‘ఈక’కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

prayanam‘ఈక’కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ లో పడ్డ పసివాడి ప్రేమ కధ ఈ ప్రయాణం..ఈరోజుల్లో ప్రేమలకు ప్రతిరూపంగా అనిపించింది ….కనిపించింది..నిన్ననే ప్రయాణం సినిమా చూసా..సినిమాని సినిమాగా చూడు లాజిక్కులు వెతక్కు అంటే వదిలేస్తా..కానీ టికెట్టు పెట్టి చూసా కాబట్టి నాకనిపించింది చెప్పే హక్కు ఉందేమో అనిపించి..రాత్రంతా విలపించి…ఇలా మొదలెట్టా…

సినిమాలో అసలు ‘ప్రయాణమే’ లేదు…ఏర్పోర్టులో ట్రాలీ మీద తప్ప…ధూమపానాన్ని అసలు సహించని మలేషియాలో కూడా మన హీరొలకి ఏర్పోర్టులో సైతం సిగరెట్టు తాగేంత హీరోయిజం ఉన్నది అన్న సత్యం తెలిసింది..నాకు తెలిసినంత వరకు, అక్కడ స్మోక్ జోన్ లు ఉంటాయి ..కాని మనోడు ‘మనోజు’ హీరో కాబట్టి నో స్మోకింగు బోర్డు ముందు నుంచుని తాగేస్తూ వాగేస్తూ ఉంటాడు.

థ్రిల్లు కోసం గ్రిల్లు పట్టుకుని కైపెక్కి- పైపెక్కి- పైకెక్కి, పోలీసుల చేతిలో చిక్కి..చచ్చీ చెడీ బయటకొచ్చి…నిమిషం తరువాత ఏమి చేస్తాడో తెలీని “ఉత్తర ధ్రువానికి” అక్కడ “మంచు ” ఎక్కువలేండి..

గంటలో ప్రేమ….రోజులో పెళ్ళి, నెలలో విడాకులు..పాపం హీరోయిన్ పెట్టిన ఎం సెట్ లాంటి పరీక్షా పత్రంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది…ఆ ‘మారేజిసెట్లో’ ఫైల్ అయినా హీరో ప్రేమ పరీక్షలో పాస్….రెండు గంటల పరిచయం..ఏడుప్రశ్నల కు సమాధానం వెరసి ఒక జీవితకాల ‘ప్రయాణం’..

‘పాట్లు’ గురించి చెప్పాలంటే భయంగా ఉంది ‘ప్రింటు మిస్టేకు’ కాదు ‘పాటలు’ అనే కన్నా ‘పాట్లు’ అనడమే కరెక్టు..అంత ఘోరంగా ఉన్నాయి అవి..సంగీతపు హోరులో ‘మాట ‘ అర్ధం కాదు..రికార్డింగు..మరీ ఘోరం…గొంతుల్లో అపశృతులు..

చంద్రశెఖర్ ఏలేటికి ఐర్పోర్టు సెంటిమెంటో మరోటో తెలీదు కానీ ‘ఐతే’ ..మాత్రం కొంచెం ఆలోచించుకోవాలేమో…ఏ ఫ్లయిట్ తెలీకుండా …ఒక వేళ రాత్రి ఫ్లయిట్ ఐతే అన్నిగంటల ముందుగా చెకిన్ ఎలా అవుతారో…అర్ధం కాలే..

బ్రహ్మానందాన్ని ‘ఆడుకున్నారు’ అనాలో ‘వాడుకున్నారు’ అనాలో కూడా తెలీదు…పాయింటు చిన్నది కాబట్టి…’బట్ట తలకీ’ -మోకాలు కి లింకెట్టి” చాక్లెట్ తిన్నవాణ్ణి వదిలేసి..బ్రహ్మానందం వెంటపడ్డ ఒక ఆధునిక హిడింబాసురుడు..పెళ్ళాం బాధ పడలేక వెంటపడడం…అసహజంగా అనిపిస్తుంది…

మందు కొట్టడం..సిగరెట్ తాగడం..బెట్టు కట్టడం..అమ్మాయి వెంట పడడం..వంటివి హీరోదాత్త లక్షణాలుగా చెలామణి అవుతున్న ఈరోజులకు ప్రతిరూపంగా కనిపించే హీరో…అప్పటిదాకా ప్రాక్టికల్ గా లైఫ్ గురించి ఆలోచించిన అమ్మాయి కన్నుమూస్తే తాజ్మహల్ కట్టిస్తానన్న హీరో మనసుకి ఆకర్షితురాలవడం…పరాయి దేశం లో పోలీసులకి బాంబు విషయం లో ఇరికించినా…ఉత్తరం అందించి సాయం చేసే రైతు బ్రహ్మానందం ఆహా అద్భుతం…చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇంక దీనిగురించి ఇంతకన్నా టైము వేస్టు చెయ్యడం ఎందుకులే అని వదిలేస్తున్నా…

–ఫణి మాధవ్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

7 Comments to “‘ఈక’కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ”

  • :-) యి ఇంక దీనిగురించి ఇంతకన్నా టైము వేస్టు చెయ్యడం ఎందుకులే అని వదిలేస్తున్నా…

    ఈ వేస్టు మాత్రం ఎందుకు బాస్? సినిమా అంత బాలేదు

  • చంద్రశెఖర్ ఏలేటి ఒక విన్నూత్న దర్శకుడనే నమ్మకం స్లోగా సడలేలా ఉందే! కాన్సెప్టు విని వైవిధ్యంగా ఉందనుకుంటే సమీక్షలన్నీ ఇలా పీకిపాతరపెడుతున్నాయేమిటి చెప్మా!!

  • :)

  • నేనీ మూవీ చూడలేదు. కానీ పాటలు విన్నాను. ‘మేఘమా…!’ పాట చాలా బాగుంది. బహుశా ఈ సంవత్సరం విన్న మంచి పాటల్లో ఒకటి.

  • కధ పెద్దగా లేదు కానీ, సన్నివేశాల్లో కొంచెం ఫ్రెష్‌నెస్ కనిపించింది. కొంచెం కధమీద శ్రద్దపెట్టి ఉంటే బావుండేది. హీరో హీరొయిన్ల కంటే వాళ్ళ ప్రక్కనున్న పాత్రలు బాగున్నాయి. ఐతేలో ఉండే ఒకబ్బాయి మంచి హాస్యం చేసాడు (సంభాషణా చాతుర్యం ఉన్నోడే). జుట్టు అబ్బాయి, హీరోయిన్ ఫ్రెండ్ కాంబినేషన్ బావుంది. మనోజ్‌కి పాపం నటించడానికి ఏం లేక ఒకటే ఎక్స్ప్రెషన్6తో సినిమా అంతా లాగించేసాడు. రెండు గంటల్లో కధ అన్నప్పుడు అంతకంటే ఎక్కువ భావాలు పలికించడం రియలిస్టిక్‌గా ఉండదనుకున్నాడేమో. ఎవరేమన్నా చంద్రశేఖర్ ఏలేటి థ్రిల్లర్స్ వదిలి ఇలా రొమాంటిక్ కామెడీ దారి పట్టడం ఒక శుభసూచకం. మరికొంచెం శ్రమిస్తే ఈసారి తన సత్తా చాటుతాడనుకొంటున్నాను. ఎటూ క్రొత్తగా దర్శకులవ్వాలనుకునేవాళ్ళకు థ్రిల్లర్లే దిక్కు కాబట్టి, అవి వాళ్లకి వదిలేయడమే ఉత్తమం. నావరకూ కధంతా ఎయిర్‌పోర్ట్ లోనే జరగాలని నిర్ణయించుకోవడం వల్ల ఈ ఇబ్బంది కలిగిందనిపిస్తుంది. ఆ రెండుగంటల్లో కాన్సెప్టు అలానే ఉంచి, కొంచెం ఎయిర్‌పోర్టు బయటకి కూడా పరుగులు తీయిస్తే మరికొంత నాటకీయతకి అవకాశం కలిగుండేది. ఒకసారి చూసి నవ్వుకోవచ్చు, మరీ భరించలేనంత దారుణం కాదు.
    ఏదేమైనా కిక్ లాంటి సినిమాల నుండి చాలా నేర్చుకోవాలి చంద్రశేఖర్ ;)

  • నిన్ననే ఈ సినిమాకి బలైపోయాను. దారుణం ఏంటంటే, ప్రస్తుతం రాజమహేంద్రి నగరంలో ఆడుతున్న సినిమాలన్నిటిలోకీ ఇది మంచిదఁట. ఖర్మరా దేఁవుఁడా.

    యేలేటి పేరు చూసి వెళ్ళిన నాకు చాలా చేదు అనుభవం మిగిల్చాడు. కథలో కొత్తదనం కోసం ప్రయత్నం వుంది. అంతే. మిగిలిన కథా, కథనం మొత్తం ఒక పెద్ద క్లిషే…

    ఇక మనోజ్ చాలా అసహజంగా చేశాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదు. ఏదేమైన అన్నిటికంటే పెద్ద లోపం సినిమా స్కిరిప్టు అస్సలు బాగాలేకపోవడం.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories