ఆది,ఖుషి,యోగి వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో భాదపడుతున్నారు. నోటి నుండి రక్తం పడటంతో ఆయనను లేక్ షోర్ హాస్పటిల్ జాయిన్ చేసారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఆయన ప్రాణం పోయింది. రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో దాదాపు 142 చిత్రాల వరకూ వరకూ నటించారు.
1970లో స్టేజ్ ఆర్టిస్టు గా ‘Kattukuthira’అనే హిట్ నాటకంలో ఆయన నట జీవితం ప్రారంభమైంది. అందులోని కొచ్చు వాల అనే పాత్ర ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఆ నాటకం దాదాపు వెయ్యి ప్రదర్శనలు పూర్తి చేసుకుని రాజన్ ని సినిమా వారి దృష్టిలో పడేలా చేసింది. అప్పటి నుంచీ ఆయన విలన్ గానే కాక రకరకాల పాత్రల్లో నటించి వాటికి ప్రాణం పోసారు. ఆయన విలన్ గా నటించిన చివరి చిత్రం ముమ్ముట్టి హీరోగా చేసిన Ee Pattanathil Bhootham. అది ఇప్పడు కేరళ ధియోటర్స్ లో హిట్ టాక్ తో రన్ అవుతోంది.అలాగే ఆయన నటుడుగానే కాక రెండు మళయాళ చిత్రాలకు సైతం దర్శకత్వం వహించారు. అవి Achamakuttiyude Achayan మరియు Achante Kochu Molku. ఆయనకు భార్య శాంత,కూతురు ఆశమ్మ,కొడుకు జూబ్లి రాజ్ ఉన్నారు.
ఇక ఆయన భౌతికకాయాన్ని ఎర్నాకులంలోని టౌన్ హాల్ లో అభిమానుల సందర్శనం కోసం ఉంచారు. రేపు ఉదయం సెయింట్ జేవియర్ చర్చి మైదానంలో ఆయన అత్యక్రియలు జరుగుతాయి. రాజన్ మృతిపై ప్రముఖ నటుడు తిలకన్ స్పందిస్తూ..రాజన్ చేసిన పాత్రలు ద్వారా ఆయన బ్రతికే ఉన్నా..ఆయన మృతి మాత్రం మళయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు గా మిగులుతుంది అన్నారు.తెలుగులోనూ ఆయన ఖుషి,ఆది,ఒక్కడు,గుడుంబాశంకర్,ఆర్య,బాలు,బన్నీ,యోగి తదితర తెలుగు చిత్రాలలో నటించి గుర్తుండిపోయారు. ఆయన మృతికి నవతరంగం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.
కత్తి మహేష్ కుమార్ says:
మంచి విలన్, మంచి నటుడు. నా ప్రఘాఢ సంతాపం.
ఉష says:
అతని పాత్రలు చూసి ఛీ అనిపించినా ఈ వార్త అయ్యో అనిపించింది. కుటుంబానికి లోటే.
గుడుంబా సత్తి says:
ఒక ప్రతినాయకుడికి ఇంతకన్నా ప్రశంస ఏం కావాలో చెప్పండి. ఆ పాత్రను చూసి, సినిమా అని తెలిసినా కూడా నచ్చలేకపోవడమే విలనిజానికి నిర్వచనమేమో.. రాజన్.పి.దేవ్ అలాంటి పాత్రలు పోషించి మనుషుల్లోంచి వెళ్ళిపోయి మనసుల్లో నిలిచిపోయాడు.
విలన్స్ కి కూడా ఫాన్స్ వుంటారండీ..
రాజన్ కి నివాళులు.
గీతాచార్య says:
Very good actor with subtlety. I like his role in Dil. He did live in that role.