటలు కాదు. సినిమా తీసేంత డబ్బు అందరి దగ్గరా ఉండాలి కదా!

మన తెలుగులో చూసినట్టయితే సొంతంగా డబ్బులుపెట్టి సినిమా తీసి విజయం సాధించిన వారిలో శేఖర్ కమ్ముల, నగేష్ కూకునుర్, రాధాకృష్ణ జాగర్లమూడి ప్రముఖులు. అయితే ఇలా ఎవరో నిర్మాత దొరికితేనో లేదా మనమే నిర్మాతగా మారితేనో తప్ప సినిమా తియ్యలేమా? సినిమా నిర్మాణానికి మరేదైనా మార్గాలున్నాయా? అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఉందనే చెప్పాలి. అదే కో-ఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్.

కో-ఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ ద్వారా సినిమా అనే మాధ్యమాన్ని డబ్బున్న వాళ్ళ చేతుల్లోనుంచి విముక్తి కలిగించాలన్న ధ్యేయంతో 1984 లో కేరళకు చెందిన జాన్ అబ్రహం ’ఒడెస్సా కలెక్టివ్’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా నిర్మించిన చిత్రమే అమ్మ అరియన్. నేటికీ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనం. కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా వీధి నాటకాలు, మంచి సినిమా ప్రదర్శనలు లాంటివి కూడా ఒడెస్సా లో భాగమే. అమ్మ అరియన్ సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఈ సినిమాని ఊరూరా తిరుగుతూ ఉచితంగా ప్రదర్శించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన అకాల మరణంతో ఒడెస్సా కలెక్టివ్ కూడా మరుగునపడిపోయింది.

అయితే జాన్ అబ్రహం ఒడెస్సా కలెక్టివ్ కి పదేళ్ళకి ముందే శ్యామ్ బెనగల్ కో-ఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ అసాధ్యం కాదు అని నిరూపించివున్నాడు. గుజరాత్ లోని ఐదు లక్షల మంది రైతుల వద్దనుంచి రెండు రూపాయాల చొప్పున సేకరించగా వచ్చిన పది లక్షల రూపాయాలతో రూపొందించిన చిత్రమే మంథన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయమే సాధించింది.

ఇలాంటి కొన్ని ఉదాహరణలు తప్పితే కో-ఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ ద్వారా పూర్తి స్థాయిలో సినిమా నిర్మాణం జరిగిన ఉదంతాలు తక్కువే అని చెప్పాలి.అయితే సినిమా నిర్మాణానికి ఈ ఐడీయా ఎలా ఉంటుందో చూడండి.

“మీకు ఇప్పుడొస్తున్న సినిమాలు అస్సలు నచ్చటం లేదు. పోనీ మంచి సినిమా నిర్మిద్దామంటే అంతంత డబ్బులు మీ వద్దలేవు. లక్షలు కోట్లు మీ దగ్గరలేవు. కానీ ఒక ఐదొందలు ఉన్నాయా? ఉంటాయి.ఈ రోజుల్లో ఐదొందలంటే ఏముంది. గట్టిగా రెండు బిర్యానీలు కూడా రావు. సో ఆ రెండు బిర్యానీలు మీవి కావనుకుని ఒక ఐదొందలు మాకిస్తే మేము మీకొక మంచి సినిమా నిర్మించి పెడ్తాము.” అని ఎవరైనా అంటే ఇదేదో మన డబ్బులు కొట్టేసే స్కీమ్ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇలా చెప్తున్నవారిలో కె.బాలచందర్, బాలూ మహేంద్ర, మహేంద్రన్ లాంటి ప్రముఖ దర్శకులుంటే అప్పుడేమంటారు?

అవునండీ ఈ మధ్య చెన్నైలో కోలం అనే సంస్థ ద్వారా కో-ఆపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ మరో సారి తెరపైకొచ్చింది. ప్రముఖ తమిళ రచయిత మరియు నాటకరంగ ప్రముఖుడు జ్ఞాని కోలం (ముగ్గు) అనే ఈ సంస్థ రూపకల్పన చేశారు. రెండు వేల మంది సభ్యుల దగ్గరనుంచి ఐదొందల రూపాయల చొప్పున సేకరించగా వచ్చిన డబ్బుతో సినిమా నిర్మాణం చేపట్టి ఆ సినిమాను డివిడి ద్వారా సభ్యులకు అందించడం ఈ సంస్థ లక్ష్యం.

కోలం గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి

30 Comments
 1. గీతాచార్య August 19, 2009 /
 2. alibhai August 19, 2009 /
 3. శంకర్ August 19, 2009 /
 4. Sarath 'Kaalam' August 19, 2009 /
 5. su August 19, 2009 /
   • su August 19, 2009 /
   • chandrasen August 20, 2009 /
  • విజయవర్ధన్ August 19, 2009 /
 6. శరత్ 'కాలం' August 19, 2009 /
  • విజయవర్ధన్ August 19, 2009 /
  • అబ్రకదబ్ర August 19, 2009 /
   • vamsi November 23, 2010 /
  • శంకర్ August 19, 2009 /
   • విజయవర్ధన్ August 19, 2009 /
 7. మేడేపల్లి శేషు August 19, 2009 /
 8. suresh peddaraju August 19, 2009 /
   • suresh peddaraju August 19, 2009 /
 9. మేడేపల్లి శేషు August 19, 2009 /
 10. sivaji August 19, 2009 /
 11. Sarath 'Kaalam' August 19, 2009 /
 12. john August 22, 2009 /
 13. vamsi November 23, 2010 /