Menu

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

nadodigal-wallpaperఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది.

“ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?”
“అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!”
బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి సినిమాని “తెలుగు ప్రేక్షకులకు” అనుగుణంగా మార్చే విఫలప్రయత్నం. ఆ ప్రయత్నంలో అసలు కథని వదిలేసి. ఆ కథలోని మూలభావాల్ని వదిలేసి. తెలుగుపూతల కోసం కథఆత్మని వదిలేసి తీసిపడేస్తారు. చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ అనుభవించడానికి ఏమీ మిగలదు.
ఈ తంతు మొత్తంలో నాకు వచ్చిన రెండు సందేహాలు; ఒకటి- నిజంగానే “తెలుగు ప్రేక్షకులు” అనే ఒక నిర్ధిష్టమూస కలిగిన ప్రేక్షకులు ఉన్నారా? రెండు – ఒకవేళ ఉంటే, వారికి కథకన్నా దానిపైనిచ్చే షుగర్ కోటింగ్ ఎక్కువ ప్రధానమా?
ఈ మధ్యనే రాంగోపాల్ వర్మ్ ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో తను అంటాడు;
“The audience is not a singular animal for any filmmaker to study, analyze and decide in his mind on what it wants. Each member of the audience are particular individuals with very different tastes and sensibilities which depend on their individual backgrounds, IQ levels and their moods, what their expectations/non-expectations were from the movie etc. So how is it possible that you can generalize them into one entity and name them the audience.”

“A film or anything you do, at the end of the day, is nothing but a personal statement you are making which could be liked, disliked, invoke hatred or maybe boredom etc. So the point is to be sure of how intensely you really want to live your life saying exactly what you want to say versus saying what you think others want to hear.

Even though you want to practice the latter it’s not possible as you can’t really do anything for the sole purpose of completely satisfying another individual other than you, let alone the so-called general audience. When filmmakers say they are making a film for the audience what they really mean is that they are trying to copy the successful elements of a previously successful film.” అని.

ఎందుకో నాకు ఈ స్టేట్మెంట్ తెగనచ్చెసింది. నేను సగటు తెలుగు ప్రేక్షకుడ్నే. మరి నాకు, నాతో పాటూ వచ్చిన మరో నలుగురు తెలుగు స్నేహితులకు నచ్చిన సినిమా, ఉన్నదున్నట్లు తీస్తే ఇంకో పదిలక్షల మందికి నచ్చదని ఎట్లానుకోవటం? కేవలం హీరో-హీరోయిన్ ను పెళ్ళిచేసుకుంటేనే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఒక ప్రేక్షకుడు అందరి ప్రేక్షకుల తరఫునా ఎట్లా చెప్పగలిగాడు? ఇలాంటి మార్పులే చాలా రీమేకుల్లో మన నిర్మాతలు ఎందుకు చేసి కథను పలుచన చేస్తారు? అనేవి నా ఊహకు అందని జవాబులు.

కానీ ఒకటి మాత్రం నిజం నాడోడిగళ్ సినిమా చూస్తే అదేదో తమిళ ప్రేక్షకుల “టేస్ట్” ఇలా ఉంటుంది కాబట్టి “ఇలాగే తీద్ధాం” అనే ఆలోచనతో తీసిన సినిమాలాగా అనిపించదు. దర్శకుడి దగ్గర ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఒక టీంతో కలిసి కథగా మలుచుకున్నాడు. ఆ కథను తను అనుకున్నట్లు తెరమీదికి అనువదించాడు. ఏ “ఫార్ములా” మూసకూ ఈ కథ సరిపోలదు. ఏ ఒక్క ప్రాంతీయ భావనల మూసకూ ఇది ప్రామాణికం కాదు. కథ తమిళనాడులో జరుగుతుంది కాబట్టి ఆ ఛాయలుంటాయి. పాత్రలు ఆ ప్రదేశానికి చెందినవి కాబట్టి ఆ భాష మాట్లాడతాయి. అంతే!

