ముప్పైతొమ్మిదేళ్ళ వయసు.
దర్శకుడిగా తొమ్మిది సినిమాలు.
నటుడిగా ఏడు సినిమాలు
మూడు జాతీయ అవార్డులు
అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు..
కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు.
రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది.
దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు తీసాడు. ఇవన్నీ ఆర్థికంగా కూడా విజయవంతమైన చిత్రాలవ్వడం ఒక విశేషం.
‘ఆటోగ్రాఫ్’(2004) సినిమాతో చేరన్ నటజీవితం ఆరంభమయ్యింది. కొందరు నటులు ఆ పాత్రను చెయ్యడానికి సిద్ధపడకపోతే తానే చెయ్యబూనడంతో తమిళ తెరకు మరో కొత్త “నటుడు” దొరికాడు. ఈ సినిమాని తెలుగులో ‘నా ఆటోగ్రాఫ్’ గా తీసినప్పటి నుంచీ చేరన్ పేరు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమయ్యింది.
ఆ తరువాత నటుడిగా బిజీగా ఉంటూనే ‘తవమై తవమిరుందు’(2005) తీసి, మరొక్కసారి తన బ్రాండ్ ఆఫ్ human emotions ని తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా ఆసంవత్సరం దాదాపు అన్ని రాష్ట్రస్థాయి అవార్డుల్నీ అందుకుంది. ఒక జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది.
ఆ తరువాత తన దర్శకత్వంలో వచ్చిన ‘మాయకన్నడి’(2007) నిరాశపరిచింది. కానీ 2008 లోవచ్చిన ‘పిరవుం సందిప్పోం’,‘రామన్ తేడియ సీతై’ ఒక సక్సెస్ ఫుల్ నటుడిగా నిలిపాయి.
ఈ సంవత్సరం చేరన్ దర్శకత్వం వహించిన ‘పొక్కిసం’ ఈ మధ్యనే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల మన్ననలు అందుకుంటోంది.![]()
త్వరలో ‘ఆటోగ్రాఫ్ – 2’ అని ఆ చిత్రానికి సీక్వెల్ తియ్యబోతున్నాడు.
చేరన్ ఏ సినిమా తీసినా మానవసంబంధాల గురించో లేక సామాజిక బంధాల గురించో ఏదో ఒక సీరియస్ విషయాన్ని చెబుతాడనే నమ్మకం తమిళ పరిశ్రమలో ఉంది. ఇతర భాషా చిత్ర పరిశ్రమలు రీమేకుకో-డబ్బింగుకో పనికొచ్చే సినిమా అయ్యుంటుందనే ఆశలో ఖచ్చితంగా ఉంటారు.
శివాజీ గణేషన్ అభిమానిగా సినీపరిశ్రమకొచ్చిన ఈ తమిళ దర్శకుడు, కమల్ హాసన్ లాగా సినిమా కోసం జీవిస్తాననే ఆశయం వెలిబుచ్చుతాడు.
cric says:
Script: http://navatarangam.com/publish/wp-content/themes/zenko/scripts/js/wp-highlight_src.js:135
This script is giving error in latest firefox ////
శిద్దారెడ్డి వెంకట్ says:
Thanks for letting us know. We will soon correct it.
కొత్తపాళీ says:
మంచి పరిచయం. ఆటోగ్రాఫ్ సినిమా తమిళంలో చూశా. హీరో నటన మరీ నీరసంఘా అనిపించింది మొదట్లో. సినిమా అంతా పూర్తయ్యేప్పటికి అతన్ని చాలా మెచ్చుకున్నా. వృత్తి నటుల్ని, స్టార్లని పెట్టి ఉంటే కచ్చితంగా ఓవరేక్షను చేసి ఉండేవాళ్ళు.
I shudder even to think how this movie was in Telugu with Ravi Teja!
సాయి బ్రహ్మానందం says:
మహేశ్ కుమార్ గారూ,
మీ వ్యాసం చాలా నిరాశ పరిచింది.
మీరు చేరన్ గురించి చెప్పిన వివరాలు ఎవరు గూగులించినా తెలుస్తుంది.
వివరాలకీ, విశ్లేషణకీ తేడా చూపించగిలిగితే బావుంటుంది.
పోనీ చేరన్ సినిమాలని విశ్లేషిస్తూ రాసినా బావుండేది. అదీ లేదు.
ఏదో రాసెయ్యాలన్న తహతహ తప్ప ఇందులో ఏమీ లేదు.
మంచి వ్యాసాలు రాయగల సత్తా వుండి ఇలాంటి రాతలు చూస్తే ఎవరికైనా నిరాశే కదా?
కె.మహేష్ కుమార్ says:
@సాయి బ్రహ్మానందం: ఈ వ్యాసం ఉద్దేశం చేరన్ “పరిచయం” మాత్రమే.
గూగులించి తెలుసుకోవడానికి ఇలాంటి దర్శకుడొకడున్నాడని తెలియాలిగా! అలా తెలియజేయడం మాత్రమే ఈ పరిచయం యొక్క ఉద్దేశం. ఏదో రాసెయ్యాలన్న తహతహలో ఇది రాయలేదు. ఇదేరాయాలని రాశాను.
సాయి బ్రహ్మానందం says:
Very good. We learned quite a few things from this. Keep up the good work.
$h@nK@R says:
మంచి పరిచయం.. కొన్ని కొత్త విషయలు సినిమాలు తెలిసాయ్
Srinivas Komanapalli says:
avunu parichayam bagundi…