Menu

మంగమ్మ శపథం

mangammaకొన్ని పాత సినిమాలను చూస్తున్నానా?అప్పటి రోజులు గుర్తుకు వచ్చి తీరతాయి. నా బాల్యంలో ఆ యా సినిమాలను కను రెప్ప వేయకుండా చూసిన తీపి గుర్తులు ఎన్నో,ఎన్నెన్నో!!! సరే!ప్రస్తుతం “మంగమ్మ శపథం”సినిమా అవ్వానిలో ఒకటి. పాటలు నిత్య నూత్నమైన “ఆపాత మధురాలు”. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటాయి. హీరో,హీరోయిన్ల అంద చందాలు కన్నులకు విందులే!

పేచీ ఎక్కడ వచ్చిందంటే,కథ గురించే!

రామారావు తండ్రీ కొడుకులుగా డబుల్ యాక్షన్ చేసాడు. పల్లెటూరి పిల్ల మంగమ్మ (జమున)ను రాజు,పంతం కొద్దీ,పెళ్ళాడతాడు.కానీ,పగతో,నేలమాళిగలో ఆమెను,బంధించి,”ఆమె బ్రతుకును ఎండ మావిలా నిస్సారంగా చేస్తాడు. “నీ కొడుకు చేత నిన్ను ఓడిస్తాను.”అని,ఇదీ ‘మంగమ్మ శపథం”.క్లైమాక్సులో ,కుమార రత్నం రాజును ఓడించాక,కథ సుఖాంతమౌతుంది. (ఇదే అంశం పాశ్చాత్యుల చేతుల్లో పడితే,తండ్రిని ఖతం చేసేసి,కొడుకు గద్దె నెక్కే వాడు.మన వారి హస్తాలలో కాబట్టి,సున్నితమైన కుటుంబ సంబంధ బాంధవ్యాలకూగ్ర తాంబూలం లభించింది.నిస్సంకోచంగా ఇది మన సాహిత్య,సినీ,కళా రంగాలకు సంక్రమించిన వారసత్వ సంపదయే!ఇది మనకు గర్వ కారణమే కూడా!) ఎత్తుకు పై ఎత్తులతో,అంచెలంచెలుగా, తనయుడు విజయాన్ని సాధించడము అద్భుత చిత్రీకరణ మహాత్మ్యమే! చిన్న చిన్న లోపాలు,మన దృష్టికి రాకుండా చేయ గలిగిన నైపుణ్యం ఆ దర్శకత్వంలో ఉన్నది.

ఇంతకీ ఏమిటా లోపాలు?

మంగమ్మ మారు వేషంలో భర్తను కలవాలి.ఒక కుటుంబ స్త్రీకి అది ఎలా సాధ్యం?

ఆమె తమ్ముడు రేలంగి ప్రేమించినది ఒక దొమ్మరి పిల్ల గిరిజను.మంగమ్మకు,రాజు గుర్తు పట్టని విధంగా వేష భాషలలో మార్పుకు ఆమె సహాయం తీసుకున్నది!”చిత్రమేమిటంటే,ఈ పాయింటును,తెరపై చూప లేదు.కానీ,అతి సున్నితమైన ఈ పాయింటు,ప్రేక్షకులకు అర్ధమయ్యవ్వాలి అన్న మాట!శభాష్!నాకు ఇది ఎంతో నచ్చినది.

నెక్స్ట్? ఈ కథలో రాజు స్త్రీ లోలుడు!ఇక్కడ నుండే,కథా పరమైన నా సందేహాలు మొదలైనాయి.

అసలైన కథా నాయకుడు ,పుత్రుడు ఎంటీ రామారావు పెద్ద వాడ,కొత్వాలు,సేనాని,వగైరా అందరినీ మభ్య పెట్టి,కోట దాకా వచ్చి,సాక్షాత్తూ రాజు గారినే ఏమార్చాలి గదా!ఒక్కొక దశగా అతడు రాగలగడము కూడా,గొప్ప ప్రతిభా నైపుణ్యాలకు నిదర్శనాలే!

స్త్రీ లోలుడైన రాజుకు,సలహా దారుడు ఒక కొజ్జా=అల్లు రామ లింగయ్య! అక్కడ రాజ్యంలో,మేధావి అయిన మంత్రి ఉన్నట్లు ఎక్కడా అగుపడదు.

హీరో పెరిగి,పెద్ద వాడైవస్తాడు,అంటే కనీసం ఇరవై ఏళ్ళూ! అసమర్ధుడైన పాలకుని చేతిలో,ఆ రాజ్యం ఇన్ని సంవత్సరాలూ భద్రంగా ఉండడం సాధ్యమేనా?

అలాగే ఇంకొక పాయింటు!…… అంత సొరంగాన్ని,తన ఇంట్లో నుండి,భూగర్భ చెరసాలలోనికి మంగమ్మ పనివాళ్ళ చేత తవ్విస్తాడు.అంత దుష్కరమైన పనిని చేయించేటందుకు,అతడు గొప్ప ధన వంతునిలా తోచదు. అందరు కూలీలు ఆ పనిలో పాలు పంచుకున్నప్పుడు,ఆ రహస్యం ఇట్టే బయటికి పొక్కకుండా ఉంటుందా?

దీనిని ఇలా మార్చి,ఆ లోపాన్ని సరిదిద్దవచ్చును.

1)మంగమ్మకు అర డజను సోదరులు ఉన్నారు,వారే ఈ సొరంగ మార్గ సత్‌క్రియను పూర్తి చేసారు./

2)”బంది పోటు”సినిమాలో వలెనే,”ప్రజలు అందరూ రాజు దుష్టత్వం వలన బాధింప బడుతున్న వారే! అందు వలన,మంగమ్మ విజయం కోసమై యావన్మందీ ఎదురు చూస్తున్నారు.

3)చక్రవర్తికి ,ఎక్కువమంది భార్యలు కలిగి ఉండటంలో ఆట్టే ఆక్షేపణ ఏమీ లేదు. సామ్రాజ్యాధికారంతో,వారు మన సమాజ సాంప్రదాయానికి విరుద్ధమైన ఈ హక్కును తమంత తామే “హక్కు భుక్తం”చేసేసుకున్నారు.

కాబట్టి,కథలో ఈ లోపం ఉన్నదికదా!రాజు,అందునా దురహంకారి అయిన వాడు, ఇన్ని సంవత్సరాలూ,”కనీసం రాజ్యానికి అవసరమైనట్టి వారసుని కోసమైనా పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? అలాగే పెళ్ళీ పెటాకులూ లేకుండా ఉండటం సాధ్యమేనా? సేనాని,బంధువులు ఎట్సెట్రాలు “నా కూతుళ్ళను ఇస్తాము.పెళ్ళి చేసుకోండి,మహా ప్రభో!”అంటూ వెంట బడరా???

ఇవి అవడానికి చిన్న లోపాలే గానీ,కథాంశంలో కీలకమైన అంశాలే కదా!

ఏది ఎలా ఉన్నా,”కుర్చీలోనుండి ప్రేక్షకులను కదలనీయకుండా,చూసేలాగా చేయ గలిగిన చిత్రీకరణకు,మనం జోహార్లు చెప్పాల్సిందే!

ముఖ్యంగా “దొమ్మరి పిల్ల”పాట కోసం రష్యన్^ పదాలూ అవీ ఇవీ వాడి రచన చేసారు.,ఆ డాన్సు లొ జమున హావ భావాలు మరపు రానివి.

–sirishasrii

5 Comments
    • MayaBazar April 7, 2010 /
  1. pappu July 8, 2009 /
  2. sirishasri July 9, 2009 /