ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తున్న సినిమాలున్న ఈ రోజుల్లో ఈ తరం ప్రేక్షకులకు ఫిల్మ్ సొసైటీల ఉద్యమం గురించి తెలియచెయవలసిన అవసరం ఎంతో ఉంది.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభం అయిన ఫిల్మ్ సొసైటీల ఉద్యమం దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉధ్రుతంగా సాగింది. సమాంతర చిత్రాలు, ఆఫ్ బీట్ చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు, అవార్డ్ చిత్రాలు గా పేరు పొందిన చిత్రాలు ఎన్నింటినో ఫిల్మ్ సొసైటీలు అలనాడు ప్రేక్షకులకు అందించాయి. కలలో కూడా చూడలేమని భావించే చిత్రాలు,పేరు కూడా సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో దేశాల చిత్రాలు, అంతర్జాతీయ స్థాయిలో ఆయా దేశాల ఖ్యాతిని ఇనుమడింపచేసిన చిత్రాలు ఎన్నింటినో చూసే భాగ్యం ఆ కాలంలో ప్రజలకు కలిగింది. మంచి సినిమాలు చూడాలన్న కోరిక కలిగిఉన్న కొంతమంది ప్రేక్షకులు కలిసి స్థాపించుకున్న ఈ సొసైటీలు చాల ఉన్నతంగా పనిచేశాయి.
ఆ కాలంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న థియేటర్లలో అటువంటి చిత్రాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం, ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా లేకపొవడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువగా ఇలాంటి చిత్రాలు ప్రదర్షించడానికి ఆసక్తి చూపకపోయేవారు. అప్పుడే ప్రారంభం అయిన ఫిల్మ్ సొసైటీల ప్రదర్షనలకు వందల మంది ప్రేక్షకులు హాజరయ్యేవారు. వారం రోజుల పాటు తమ తమ కార్యకలాపాలలో ఉన్న వారు కూడా ఆదివారాలు, సెలవు దినాల్లో ప్రెక్షకులకు ఏ మాత్రం సౌకర్యం లేని ఉదయం 8.00 గంటలకు సినిమాలకు హాజరయ్యారు. అయితే 90వ దశకంలోకి వచ్చేసరికి దేశంలోని చాలా ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో సైతం దూరదర్శన్ అందుబాటులోకి వచ్చింది. దాంతో సామాన్య ప్రెక్షకులకు మంచి చిత్రాలు చూడడానికి మరో అవకాశం ఏర్పడింది.
ఫిల్మ్ సొసైటీలలో ప్రదర్శింపబడే ఎన్నో ఉత్తమ చిత్ర్రాలు శనివారం రాత్రిళ్ళు , ఆదివారం మధ్యాహ్నం వేళల్లో దూరదర్శన్ లో ప్రసారం కావడం ప్రారంభం అయింది. ఇంట్లోనే కూర్చుని వివిధ దేశాల మంచి చిత్రాలు చూసే అవకాశం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అదే కాలంలో ఆదివారం ఉదయం పూట రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణ్ సీరియల్ ప్రదర్షన ప్రారంభం అయ్యింది. సహజంగానే భక్తి భావం కలిగిన దేశప్రజలు తమకు తెలియకుండానే ఆ సీరియల్ కు అంకితమయ్యారు. సరిగ్గా ఆ దశలోనే ఫిల్మ్ సొసైటీలకు ప్రేక్షకుల సంఖ్య తగ్గడం ప్రారంభం అయ్యింది. ఫిల్మ్ సొసైటీ ఉద్యమం పట్ల, అవి ప్రదర్శించే సినిమాల పట్ల ఎంతోమక్కువ కలిగిన ప్రేక్షకులు కూడా వాటికి హాజరు కాలేకపోయేవారు. అదే సమయంలో దేశ విభజనకు ముందున్న జీవనాన్నీ, దేశభక్తి భావననూ ప్రేక్షకుల్లో రేకెత్తించిన “బునియాద్”, ఆ తరువాత వచ్చిన “మహాభారత్” వంటి సీరియల్స్ ప్రేక్షకులను దూరదర్శన్ కు కట్టిపడేశాయి.ఆ తరువాత వచ్చిన వీడియో క్యాసెట్ల అందుబాటు, చిన్న చిన్న వీడియో థియేటర్ల వంటి వాటి వల్ల ఫిల్మ్ సొసైటీల ఉద్యమం స్వల్పంగా బలహీన పడింది.
