Menu

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను.
అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే?
అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత
ఏడ్సినట్టుంది.
ఏంటి సినిమానా ?
కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ?
ఇంగ్లీషులోనే చూశా!
మరి తెలుగులో సేతడమెందుకో?
తెల్దా? స్టైలు.
అవునా? ఎక్కడ?
బ్లాగుల్లో!
హ హ హ . ఇంతకీ సినిమా తెలుగులో ఎందుకు చూళ్లోదో? ఇంకా మన గణపతి ఫిలిమ్స్ వాళ్లు డబ్బింగ్ చెప్పలేదా?
లే , తెలుగులో కూడా ఆడుతున్నట్టుంది.
మరి అంత తెలుగు పిచ్చోడివి తెలుగులో చూడక ఆంగ్లంలో చూశావే?
మరీ అంత పిచ్చేమీ లేదు.
వేపకాయంత ఉందంటావ్
ఏంటీ
ఏం లేదులే – గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ – ముందు సొల్లినప్పుడే ఎరుకలో ఉండి ఇనాల.
అలాగే సార్.
ఇంతకీ సినిమా ఇంగ్లీషులో ఎందుకు చూశావ్
ఏదో ఐమాక్స్ కదా, త్రీ డీ కదా అని.
కాసుల గల గల
ఏంటీ
గోల్డెన్ వర్డ్స్
సరే సరే
త్రీ డీ ఫుల్లు ఎంజాయ్ చేశావన్న మాట.
ఏమెంజాయో ఏమోలే. ఫష్టు పది నిమిషాలే త్రీడీ తరువాతంతా కళ్లజోడు మోసీ మోసీ చేతులు నోప్పెట్టాయి.
అంత బరువుందా
లే, కానీ ప్రశాంతంగా సినిమా చూడకుండా చేతుల్లో అడ్డం – దానికి తోడు ఐస్ క్రీం, పాప్ కార్న్, కూల్ డ్రింక్,.
ఓ ఫుల్లు బ్యాగేజీతో వెళ్లావన్నమాట.
అవును మరి – ఒంటేలు బెల్లు లేదని ముందే పెద్ద బోర్డు పెట్టారుగా.
ఒంటేలు బెల్లు లేదా? ఎందుకలాగా
బిజినెస్ లాజిక్ బాబూ. ఆ అర్దగంటలు నాలుగు కలిపితే ఇంకో షో వేసుకోవచ్చు కదా, ఇంకో యాభై వేలు వస్తాయి కదా.
మరి క్యాంటినోల్లెట్టా బతకాలి
సర్లే ఐ మాక్స్ కెళ్లినోడు ఒంటేలు బెల్లులోనే కొనాలా ఏంటి, సినిమా ముందూ కొంటారు, సినిమా తరువాతా కొంటారు.
అవునవును, కన్పడుతూనే ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది?
బాగానే ఉంది.
అంటే బాగున్నట్టా, బాగా లేనట్టా?
బాగుంది. కానీ ఏదో అసంతృప్తి.
ఎందుకలాగా? గ్రాఫిక్స్ బాలేవా ?
గ్రాఫిక్స్ కేంది. సూపర్, సూపరో సూపరు.
మరింకే పాత్రలు – నటన బాగోలేవా?
పాత్రలకేం తక్కువ, బాల్యం నుండి అలవాటయిన నటులు కదా పండి పొయ్యారు. ముఖ్యంగా లవ్ పోషన్ తాగాక రాన్ నటన ఉందీ, సూపరో సూపరు.
మరింకేం తక్కువయింది?
ఏదో అసంతృప్తి.
అదే ఎందుకని
పుస్తకాన్ని ఖూనీ చేశారు.
ఓ నువ్వా పుస్తకాన్ని కూడా చదివావా
