Menu

Monthly Archive:: July 2009

36 చౌరంఘీలేన్

మహిళను ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన అనేక భారతీయ చలన చిత్రాల్లోకి అపర్ణా సేన్ దర్శకత్వంలో నిర్మితమైన ’36 చౌరంఘీలేన్ ‘ విశిష్టమయింది . దేశ విదేశీ సినీ విమర్శకుల చేత గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 1981 లో ఇంగ్లీషులొ నిర్మితమయింది.ఇందులో వయసు మళ్లుతున్న ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ యొక్క చేతన, అంతఃచేతనల్లోని ఆశలు, అవగాహనలు, వాస్తవ జీవితంలో ఆమె అనుభవించే ఒంటరిగనమూ, తోడు కోసం, కంపెనీ కోసం వ్యధ చేందే ఆమె మానసిక

లక్ (హిందీ) – అంత లక్కీ కాదు : సమీక్ష

ఈ మధ్యకాలంలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం తగ్గించాను. కానీ అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ టికెట్టు దొరికేస్తే అదో ఆనందం. ఆ ఆనందం, లక్ సినిమా మొదలయ్యేవరకే మిగిలింది. సగం సినిమా పూర్తయ్యేసరికీ నా అంత అన్ లక్కీ ఫెలో ఉండడని తేలిపోయింది. దర్శకుడు సోహమ్ షా మొదటి సినిమా ‘కాల్’. కనీసం ఆ సినిమా చూసైనా దర్శకుడి మీద ఒక దిగజారిన అంచనా వేసుకుని ఉండాల్సింది. కానీ ఏంచేస్తాం, కమల్ హాసన్ కూతురు శృతి హసన్

కొత్తదనం కొరకు మంచి ప్రయత్నం – సరోజ

ఈ మధ్య కాలంలో కొత్త టెక్నీషియన్లు, కొత్త దర్శకులు,కొత్త రైటర్లు తెలుగు సినిమాలలో కొత్తదనం చూపించడానికి ఎన్నో మంచి ప్రయోగాలు,ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ సరోజ. ఈ సినిమా రిలీజయ్యినప్పుడు థియేటర్లో చూడడం కాలేదు.అనుకోకుండా ఈ రోజే ఈ సినిమా డి.వి.డి లో చూడగానే మంచి ప్రయత్నంగా అనిపించింది. సాంకేతిక పరంగా నేపధ్య సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమానా లేక రెండు భాషలలో ఒకేసారి తీసారో తెలియలెదు. పాటలు గొప్పగా

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను. అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే? అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత ఏడ్సినట్టుంది. ఏంటి సినిమానా ? కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ? ఇంగ్లీషులోనే చూశా! మరి తెలుగులో సేతడమెందుకో? తెల్దా? స్టైలు. అవునా?

నాడోడిగళ్ (త)- సమీక్ష

“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a friend అనే