Menu

Monthly Archive:: July 2009

Khoslaa kaa Ghoslaa

ఏముంది ? ఇల్లు కట్టుకోవాలి – ఇది స్వప్నం ! ఇదే కధ ! వాస్తు ప్రకారం, భవిష్యత్ ప్రణాళికల ప్రకారం, అన్నిరకాలుగా సరిపోయే బంగారం లాంటి ఇంటి స్థలం, జీవితకాలపు ఆర్జనంతా మదుపుపెట్టి కొన్నారు. ఇల్లు ఇలా కట్టాలీ, అలా కట్టాలీ అని ప్లాన్లు వేసుకుంటున్నారు. వారానికోసారి కాబోలు ఇంటిల్లిపాదీ స్థలం చూడ్డానికెళ్తారు. అదో తంతు ! పిల్లలకి తండ్రి చాదస్తం అంటే పరిహాసం, విసుగు ఇంకా.. సానుభూతి ! అయినా తప్పది. సొంతిల్లు, ఖోస్లా

Father of the bride

Father of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే… కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న

ఫిల్మ్ సొసైటీల ఉద్యమం – యువతరానికో ఛాలెంజ్

ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తున్న సినిమాలున్న ఈ రోజుల్లో ఈ తరం ప్రేక్షకులకు ఫిల్మ్ సొసైటీల ఉద్యమం గురించి తెలియచెయవలసిన అవసరం ఎంతో ఉంది.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభం అయిన ఫిల్మ్ సొసైటీల ఉద్యమం దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉధ్రుతంగా సాగింది. సమాంతర చిత్రాలు, ఆఫ్ బీట్ చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు, అవార్డ్ చిత్రాలు గా పేరు పొందిన చిత్రాలు ఎన్నింటినో ఫిల్మ్ సొసైటీలు అలనాడు ప్రేక్షకులకు అందించాయి. కలలో కూడా చూడలేమని

సంకట్ సిటీ – ఒక చీకటి సిటీ

ఈ మధ్యకాలంలో కొందరు నటులుంటే చాలు ఆ సినిమా బాగానే ఉంటుంది అని నమ్మెయ్యదగ్గ “నమ్మకం” సంపాదించుకున్న నటుల్లో బాలీవుడ్ నటుడు కేకే(మీనన్) ఒకరు. హఠాత్తుగా ఒక పోస్టర్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా ‘సిన్ సిటీ’ తరహాలో ఉందే అనుకుంటే ఆ సినిమా పేరే ‘సంకట్ సిటీ’ అని కనిపించింది. ఆ పోస్టర్ పైన కేకే బొమ్మ. ఇంకేం సినిమా చూసెయ్యాలని డిసైడ్ అయ్యాను. చూశాను. ఇదొక వెధవ సినిమా. సినిమాలో కనిపించే ప్రతిపాత్రా వెధవ

డిఫాయన్స్

కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance). టైటిల్ చూసి, పోస్టర్ మీద మన