మల్లన్న

wall_800x600_1

మల్లన్న – ఇది ఠాగూర్, అపరిచితుడు , శివాజీ సినిమాలకు రివ్యూ……

సీరియస్ రివ్య్రూ చదవాలి అనుకునేవారు ఇది చదవకండి ……………..

నవతరంగంలో ఠాగూర్, అపరిచితుడు,శివాజీ సినిమాల మీద రివ్యూరాలేదు కదా దాన్ని భర్తీ చేద్దమనుకుని, మల్లన్న సినిమా రివ్యూరాయటం మెదలు పెట్టాను… ( తీర్దంపుచ్చుకున్నాను అనుకునేరు…అదేంలేదు).. రెండేళ్ళూ తీసారు…. సినిమా దెబ్బకు కలైపులి(ఈ సినిమా ప్రోడ్యూసర్) గారు కాస్తా, కలైపిల్లి అయిపోయారు ,ఇక అట్టా తీసిన ఈ సినిమా కష్టాలన్నీ గట్టెక్కిస్తుంది అనిన్నీ, విక్రమ్ , కలైపులి అన్నీ కలిపి సినిమా పోలి కేక అనుకుని వెళ్ళాను.

కధ గురించి:
సూపర్ హీరో సినిమా……….. స్పైడర్ మ్యాన్, బాట్ మ్యాన్, సూపర్ మాన్ … టైగర్ మ్యాన్… ఇప్పుడు కాక్ మ్యాన్ (తెలుగులో చిట్టిమల్లు… బాలయ్య సినిమా గుర్తుండే ఉంటుంది). సదర్ కాక్ మ్యాన్ మన విక్రమ్ గారు రాబిన్ హుడ్ గారి ఏకలవ్య శిష్యుడు. ఉన్నోళ్ళ దగ్గర కొట్టు లేనోళ్ళకు పెట్టు….ఇక పోతే తతిమ్మా విషయాలు – తెలుగు సినిమా హీరోయిన్స్ తండ్రులు విలన్స్ లేదా విలన్ కూతురిని హోరో లవ్ చేస్తాడు… ఇక్కడా అంతే…… అయినోళ్ళకు నొప్పి కలిగినప్పుడు సోసైటీ బాగు చేయల్లన్న యావ పుడుతుంది…ఇందులో కూడా అంతే…. ( నాకు బాగ ఇష్టమయిన ఠాగూర్, అపరిచితుడులో కూడా అంతే కాక పోతే అందులో విషయం ఉంది,ఇందులో నాకు కనపడలేదు) – విలన్స్ నంబర్ కొద్దిగా ఎక్కువే …ఎవడు పెద్ద విలన్ చిన్న విలన్ ….తెలియరాలేదు… చివరుకు మిగిలే వాడు మెయిన్ విలన్ కనుక మీనాకుమారి పాటలో వాడిని అనుకుందాం………… సినిమా ఎలా అయో మయంగా ఉందో …రివ్యూకూడా అంతే ఉంటుంది మరి…. అసలే తెలుగు వాళ్ళాయా నేను… కాపీ కొట్టడం నా జన్మ హక్కు కదూ మరి……..

మరీ ఈ సినిమాలో విక్రమ్ గెటప్పులు మరీ………..
వస్తున్నా అక్కడికే వస్తున్నాను…. ఇలా వచ్చి అలా వెళ్ళీపోయింది మెరుపు తీగ… ఆడ గెటప్ , కోడి గెటప్ మాత్రం కొద్దిగా ఎక్కువ సేపు ఉంటాయి… మిగిలినవి ఎప్పుడొచ్చాయో ఎప్పుడుపోయాయో ఆ జీవుడికే తెలియాలి.

మరి మెక్సికో…. బ్లాక్ మనీ…. వగైరా……….

