సంతోష్ శివన్ దళపతి,రోజా,ఇద్దరు, దిల్ సే లాంటి మణిరత్నం సినిమాలలో కీలకపాత్ర వహించిన సినెమాటోగ్రఫర్ గా మనందరికీ పరిచయమే. ‘హలో’,‘మల్లి’ వంటి బాలల చిత్రాల తర్వాత ‘టెర్రరిస్ట్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మధ్య శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘తహాన్ (2008)’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ప్రేక్షకుల ఆదరణను పొందలేదు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ సంస్థ మర్చంట్ ఐవరీ నిర్మించిన Before the rains భారతదేశంలో విడుదలకు సిద్దమౌతోంది.
Before the rains 2007 వ సంవత్సరంలో నిర్మించబడి అమెరికా బ్రిటన్ లలో ప్రదర్శితమైనా, భారతదేశంలో ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. ఈ ఆగష్టు మాసంలో ఈ సినిమాను ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇజ్రాయిలీ సినిమా Asphalt Zahov ఆధారంగా నిర్మించబడినా, భారతీయ నేపధ్యానికి అనుకూలంగా మలుచుకోబడింది.
1930 లలో బ్రిటిష్ కాలం నాటి కేరళలోని మలబార్ జిల్లాలో ఒక భారతీయ యువకుడు. ఒక బిటిష్ ప్లాంటేషన్ యజమాని. ఆ బ్రిటిష్ యజమాని ఇంట్లో పనిచేస్తూ తనతోనే ప్రేమలో పడే ఒక భారతీయ స్త్రీ కథ ఈ సినిమా. స్వాంతంత్ర్య సమరస్పూర్తి, వ్యక్తిగత ఆకాంక్ష, ప్రేమ, అసూయ, ద్వేషం మధ్యన ఊగిసలాడే ఒక మానవీయకథాంశంతో రూపొందించిన చిత్రం ఇది.
రాహుల్ బోస్, నందితాదాస్,లైనస్ రోచే, జెన్నిఫర్ అహ్లే, జాన్ స్టాండింగ్ నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినా, నటీనటుల నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినెమాటోగ్రపీ ఎన్నో అభినందనల్ని అందుకుంది. ఖచ్చితంగా చూడదగిన చిత్రం అనిపిస్తోంది. దగ్గర్లో ఎక్కడైనా వస్తే…don’t miss it
శిద్దారెడ్డి వెంకట్ says:
నేను లండన్ లో ఈ సినిమా చూశాను. ఇది ఇజ్రాయలీ సినిమా అయిన యెల్లో ఆస్ఫాల్ట్ అనే సినిమాలోని మూడు కథల్లో ఒకటి తీసుకుని భారతీయ నేపథ్యానికి అనువదించారు. 30 నిమిషాల కథను రెండు గంటలకు పొడిగించడం వల్ల, అలాగే సినిమా కథను రామాయాణానికి ప్యారలల్ గా రూపొందించడంలో కథలోని సన్నివేశాలు అక్కడక్కడా ఫోర్స్ చేసినట్టుగా ఉంటుంది. అయినా కూడా నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ కోసం ఈ సినిమా తప్పక చూడొచ్చు.
raman says:
ఛెన్నై నుండి ఓ స్నెహితుడు మరీ మరీ పిలిచి చెప్త్ ఈ సిన్మా గత సంవత్సరం చూసాను
నెను ఇజ్రాఇల్ సిన్మా ఎల్లొ అస్ఫల్ట్ కూడా చూసాను.
మన నెటివిటి కి బాగా అన్వ ఇంచి తీసారు
screenply, Photography చాలాబాగుంది
ఒకసారి తప్పకుండా చూడండి .