భారతదేశపు చలనచిత్రసంగీత దర్శకులలో ఆకాశమంతటి స్థాయి,ప్రతిభావ్యుత్పత్తులు గలమహానుభావుడు.హిందీసినిమాలకు ఎందరో అత్యుత్తమ సంగీతం అందించారు.
నౌషాద్,ఒ.పి.నయ్యర్,సి.రామచంద్ర,రవి,హేమంత్ కుమార్,మదన్ మోహన్,ఖయ్యాం,సలీల్ చౌదరి,శంకర్-జైకిషన్,కళ్యాణ్ జీ-ఆనంద్ జీ,తదనంతరం లక్ష్మీకాంత్-ప్యారేలాల్,రవీంద్రజైన్,ఆర్.డి.బర్మన్ ఇలా అనంతమైన జాబితా ఉన్నప్పటికీ అందరిలోకి అగ్రగామి యస్.డి.బర్మన్.
యస్.డి.బర్మన్ సినిమాకెరీర్ నో లేక ఆయన చలనచిత్రాలకు అందించిన సంగీతాన్ని గురించిన విశ్లేషణలను ఆయన నూటనాలగవ జయంతి అక్టోబరు ఒకటో తేదీన మరలా చర్చింకుందాము.ఇంతకీ ఈవ్యాసరచనకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి ముచ్చటించుకునేముందు ఈ గీతాన్ని చదివి చూసి విని ఆనందించండి.
‘రోజులుమారాయి’ చిత్రంలోని ఈ ఎవర్ గ్రీన్ గీతాన్ని విననివారెవరు?
సారధీచిత్రపతాకంపై 1955లో వచ్చిన ‘రోజులుమారాయి’చిత్రానికి కొసరాజు సాహిత్యమందించగా మాష్టర్ వేణు స్వరాలు సమకూర్చారు.ఈ పాటలో నర్తించిన వహీదారెహమాన్ తర్వాత హిందీచలనచిత్రసీమలో తారాపధానికి ఎగిసింది.
తర్వాత 1960లో మఝ్రూసుల్తాన్ పురి లేఖిని నుంచి వెలువడి ఆశాభోంస్లే గళం నుంచి జాలువారిన ఈ గీతాన్ని చూడండి.ఇది ‘బొంబయి కా బాబు’ లోది.దేవానంద్ సరసన నటించినది ప్రఖ్యాత అభినేత్రి సుచిత్రాసేన్.
dekhne mein bholaa hai dil kaa salonaa
bambai se aayaa hai baabuu chinnannaa
dekhne mein bholaa hai dil kaa salonaa
bambai se aayaa hai baabuu chinnannaaballe ni bale bale
gali gali gaanv ki re jaagi hai sote sote
gali gali gaanv ki re jaagi hai sote sote
phir se laage hai aisaa
phir se laage hai aisaa
hue ham chhote chhote
sang leke aayaa hai meraa bachpanaa
bambai se aayaa hai baabuu chinnannaa
dekhne mein bholaa hai dil kaa salonaa
bambai se aayaa hai baabuu chinnannaaniki munni noor beGam use na banaanaa ji
niki munni noor beGam use na banaanaa ji
haseenon ka shahzaadaa hai
haseenon ka shahzaadaa hai
hansi naa udanaa ji
dil uda le jaayegaa chodo bachpanaa
bambai se aayaa hai baabuu chinnannaa
dekhne mein bholaa hai dil kaa salonaa
bambai se aayaa hai baabuu chinnannaasuno magar shahzaade ji kahin bhool mat jaanaa
suno magar shahzaade ji kahin bhool mat jaanaa
buri hain yah nainon waali
buri hain yah nainon waali
banaate hain deewaanaa
gaamv hai yah pariyon ka dil ko bachaanaa
bambai se aayaa hai baabuu chinnannaa
dekhne mein bholaa hai dil kaa salonaa
bambai se aayaa hai baabuu chinnannaa
అంతర్జాలంలో గాలించగా వి.యే.కే.రంగారావు,వికీపీడియా తదితరాల్లో ఈ పాట ‘రోజులుమారాయి’నుంచి కాపీ కొట్టారనే పేర్కొంటున్నా నాకెందుకో యస్.డి.బర్మన్ వంటి దిగ్దర్శకుడు‘కాపీ’కొట్టారు’అన్న ఊహాను కూడా భరించలేకపోతున్నాను.మితిమీరిన అభిమానం కూడా ఇందుకు కారణంకావచ్చు.కాకపోతే ఈ పాటలన్నిటికీ లేక వరసలన్నిటికీ అసలంటూ మరొకటి ఏదన్నా ఉందా?ఉంటే ఏమిటది?సినిమా పాటేనా?లేకమరొకటా?అన్న సందేహాన్ని విజ్ఞులెవరన్నా తీర్చగలరా అని ఎదురుచూస్తున్నాను.పరుచూరి శ్రీనివాస్,కొడవటిగంటి రోహిణీప్రసాద్ వంటివారు స్పందిస్తారని నాఆశ.