ఆ తరువాత కాలంలో దూరదర్శన్ లో తెలుగు ఛానెల్ ప్రారంభం, కేబుల్ టీ.వి. ద్వారా వివిధ ప్రైవేటు ఛానెల్స్ ప్రసారం కావడం దేశప్రజలందిరి జీవితాల్లోకి చొచ్చుకు వచ్చిన ఒక గ్రహణం అయ్యింది. దీంతో మంచి సినిమాలు చూసె అలవాటు యువతరానికి దూరం అయ్యింది. ఇది భావితరాల మేధోమధనానికి తీరని నష్టం. ఇలాంటి సమయంలో ఫిల్మ్ సొసైటీల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెల్లాల్సిన బాధ్యత యువతరానికో ఛాలెంజ్.
–డా.రావికంటి మురళి
abhimaani says:
Murali,
yes it is a real challenge for the youth to take forward this movement. But I think there are hardly any members of youth who can take this forward.
K మహేశ్ కుమార్ says:
ఫిల్మ్ సొసైటీలు తమ పరిధిని పెంచుకుని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విస్తృతిని పెంచుకుంటే యువత దానంతట అదే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆప్రయత్నం స్కూళ్ళు,కాలేజిలూ,యూనివర్సిటీల్లో మొదలెట్టాలి. నేనొకచెయ్యి వెయ్యడానికి సిద్ధం. మరిమీరు!
dr.murali ravikanti says:
i am very much ready
Sunil K Thodupunuri says:
Some ideas that may work, Iam sure you have done some of them:
·Incentives if attendee brought a group from his or another industry (Have a committee of recruiters to go out promoting incentives)
·Raffles/Lottery some gift items (Gift items could be donated by some local businesses with their advertizement on the gift item)
·Giving promotional gift packets at the door (discounts, gift items, desk items,etc.)
·Free/Discount food/drink vouchers
మేడేపల్లి శేషు says:
ఫిల్మ్ సొసైటీల గురించి లోగడ ‘నవతరంగం’ లో వ్యాసాలు వచ్చాయి. అవి ఈ వ్యాస రచయిత చదివినట్టు లేదు. మన దగ్గిర కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ చాలా ప్రముఖమైనది. వాళ్లకు స్వంత థియేటర్ కూడా ఉంది. మంచి సినిమాల గురించి, దర్శకుల గురించి ఈ తరం యువతలో సరైన అవగాహన లేని మాట నిజమే. ఇతర భాషల చిత్రాల గురించి అవగాహన ఇంకా తక్కువ. మంచి సినిమాలను చూడటం, ఆదరించటం అనేది విద్యార్థుల నుంచే రావాలి. పాఠశాలల్లొ, కళాశాలల్లో ఇవి ప్రదర్శించాలి. అయితే, ఇటీవల NCERT సినిమాను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఉత్తమచిత్రాలు అనదగ్గవి కొన్ని (కనీసం పది) ఎంపికచేసి, స్కూళ్ళలో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఇది హర్షించదగ్గ విషయం.
dr.murali ravikanti, karimnagar says:
మేడిపల్లి శేషు గారు తెలియ చేసిన అభిప్రాయానికి చాలా థాంక్స్. వారు మెన్షన్ చేసిన కరీం నగర్ ఫిల్మ్ సొసైటీ లో నేను శాశ్వత సభ్యుడిని. అంతేకాకుండా ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రెటరీగా పనిచేస్తున్నాను. మేము కూడా మా కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల ద్వారానే చేస్తున్నాము. ఈ విధమైన స్ఫూర్థి మిగతా ప్రాంతాలలో కూడా రావాలనేదే నా ఆశ.
Kiran Vemula says:
ఫిల్మ్ సొసైటీలపై నాకు పెద్దగా అవగాహన లేక పోయినా, ఒక ప్రేక్షకుడిగా మాత్రం నాకు గుర్తున్నది, చిన్నప్పుడు కరీంనగర్లో, చిల్డ్రెన్ ఫిల్మ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చూపించిన ఎన్నో పిల్లల చిత్రాలను చూసాను. ఛూసిన ప్రతీ ఒక్క సినమా నాకు బాగా గుర్తు… ఆ అనుభవాలు నేను ఎప్పటికీ మరవలెను…థాంక్ యు ఫిల్మ్ సొసైటీ…
V. Raja Ram says:
I am very happy to see such an article. Being an executive member of Karimnagar Film society between 1970-80 I appreciate the improvement in Film society campaign and certainly I will take active part in the movement. This article made me to remember our President Sri Naveen Garu (Ampa shayya Naveen garu ) and Honourary Chairman/President Collector Sharma Garu.