ఈ బ్లాక్ మనీ ఒకడిదే అంతా, ప్రేమించినట్టు నటించి మోసం చేసిన శ్రీయని, అదే ప్లాన్తో దెబ్బ కొట్టి వాళ్ళ బాబు ఎకౌంట్లో మనీ దొబేస్తాడు.. దానికీ శివాజీ లో లాగా కోద్దిగా టిక్కెట్టు గిట్టుబాటయ్యేలా లాటు మార్పిడీ సీన్ లాంటిది అంటూ పెద్ద ఏమీ లేదు….ఎదో డైరక్టర్ తెరమీదకు రావటానికి ఇండియాలో చూపిస్తే నామర్దాగా ఉంటుంది అన్నట్టు…. డైరక్టర్ గారు…మెక్సికోకు మార్చుకున్నారు…… నిజంగా మెక్సికో లో ఒకడిని చంపటానికి హెలీకాప్టర్ వాడాలా ఏంటి…. ఎక్కడ చంపితే నేమీ ఎవడు అడిగాడు…… నేను “బాడీ ఆఫ్ లైస్” రేంజ్లో కంట్రీలు మారుస్తాడేమో…అనుకున్నాను… తప్పునాదేలేండి…..

పాటలు – మ్యూజిక్ :
విక్రమ్ తన పాటలకు న్యాయం చేశాడు, దరిద్రంగా అయితే లేదు, కాని మరీ నాలుగు పాడటమే ఎబ్బీట్టుగా ఉంది. అలెగ్రా పాట బాగుంది.. నాకయితే అది సెటు అనిపించలేదు… మా ఊరులో రంగనాయకమ్మ పంక్షన్ హాలు అద్దిక తీసుకుని వెనుక బ్లూ స్ర్కీన్ వేసుకుని షూట్ ఫినిష్ చేసి చక్క వి యఫ్ యక్స్ లో ఒక రోమన్ అర్కిటెక్చురల్ వందర్ ఒక దాన్ని తగిలిస్తే అచ్చు అలెగ్రా పాటలానే వస్తుంది…… సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది….

శ్రీయా కొత్త లుక్కు భలే ఉంది కదా…:
హా బానే ఉంది…. శ్రియా బాగానే చేసింది….. కాని……….!!!

రివ్యూలో ఇంతకన్నా రాస్తే .. వీడెవడో బ్లాక్ లో కొనుక్కుని మరీ మెదటి ఆటకు పోయి….. అ కసి అంతా వెళ్ళ గక్కుతున్నాడు అనుకుంటారు….( అమ్మో అది నిజం అని తెలిస్తే …నా పరువేం కాను…)….

ఠాగూర్ – |అపరిచితుడు | కాక్ మ్యాన్
విధ్యార్దులతో |ఒంటరిగా |చిన్న నాటి స్నేహితులతో | తన పంతం నెరవేర్చాడు.
భార్య | చెల్లెలు |స్నేహితుడి ప్రాణం/చేయి(హ్యండ్) | పోవటం వలన సొసైటీ పట్ల తన భాధ్యత గుర్తోచ్చింది.
చీకట్లో,పలుచోట్ల ఒకసారీ | ట్రాన్స్లో, మంత్రాలతో |చీకట్లో కామిడీ/విన్యాసాలు చేస్తూ | జనాలకు అరోగ్యకరమయిన భయం కలిగించారు.
విధ్యార్దులు | వెబ్ సైట్ |చెట్టుకు కట్టిన చీటీలు | చెప్పన దాన్ని బట్టి, హత్య,డబ్బు సహయం చేశాడు.
————————————————————————————————————————-
హిట్ | హిట్ | ఇంకా తెలీదా ….అబ్బే | అయింది…

శివాజీ లో బ్లాక్ మనీ కాన్సెట్ తీసుకుని – ఠాగూర్ , అపరిచితుడు ప్రేములు తీసుకుని వాళ్ళ ఆవడకు తెలీయకుండా వంటిట్లో దూరి మిక్సీలో వేసి ఆ మూడ కధలు రంగరించి ఇంకు తయారు చేసుకుని, వచ్చిన పొగ ను ఒక గ్యాస్ సిలీండర్లో పెట్టుకుని …. కలైపులి ఇంటికెళ్ళీ…. ఆ సిలిండర్లో ముప్పావు వంతు ఉపయోగించి… సినిమాతీసి ఆ మిగిలిన పావు వంతు మీడియావాళ్ళకు ఉపయొగీంచి … రాసిని,తీసిన,దొంగిలించిన దృశ్యకావ్యం…………….

