Menu

Zidane: A 21st Century Portrait

zidane-DVD(1)

Zidane: A 21st Century Portrait

నేనేమీ హార్డ్ కోర్ ఫుట్ బాల్ ఫాన్ ని కాదు కానీ ఎందుకో జిదాన్ లాంటి వారు ఆడుతుంటే మాత్రం అత్తుక్కుపోవల్సిందే ….

దీన్ని xperimental సినిమా / డాక్యుమెంటరీ అనొచ్చేమో … అసలు దీని సంగతేంటంటే … 17 హై డెఫినెషన్ కెమరాలతో ఒక real ఫుట్ బాల్ మాచ్ లో కేవలం జిదాన్ ని live గా ట్రాక్ చెయ్యడం !!

అవును 90 నిమిషాల సినిమా మొత్తం కేవలం జిదానే జిదాన్. మాచ్ లో అతని హావ భావలు , కదలికలను …. కెమరాలతో బంధించిన తీరు అద్భుతం !! … అసలు నిజంగా అమేజింగ్ ఎడిటింగ్ వర్క్ అని చెప్పొచ్చు … దీనికి సినిమాటోగ్రఫీ అదించింది ఫేమస్ సినిమాటోగ్రాఫర్ Darius Khondji.

ఈయన David Fincher సినిమాలు (se7en , panic room) చూసిన వారికి కొంత పరిచయమే … వాటికి ఈయనే సినిమాటోగ్రాఫర్ !! అసలు ఈ సినిమా లో Darius ఉపయోగించిన deep focus షాట్స్ తీరు నిజంగా అమేజింగ్ … బాల్ ని తన కాళ్ళ తొ నాట్యం చేయిస్తూ … తన క్లాసిక్ డ్రిబిల్ తో జిదాన్ బాల్ పాస్ చేయగానే … వెనకే అతన్ని ఆరాధించే కేరింతలు కొడుతున్న వేలాది జనాన్ని fore ground లోకి తెచ్చి జిదాన్ ని గ్లేర్ గా చూపించే కెమెరా వర్క్ నిజంగా మాస్టర్ ఫుల్ల్ !!

ఇక బాల్ ని దొరక పుచ్చుకునేందుకు రొప్పుతూ కదిలే జిదాన్ ఊపిరి శబ్దాన్ని….. జనాల కేరింతలని కలగలిపి తమ మ్యూజిక్ తో Mogwai రాక్ బాండ్ అందించిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది !!

సినిమా సాగుతున్నంత సేపూ ఒక ఆటగాడి ఆలోచనలూ అతని భావాలు … opposite team పై చేయి సాధి్స్తుంటే ఆ క్షణం లో అతను పడే ఆవేదననూ … అతనికి గేం పై ఉన్న concentration ను మన కళ్ళకు కడుతుంది !!

అసలు ఈ సినిమా కాంసెప్ట్ చాలా ఎక్క్ష్పరిమెంటల్ … దీని దర్షకుల లో ఒకరైన Douglas Gordon కి ఇలాంటి experiments కొత్తేమీ కాదు … ఇతను ఇంతకు మునుపు Alfred Hitchcock సినిమా pyscho ని
కేవలం 2 ఫ్రేం రేట్స్ పర్ సెకండ్ (2 frames per second actual frame rate for a film is 24 frames per second) తో స్క్రీన్ చేసాడు …. అలా చెయ్యడం ఆ సినిమా కాస్తా తో ఏకంగా 24 గంటల సేపు సాగింది !!

అందుకే తన ప్రాజెక్ట్ కి 24 hours psycho అని పేరు పెట్టుకున్నాడు !! ఒక రకంగా అది వీడియో లా కాకుండా … బొమ్మలు గా చూసినట్టే .

ఆ psycho వర్క ని కాస్త పక్కన పెట్టి మన జిదాన్ విషయానికి వద్దాం …. మొత్తానికి నే చెప్పేదేంటంటే … ఇది నిజంగా సూపర్ xperimenట్ .

మీరు ఫుట్ బాల్ ఫాన్ కాక పోయినా అసలు మూవీ Editing , camera works కోసమైనా కచ్చితంగా చూడొచ్చు !! సినిమా లో అక్క్డక్కడా ronaldo , beckham కూడా తలుక్కు మంటారు ….

కొసమెరుపు : రెగులర్ సినిమాల్లో ట్విస్టు లాగానే … ఈ మాచ్ లో నిజంగా నే జిదాన్ కు ఆఖరి నిమిషం లో రెడ్ కార్డ్ ఇచ్చారు !!

యూ ట్యూబ్

Solitude

–క్రిష్

2 Comments
  1. venkat July 9, 2009 /