నవతరంగం పాఠకులకి మరియు రచయిత(రచయిత్రు)లకు,
గడిచిన రెండు మూడు నెలల్లో నవతరంగంలో వ్యాసప్రచురణ విషయంలో ఒకరకమైన అనిశ్చితి నెలకొన్న విషయం అందరికీ విదితమే. కొన్ని సమయాల్లో ఒకే వ్యాసం రోజుల తరబడి ప్రముఖంగా మొదటి పేజీలో కనిపించడం, మరికొన్ని సమయాల్లో ఒకే రోజు రెండు అంతకంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించడం జరుగుతుంది. షెడ్యూలింగ్‌కి అవసరమైన వ్యాసాలు నిల్వ లేకపోవడంచేత, వచ్చిన వ్యాసాలు వచ్చినట్టుగా ప్రచురించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విషయాలు రచయితలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయాలనుకుంటూనే సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వస్తున్నాం. ఇక ఇప్పటినుండి ప్రచురణ ఒక నిర్ధిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రస్తుత పరిస్ధుతలని బట్టి నవతరంగంలో రోజుకి రెండుకి తగ్గకుండా వ్యాసాలు ప్రచురించగల స్ధితిలో ఉన్నాం కాబట్టి భారతీయ కాలమాన ప్రకారం ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి సాయంత్రం ఎనిమిది గంటలకు ఒకసారి మాత్రమే క్రొత్త వ్యాసం ప్రచురించబడుతుంది. త్వరలోనే ప్రచురణకు సంబంధించిన google scheduling calenderను సభ్యులందరికీ పంపిస్తాము. అందులో ఖాళీలను బట్టి మీ వ్యాసం ఎప్పుడు ప్రచురించదలచుకున్నారో మాకు తెలిజేస్తే ఆ సమయాన్ని మీకు కేటాయించగలం. ఒకవేళ మీరు ఏదైనా క్రొత్త సినిమా మీద వ్రాసి అది వెంటనే ప్రచురించాల్సిన అవసరం ఉన్నట్లైతే మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. ఇకనుండి ప్రతి క్రొత్త వ్యాసం ఖచ్చితంగా 12 గంటలు మాత్రమే lead boxలో ఉంటుంది. 12 గంటల తర్వాత క్రొత్త వ్యాసం ప్రచురణకు సిద్ధంగా లేకుంటే నవతరంగంలో గతంలో ప్రచురించిన ఏదో ఒక ఫిల్మ్ మేకింగ్ వ్యాసం పుణ: ప్రచురణకు నోచుకుంటుంది. ఈ షెడ్యూలింగ్ గురువారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి ప్రారంభమౌతుంది. అప్పటివరకూ మీ అభిప్రాయాలను , సూచనలను తెలిజేయవలసిందిగా కోరుతూ
-నవతరంగం.
వెంకట్ ఉప్పలూరి says:
12 hours seems to be too rigid. If you post the article at 8AM IST, that will be 930PM for us in Chicago. And you will be replacing it by 8PM IST that will be our 930AM. Will be very dificult to watch it in the short span of time. Let us explore the possibility of 24Hrs post slot.
శంకర్ says:
12 గంటల తర్వాత ‘lead box’లో లేకపోయినా ‘ఇటీవలి వ్యాసాలూ అనే చోట ప్రతి క్రొత్త వ్యాసం రెండ్రోజుల పాటు హైలైట్ అవుతుంది. సగటున రోజుకి రెండు వ్యాసాలు ప్రచురించే అవకాశం ఉంటుంది అని మా అంచనా. ఒకవేళ అనుకున్నన్ని వ్యాసాలు అందుబాటులో లేకుంటే మీరన్నట్టు 24 గంటలకు వ్యాస పరిధిని పెంచే విషయం ఆలోచిస్తాం.
నవతరంగంలో నిర్వహణలో మరింత నాణ్యత పెంచేందుకు పాఠకులు తమకు తోచిన సూచనలు ఇక్కడ పంచుకోవలసిందిగా మనవి.
కొత్తపాళీ says:
Excellent idea.
కె.మహేష్ కుమార్ says:
ఎల్లప్పుడూ ఖచ్చితంగా పాటించకపోయినా…అవసరాన్నిబట్టి అప్పుడప్పుడూ కొంత వెసులుబాటు కల్పించినా… రూల్స్ ఉండటం ఎప్పుడూ మంచిదేగా!
దుప్పల రవికుమార్ says:
నవతరంనగం లో షెడ్యూలింగ్… చాలా బాగుంది. ఇలా రోజూ విచ్చేసే నాబోటి వారికే కాక, వారానికో, తీరుబడిగానో విచ్చేసే వారికి కూడా ఉపయుక్తంగా వుంటుంది…