 

చంద్రమౌళి కందుకూరి

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

18 Comments to “మల్లన్న”

  • :D

  • I think I should watch the movie so as to understand your review. :)

  • తమిళ సినిమాల్ని ఓ తెగ పొగిడేసి ఆకాశానికెత్తేసే కొందరు తెలుగోళ్లని నేలకి దించటానికి అప్పుడప్పుడూ తమిళ తెరపై మల్లన్నలు/కందసామిగళ్ ఉద్భవిస్తుంటారు :-)

    Very funny review. కొసమెరుపు పేరాగ్రాఫ్ బ్రహ్మాండం.

    • @అబ్రకదబ్ర: పొడుడుతోంది తమిళ సినిమాని కాదు. తమిళ సినిమాలోని వైవిధ్యాన్ని,నిబద్ధతను.ఒకప్పుడు రజనికాంత్ తో పాటూ కమల్ హాసన్, ఇప్పుడు విజయ్ తో సమానంగా విక్రం,సూర్య వంటి భిన్నమైన అభిరుచి,అభినయ వైదుష్యం కలిగిన నటుల సినిమాలు ఉండటం అక్కడి ప్రత్యేకత.

      బాలచందర్,బాలూమహేంద్ర,భారతీరాజా వంటి దిగ్గజాలస్థానాన్ని అంతే అలవోకగా మణిరత్నం వంటి దర్శకులు substitute చెయ్యగలిగితే, ఈ తరం చేరన్,బాల వంటి వారు కొత్తకొత్తగా వచ్చిన అమీర్,శశికుమార్ వంటి దర్శకులు అంతే వైదిధ్యంతో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. తమిళ సినిమాలో కొత్త గ్రామర్ ని లిఖిస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త నీరు “పెద్దస్థాయిలో” నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంది.

      ఒక సంవత్సంలో వచ్చిన అన్ని తమిళ సినిమాల్నీ చూసుకుంటే వాటిల్లోని భిన్నత్వం అన్ని రకాల ప్రేక్షకుల్ని,విమర్శకుల్ని,కళాకారుల్నీ/సాంకేతిక నిపుణుల్నీ ఏంతోకొంత స్థాయిలో తృప్తిపరిచేదిగానే ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమ అలా ఉందా? అనేది మాత్రమే ప్రశ్న. నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు తమిళ రంగంలో ఉంటే వాటిని నేర్చుకోవడం వదిలి ఆభిజాత్యం ప్రదర్శించడం ఎదుగుదలకి సంకేతం కాదు.

      • గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో !! ;)

        • @Norman Bates: నేను తమిళ సినిమా పరిశ్రమ శైలికి చాలా పెద్ద మద్ధతుదారుని. నవతరంగంలో నా అంత బలంగా తమిళ సినిమా గురించి వకాల్తా పుచ్చుకునేవాళ్ళు మరొకరు లేరు. ఆ విషయంలో నేను “దొంగను” కాను “భుజాలు తడుముకోవలసిన” అవసరం అంతకన్నా లేదు.

          Objective గా బేరీజుచేసినా తమిళ సినిమా ప్రస్తుతం సాంకేతికంగా,విషయపరంగా తెలుగుకన్నా ఖచ్చితంగా ముందుంది. కాబట్టి వారి విధానాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం మనకు చాలా విధాల శ్రేయస్కరం.

        • @Bates,

          what a coincidence! ఇప్పుడే ఎఎమ్‌సి ఛానెల్లో ‘సైకో’ (ఈ మధ్యది – విగో మోర్టెన్‌సన్, జూలియాన్ మూర్) చూసేసి ఇటొస్తే ఇక్కడ బేట్స్ కనపడ్డాడు :-)

          @మహేష్:

          చేరన్ వోకే. బాల కూడా బ్రహ్మాండమైన దర్శకుడంటే నేనొప్పుకోను. అతను తీసింది నాలుగైదు సినిమాలు. అన్నిట్లోనూ ఒకటే పైత్యం .. కాటి కాపర్లు, చితి మంటలు, తిక్క తిక్కగా ప్రవర్తించే కథానాయకులు.

          రజనీకాంత్, కమల్‌హసన్ లతో విజయ్, సూర్య, విక్రమ్‌లని పోల్చటం తొందరపాటే. ఏమిటి వాళ్లు చేసిన విభిన్న చిత్రాలు? చిత్ర విచిత్రమైన గెటప్పులేయటం విభిన్నతా?

