గోగోగో పిమ్మట నాలో నేను.

gggగోగోగో సినిమా చూశాను.
గోపి గోపికా గోదావరి!
దాని గురించి ఏమన్నా వ్రాయాలా?
ఏం వ్రాయాలి?
బాగోలేదని వ్రాయాలి.
అలా ఎలా వ్రాస్తావ్ ?
ఏం ఎందుకు వ్రాయకూడదు?
వంశీ సినిమా కదా.
వంశీ అయితే కొమ్ములుంటాయా?
కొమ్ములు తిరిగిన దర్శకుడు కదా!
ఎన్ని కొమ్ములేంటి?
ఎన్నో ఒకన్నిలేగాని, మంచి రచయిత కదా!
అవునా! నాకంతగా తెల్వదు.
స్వాతిలో మన్యం రాణి సీరియల్ వస్తుందిగా!
ఏవో బొమ్మలు చూట్టమేగాని, సీరియల్ ఎప్పుడూ చదవలేదు.
ఎందుకలాగ?
నాకా గోదావరి యాస చదవబుద్దికాదు.
అవునా?
అవును. అసలు యాసలో ఉన్నయి చదవాలంటే నాకేదో గ్రీక్ రష్యన్ లా ఉంటాయి.
ఆహా!
అవున్రా బాబు. అందుకే మన రానారె బ్లాగు చదవటానికి ఒక వర్షం పట్టింది.
ఆహా!
అవున్రా బాబు. దీపం చెప్పిన కథలు అని ఓ పుస్తకం కొని కష్టపడి రెండు కథలు చదివి పక్కన పెట్టేశా.
ఇంతకీ ఏ యాస చదువుతావేంటి?
పుస్తకాల్లో వ్రాసే తెలుగు.
ఇంకా?
ఇంకా మా ఖమ్మం యాస.
ఖమ్మానిక్కూడా యాసుందేటి?
యా! అన్ డౌటెడ్లీ!!
అసలు నాకు వంశీ యాస నచ్చకనే ఆ సినిమా నచ్చలేదేమో?
చ! అదేమిలేదు. అసలది సినిమాలానే లేదు. ఏదో నాటకంలా ఉంది. పాత్రలు, పాత్రధారులు కృతకంగా ఉన్నాయి. బాగా లోబడ్జెట్ అనుకుంటాను. టెక్నికల్ పూర్ వాల్యూస్, ఒక్క సీన్లో అయితే కెమెరా అటకపై పెట్టి తీశాడు. అంటే ఏంటి? ప్రేక్షకులు అటక మీద కూర్చోని సినిమా చూడాలా? ప్రేక్షకులు పాత్రల మద్య కూర్చోనో, నిల్చోనో కదా సినిమా చూడాల్సింది. ఎంత నాచురాలిటీ అయితే మాత్రం పడవ తెరచాప అంత చెత్తగా ఉంచాలా? కొంచెం తెల్లయి ఉంచొద్దూ. ఆ స్టోరీ ఏంట్రా బాబు, ఇంతకంటే మంచి స్టోరీలే తయారు చేసుకోలేడా? ఫస్ట్ ఐదు నిమిషాలు చూసి చివరి ఐదు నిమిషాలు కూడా ఏం జరుగుతుందో చెప్పెయ్యవచ్చు. జనాలు నవ్వుతున్నారు. ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు, కామెడీకి కాదు, వంశీ పనితనానికి.
ఇగ చాల్రా ఆపరా బాబు. – అయితే సినిమా చూడక్కర్లేదంటావ్ ?
సినిమా చూడొచ్చు. చూసి బాగోలేదనుకోవచ్చు. వంశీ మన్ని మళ్లీ నిరాశపర్చిండనుకోవచ్చు.
శుభం -

Filed Under: featuredleadతెలుగుభారతీయ సినిమాసమీక్ష

Tags: , , ,

Comments (15)

Trackback URL | Comments RSS Feed

  1. teja says:

    బాగా వ్రాసారు.
    వంశీ అభిమానిగా ఈ గోగోగో నన్ను తీవ్రంగా నిరాసపరిచింది.

    ఎంత అంటే వంశీ గత చిత్రం ‘అనుమానాస్పదం’ దీనికంటే మెరుగు అనిపించేటంత.

    కనీసం, అనుమానాస్పదం చిత్రం లొ ఇళయరాజా నేపధ్య సంగీతం వీనుల విందు చెసింది.
    గోగోగో కి చక్రి అందించిన రీరెకార్డింగ్ అతిభయంకరం.

    మీరు తెరచాపని గమనించిన సీన్ లొనే నెను ఒక ఊరకుక్కని చూసి మీరు అనుకున్నట్టే ..”ఎంత నేట్యురాలిటీ అయితె మాత్రం మరీ కుక్కలని సీన్ లొకి ఎలా రానిచ్చారు” అని అనుకున్నా :)

  2. సుజాత says:

    వంశీ ఇలా చాలా సార్లు నన్ను నిరాశకు గురి చేశాడు. డిటెక్టివ్ నారద, దొంగరాముడు అండ్ పార్టీ,అనుమానాస్పదం ఇలాంటివన్నీ వంశీ శ్రద్ధగా కాక ఏ మూడ్ లో ఉన్నాడో కూడా తెలీనంత బాడ్ మూడ్ లో తీశాడేమో అనిపిస్తుంది. ఈ మధ్య చూసిన వాటిలో అనుమానాస్పదం మరీ! దాన్ని నేను అన్వేషణ స్థాయిలో ఊహించుకుని చూశాను. గో గో గో అంతకంటే చెత్తగా ఉందని తెలిశాక ఇక చూసే ధైర్యం లేదు. నిజంగా ఎప్పటినుంచో ఈ సినిమాకోసం ఎదురు చూశాను. హీరో కూడా సరైన ఎన్నిక కాదనుకుంటా!

  3. Mauli says:

    అసలు నాకు వంశీ యాస నచ్చకనే ఆ సినిమా నచ్చలేదేమో?
    చ! అదేమిలేదు. అసలది సినిమాలానే లేదు. ఏదో నాటకంలా ఉంది

    ee rendo nizam andi .. inka …ee cinima godavari vallaki yentho kontha nachuthundi ..mukhyam ga un educated vallaki …valla kosam cinima yevaru teestunnaru ..valla valla illa lo unde problems konchem use chesaru ….city life ki nature ki assalu sambandham undadu ,so manaki nachadu …inka tana story ki inka baga tiyyali ante tanu chala values lo compromise avvali ..so ala avvaledu vamsi ….

    Note: vamsi tana abhimaanula kosam teeyadu movie …tanaki nachi natlu ga teestadu ….so nirasa parachadu antam konchem aalochinchalsina vishyame…(naakkoda nachaledu …kani ee movie tarvatha … youth ki nache la audio ni unchadu …inka migilina valla kosam cinima :)

  4. నాకైతే వంశీ అనుమానాస్పదం చూసినప్పుడే గట్టిగా అనుకున్నా ఈ సారి వంశీ సినిమాలు మంచి టాక్ వస్తేగాని చూడకూడదని. తను పుస్తకాల్లో రాసిన అందమైన భావనలు తెరపై చూపించటంలో ఘోరంగా విఫలమవుతున్నాడనిపిస్తుంది.

  5. ఆల్రెడీ ఒక మిత్రుడి సమీక్ష విని చూసే ధైర్యం కోల్పోయాను. ఇక ఏం చెయ్యాలి…అస్సలు చూడకూడదని నిర్ణయించుకున్నాను.

  6. వంశీ గత వైభవం చెప్పుకుని ఇంకా బండి లాగిస్తున్నాడు. నిజానికి ఆలాపన, సితార వంటి ఒకట్రెండు తప్ప వంశీ తీసిన చెప్పుకోదగ్గ సినిమాలేవి? లేడీస్ టైలర్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల లాంటివి అప్పట్లో హిట్లే కానీ ఇప్పుడు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా ఆ పాత కాలపు టేకింగ్‌నే పట్టుకుని వేలాడుతున్నాడాయన. భావుకత ఉంటే సరా? జూమ్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు లాంటి కనీస కెమెరా జ్ఞానం లేకపోతే ఎలా?

  7. మేడేపల్లి శేషు says:

    హలో కిరణ్ కుమార్ గారూ, సినిమా మీకు నచ్చకపోతే పోయింది గాని, మీ అభిప్రాయం మాత్రం వెరైటీగా రాశారు. అది నాకు నచ్చింది. మరో విషయం. మీదీ తెనాలే. మాదీ తెనాలే. అదేనండీ. నాదీ ఖమ్మమే అంటున్నాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం డిల్లీ. అదేంటండీ, ఖమ్మానికి యాస ఉందనేశారు. నేను ఇన్నాళ్ళూ ఖమ్మానికి ఒక ప్రత్యేకమైన యాస లేదు అనుకుంటూంటే. ఎందుకంటే, అది ఆంధ్రాకీ, తెలంగాణాకీ సరిహద్దు. అందుకని భాష కాస్త బాలెన్సుడుగానే ఉంటుంది. ఇక యాస చదవాలంటే మీకు గ్రీకు, లాటిన్ లా ఉంటుందన్నారు. కాకపోతే, నేను దీనికి పక్కా ఆపోజిట్. నాకు మాండలికాలంటే చాలా ఇష్టం – రాయలసీమ, కోస్తా, తెలంగాణా, ఉత్తరాంధ్ర ఇలా ఏదైనా. వంశీ గోదావరి మాండలికం ఆయన రచనల్లో చదివి ఆనందించినా, సినిమాల్లో మాత్రం అర్థం కావాలంటే, కాస్త టైం పడుతుంది (అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లోని డైలాగుల స్పీడును నేను ఫాలో కాలేకపోయాను). అయితే, తెలుగు ప్రేక్షకులు వంశీని గో..గో..గో.. అనేశారా? ఇంతకీ, కొంతకాలం క్రితం ‘కథాకిరణాలు’ (కథారచయితల పరిచయాలు) ప్రచురించింది మీరేనా?

  8. chavakiran says:

    >> ‘కథాకిరణాలు’ (కథారచయితల పరిచయాలు) ప్రచురించింది మీరేనా?
    కాదు.
    >> నాకు మాండలికాలంటే చాలా ఇష్టం
    నాక్కూడా ఇష్టం , అందుకే అప్పుడప్పుడూ కష్టపడి చదువుతుంటాను.

  9. chavakiran says:

    >> అదేంటండీ, ఖమ్మానికి యాస ఉందనేశారు
    నేనూ లేదనే అనుకున్నాను, కానీ నాలుగేండ్లు ఖమ్మానికి దూరంగా ఉండి ఓ రైలు ప్రయాణంలో ఖమ్మం వాళ్ల భాషని బట్టి పోల్చుకున్నప్పుడు కానీ జ్ఞానోదయం అవ్వలేదు!

  10. మేడేపల్లి శేషు says:

    Anyway, మీలో మంచి రైటింగ్ టాలెంట్ ఉంది కిరణ్ గారూ. మీరు ‘నవతరంగం’లో ఇంకా మంచి సమీక్షలు రాయాలి. నచ్చనివాటి గురించి ఎవరూ ఎక్కువగా రాయరు. అందుకే మీరు వాటిగురించే రాయండి. ఆయా సినిమాల్లో నచ్చని అంశాల గురించి కొంత విశ్లేషణాత్మకంగా రాస్తే, చదివే వాళ్లకు ప్రయోజనం ఉంటుంది. (ఇలా రాయటానికి కొంచెం సమయం పడుతుంది. అయినా ప్రయత్నించి చూడండి). సినిమా ఎలా ఉందొ చెప్పటంకంటే, ఎలా ఉండకూడదో చెప్పటం కొంచెం కష్టమే.

  11. Chandritha says:

    కిరణ్ గారు మీ రివ్యూ బగుందండీ.. నిజంగా ఖమ్మానికి యాస వుందంటారా? మాది ఖమ్మమే అయినా నేను ఎప్పుడూ గమనిచలేదు.

  12. sivaji.k says:

    wonderfull discussion -sivaji

  13. Pradeep says:

    ఇన్ని రివ్యులు చదివి కూడా నేను గోగోగో చూడటానికి వెళ్ళాను. ఏదో వంశిగారి మీద అభిమానం. ఎవ్వరికి పాత్రలు suite అవ్వలేదు. camera భయానకం. ఇంక నేపథ్య సంగీతం .. బాబోయ్ !!

  14. అనుమానాస్పదం సినిమా చూస్తున్నప్పుడు నాకెందుకో బహుశా ఇదే వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో చూడబోయే చివరి సినిమాఅని నాఅనుమానం నిజమయినందుకు బాధగా ఉంది.ఈ గోగోగో లో మామిత్రులొకాయన నటించారు.ఆయన పేరు వై.యస్.కృష్ణేశ్వరరావు.ఆయనప్రముఖ నాటకరచయిత,నటుడు,కొన్ని సినిమాలకు మాటలు రాసారు కూడా.వాటిలో శ్రీహరి నటించిన భధ్రాచలం కూడా ఉంది.ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటి?వగైరా విశేషాలు ఎవరైనా తెలియజేయగలరా?

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.