Menu

Monthly Archive:: July 2009

Ice Age 3 రివ్యూ

ఒక చిన్న పిల్లవాడిని అతడి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి ఒక ఏనుగు చేసే ప్రయత్నాల ఆధారంగా 2002 లో తీయబడిన Ice Age మంచి కథనం, అంత కంటే మంచి పాత్రలు, కనువిందు చేసే గ్రాఫిక్స్ తో ఆకట్టుకొంది. ఈ సినిమా ఘనవిజయంతో Ice Age 2 సీక్వల్ వచ్చింది. Manny కి, ఆడ ఏనుగు Ellie కి మధ్య లవ్ స్టోరీ రెండవ పార్టు కథాంశం. బోరు కొట్టించే కథ, చిరాకు పుట్టించే క్యారక్టర్లతో రెండవపార్టు

నాడొడిగళ్ (తమిళ్) – పరిచయం

తమిళ సినిమా ‘సుబ్రమణ్యపురం’ (అనంతపురం-1980)  నటుడు దర్శకుడు శశికుమార్ పూర్తిస్థాయి నటుడిగా మారిన చిత్రం “నాడోడిగళ్”. నాడోడిగళ్ అంటే అర్థం Nomads. నలుగురు స్నేహితుల కథ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘సముతిరకని’. గతవారం తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం అటుప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే శశి కుమార్ మొదటి చిత్రం, రెండవ చిత్రం (నిర్మాతగా) ‘పసంగ’ల్ని నవతరంగం పరిచయం చేసింది. ఇప్పుడు మూడోచిత్రం గురించి వివిధ సమీక్షకుల స్పందన ఏమిటో పంచుకోవడం ద్వారా,

సినిమా రచయితలు చదవాల్సిన పుస్తకాలు

గత నెలలో జరిగిన చెన్నై స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ లో స్క్రీన్ రైటింగ్ లోని వివిధ అంశాలను ఎంతో ఆసక్తిగా బోధించిన అంజుం రాజ్బలి ఔత్సాహిక స్క్రీన్ రైటర్స్ చదవాల్సిన పుస్తకాలు కొన్నింటిని రికమెండ్ చేశారు. వాటి వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. అలాగే సంవత్సరానికి డజన్ల కొద్దీ ప్రచురితమయ్యే స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు, ’to-do’ పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకోవడం అటుంచి రచయితలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన

మంగమ్మ శపథం

కొన్ని పాత సినిమాలను చూస్తున్నానా?అప్పటి రోజులు గుర్తుకు వచ్చి తీరతాయి. నా బాల్యంలో ఆ యా సినిమాలను కను రెప్ప వేయకుండా చూసిన తీపి గుర్తులు ఎన్నో,ఎన్నెన్నో!!! సరే!ప్రస్తుతం “మంగమ్మ శపథం”సినిమా అవ్వానిలో ఒకటి. పాటలు నిత్య నూత్నమైన “ఆపాత మధురాలు”. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటాయి. హీరో,హీరోయిన్ల అంద చందాలు కన్నులకు విందులే! పేచీ ఎక్కడ వచ్చిందంటే,కథ గురించే! రామారావు తండ్రీ కొడుకులుగా డబుల్ యాక్షన్ చేసాడు. పల్లెటూరి పిల్ల మంగమ్మ (జమున)ను రాజు,పంతం కొద్దీ,పెళ్ళాడతాడు.కానీ,పగతో,నేలమాళిగలో

విజేత

ఇంటి పెద్ద కొడుకు కుటుంబం కోసం త్యాగాలు చేయడం ఇతివృత్తంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటికి భిన్నంగా, అన్నలు వదిలేసిన బాధ్యతని తన భుజాలపై వేసుకుని కుటుంబం కోసం తనకి యెంతో ఇష్టమైన కెరీర్ ని వదులుకున్న ఓ తమ్ముడి కథతో వచ్చిన సినిమా ‘విజేత.’ అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి తో త్యాగపూరితమైన పాత్రని చేయించడం సాహసమే. నిర్మాత అల్లు అరవింద్ తన గీతా