ఔ, ఏడోది కూడా చదివా.
అయితే ఫానన్నమాట.
ఏదో ఒకటిలే.
సరే ఏదో ఒకటి. ఇంతకీ పుస్తకాన్ని ఖూనీ చేశాడని ఎందుకన్పించింది.
లాస్ట్ ఫైట్ తీసేశాడు.
ఓ , మంచి యాక్షన్ మిస్సయిందనా ఈ ఏడుపంతా. ఆ ఫైట్ అట్లానే తరువాత బుక్కులో కూడా ఉందంటగా.
ఉంటే మాత్రం. ఇక్కడ ఫాన్స్ ఫీలయ్యారు.
ఫానా ? ఫాన్సా ?
ఫాన్సే, మా ఫాన్ గుంపులన్నీ వలవల ఏడేచేస్తున్నాయి.
ఒక్క ఫైట్ తీసేస్తేనే
ఒక్క ఫైటా? ఎంత మాటన్నావు, మా హీరో కారక్టర్ పై కొట్టాడు. పుస్తకంలో అయితే డంబుల్ డోర్ మంత్రం వాడి హారీని కదలకుండా చేస్తాడు, కానీ ఇక్కడ ఆ మంత్రం లేదు, అయినా హారీ విలన్లతో ఫైట్ చెయ్యటానికి పోడు. ఎంత అన్యాయంగా స్టోరీ మార్చేశాడు. ఎంత దారుణం. అట్టాంటిది నువ్వు ఒక్క ఫైటేగా అంటావా? ఇంకా అన్యాయం అస్సలు టైటిల్ జస్టిఫికేషనే లేదు. ఆ పాత పుస్తకంతో హీరో అనుబంధం లేదు, ఘర్షణ లేదు, ఏం లేదు. ఇంకా మాట్లాడితే అవసరమున్న చోటే, లేని చోటా పుచుక్ పుచుక్ మని ముద్దులు మాత్రం పెట్టాడు. మొత్తం స్టోరీని నాశనం చేశాడు.
ఓకే ఓకే నీ బాధ అర్ధం అయింది. ఇంక ఆపు. అయినా అంత పెద్ద పుస్తకం సినిమాగా తియ్యాలంటే కాంప్రమైజ్ అవ్వాలి కదా.
కాంప్రమైజ్ కాదు కక్కుర్తి.
ఎవరికో
ఇంకెవరికి, నిర్మాతలకి, వార్నర్ బ్రదర్స్ కి.
వివరించు.
ఎప్పుడో ఆరు నెళ్ల క్రింద అంతా రడీ అయిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేశారు, కాసుల కోసం కక్కుర్తి కాదు. అస్సలు ఫాన్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా. ఒక్క ముక్కగా ఉన్న ఏడో పుస్తకాన్ని రెండు సినిమాలుగా తీసి ఎక్కువ కాసులు కూడబెట్టుకుందామని చూస్తున్నారు, అది కక్కుర్తి కాదా? అయ్యి హిట్టవటం కోసం ఆరో సినిమాను ఖూనీ చేశారు, అది కక్కుర్తి కాదా. అసలు సీరీసే వాళ్లకు డబ్బులు కాసే చెట్టులా తయారు అయింది. ఫాన్స్ ఫీలవుతున్నారన్న ఇంకితం లేకుండా పొయింది.
ఓకే ఓకే కూల్ డౌన్, ఇంతకీ సినిమా చూడొచ్చా?
పాటర్ ఫాన్స్ అయితే ఎట్టాగూ తప్పదు కాబట్టి చూడొచ్చు. చూసి వలవల్లాడుతూ బ్లాగొచ్చు. ఫాన్స్ కాకపోతే చూసినా అర్థం కాదు.
శుభం.

కిరణ్ కుమార్ చావా

8 Comments
 1. అబ్రకదబ్ర July 22, 2009 /
  • harish July 22, 2009 /
   • అబ్రకదబ్ర July 22, 2009 /
   • sasank July 23, 2009 /
 2. గీతాచార్య July 22, 2009 /
 3. కొత్తపాళీ July 23, 2009 /
 4. mohanrazz July 23, 2009 /