          తమిళ సినిమాల్లో తెలుగుకన్నా కధా వైవిధ్యం ఉందంటే ఒప్పుకుంటాను. అదే సమయంలో తెలుగుకన్నా ఛండాలమైన సినిమాలు కూడా తీస్తుంది తమిళ పరిశ్రమ. సమస్యేమిటంటే, ‘కాక్క, కాక్క’, ‘కాదల్’ లాంటి మీడియోకర్ సినిమాల్ని కూడా కొందరు పైకెత్తేస్తుంటారు. ఆ మాత్రం సినిమాలు మనవాళ్లూ తీస్తున్నారు.

          • @అబ్రకదబ్ర: చర్చ నిబద్ధత- వైవిధ్యం గురించి.గొప్పతనం బ్రహ్మాండంగా ఉండటం గురించి కాదు.

      • aithe evariki ekkuvaa…cinema ni mana prajalu aadarinchinraa ledaa annadi kochin eeda…..bhinnatvaalu, masala vada lu enduku….

        cinema enjoy sesetattunte sestar lekapote tidtaar…

  • ఇక్కద ఒక సమస్య ఉంది ….. చివర నుంచి రెండవ పేరా గ్రాఫు టేబులు

    ఠాగూర్ అపరిచితుడు కాక్ మాను ఈ మూడు హేడ్డింగులు …. కనుక దాన్ని టేబులు లా చదవగలరని మనవి ….

    • ఓహ్.. ఇప్పుడు అర్ధం అయింది.. చెయ్యి అందించినందుకు నెనర్లు.

  • mama nuvvenaa raasindi review…inka evaro anukunna..chimpeshinav kada…

    nee review ki naa vote kuda esko…thu edava cinema…daani debbaki 3 peggulu dharapoyalsochindi

  • సమీక్ష కొత్తతరహాలో చాలా బాగుంది.

  • Natasekhara krishna enduko dabbulu dandagaa??

    Watch Super Duper **** film MALLANA coz u wont get swineflu in empty theatres

  • నాకు తెలిసి ఈ వ్యాసం చదివిన వాడెవడూ ఈ సినిమా కాదుకదా …. పోస్టర్ కూడా చూడడు.

    ఆయినా.. కాక్ మాన్ ఏంటండి వాడి పైత్యం కాకపొతీను.. వీడు కొడిమనిషిని చుపిస్తే అది మనం చుసేసి అదికాస్తా హిట్ అయిపోయి రీపు ఇంకోడు కుక్క మనిషిని (Daburman), మరొకడు పంది మనిషిని … దేవుడి దయవల్ల ఇది ఇక్కడితో ఆగినందుకు సంతోషం .. ఆపేందుకు మీ కృషి ప్రశంశనీయం .
    సకాలం లో వ్యాసం రాసి మాకు డబ్బులు మిగిల్చినందుకు ధన్యవాదాలు.
    the table (about three films) was good.

  • ఏమయ్యా చంద్ర మౌళి, నీకు మీమేమి అన్యాయం చేసామయ్యా. కొన్ని రోజుల ముందే ఈ రివ్యూ రాస్తే నీ సోమ్మేమి పోయ్యేదయ్యా .

  • చెత్త సినిమా ఈ మల్లన్న, ఇక మీదట ఎవరన్న తిట్టేటప్పుడు నువ్వు మనిషివా లేక గోడ్డువ (మా కాలేజీ లో అయితే ఇంకోలా అంటారు) అనడానికి బదులు నువ్వు మనిషివా లేక మల్లన్న అని అంటారు :-)

    అయినా తమిళ్ వాళ్ళకి ఇంత పైత్యం ఎక్కడి నుండి వస్తుందో. కనీసం బేసిక్ గ్రామర్ కూడా తెలియకుండా సినిమా తీసాడు సూసి గనేషన్. ఈ సినిమాకి బొక్కల అన్వేషణ చెయ్యనక్కర్లేదు. ఇంకొకటి చెయ్యచ్చు, కరెక్ట్ గా వున్నా సీన్స్ ఒక నాలుగు చెపితే చాలు.మలన్నలో బొక్క లేని సీన్ల అన్వేషణ అని :-)

    Hope Somebody will do that and it will be really very funny

  • review bagundi !

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories