Menu

A Wednesday గురించి నా అభిప్రాయం

ఈ వారాంతంలో  “A a-wednesday-lead” సినిమా చూసాను. ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ముందు నా దృష్టిలో సినిమా అంటే ఎలా వుండాలో నా అభిప్రాయన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తాను.

సినిమాలోణీ ఏ ఫ్రేం అయినా సరే మూడు కేటగరీస్ లో ఉండాలని నేను అనుకుంటాను. ఏదైనా ఒక ఫ్రేం ని ప్రేక్షకుడు చూస్తు వున్నప్పుడు ..ఆ ప్రేక్షకుడు “ఒహ్, ఇలా జరిగింది లేదా ఇలా జరుగుతుంది లేదా ఇలా జరగాలి”  అనే అనుభూతికి లోనైతె ఆ సినిమా తీసిన డైరెక్టర్ తన క్రుషి లొ సంపూర్ణ విజయం సాధించినట్లె అని నా అభిప్రాయం.

ఇక నా థియరి ప్రకారం “A Wednesday” సినిమా ని చూస్తే ప్రతి ఫ్రేం లొ పైన చెప్పిన మూడింట్లో ఏదో ఒక అనుభూతి కి లోనవుతాము.

నారిమన్ పాయింట్ బీచ్ ఒడ్డున కూర్చున్న ఆనుపం ఖేర్ తను పొలీసు ఆఫీసర్ గా వున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన వివరిస్తూ వుండడంతో కథ మొదలవుతుంది. ఫ్లాష్ బాక్ లోకి వెలితే నసీరుద్దిన్ షా  ఒకింత అనుమానస్పదంగా ముంబై రైల్వే స్టేషన్ నుండి ఒక పొలీసు స్టేషన్లో అడుగిడి తన పర్సు పోయింది అని కంప్లైంట్ చేస్తాడు. ఒకింత అసహానానినికి ,అశ్చర్యాని కి గురైన అక్కడి పోలీసు ఆఫీసర్ కంప్లైంట్ తీసుకుంటాడు. ఆ తరువాత వడి వడిగ బాత్ రూం లోకి వెళ్ళి, అక్కడ ఒక బాగ్ దాచి వస్తాడు – ఈ ఓపెనింగ్ సీను లోనే డైరెక్టెర్ మన మైండ్ లొ ఎన్నో అనుమానాలని రేక్కెత్తిస్తాడు -ఎం జరగ బోతుంది అనే ఒక క్యూరియాసిటి క్రియేట్ చేస్తాడు- ఇక నా థియరి ప్రకారం ఈ సీన్ చూస్తే : బ్యాగ్స్ లో బాంబ్స్ పెట్టడం కామన్- ఇది జరిగింది మరియు జరుగుతుంది అని ప్రేక్షకుడు వెంటనే కనెక్టు కాగల్గుతాడు.

ఆ తరువాత, ముంబైలో ఎక్కడో ఒక టాప్ ఫ్లోర్ పైన కూర్చున్న నసీరుద్దిన్ షా, అత్యాధునికమైన టెక్నాలజి, గాడ్జెట్స్ ఉపయోగించి, మొబైల్ ఫోన్ లొ సింకార్డ్ మార్చి లాప్ టాప్ తొ కనెక్టు చేసి, ముంబై పొలీసు ఆఫీసర్  అనుపెం ఖేర్ కి కాల్ చేసి ముంబై లో ఆరు చోట్ల బాంబ్స్ పెట్టాను,తన డిమాండ్స్ ని తీర్చకుంటే పేల్చి వేస్తాను అని ఫోన్ చేస్తాడు. అనుపం ఖేర్ వెంటనే వార్ రూం పొలీసు ఆఫీసర్స్ సహయంతో నసీరుద్దిన్ షా ని ట్రాక్ చెయ్యగల్గుతాను అనుకుంటాడు కాని
నసీరుద్దిన్ షాహ్ వాడుతున్న టెక్నాలజి కి పొలీసు వర్గం అవాక్కు అవుతారు. ఈ లోపు పొలీసులు నసీరుద్దిన్ షాహ్ పొలీసు స్టేషన్ లొ పెత్తిన బంబ్ ని ఐడెంటిఫై చేసి దానిని RDX గా కంఫిర్మ్ చేస్తారు. ఈ సన్నివేశంతో ప్రేక్షకుడు లోని క్యూరియాసిటి ఇంకా పెరుగుతుంది.

నసీరుద్దిన్ షాహ్ ఒక వైపు పొలీసుల తో మాట్లాడుతునే టీవి రిపొర్టర్ కి ఇంఫర్మషన్ ఇస్తూ వుంటాడు.నసీరుద్దిన్ షాహ్ తన డిమాండ్స్ గా జైల్లో వున్న నలుగురు తీవ్రవాదులను ఒక ఎయిర్ స్ట్రిప్ లోని రన్ వే పైకి తీసుకు రమ్మని చెప్తాడు. ముఖ్యమంత్రితో  మాట్లాడిన అనుపం ఖేర్ వేరే ఆప్షన్ లేక నలుగురు తీవ్రవాదులను ఎయిర్ స్ట్రిప్ కి పంపిస్తాడు. వచ్చినది తను అనుకున్న తీవ్రవాదులే అని కన్ఫర్మ్ చేసుకున్న నసిరుద్దిన్ షా, వాళ్ళని ఒక బెంచ్ పైన కూర్చొమంటాదు.

ప్రేక్షకుడు ఆశించినట్లే నలుగురు తీవ్రవాదులను నసీరుద్దిన్ షా యెక్కడ విడిపించుకుని పొతాడో అనే ఉద్దేశం తో ఎస్కార్ట్ గా వెళ్ళిన పొలీసు ఆఫీసర్  నలుగురి లో ఒకడిని తమతో తీసుకెళ్ళుతారు.

నసీరుద్దిన్ షా, సెల్ ఫొన్ బాంబ్స్ సహయంతో ఆ ముగ్గురు తీవ్రవాదులను పేల్చి వేస్తాడు. ప్రేక్షకుడు ఇలా కూడ జరుగుతుందా అనుకొన్న వెంటనే ఇలాగే జరగాలి అనే ఒక అనుభూతి కి లోనవుతాడు. నసీరుద్దిన్ షా కి ఇంక ఒక తీవ్రవాది మిగిలి పొయాడని తెలిసి, పొలీసులకి బాంబ్స్ విషయం చెప్పనని, ఈ లొపు ముఖ్యమంత్రి, అనుపెం ఖేర్ సైతం వేరే ఆప్షన్ లేదని మిగిలిన వాడిని సైతం చంపి వెయ్యడం, దానిని టీవి రిపొర్టర్ సహయం తో కన్ఫర్మ్ చేసుకున్న నసీరుద్దిన్ షా, పొలీసులకి తిరిగి కాల్ చేసి తను ఒక సామన్య మనిషినని, రోజు చచ్చి చెడి బ్రతికే కన్న సమాజానికి ఉపయోగమైన ఈ  పని చేసానని,మరెక్కడ  బాంబ్స్ పెట్టలేధని చెప్తాడు.

ప్రేక్షకుడి లో యెలాంటి సందేహాలు లేకుండా వుండడానికి తను బాంబ్స్ గూర్చి ఎలా తెలుసుకున్నది, ఎలా సమకూర్చుకున్నది కూడ సవివరంగా వివరిస్తాడు…ఈ లోపు ఒక కుర్రాడి సహయంతో నసీరుద్దిన్ షా వున్న ప్లేస్ ని ట్రాక్ చేసి, అనుపం కేర్ నసీరుద్దిన్ షా ని పట్టుకొవడానికి బయల్దేరి వెళ్తాడు. అప్పటికే నసీరుద్దిన్ షా తన వద్ద ఉన్న ఎక్విప్మెంట్ అంత నాశనం చేసి అనుపం కి యెదురుగా వస్తాడు. యెదురుగ వస్తున్న నసీరుద్దిన్ షా ని అనుపమ్ టైం యెంత అని ప్రశ్నిస్తూ ప్రేక్షకుడి మదిలో తన వాయిస్ ని ఐడెంటిఫై చేస్తున్న భ్రమ ని కల్పిస్తాడు. అనుపమ్ కి నసీరుద్దిన్ షా చేశాడు అని తెలిసిన తనని అరెస్ట్ చెయ్యకుండా వుండడం తో కథ సుఖాంతం అవుతుంది. ప్రేక్షకుడు ఇలా జరగాలి అని ఊపిరి పీల్చుకుంటాడు.

ఈ సినిమా కి బలం , మంచి స్క్రీన్ ప్లే మరియు అనుపం ఖేర్ అండ్ నసీరుద్దిన్ షా యాక్టింగ్.

కమల్ హాసన్ ఈ సినిమా ని తెలుగు లో ఈనాడు అని యెందుకు తీస్థున్నడో అనే క్యూరియాసిటి తో చూసి నేను ఒక మంచి సినిమా చూశాను అన్న భావన తో వున్నాను.

అందరు చూడాల్సిన సినిమా.

–చంద్రసేన

27 Comments
 1. Chandrasena August 9, 2009 /
   • Chandrasena August 10, 2009 /
 2. su August 10, 2009 /
 3. Chandrasena August 10, 2009 /
  • su August 10, 2009 /
 4. Chandrasena August 10, 2009 /
 5. Chaitanya August 10, 2009 /
 6. prem August 10, 2009 /
 7. కొత్తపాళీ August 10, 2009 /
 8. మేడేపల్లి శేషు August 10, 2009 /
 9. వెంకట్ ఉప్పలూరి August 10, 2009 /
  • Ravi August 11, 2009 /
 10. మేడేపల్లి శేషు August 11, 2009 /
  • Ravi August 11, 2009 /
   • su August 12, 2009 /
  • su August 11, 2009 /
 11. Chandrasena August 11, 2009 /
  • su August 11, 2009 /
   • chandrasen August 12, 2009 /
   • su August 12, 2009 /
 12. shreepriya October 22, 2009 /