Menu

కొత్తదనం కొరకు మంచి ప్రయత్నం – సరోజ

ఈ మధ్య కాలంలో కొత్త టెక్నీషియన్లు, కొత్త దర్శకులు,కొత్త రైటర్లు తెలుగు సినిమాలలో కొత్తదనం చూపించడానికి ఎన్నో మంచి ప్రయోగాలు,ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ సరోజ. ఈ సినిమా రిలీజయ్యినప్పుడు థియేటర్లో చూడడం కాలేదు.అనుకోకుండా ఈ రోజే ఈ సినిమా డి.వి.డి లో చూడగానే మంచి ప్రయత్నంగా అనిపించింది. సాంకేతిక పరంగా నేపధ్య సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమానా లేక రెండు భాషలలో ఒకేసారి తీసారో తెలియలెదు. పాటలు గొప్పగా అనిపించలేదు. ప్రకాష్ రాజ్ నటన మాములుగా ఉంది. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర. ఉన్నంతమేరకు శ్రీహరి నటన ఫరవాలేదు.

కథా విషయానికి వస్తే….. ఒక కోటీశ్వరుని కూతురు సరోజ. ఈ అమ్మయి మంచి చెడ్డలు తల్లిదంద్రులు పట్టించుకున్నప్పటికీ ఆమె ఎమోషన్లను అలోచనలు షేర్ చేసుకునే తీరిక కానీ ఆసక్తి కానీ వారికి ఉండదు. ఒక రోజు హఠాత్తుగా సరోజను కిడ్నాప్ చేసామనీ పది కోట్లు ఇస్తే వదులుతామని ఫోన్ వస్తుంది ప్రకాష్ రాజ్ కు. ఈ కేస్ లో సాయం చెయ్యడానికి ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ డి.ఎస్.పి. శ్రీహరి వస్తాడు.

ఈ కథకు సమాంతరంగా మరో కథలో చెన్నై నుండి నలుగురు మిత్రులు హైదరాబాద్ కారులో బయలుదేరుతారు.దారిలో ఆక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జాం అవుతుంది. దాంతో వాళ్ళు నలుగురు అడవి దారి గుండా హైదరాబాద్ వెల్లడానికి బయల్దేరుతారు. ఆ దారిలో వెల్లేటప్పుదు అనుకోకుండా వారు కొందరు వ్యక్తులు ఒక పోలీస్ ఆఫీసర్ ను చంపడం చూస్తారు. ఆ సంఘటనలో గాయపడ్డ వ్యక్తికి సాయం కోసం దగ్గరలోని ఒక పాత ఫాక్టరీకి వెళతారు. అక్కడ కిడ్నాప్ చేయబడ్డ సరోజ ను విడిప్స్తారు. అప్పుడు ఆ కిడాపర్లకూ వీరికీ మధ్య జరిగే చేజులు, ఫైట్లు తరువాత చివరకు సరోజ తన తండ్రి దగ్గరకు చేరుతుంది. ఈ కథలో కొస మెరుపు ఈ కేసు డీల్ చేస్తున్న శ్రీహరినే కిడ్నాపర్ల గ్యాంగ్ కు బాస్ గా చూపించడం. కానీ దానికి చూపించిన కారణం కన్విన్సింగ్ గా అనిపించలేదు. కేవలం శ్రీహరి కొరకే ఆ విధంగా చూపించారేమో అనిపించింది. మొత్తం పైన ఈ సినిమా సాంకేతికపరంగా బాగుంది.

ఇందులో మరికొన్ని విషయాలు అర్థం కావు. అందులో మొదటిది వైభవ్ కాజోల్ ను ప్రేమించి ఫ్రెండ్ కొరకు త్యాగం చేయడం.ఇది కథకు ఏ మాత్రం సంబంధం లేదు.బహుషా ఇది హీరో పాత్రను ఎలివేట్ చేయడానికి పనికి వస్తుందనుకుని ఉండవచ్చు. మరొకటి ప్రకాశ్ రాజ్ కు మరో స్త్రీతో సంబంధం ఉన్నట్టు సంభాషనల్లో తెలుస్తుంది. ఇది కూడా కథతో సంబంధం ఉండదు. మరొకటి బ్రహ్మానందం పాత్ర. ఎక్కడొ హైవేలో కనబడుతుంది. ఆ సీక్వెన్స్ చూస్తే ఎడిటింగ్ లో పోయినట్లు గా ఉంది.చివర్లో కిడ్నాపర్లు అందరూ పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళుగా చూపించారు. అందుకే స్తోరీలో పెద్దగా పస లేకపోయినా సినిమాను సినిమాగా చూసే వాళ్ళకు ఈ సినిమా నచ్చవచ్చు.

–డా.రావికంటి మురళి

10 Comments
 1. Phani July 23, 2009 /
 2. కొత్తపాళీ July 23, 2009 /
  • అబ్రకదబ్ర July 23, 2009 /
 3. vinay July 24, 2009 /
  • su July 25, 2009 /
   • dr.ravikanti murali July 25, 2009 /
   • vinay July 27, 2009 /
 4. veerni srinivasarao July 24, 2009 /