Menu

Monthly Archive:: July 2009

Transformers 2 రివ్యూ

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను. మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది. “ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?” “అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!” బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి

Definitely, May be (2008)

ఇప్పుడీ సినిమా కథ చెప్పాలంటే, అదో పెద్ద కథ. చూసేటప్పుడు కూడా నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే అనిపించింది. విషయానికొస్తే, మన కథ వర్తమానంలో మొదలౌతుంది. విల్ హేస్ తన భార్య నుండి విడాకులు కోరి ఉంటాడు. ఈ ప్రయత్నాలు నడుస్తూ ఉండగా, విల్ పదేళ్ళ కూతురు మాయ తన తల్లిదండ్రుల వివాహానికి ముందు జరిగిన కథను తెలుసుకోవాలనుకుంటుంది. విల్ ఈ కథని యదాతథంగా చెప్పక – పాత్రల పేర్లు మార్చి, కాస్త నాటకీయంగా చెప్పడం మొదలుపెడతాడు.

గోగోగో పిమ్మట నాలో నేను.

గోగోగో సినిమా చూశాను. గోపి గోపికా గోదావరి! దాని గురించి ఏమన్నా వ్రాయాలా? ఏం వ్రాయాలి? బాగోలేదని వ్రాయాలి. అలా ఎలా వ్రాస్తావ్ ? ఏం ఎందుకు వ్రాయకూడదు? వంశీ సినిమా కదా. వంశీ అయితే కొమ్ములుంటాయా? కొమ్ములు తిరిగిన దర్శకుడు కదా! ఎన్ని కొమ్ములేంటి? ఎన్నో ఒకన్నిలేగాని, మంచి రచయిత కదా! అవునా! నాకంతగా తెల్వదు. స్వాతిలో మన్యం రాణి సీరియల్ వస్తుందిగా! ఏవో బొమ్మలు చూట్టమేగాని, సీరియల్ ఎప్పుడూ చదవలేదు. ఎందుకలాగ? నాకా గోదావరి

గిద్

స్త్రీని విలాస వస్తువుగానూ, వినియోగ వస్తువుగానూ పరిగణించడం మన వ్యవస్థలో అనాదిగా వస్తున్నది. ఆ స్త్రీ అట్టడుగు వర్గానికి చెందినది అయినప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. బూర్జువా సమాజంలో అధికారంతో ఆధిపత్యం చెలాయిస్తె ఈ పురుషస్వామ్యం పెట్టుబడిదారి సమాజంలో ధనం, వినోదాల ఎరచూపి స్త్రీని అణచివేతకు గురిచేయడం ఆమె శీలాన్ని జీవితాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అట్టడుగు బడుగువర్గాల స్త్రీలను దేవునిపేర ఊరు పరం చేసే ఆచారాలు అనేకం మనదేశంలో నెలకొని