‘బొంబయి కా బాబు’ చిత్రాన్ని నవతరంగం ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుగా ఈ వ్యాసం ఒక ‘కర్టన్ రైజర్’.
మేడేపల్లి శేషు says:
రాజేంద్రకుమార్ గారూ, మీ పోస్టు బాగుంది. ఏమై పోయారు ఇన్ని రోజులూ. కనిపించలేదు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
ధన్యవాదాలు శేషు గారు ఆరోగ్యసమస్యలు ఇతరత్రా ఇబ్బందుల వల్ల కనిపించలేకపోయాను
కత్తి మహేష్ కుమార్ says:
ఎస్.డి.బర్మన్ కాపీ కొట్టలేదులెండి. ఇది “అధికారిక అడాప్షనే”.
కాకపోతే మనం ఇక్కడ మాస్టర్ వేణు గారి మాస్టరీని గుర్తించాలి. పాటను హిందీకి ఎంత అడాప్ట్ చేసుకోవాలనుకున్నా “చిన్నన్నా” అనే పదాన్ని ఎలా మార్చాలో తెలియరాలేదు. అందుకని ఆ పదాన్ని అలానే వాడేసుకున్నారు.
వజ్రాల నగలాంటి పాట. కొత్తగా నగిషీచెక్కాలన్నా కొన్ని ముడులు ఎలా విప్పాలో మాస్టర్ మ్యూజిక్ డైరెక్టరైన సీనియర్ బర్మన్కే తెలీనంతగా “మన” మాష్టర్ ఆల్రెడీ పొదిగేసాడు మరి. అదే మాస్టర్ వేణు గొప్పతనం.
నౌషాద్ వంటి సంగీత దర్శకుని మొప్పునందుకున్న మాస్టర్ వేణు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకో విషయం. Helmond organ ను భారతదేశంలో వాయించగల ఒకేఒక దిట్టగా ఈయన కొక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఏమిటో పాత పాటల్ని గుర్తుచేసి మనసు పిండేస్తున్నారు. అవునూ….ఇంతకాలం తర్వాత దర్శనమేల?
నవీన్ గార్ల says:
మహేష్ గారు, Hammond organ అనేది సరైన పదం అనుకుంటా.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
నవీన్ గారు,Hammond Organ సరైన పదమేనండి
http://en.wikipedia.org/wiki/Hammond_organ
కె.మహేష్ కుమార్ says:
Thank you for correcting. I stand corrected.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
ఇక అన్నీ పాటలూ సినిమాలే చాన్నాళ్లకు సరిపడా సరంజామా సమకూర్చుకుని ఇంతకాలానికి దర్శనమిచ్చానన్నమాట
గీతాచార్య says:
ముందు మీరొచ్చారు చాలా కాలానికి. ఎలా ఉన్నారేంటి?
మన తెలుగోళ్ళ పాటని హిందోళ్ళు కాపీ కొడితే నమ్మరన్నమాట. Grrrrrrr
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
ప్రస్తుతం 305 మీద ఉందండి చక్కెరశాతం కాబట్టి బాగానే ఉన్నా
కాపీ కొడితే నమ్మనని కాదు కానీ….యస్.డి.బర్మన్ మీద అభిమానం అడ్డం పడుతుంది అంతే
Rohiniprasad says:
మాస్టర్ వేణు నిస్సందేహంగా ప్రతిభావంతుడేగాని ఏరువాకా పాటకు ఆధారం ఒక సంప్రదాయ తెలుగు జానపద బాణీయే. బర్మన్ మటుకు రోజులు మారాయి ట్యూన్ విన్నాకనే తన పాట చేసి ఉంటాడు. ఈ విషయం వహీదా రెహమాన్ ద్వారా ఆయనకు చేరి ఉంటుందని మనం ఊహించవచ్చు. ఇమిటేషన్ ఈజ్ ది బెస్ట్ ఫాం ఆఫ్ ఫ్లాటరీ అంటారు కనక దీనివల్ల బర్మన్ ప్రతిభకు వచ్చిన నష్టమేమీ లేదు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
ధన్యవాదాలు ప్రసాద్ గారు.వహీదా రహమాన్ ద్వారా ఆయనకు చేరి ఉండొచ్చని మీరన్నాక నాకు నిజమే అనిపిస్తుంది కానీ అంతమంచి పాటను ముఖ్యంగా తనకు సినీ జన్మనిచ్చిన గీతాన్ని ఆమె తనమీదే చిత్రీకరించే విధంగా ఎందుకు చేసుకోలేకపోయారంటారు?
