Menu

Monthly Archive:: June 2009

తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-2

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి. కథా రచయితలూ ఉన్నారు ఈ సినిమాకైనా ఆరంభం కథతోనే అనేది నిర్విదాంశం. 24 డిపార్ట్మెంట్స్ లో ’స్టోరీ’ డిపార్ట్మెంటే మొదటిది. కొత్త తరం కథ రచయితలలో చాలామంది కూడా విద్యాపరంగా అత్యున్నత చదువులు చదివినవారే. ’గమ్యం’, ’సొంతవూరు’ వంటి సినిమాలకు కథ భాగస్వామిగా, మాటల రచయితగా పేరు పొందిన నాగరాజు గంధం అత్యున్నత విద్యావంతుడే. ఆయన కొంతకాలం ఖమ్మంలోని బిబిఎం కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. అలాగే,

Ed Wood (1994)

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటుల పనితనం వీధినాటకాల వాళ్ల నటనకంటే తీసి కట్టుగా అనిపించిందా?, సెట్టింగుల్లో డొల్లతనం కళ్ళు మూసుకున్నా కనిపించిందా? నాసిరకం నిర్మాణ విలువలు అడుగడుగునా విసుగెత్తించాయా? ఇలాంటి సినిమాలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచన కలిగిందా? .హాలీవుడ్ వాళ్ళు అలాంటి వాటిని ఎడ్‍వూడ్స్ పిల్మ్స్ అని ముద్దుగా పిల్చుకుంటారు. ఈ ఎడ్‍వూడ్ ఎవరా అనుకుంటున్నారా? అయితే మీరు టిమ్ బర్టన్ సినిమా ఎడ్‍వూడ్స్ చూడాల్సిందే. ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్నేహితుల తోడ్పాటు ఉంటే

Mad Cow Sacred Cow

అనగనగా ఒక కెనడాలో పట్టిన భారతీయ సంతతి వ్యక్తి. పేరు ఆనంద్ రామయ్య. కెనడియన్ భార్య. అప్పుడే మరో బిడ్డకు తండ్రయ్యాడు. సంతోషంగా సాగే జీవితం. హఠాత్తుగా కెనడాలో ‘మ్యాడ్ కౌ’ రోగం కమ్ముకుంది. రోజూతినే బర్గర్లోని బీఫ్ ద్వారా రోగాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఆహారం విషయంలో అబద్రత ఏర్పడింది. తినేతిండి ఎంత సురక్షితమో ప్రశ్నార్థకం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు మూల కారణం వెతకాలని తన వీడియో కెమెరాతో బయల్దేరాడు. ఆనంద్ రామయ్య

మనుషులు – మమతలు

కధా కధనాన్ని పక్కనపెడితే ఈ సినిమా ప్రత్యేకించి నటిశిరోమణి సావిత్రి జీవిత చరిత్రని ఆమూలాగ్రం స్ఫురింపచేస్తూ (ఆవిడ జీవితం చివర్లో విషాదాంతం,ఈ కధ సుఖాంతం అంతే తేడా) ఒక్కో చోట నిజమేనేమో అనిపింపచేస్తుంది కూడా కొన్ని సన్నివేశాల్లో.యధావిధిగా ఆమె ఇందులో కూడా తనకి మాత్రమే సొంతమయిన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.ప్రత్యేకించి “మంచి మనసులు” సినిమా తర్వాత ఇదే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కనిపించినంత సౌందర్యంగా,చిలిపిగా మరే చిత్రంలో(నటనని మినహాయిస్తే) కనిపించలేదేమొ మరి. ఇప్పటి నిర్మాతా,దర్శకులు,నటీమణులు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశాలు

తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-1

సినిమా రంగం అంటే లక్ష్మీదేవి ’కోటి’రూపా(యి)లతో తాండవ నృత్యం చేసే చోటు. నిన్న మొన్నటి వరకు ఆ రంగం పై మోజుతోనో, అక్కడ లభించే పేరు ప్రఖ్యాతులపై ఆశతోనో ఇల్లు, వాకిళ్లు వదిలి రైలెక్కేవారు, లేకుంటే తమ ప్రతిభ చూపుదామని ఆశించేవారే తప్ప, అదో వృత్తిగా ప్రవృత్తిగా భావించిన వారు అరుదు. ముఖ్యంగా కాస్త చదువుకున్నవారు వేరే దారి లేకపోతే తప్ప అందులో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ. ఎన్.టి.రామారావు బి.ఎ అనో, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి