Menu

Monthly Archive:: July 2009

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’

కెమెరా-దర్శకులు ‘హిట్‘ కొట్టలేరా?

‘లోటస్ పాండ్‘! ఈ మధ్య మన తెలుగు, జాతీయ సినీ వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న సినిమా! తెలుగు సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుత్రరత్నం ఆకాశ్ ఈ సినిమాలో నటిస్తున్నాడనీ, ఈ సినిమా బాలల చిత్రం అనీ, ఇంగ్లీష్ల్ లో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం అవుతుందనీ….ఇలా ఎన్నో విశేష వార్తలు ఈ సినిమా గురించి వెలుగులోకి వచ్చాయి. ఐతే వీటన్నింటినీ మించిన గొప్ప విశేషం ఏమంటే – ఈ సినిమాకి పి.జి.వింద

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

ఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో మొట్టమొదట సమీక్షించినది సాయి బ్రహ్మానందం గారు (డిసెంబర్ 1, 2008). అప్పటికి ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. అప్పుడు ఈ సమీక్షకు రాసిన వ్యాఖ్యల్లో నేను ఇది ఎందుకూ పనికిరాని సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాశాను. ఆ తర్వాత ‘స్వాతి’ మాసపత్రికలో (జనవరి, 2009) ఈ సినిమా మాతృక అయిన వికాస్ స్వరూప్ రాసిన ‘Q & A’ నవల గురించిన సమీక్ష –

నాడొడిగల్ సమీక్ష

దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన

యస్.డి.బర్మన్ కూడానా?

సచిన్ దేవ్ బర్మన్! భారతదేశపు చలనచిత్రసంగీత దర్శకులలో ఆకాశమంతటి స్థాయి,ప్రతిభావ్యుత్పత్తులు గలమహానుభావుడు.హిందీసినిమాలకు ఎందరో అత్యుత్తమ సంగీతం అందించారు. నౌషాద్,ఒ.పి.నయ్యర్,సి.రామచంద్ర,రవి,హేమంత్ కుమార్,మదన్ మోహన్,ఖయ్యాం,సలీల్ చౌదరి,శంకర్-జైకిషన్,కళ్యాణ్ జీ-ఆనంద్ జీ,తదనంతరం లక్ష్మీకాంత్-ప్యారేలాల్,రవీంద్రజైన్,ఆర్.డి.బర్మన్ ఇలా అనంతమైన జాబితా ఉన్నప్పటికీ అందరిలోకి అగ్రగామి యస్.డి.బర్మన్. యస్.డి.బర్మన్ సినిమాకెరీర్ నో లేక ఆయన చలనచిత్రాలకు అందించిన సంగీతాన్ని గురించిన విశ్లేషణలను ఆయన నూటనాలగవ జయంతి అక్టోబరు ఒకటో తేదీన మరలా చర్చింకుందాము.ఇంతకీ ఈవ్యాసరచనకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి ముచ్చటించుకునేముందు ఈ గీతాన్ని చదివి చూసి