Menu

Monthly Archive:: June 2009

మిర్చ్ మసాలా

1980వ దశకంలో భారతీయ సినిమారంగంలో వెలుగు చూసిన మంచి చిత్రాల్లొ కేతన్ మెహతా నిర్మించిన “మిర్చ్ మసాలా” ఒకటి. సత్యజిత్‌రే “ఘరే బైరే”. ఆదూర్ గోపాలకృష్ణన్ “ముఖాముఖం”, అరవిందన్ “చిదంబరం” లాంటి గొప్ప చిత్రాల సరసన నిలిచే చిత్రం “మిర్చ్ మసాలా”. సమాజంలోని వాస్తవికతను ఆవిష్కరించే దిశలో ప్రేక్షకుల్ని తన వెంట లాక్కెళ్తుందీ చిత్రం. గొప్ప భావావేశంతో ఆద్యంతం చూపరుల్ని కట్టిపడేస్తుంది. “మిర్చ్ మసాలా” చిత్రంలో ఉపయోగించిన మిర్చి రంగు గొప్ప ఉద్వేగభరితమయిన భావాల్ని ప్రస్ఫుటం చేస్తుంది.

డేరింగ్ డాక్యుమెంటరి ఫిల్మ్ మేకర్

సొంత ఇంటి దొంగలెవరో, ద్రొహులెవరో చాల చక్కగా  చూపిన నిర్మాత దర్శకుడు ఆనంద్ పట్వర్థన్. సెన్సారింగ్ మరియు దూరదర్శన్ లో ప్రసారం విషయం లో కొన్ని సంవత్సరాలు అప్పటి ప్రభుత్వపు నిరంకుశ నిషేదాజ్ఞలకు బలయి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి చివరకు గెలిచినది బహూశా ఈయనే మొదటి వాడయి వుంటారు. ఏన్నొ నదులు, ఉపనదులు.మూడుకాలాల్లో పండే అన్ని రకాల పంటలు, అవసరమొస్తే మొత్తం ప్రపంచపు ఆకలి తీర్చగల సత్తా ఉన్నా సస్యశ్యామల అన్నపూర్ణ అయిన మనదేశపు రాజకీయ

Three colours – White

ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది. సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది.

కత్తెర కథ

“the great editing skill will protect the director from committing suicide” – Sean penn, Actor/Director “కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక  కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే

అవకాయ బిర్యానీ గురించి మరోసారి

‘దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్క మొరిగిందన్నట్టు’ డబ్బాలు తిరిగొచ్చిన యిన్ని రోజుల తరువాత, ఈ సినిమా గురించి, యిప్పటికే నవతరంగంలో రెండు వ్యాసాలు వచ్చేకా, యింకో టపా రాయడం అవసరమా అన్న విషయం పరిగణించాను. ఈ సినిమా గురించే కాక, ఈ తరహా సినిమాల గురించి కలిగిన అభిప్రాయాలకి నాకు స్పష్టత కలగడంకోసం టపా రాయచ్చని భావనతో, యిక్కడైతే కొంత చర్చ జరిగే అవకాశం వుండటం ఈ టపా ప్రచురించడంలో వుద్దేశ్యం. సినిమాలో నాకు నచ్చిన అంశాలు