Sreenivas Paruchuri says:
కనీసం ఒక డజను సార్లు ఈపాట గురించి, దాని మూలాలు, వేర్వేరు రూపాలు, దాని మీద కోర్టు కేసులు, దాని సృష్టికర్తను నేనంటే నేనని జరిగిన వాదనలు, … గురించి పోస్టులు రాసాను. చాలా వివరంగానే. మరో సారి టైపు చేసే టైము, ఓపిక లేవు. క్షంతవ్యుణ్ణి! గూగుల్లో చూడండి.
– శ్రీనివాస్
గీతాచార్య says:
హమ్మయ్య ఒక సమస్య తీర్చేశారు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
శ్రీనివాస్ గారు మీరు ఇప్పుడొక కొత్త దిగులు పెట్టారు నాకు..:)
కోర్టు కేసులు, దాని సృష్టికర్తను నేనంటే నేనని జరిగిన వాదనలు, … నా??బాప్ రే వెతకాల్సిందే గూగుల్ను.
pappu says:
మళ్ళీ బర్మన్ని గుర్తు చేసారు బావుంది,సంతోషం,మంచి పాట పరిచయంతో రీ-ఎంట్రీ సూపర్.ఇంతకీ ఏమయ్యారు ఇన్నాళ్ళూ,కు-శలమేనా మీకూ కుశలమేనా(విశాఖా తీరాన్నేనా)…
Sreenivas Paruchuri says:
క్లుప్తంగా:
పాట అయ్యో కొయ్యోడా అన్న “జానపద గీతానికి” అనుకరణ.
ఈ “జానపద” గీతానికి మేమే బాణీ కట్టాం, పాట మాదే అని వింజమూరి అనసూయ గారన్నారు. కానీ వల్లూరి జగన్నాథం (జగన్నాథరావు) అన్న ప్రముఖ గాయకుడు 1924-5 ప్రాంతంలోనే ఆ పాటను గ్రామఫోను రికార్డుగా యిచ్చారు. నిజానికి వింజమూరి సోదరీమణులు వల్లూరి దగ్గర కొంత శిష్యరికం చేశారు.
సినిమాల్లో: “శ్రీ లక్షమ్మ కథ” (1950, సుబ్బురామన్) అన్న సినిమాలో జిక్కి, శివరావు పాడిన (గొప్ప, హుషారైన) పాట: చీటికి మాటికి చిట్టెమంటావ్, చిన నాయుడుంటడు పెద నాయుడుంటడు చిట్టెమ్మా అని పిలువకురో అయ్యో కొయ్యోడా” పైన వల్లూరి బాణీలోనే సాగుతుంది.
మాస్టర్ వేణు కొత్త వాద్య నిర్మాణంతో పాత బాణీకి అందాన్ని తెచ్చిన మాట వాస్తవం.
1960 ప్రాంతంలో సుసర్ల దక్షిణామూర్తి ఇదే బాణీని “మదురై వీరన్” అన్న తమిళ చిత్రంలో వాడుకుంటే కోర్టులో కేసులవరకు వెళ్ళింది. మొదటి సారిగా బాణీలకు IP rights వుంటాయా అన్న చర్చ దీనితోనే జరిగింది.
బర్మన్ ఇదే కాలంలో హిందీలో ఆ బాణీని వాడుకున్నాడు. ఆయన అదృష్టం బాగుండి కోర్టు కేసులు గట్రా ఏమీ పడలేదు.
– శ్రీనివాస్
నేను says:
[quote] “శ్రీ లక్షమ్మ కథ” (1950, సుబ్బురామన్) అన్న సినిమాలో జిక్కి, శివరావు పాడిన (గొప్ప, హుషారైన) పాట: చీటికి మాటికి చిట్టెమంటావ్, చిన నాయుడుంటడు పెద నాయుడుంటడు చిట్టెమ్మా అని పిలువకురో అయ్యో కొయ్యోడా” పైన వల్లూరి బాణీలోనే సాగుతుంది.[quote]
పైన చెప్పిన పాట నేను వినలేదు.కాని చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలో ఇదే పాట ఉంది. ఈ బాణీ కూడా అదేనా ?