Menu

మల్లన్న

మల్లన్న – ఇది ఠాగూర్, అపరిచితుడు , శివాజీ సినిమాలకు రివ్యూ……

సీరియస్ రివ్య్రూ చదవాలి అనుకునేవారు ఇది చదవకండి ……………..

నవతరంగంలో ఠాగూర్, అపరిచితుడు,శివాజీ సినిమాల మీద రివ్యూరాలేదు కదా దాన్ని భర్తీ చేద్దమనుకుని, మల్లన్న సినిమా రివ్యూరాయటం మెదలు పెట్టాను… ( తీర్దంపుచ్చుకున్నాను అనుకునేరు…అదేంలేదు).. రెండేళ్ళూ తీసారు…. సినిమా దెబ్బకు కలైపులి(ఈ సినిమా ప్రోడ్యూసర్) గారు కాస్తా, కలైపిల్లి అయిపోయారు ,ఇక అట్టా తీసిన ఈ సినిమా కష్టాలన్నీ గట్టెక్కిస్తుంది అనిన్నీ, విక్రమ్ , కలైపులి అన్నీ కలిపి సినిమా పోలి కేక అనుకుని వెళ్ళాను.

కధ గురించి:
సూపర్ హీరో సినిమా……….. స్పైడర్ మ్యాన్, బాట్ మ్యాన్, సూపర్ మాన్ … టైగర్ మ్యాన్… ఇప్పుడు కాక్ మ్యాన్ (తెలుగులో చిట్టిమల్లు… బాలయ్య సినిమా గుర్తుండే ఉంటుంది). సదర్ కాక్ మ్యాన్ మన విక్రమ్ గారు రాబిన్ హుడ్ గారి ఏకలవ్య శిష్యుడు. ఉన్నోళ్ళ దగ్గర కొట్టు లేనోళ్ళకు పెట్టు….ఇక పోతే తతిమ్మా విషయాలు – తెలుగు సినిమా హీరోయిన్స్ తండ్రులు విలన్స్ లేదా విలన్ కూతురిని హోరో లవ్ చేస్తాడు… ఇక్కడా అంతే…… అయినోళ్ళకు నొప్పి కలిగినప్పుడు సోసైటీ బాగు చేయల్లన్న యావ పుడుతుంది…ఇందులో కూడా అంతే…. ( నాకు బాగ ఇష్టమయిన ఠాగూర్, అపరిచితుడులో కూడా అంతే కాక పోతే అందులో విషయం ఉంది,ఇందులో నాకు కనపడలేదు) – విలన్స్ నంబర్ కొద్దిగా ఎక్కువే …ఎవడు పెద్ద విలన్ చిన్న విలన్ ….తెలియరాలేదు… చివరుకు మిగిలే వాడు మెయిన్ విలన్ కనుక మీనాకుమారి పాటలో వాడిని అనుకుందాం………… సినిమా ఎలా అయో మయంగా ఉందో …రివ్యూకూడా అంతే ఉంటుంది మరి…. అసలే తెలుగు వాళ్ళాయా నేను… కాపీ కొట్టడం నా జన్మ హక్కు కదూ మరి……..

మరీ ఈ సినిమాలో విక్రమ్ గెటప్పులు మరీ………..
వస్తున్నా అక్కడికే వస్తున్నాను…. ఇలా వచ్చి అలా వెళ్ళీపోయింది మెరుపు తీగ… ఆడ గెటప్ , కోడి గెటప్ మాత్రం కొద్దిగా ఎక్కువ సేపు ఉంటాయి… మిగిలినవి ఎప్పుడొచ్చాయో ఎప్పుడుపోయాయో ఆ జీవుడికే తెలియాలి.

మరి మెక్సికో…. బ్లాక్ మనీ…. వగైరా……….

ఈ బ్లాక్ మనీ ఒకడిదే అంతా, ప్రేమించినట్టు నటించి మోసం చేసిన శ్రీయని, అదే ప్లాన్తో దెబ్బ కొట్టి వాళ్ళ బాబు ఎకౌంట్లో మనీ దొబేస్తాడు.. దానికీ శివాజీ లో లాగా కోద్దిగా టిక్కెట్టు గిట్టుబాటయ్యేలా లాటు మార్పిడీ సీన్ లాంటిది అంటూ పెద్ద ఏమీ లేదు….ఎదో డైరక్టర్ తెరమీదకు రావటానికి ఇండియాలో చూపిస్తే నామర్దాగా ఉంటుంది అన్నట్టు…. డైరక్టర్ గారు…మెక్సికోకు మార్చుకున్నారు…… నిజంగా మెక్సికో లో ఒకడిని చంపటానికి హెలీకాప్టర్ వాడాలా ఏంటి…. ఎక్కడ చంపితే నేమీ ఎవడు అడిగాడు…… నేను “బాడీ ఆఫ్ లైస్” రేంజ్లో కంట్రీలు మారుస్తాడేమో…అనుకున్నాను… తప్పునాదేలేండి…..

పాటలు – మ్యూజిక్ :
విక్రమ్ తన పాటలకు న్యాయం చేశాడు, దరిద్రంగా అయితే లేదు, కాని మరీ నాలుగు పాడటమే ఎబ్బీట్టుగా ఉంది. అలెగ్రా పాట బాగుంది.. నాకయితే అది సెటు అనిపించలేదు… మా ఊరులో రంగనాయకమ్మ పంక్షన్ హాలు అద్దిక తీసుకుని వెనుక బ్లూ స్ర్కీన్ వేసుకుని షూట్ ఫినిష్ చేసి చక్క వి యఫ్ యక్స్ లో ఒక రోమన్ అర్కిటెక్చురల్ వందర్ ఒక దాన్ని తగిలిస్తే అచ్చు అలెగ్రా పాటలానే వస్తుంది…… సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది….

శ్రీయా కొత్త లుక్కు భలే ఉంది కదా…:
హా బానే ఉంది…. శ్రియా బాగానే చేసింది….. కాని……….!!!

రివ్యూలో ఇంతకన్నా రాస్తే .. వీడెవడో బ్లాక్ లో కొనుక్కుని మరీ మెదటి ఆటకు పోయి….. అ కసి అంతా వెళ్ళ గక్కుతున్నాడు అనుకుంటారు….( అమ్మో అది నిజం అని తెలిస్తే …నా పరువేం కాను…)….

ఠాగూర్ – |అపరిచితుడు | కాక్ మ్యాన్
విధ్యార్దులతో |ఒంటరిగా |చిన్న నాటి స్నేహితులతో | తన పంతం నెరవేర్చాడు.
భార్య | చెల్లెలు |స్నేహితుడి ప్రాణం/చేయి(హ్యండ్) | పోవటం వలన సొసైటీ పట్ల తన భాధ్యత గుర్తోచ్చింది.
చీకట్లో,పలుచోట్ల ఒకసారీ | ట్రాన్స్లో, మంత్రాలతో |చీకట్లో కామిడీ/విన్యాసాలు చేస్తూ | జనాలకు అరోగ్యకరమయిన భయం కలిగించారు.
విధ్యార్దులు | వెబ్ సైట్ |చెట్టుకు కట్టిన చీటీలు | చెప్పన దాన్ని బట్టి, హత్య,డబ్బు సహయం చేశాడు.
————————————————————————————————————————-
హిట్ | హిట్ | ఇంకా తెలీదా ….అబ్బే | అయింది…

శివాజీ లో బ్లాక్ మనీ కాన్సెట్ తీసుకుని – ఠాగూర్ , అపరిచితుడు ప్రేములు తీసుకుని వాళ్ళ ఆవడకు తెలీయకుండా వంటిట్లో దూరి మిక్సీలో వేసి ఆ మూడ కధలు రంగరించి ఇంకు తయారు చేసుకుని, వచ్చిన పొగ ను ఒక గ్యాస్ సిలీండర్లో పెట్టుకుని …. కలైపులి ఇంటికెళ్ళీ…. ఆ సిలిండర్లో ముప్పావు వంతు ఉపయోగించి… సినిమాతీసి ఆ మిగిలిన పావు వంతు మీడియావాళ్ళకు ఉపయొగీంచి … రాసిని,తీసిన,దొంగిలించిన దృశ్యకావ్యం…………….

 

చంద్రమౌళి కందుకూరి

19 Comments
 1. Sarath 'Kaalam' August 28, 2009 /
 2. Indian Minerva August 28, 2009 /
 3. అబ్రకదబ్ర August 28, 2009 /
   • Norman Bates August 29, 2009 /
   • అబ్రకదబ్ర August 29, 2009 /
   • hero August 31, 2009 /
 4. chandramouli August 29, 2009 /
  • రామ September 9, 2009 /
 5. hero August 29, 2009 /
 6. jonathan August 29, 2009 /
 7. bs August 29, 2009 /
 8. Ashok August 29, 2009 /
 9. sasank August 30, 2009 /
 10. mohanrazz August 31, 2009 /
 11. Dileep kumar October 10, 2015 /