మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

naadodigal-wallpaper

naadodigal-wallpaperఅందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ.

‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది.
భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం సుధాచంద్రన్ తెరపైకి వచ్చినా, కథాపరంగా పాత్రపరంగా సినిమా అంగవైకల్యం గురించే కాబట్టి అర్థం చెసుకోతగ్గ పరిణామమే. కానీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఒక మూగ-చెవిటి నాయికను తన ప్రతిభను గుర్తించి ఎన్నుకోవడం నిర్మాత,దర్శకుల అభిరుచికి నిదర్శనం. ఇంత సాహసం చేసికూడా, “అదేమీ పెద్ద విషయం కాదు. తనలో ప్రతిభ ఉంది. తన అవసరం మా సినిమాకు ఉంది. అంతే!” అని అంటున్న దర్శకుడు ‘సముద్రకని’ అభినందనీయుడు. ఈ విషయం గురించి ఎక్కడా పబ్లిసిటీ చెయ్యకపోవడం అతని నిబద్ధతకు చిహ్నం.
‘అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం’ అని ఋజువు చెయ్యడానికి ఇలాంటి ప్రతిభావంతులు, ఆ ప్రతిభని గుర్తించి ప్ర్రోత్సహించే మనుషులూ తారసపడుతుంటారేమో!



ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

20 Comments to “మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్”

  • ఈ విషయం గురించి ఎక్కడా పబ్లిసిటీ చెయ్యకపోవడం అతని నిబద్ధతకు చిహ్నం.
    exactly.
    though its all over in media…dunno how it came out..
    anyway…..people challenged with verbal skills can give the BEST facial expressions to convey meanings…because its part of their life.
    but real acting is ….”acting” than living….like how suhasini did a role old deaf mute in sirivennela so efficiently though she isnot one
    if the role of this girl…is not a deaf-mute or something in this tamil film…and if she had dialogues too than its acting…otherwise its just living offscrean life onscreen..
    hope she “acted”…such a beautiful girl…nature is cruel..she had strength

    • @su: ఈ సినిమాలో ఈ అమ్మాయి “నటించింది”. తన పాత్రకు ఈ సినిమాలో మాటలున్నాయి.తెరపై మాట్లాడుతుంది. కానీ నిజ జీవితంలో మాట్లాడాలేదు. వినలేదు.

  • and..i suggest you to change the article name as DEAF MUTE GIRL than dumb…(though dumb is also right description..its used for idiocy these days)
    when i wanted to paste link to someone..it appeared harsh

    • @su: Its changed to “mute”.

      • మీరు ఈ సినిమా గురించి ఒక కేస్ స్టడీ లేదా థీసిస్ వ్రాయగలరేమో? అవకాశం ఉంటే దాని నవతరంగీకరించండి. :-D

  • hats off to abhinaya and samudrakani..

  • విషయం గురించి ఎక్కడా పబ్లిసిటీ చెయ్యకపోవడం అతని నిబద్ధతకు చిహ్నం.
    “అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం” అని ఋజువు చెయ్యడానికి ఇలాంటి ప్రతిభావంతులు, ఆ ప్రతిభని గుర్తించి ప్ర్రోత్సహించే మనుషులూ తారసపడుతుంటారేమో!
    100% correct.

  • కథానాయికలకి (కొందరు నాయకులకూ) వేరేవారితో డబ్బింగ్ చెప్పించటమ్మీద చిన్నచూపుండేది నాకు. ఈసారి, ఒక మంచి ప్రయత్నానికి డబ్బింగ్ సహకారం తీసుకున్నారన్నమాట.

    • @అబ్రకదబ్ర: నిజం. ఈ సినిమాలో ఈ అమ్మాయికి చాలా చక్కగా డబ్బింగ్ కుదిరింది. భాషతెలీని హీరోయిన్లని బొంబాయి నుంచీ తీసుకొచ్చి లొకేషన్లో ఒకటిరెండ్లు చెప్పించి ఆ తరువాత డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలకన్నా, ఈ ప్రయత్నం ఎంత ఉన్నతమో కదా!

      ఈ సినిమా ఇప్పుడు చూసినా అభినయకు మాటలు రావనే నిజాన్ని జీర్ణించుకోలేము.

  • deaf and dumb are words which are now considered to be offensive. Instead of them you could use hearing impaired and speech impaired respectively.

  • great.

  • ఈ సినిమా గురించిన విశేషాలు NTలో చదివి చదివి ఆశక్తి పెరుగుతుంది. sub titles ఎక్కడైనా దొరికితే ఎవరైనా తెలియచేయండి దయచేసి. తెలుగులో వచ్చేముందే చూసేయ్యాలి.

  • బాగుంది, మంచి ప్రయత్నం.

  • అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం….i completely agree with this…..

    thanks for posting this mahesh gaaru

  • samudra kani prayatnam migata directors ku adarsham, KEEP IT UP.

  • ఈ సినిమా తెలుగులో తియ్యడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాను. మన వాళ్ళు మాత్రం (చెత్త) సంప్రదాయం చెడకుండా, బొంబాయి నుంచి ఒక నటశూన్య ని దిగుమతి చేసుకొని, (డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంత కష్టపడినా) లిప్ మోమెంట్ ఏ మాత్రం కలవకుండా “నటింపచేసి” మన మీదకి వదుల్తారు అనిపిస్తోంది.
    లేదా, మన అదృష్టం పండి, ఈమె చేతనే తెలుగు లో కూడా చేయిస్తారా?

  • CHALA HOOPS PETTUKUNNANU KANI ?

  • really great actress.I hope that within few daily she will become top actress.Director and producer also thankfull to them are giving opportunity.

  • really hatts off 2 abinaya , director samudrakhani n producer

  • this is unbelievable…absolutely great!
    i congratulate the director and his team.

    నేను ఒకసారి టీవీలో ఈ అమ్మయి మట్లాడడం చూసాను, నాకు ఏమీ అర్థం కాలేదు. పక్కనున్న శివ బాలాజీకి మాత్రం అర్థమయింది…తను మళ్ళీ తెలుగులో చెప్పాడు. ఏమిటి ఈ అమ్మాయి తనలోతనే గొణుక్కున్నట్టు, ఏమీ అర్థం కాకుండా ఇలా మాట్లాడుతున్నాది అనుకున్నాను. కానీ ఇది విషయమని తెలీదు. ఆ అమ్మాయి ఆత్మవిస్వాసానికి జోహార్లు. నిజంగానే పేరుకి తగ్గట్టు అభినయం, అందం ఉన్న వ్యక్తి. All the best to her!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories