కావ్యాస్ డైరీ-సమీక్ష

kavya

kavyaలో బడ్జెట్లో లాభాలొచ్చే సినిమా తీయాలంటే మంచి ఐడియా ధ్రిల్లర్ లేదా హర్రర్ అని మనవాళ్ళు మన చిన్నప్పటి నుంచీ ఫిక్సయినట్లు ఉన్నారు. పోనీ అవైనా ఆసక్తితో ప్రారంభం అవుతాయా అంటే ఈ మధ్య ఓ మిత్రుడు భూమికతో హర్రర్ తీద్దామని ప్లాన్ చేసారు. ఏంటి మీకు లాభం అంటే..సినిమా మొత్తం సింగిల్ లొకేషన్లో చుట్టేయచ్చు. షాట్స్ స్లోగా తీసి స్క్రీన్ టైమ్ తినేయచ్చు…పాటలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు..చివరగా బాబుల చుట్టూ డేట్స్ కోసం తిరగక్కర్లేదు అన్నాడు. ఎవరి ధైర్యం వారిది అనుకోండి…అలాంటి ఐడియా నే మంజులకి వచ్చినట్లుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్లు ఓ కావ్యాస్ డైరీ చలనచిత్ర చరిత్రనే మారుస్తుందనిపించి ఉండవచ్చు(అఫ్ కోర్స్ టీవీల్లోనూ అదే పదే పదే ఆమె చెబుతోందనుకోండి)అలాగే మంత్ర తర్వాత ఛార్మిని పెట్టడమే సగం విజయం అనుకున్నట్లున్నారు. ఇక మంజుల కూడా షో తర్వాత తెలుగులో మొహం చూపించలేదు కదా అని ముచ్చటపడి మన డబ్బే కదా అని రంగంలోకి దూకినట్లుంది. దీనికి తోడు 1992 నాటి “The hand that rocks the cradle” సినిమా నచ్చి వచ్చిన ప్రీమేక్ ఆలోచన కూడా అద్బుతం అనిపించి ఉండవచ్చు. అయితే ఇన్ని కలిసి వచ్చిన ఆమెకు ప్రేక్షకులే కలిసి వచ్చేటట్లు కనపడటం లేదు.

పూజ(మంజుల)భర్త,పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీకి టీవీ యాడ్ లా (ఎప్పుడూ నవ్వుతూ ,తుళ్ళుతూ,పాటలు పాడుకుంటూ)జీవితం గడుపుతూంటుంది. ఆ ఆనంద నిలయం లాంటి ఇంట్లోకి సినిమాటిక్ గా(మంజుల కూతుర్ని ఓ లారి ప్రమాదం నుంచి రక్షించి)ఆయా రూపంలో కావ్య(ఛార్మి) ప్రవేశిస్తుంది. అక్కడనుంచీ మీరూహించిందే…(అఫ్ కోర్స్ ఆ ప్యామిలీకి పొరపాటున కూడా ఛార్మిపై అనుమానం రాదు)పూజ కుటుంబంలో అన్నీ అనుకోని సంఘటనలే..ప్రమాదాలే.ఆమె మరిది(శశాంక్)సైతం కావ్యపై ప్రేమ పెంచుకున్నందుకు పైకి వెళ్ళిపోతాడు. అయితే మరణించేముందు అతనికి ఈ దారణాలన్నిటీకీ కారణం కావ్య అనే భయంకర నిజం తెలుస్తుంది. కానీ తెలిసిన మరుక్షణం ఎవరికీ చెప్పకుండానే పైకి ప్రయాణం కడతాడు. ఎందుకు కూల్ గా ఉండే కావ్య రాక్షసిలా బిహేవ్ చేస్తోంది,ఈ విషయం పూజకు ఎప్పుడు తెలుస్తుంది…వంటి అనేక ధ్రిల్లింగ్ (ఫీలయితే) ప్రశ్నలకు సమాధానాలు తెరపై తీరిగ్గా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇంటర్వెల్ లో ఛార్మినే ఈ చిత్రంలో విలన్ అని తెలిసి ప్రేక్షకుడు షాక్ అవుతాడు అదొక్కటి చాలు హిట్ టాక్ రావటానికి (అంటే ఇంటర్వెల్ లో జనం సెల్ లు తీసి ఫోన్ లు చేస్తూంటారు కదా)అని కథనం వండినట్లు క్లియర్ గా అర్ధమవుతుంది. అయితే ఈ ధ్రిల్లింగ్ ఊహ ప్రభావంతో రచయితలు ఇంటర్వల్ లో మనం ట్విస్ట్ ఇచ్చే వరకూ కథలో ఏం జరగక నసగా ఉంటుందనే విషయం మర్చిపోయారు. అంతేగాక ప్రేక్షకుడుకు ఇంటర్వెల్ లో ఛార్మి విలన్ అని ఓపెన్ చేసి అని చెప్పి..ఆమెను ఎదుర్కోవాల్సిన పాత్ర మంజులకు ప్రీ క్లైమాక్స్ దాకా చెప్పకుండా దాచిపెట్టారు. దాంతో ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకూ దుష్ట పాత్ర ఛార్మి చెలరేగిపోయే విధానాన్ని,భీబత్సాన్ని చూడాల్సిన స్ధితి ఏర్పడింది. దాంతో కథలో ఆమెను ఎదుర్కోవాల్సిన మంజుల పాత్రలో లీనమై చూసిన వారికి ఆమె ఏమీ చేయక అసహనం కలుగుతూంటుంది. ఛార్మి పాత్రకు మంజుల పోటాపోటీ ఇస్తే మరో అరుంధతి లేదా అనసూయ అయ్యేది. పోనీ ఛార్మిలో ప్రేక్షకుడు లీనమవుదామనుకుంటే అది నెగిటివ్ క్యారెక్టర్ అయి కూర్చుంది.

అయితే ఈ చిత్రంలో ఛార్మి తనకిచ్చిన పాత్రకు పూర్తి స్ధాయి న్యాయం చేసినట్లు అర్దమవుతుంది. కానీ మంజుల నటన మాత్రం కృత్రిమంగా కనపడుతుంది.అయితే ఆమె కూతురుగా వేసిన పాప మాత్రం చాలా బాగా చేసింది. అలాగే డైరక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీలేదు. ఏమన్నా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అన్పించినా ఆ క్రెడిట్ కెమెరామెన్ కే దక్కుతుంది. ఎందుకంటే చాలా సీన్స్ లో షాట్ బై షాట్ హాలీవుడ్ సినిమానే ఫాలో అయ్యారు. ఇక డైలాగ్ రచయితగా వక్కంతం వంశీలో కిక్ కనపడదు. చాలా డైలాగులు ఇంగ్లీష్ కి తెలుగు తర్జమా అనిపిస్తూ..కుదరని చోట బిచ్ వంటి డైలాగులు ఉన్నపళంగా వాడేస్తూ పోతూంటుంది. అయితే ఎంత ఇంగ్లీష్ సినిమా ఫాలో అయినా ఛార్మి..మంజుల భర్తతో కలసి ప్రక్క పంచుకోవటం వంటివి వదిలేస్తే బాగుండేదనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కావ్యాస్ డైరీ అనిపెట్టినందుకు ఆ డైరీకి ఎక్కడో చోట ప్రాముఖ్యత ఇస్తే బావుండేది.కానీ డైరీకి కథకీ సంభంధం ఉండదు. పాటల్లో ఒకటి బాగుంది(అదే టీవీల్లో ప్రొమోలు వేస్తున్నారు.). అలాగే రిలీఫ్ కోసమైనా కాస్త కామెడీ పెడితే బాగుండేది. ఈ సినిమా చూస్తే పాపం శశాంక్ ఎలాంటి క్యారెక్టర్స్ కి వెళ్ళిపోయాడు..సత్యం రాజేష్ మాత్రం చాలా కాలానికి కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు.