ఇలాంటి సినిమాను రీమేక్ చెయ్యడమే ఒక తప్పు. అలా చేసినా, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇలాంటి అనుభవాలని వెతుక్కోవాలేగానీ, సీన్ బై సీన్ తమిళ సినిమాని దించేసి, కేవలం అడిషనల్ గా రెండు పాటలూ లేకపోతే హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి హీరోయిన్ తో నాలుగు గెంతులు వేయించేసి, అదే తెలుగు ప్రేక్షకుల “టేస్ట్” అనడం ఎంత కృతకంగా ఉంటుందా! అని ఆలోచించాను. సమాధానం దొరకలేదు.

మొత్తంగా ప్రేక్షకాగంతకుల (nameless,faceless audience) అభిరుచిన నిర్ధారించెయ్యడం. “ఇలా తీస్తేనే మనోళ్ళకు ఎక్కుతుంది” అని నిర్ణయించడంలోని అవగాహనా రాహిత్యాన్ని, అనాలోచిత ప్రవర్తననీ మీరి, “కథల్ని కథలుగా” చెప్పడం నేర్చుకోనంత వరకూ ఎంతగొప్ప పరభాషా చిత్రాలను తెలుగులోకి అనువదించినా వాటివల్ల తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకూ ఒరిగేదేమీ ఉండదనుకుంటాను. రాంగోపాల వర్మ చెప్పినట్లు, హిట్ అయిన సినిమాల నుంచీ మళ్ళీ సినిమాలు తీసే అలవాటు కాకుండా అనుభవాల్లోంచీ కథల్నీ, కథల్లోంచీ సినిమాలనీ తీసే వరకూ ఏ ప్రేక్షకాగంతుని పేరుచెప్పి ఈ చవక సరుకుని థియేట్లర్లో దింపి, అదే ప్రేక్షకుడికి అజీర్ణాన్ని కలిగించే తంతుకు చరమగీతం పలకడం కష్టం.

*నాడోడిగళ్ సినిమా హైదరాబాద్ ప్రసాద్స్ (IMAX) లో వారాంతరాలలో ఒక షో ఆడుతోంది. శుక్ర,శని,ఆది వారాల్లో 11.30 ఆట. తమిళం రాకపోయినా చూడదగిన సినిమా. కాబట్టి మన తెలుగోళ్ళు మనకోసం ఈ సినిమాని నాశనం చెయ్యకముందే ఒరిజినల్ ని చూసెయ్యండి.

50 Comments
 1. srinivas July 20, 2009 /
 2. harish July 20, 2009 /
 3. Venkat Uppaluri July 20, 2009 /
 4. kolord97@gmail.com July 20, 2009 /
   • sasank July 21, 2009 /
   • manadalla July 21, 2009 /
   • sasank July 22, 2009 /
   • jonathan July 22, 2009 /
   • sasank July 22, 2009 /
   • rameshkumar July 22, 2009 /
   • rameshkumar July 22, 2009 /
   • jonathan July 24, 2009 /
 5. Marthanda July 21, 2009 /
 6. manadalla July 21, 2009 /
 7. director July 22, 2009 /
  • Praveen July 28, 2009 /
 8. director July 22, 2009 /
 9. rameshkumar July 22, 2009 /
 10. rameshkumar July 22, 2009 /
  • sasank July 23, 2009 /
   • sasank July 24, 2009 /
  • sasank July 23, 2009 /
 11. Satyam July 23, 2009 /
 12. sasank July 24, 2009 /
   • sasank July 24, 2009 /
 13. sasank July 24, 2009 /
 14. bonagiri July 24, 2009 /
  • sasank July 24, 2009 /
 15. su July 25, 2009 /
 16. Norman Bates July 25, 2009 /
 17. పుల్లాయన July 27, 2009 /
  • su July 27, 2009 /
   • పుల్లాయన July 28, 2009 /
   • sasank July 28, 2009 /
 18. mohanrazz July 27, 2009 /
  • su July 27, 2009 /
 19. su July 27, 2009 /
 20. Praveen July 28, 2009 /
 21. Aditi July 15, 2017 /