Menu

Music & Lyrics

Music-And-Lyrics-Music-From-The-Motion-PictureMusic & Lyrics – 2007 హాలీవుడ్ చిత్రం. తారాగణం: హూగ్ గ్రాంట్, డ్రూ బారిమూర్.

కథ: ఎనభైల్లో ప్రచారం పొందిన్ పాప్! అన్న సంగీతకారుల గుంపు (కల్పితం) ను చిత్రిస్తూ మొదలౌతుంది సినిమా. టైటిల్స్ గట్రా అయిపోయి వర్తమానానికి వస్తే, పాప్! ఆ తరువాత విడిపోతుంది. దానిలో ప్రధాన సభ్యులైన కాలిన్, అలెక్స్ ఫ్లెచర్ (హూగ్ గ్రాంట్) లలో కాలిన్ సోలోగా చాలా పేరు తెచ్చుకుంటాడు. అలెక్స్ అదృష్టం బాగోక – చిన్నా చితకా ప్రోగ్రాం లు చేసుకుంటూ, రీయూనియన్ సభల్లో పాడుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో, ప్రస్తుతం ప్రముఖ పాప్ సంచలనం కోరా – అలెక్స్ పై గల అభిమానం కొద్దీ అతన్ని ఓ పాట రాసిమ్మని అడిగి చాలా కొద్ది రోజుల గడువిస్తుంది. అయితే, పాప్! ఉన్న కాలంలో కాలిన్ సాహిత్యం రాసేవాడు, అలెక్స్ పాడేవాడు. దానితో అలెక్స్ కు ఏం చేయాలో తోచదు. అప్పుడే తమ ఇంట్లో చెట్లకు నీళ్ళు పోసే సోఫీ ఫిషర్ లో పాటలకి మంచి సాహిత్యం రాయగల ప్రతిభ ఉందని గుర్తిస్తాడు అలెక్స్. ఎలాగోలా కష్టపడి ఆమెని ఒప్పిస్తాడు.

ఆమెకి ఓ కథ ఉంటుంది. ఆమె రచయిత కావాలనుకుంటూ ఉంటుంది. అనుకోకుండా ఆమె ఇంగ్లీష్ ప్రొఫెసర్ తో గల సంబంధంలో అతను ఆమెని వాడుకున్న తర్వాత తన రచనాపటిమపై ఆమెకి నమ్మకం సన్నగిల్లుతుంది. అలెక్స్ ఆమెని ప్రోత్సహిస్తూ తామిద్దరం కలిసి పాట కంపోజ్ చేద్దామని ఒప్పిస్తాడు. ఈ ప్రయత్నం లో ఇద్దరూ ఒకరికొకరు చేరువౌతారు. వీరిచ్చిన పాట కోరా కి నచ్చడం తో వీరు సంతోషిస్తారు కానీ, ఆమె తన పద్ధతిలో దాన్ని అన్వయించి దానికి తన పైత్యం జోడించడంతో సోఫీ దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ విషయమై అలెక్స్ తో గొడవపడి సోఫీ వెళ్ళిపోతుంది. అలెక్స్ రమ్మన్నా రాదు. తర్వాత కోరా-అలెక్స్ ల ప్రదర్శనకు తన అక్క, అలెక్స్ వీరాభిమాని అయిన రొండా పిలిస్తే వెళుతుంది. అక్కడ అలెక్స్ పాడేముందు చేసిన ప్రకటన లో తన పేరు లేదని గమనించి ఇతనూ మోసం చేసాడనుకుని వెళ్ళిపోబోతూ ఉండగా, ఆ పాట అలెక్స్ తనకోసం పాడుతున్నదని అర్థం ఔతుంది. తరువాత కోరా-అలెక్స్ లు తను,అలెక్స్ కలిసి రాసి స్వరపరచిన పాటను, తామిద్దరూ మొదట అనుకున్నవిధంగానే పాడతారు. ఇలా చేసేందుకు అలెక్స్ కోరాను ఒప్పించాడని తెలుసుకున్న సోఫీ-తిరిగి అలెక్స్ కు చేరువౌతుంది. తర్వాత వాళ్ళిద్దరు ఇలాగే కలిసి పాటలు సృష్టిస్తూ, కలిసి జీవిస్తారు – కథ కంచికి, మనమింటికి.

అలెక్స్ కి టీవీ చానెల్ వారితో జరిగే సంభాషణా, సోఫీ ఫిషర్ ఇంట్రో దృశ్యం, సోఫీ అక్క ఇంటి దృశ్యాలు, పాటలూ, కోరా కోసం పాట తయారుచేస్తున్నప్పుడు అలెక్స్-సోఫీల మధ్య జరిగిన సంభాషణలూ – ఇవన్నీ నాకు చాలా నచ్చాయి.

ప్రధానంగా నాకు ఈ కథ అంతా చాలా హాయిగా సాగిపోడం చాలా నచ్చింది. అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలాంటి సినిమాలు చూడాలి. సినిమాలో అక్కడక్కడా హాస్యం బాగుంది. అలాగే, మొదట నేను నిజంగానే “పాప్!” అనే గుంపు ఉందేమో అనుకున్నా. అంత వాస్తవికంగా అనిపించింది ఆ మొదట్లో వచ్చిన “Pop! goes my heart!” పాట. సినిమాలో పాటలు నాకు చాలా నచ్చాయి. అలాగే, సోఫీ-అలెక్స్ ల మధ్య కెమిస్ట్రీ కూడా. అలా, కాలక్షేపానికి, హాయిగా కూర్చుని చూసేయొచ్చు ఈ సినిమా. సంగీతం-సాహిత్యం మీద జరిగిన ఓ సంభాషణ చాలా నచ్చింది:

alex: It doesn’t have to be perfect. Just spit it out. They’re just lyrics.
sophie: just lyrics?
alex: Lyrics are important. They’re just not as important as melody.
sophie: I really don’t think you get it.
alex: Oh. You look angry. Click your pen.
sophie: A melody is like seeing someone for the first time. The physical attraction. Sex.
alex: I so get that.
sophie: But then, as you get to know the person, that’s the lyrics. Their story. Who they are underneath. It’s the combination of the two that makes it magical.

(courtesy: IMDB)

మొత్తానికి, సంగీతం కోసం, కథనం కోసం, అన్నింటికంటే – pure entertainment కోసం – ఈ సినిమా తప్పక చూడాలి. నటీనటులకోసం కూడానూ.

2 Comments
  1. vishnu November 17, 2009 /