అయినా ఇతరులు డైరీలపై ఆసక్తి పెంచుకోవటం,చదవటం తప్పు అని ఈ చిత్రం చూడటంతో మరోసారి బుద్ది వస్తుంది. అయినా ఊరు పేరు తెలియని వారిని ఇళ్ళల్లో ఆశ్రయం ఇవ్వద్దని పోలీస్ కమీషనర్ టీవీల్లో గొంతు చించుకుంటూంటే వీళ్లు పట్టిచ్చుకోలేదా అనిపిస్తుంది(ఊళ్ళో మానవబాంబు తిరుగుతున్నారని టీవీల్లో ఊదరకొడతున్నారుకదా).కాబట్టి పోలీస్ డిపార్ట్ మెంట్ వారు ఇలా మీ ఇష్టం వచ్చిన వారికి ఆశ్రయమిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని పబ్లిసిటీకి ఈ చిత్రం వాడుకోవచ్చు. అయినా ఈ చిత్రంను ఇంగ్లీష్ సినిమాను పెద్ద మార్పులు లేకుండా ఎలా తెలుగుకు ఎడాప్ట్ చేసారు అన్న విషయం తెలిసికోవాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఉపయోగం.ఏదైమైనా ఈ చిత్రానికి కావ్యాస్ డైరీ అనకుండా కావ్యాస్ డైలీ(సీరియల్ )అని పెడితే జస్టిఫై అయ్యేది. మల్టీ ఫ్లెక్స్ లకు టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడా ఆడటం కష్టమే.

సినిమా: కావ్యాస్ డైరీ
బ్యానర్ :ఇందిరా ప్రొడక్షన్స్
నటీనటులు :ఛార్మి,మంజుల,శశాంక్,ఇంద్రజిత్,సత్యం రాజేష్ తదితరులు.
నిర్మాత : సంజయ్ స్వరూప్
సంగీతం : మనురమేషన్
దర్శకుడు :కరుణ ప్రకాష్
రిలీజ్ డేట్: జూన్ 5, 2009.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

6 Comments to “కావ్యాస్ డైరీ-సమీక్ష”

  • హహహ పోస్టర్లు చూసి ‘పాయిజన్ ఐవీ’అనుకున్నాను. తప్పులో కాలేసానా! లేక అదికూడా కాస్త కలిపారా?

  • ee maathram daaniki mana mahesh babu gaaru cheppindentante.. kurchiki athukkukkupoyi voopiri kooda salapanantha uthkantha kaligindi’ta’. athaniki nachithe adi vere vishayam.. daaniki mundu vedhava statement okati padesaadu, entita ante.. athanini saadhaaranam ga evaroo/a cinema meppinchaledu ta. idi maathram pichi ga nachesindi ta!!

    • @sharma:

      Remember what he said at the time of Bobby?

      • emannadu intaki…aa kavya daily serial chudaleka chavaleka inka kona oopiritho unna…daya chesi ee cinema evvaru chudakandi…ilanti chetha cinema ni naa jeevitam lo idi rendava saari chudadam…….

        edava cinema ..edava cinema…..thu

  • జోస్యుల గారు సినిమాకన్నా మీ సమీక్షలోనే మంచి కామెడీ వుంది. ఈ మాత్రం కామెడీ సినిమాలో వున్నా బాగుండేదిఏమో.

    ఈ సినిమాలో ఎమన్నా బాగుంది అంటే అది కెమెరా వర్క్, రీరికార్డింగ్ & ఛార్మి నటన.
    ఏంటో మన తెలుగులో డైరీ అనే పేరు టైటిల్ లో వుంటే సినిమా హిట్ అవ్వదు ఏమో. పోయిన వరం వచ్చిన డైరీ (శివాజీ హీరో) బాగాలేదు , ఈ వారం వచ్చిన కావ్య’స్ డైరీ కూడా బాగాలేదు .

    ఇక డైరీలు ఏమి రాకపోతేనే మేలు ఏమో.

  • 15 సంవత్సరాల క్రితం ఇదే కథతో హిందీలో వచ్చిన खल नायिका (జయప్రద, జితేంద్ర) దీనికంటే బాగా అనిపించింది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories