Menu

కేట్ చదివించింది

readerకేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె.

ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆనాటి టైటనిక్ నుంచీ ఈనాటి ద రీడర్ వరకూ ఏ సినిమా చూసిన అర్ధం అవుతుంది. కేవలం కేట్ కోసమే సినిమాలని చూసే వాళ్ళున్నారు. సరే అసలు విషయం. కేట్ కేవలం అందమే కాదు. నటనా ఉన్న నటి. (నటించేవారే నటులు అంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలియానా, అనుష్క, త్రిష, జెనీలియా, ప్రియమణి ఎట్సెట్రాదులు కేవలం అందంతోనే నెట్టుకొస్తున్నారు యువరానర్. అందుకే నటన లేక పోయినా అందం ఉన్న వాళ్ళూ  కూడా నటులే అని నా స్నేహితుడు వాదించాడు. ఐతే రాహుల్ గాంధీ కూడా నటుడేనా అన్నా. దెబ్బకి మూతపడింది ఆ నోరు).

ద రీడర్ చూడటనికి ముందు నేను ఆ నవలని చదివాను. ఆ సినిమాని చుద్దామనే కుతూహలంతోనే. అదీ సినిమా చూడటానికి ఒక రోజు ముందే. నవల చదవక ముందు నాకు ఆ సినిమా గురించైనా, లేదా ఆ కథాంశం గురించైనా తెలిసిందేమీ లేదు. కేట్ సినిమా, ఆమెకి చాలా ఎదురుచూపుల తరువాత ఆస్కార్ తెచ్చిన చిత్రం అని తప్ప. నవల చదివాక  చుద్దామనే కోరిక కలిగి మేమిద్దరం వెళ్ళాం. తేలిగ్గానే టిక్కెట్లు దొరికాయి.

కథ: రకరకాలుగా చెప్పొచ్చు. కానీ సింపుల్‍గా చెప్పాలంటే మైకేల్ బెర్గ్ అనే వ్యక్తి జీవితం తో హన్నా అనే స్త్రీ కి ఉన్న అనుబంధం. అది వివిధ దశలలో ఎలా పరిణామం చెందింది? దాని వల్ల మైకేల్ అలాంటి అనుభూతులని పొందాడు? అంతే. ఒక సాధారణమైన కథ.

కానీ దానికి నాజీల దురాగతాలని చేరుస్తే? అంతుపట్టని రహస్యాన్ని ఆ స్త్రీ జీవితంలో ఉంటే? చదివించే నవల అవుతుంది. కేట్ విన్‍స్లెట్ తో డేవిడ్ క్రాస్ పోటీ పడి నటిస్తే అది ద రీడర్ సినిమా అవుతుంది. కేట్ కి ఆస్కార్ తెచ్చిపెడుతుంది. చూసిన వాళ్ళకి ఒక ఫ్లాడ్ క్లాసిక్ ని అందిస్తుంది.

నవల అంత మజాని (కూల్ డ్రింక్ కాదు) సినిమాని ఇవ్వదు కానీ అంత తీసిపారేయదగ్గది మాత్రం కాదు. మంచి సినిమా ప్రేమికులు చూడదగ్గదే.

కథనం: మైకేల్ గత జీవితం గుర్తుకు తెచ్చుకునే విధంగా సన్నివేశాలని రూపొందించారు. తనకి పదిహేనేళ్ళ వయసున్నప్పుడు మైకేల్ ఒక రోజు రోడ్డు మీద వాంతి చేసుకున్నప్పుడు హన్నా అనే ఆమె అతనిని పట్టించుకుని కోలుకునేలా చేసి ఆ క్రమంలో అతనితో గాఢమైన అనుబంధాన్ని పెంచుకుంటుంది.  ఆ సమయంలో మైకేల్ ఆమెకి గొప్ప గొప్ప పుస్తకాలని చదివి వినిపిస్తాడు.

కొన్నాళ్ళకి ఆమె అతనికి చెప్పకుండా వెల్ళిపోతుంది.

తరువాత మనం మైకేల్ ని ఒక యువ లాయర్ గా చూస్తాం. అప్పుడు ఒక ట్రయల్ ని గురించి సెమినార్ క్రింద వెళ్ళిన సందర్భంలో అతను అక్కడ యుద్ధ (రెండో ప్రపంచ యుద్ధం) సమయంలో మూడు వందల మంది యూదు మహిళల మరణానికి కారణమైన స్త్రీలని చూస్తాడు. వారిలో హన్నా ఒకరు. అతను ఆ సంఘటనతో ఆశ్చర్యానికి గురవుతాడు. ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నా, ఆమెకి శిక్ష పడ్డా ఆమె ఏదో నిజాన్ని దాస్తోందని మనకీ, మైకేల్ కీ అర్థం అవుతుంది. ఆమెకి జీవిత శిక్ష పడుతుంది.

మైకేల్ పెరిగి పెద్దవాడయి పెళ్ళి చేసుకుని, విడాకులనీ చూసి, ఒక రోజు గత ఙ్ఞాపకాల వల్ల తను ఆమెకి చదివి వినిపించిన పుస్తకాలని రెకార్డ్ చేసి ఆమెకి పంపుతాడు.  చివరి దశలో హన్నా ఆత్మహత్య చేసుకుంటూ అతనికి ఒక టీ టిన్ను, అందులో కాస్త డబ్బు ఉంచుతుంది. ఇలానా కి అందజేయమని కోరుతుంది.

మైకేల్ ఇలానాకి ఆ టిన్నుని, డబ్బునీ అందజేసి తాను తెలుసుకున్న నిజాన్ని ఇలానాకి చెపుతాడు. ఇలానా ఆ టిన్నుని తనకోసం తీసుకోగా ఎడల్ట్ ఇల్లిటరసీ ని రూపుమాపేందుకు వాడమని మైకేల్ అంటాడు. ఈ కథని తన కూతురికి మైకేల్ చెప్తుండగా సినిమా ముగుస్తుంది.

చెప్పుకోవటానికి  అదోలా ఉన్నా ఆ సన్నివేశాలని తెరకెక్కించిన విధానం బాగుంది. ముఖ్యంగా కేట్ తన నటనని హైట్స్ కి తీసుకుని వెళ్ళింది. భావరహితమైన (ఇమొషన్‍లెస్) ఒక నడివయసు స్త్రీగా, తనకన్నా వయసులో చిన్న వాడైన వ్యక్తిని సెడ్యూస్ చేసే సమయంలో, ఆ కోర్ట్ సన్నివేశాలలో నిజాన్ని గుండెల్లో దాచుకున్న సందర్భంలో ఐనా ఎలాంటి సన్నివేశాలలో విన్స్లెట్  నటన బియాండ్ ఆస్కార్.

చిన్న వయసు మైకేల్ గా వేసిన డేవిడ్ క్రాస్ బాగ్ చేశాడు. పెద్ద వయసు మైకేల్‍గా వేసిన రాల్ఫ్ ఫియెనెస్ నటన నాకు అంత ఇంప్రెసివ్‍గా అనిపించలేదు. మనిషి మాత్రం పాత్రకి తగ్గట్టుగానే ఉన్నాడు.

ఇంకా: ఈ సినిమాని కేవలం కేట్ కోసమే తీశారా అని అనిపిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. భావోద్వేగాలని పండించటంలో కానీ అందంలో కానీ, (టైటానిక్ వచ్చి పన్నెండేళ్ళు కావచ్చినా కేట్ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు) ఆమెకి ఇప్పట్లో సాటి వచ్చేవారు ఈ తరం నటీమణుల్లో ఒక కీరా నైట్లీ తప్ప వేరొకరు లేరు. నటనలో కేట్ కే నా ఓటు.

విచిత్రం ఏమిటంటే ముందుగా ఈ సినిమాకి మొదటి ఛాయ్స్ కేటే అయినా ఆమె డేట్లు దొరకక నికోల్ కిడ్మన్ ని అనుకున్నారట. కానీ

కిడ్మన్ మధ్యలో తప్పుకోవటంతో మళ్ళా ఆ పాత్ర కేట్ కే దక్కింది. ఎవరికి చేరాలో వారికే చేరింది.

ఈ సినిమాకి కాస్త వెనుకా ముందుగా ’రివల్యూషనరీ రోడ్’ వచ్చింది. అంతకు ముందు ’లిటిల్ మిస్ సన్ షైన్’ వచ్చింది. అన్నీ కేట్ నటనకి పట్టం కట్టేవే.

అనుభూతి: నాకు సహజంగా ఇలాటి మూడ్ ఉన్న సినిమాలు నచ్చవు. అందుకే వెళ్ళాలనుకున్నది కేవలం కేట్ కోసం. కానీ సినిమా మొదలవగానే నా ఆలోచన అంతా సినిమా ఎలా తీయగలిగారనే దానిమీదే. కష్టమైన హావభావాలూ, కాంప్లికేటెడ్ బంధాలూ…

ఈ సినిమా మనని వెంటాదుతుంది. ఆ ఆలోచనలే. హన్నా ఫంక్షనల్లీ ఇల్లిటరేట్. అంటే… “A functionally illiterate person can read and possibly write simple sentences with a limited vocabulary, but cannot read or write well enough to deal with the everyday requirements of life in his own society.”  (వికీ లో దొరికింది)

అందుకే ఆమె సెక్స్ కి ముందు కానీ తరువాత కానీ మైకేల్ ని కొన్ని పుస్తకాలని చదవమంటుంది. ఆమె తాను ఫంక్షనల్లీ ఇల్లిటరేట్ అన్న విషయాన్ని దాచటం కోసమే చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఆమె జైలుకి వెళ్ళటం మైకేల్ తోపాటూ మననీ ఆశ్ఛర్యోద్వేగాలకి గురిజేస్తుంది.

కొన్ని కొన్ని ఫిలసాఫికల్ ప్రశ్నలూ, మోరల్ కొరీలు, నాజీల కాలం నాటి జర్మనీ, ఆ కాలం గురించిన జర్మన్ల ఆలోచనలూ తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడవచ్చు.

కేట్ కళ్ళలో ఉన్న ఆ కోల్డ్నెస్, నిర్లిప్తతా మనని వెంటాడుతాయి.

కేట్ విన్‍స్లెట్ గొప్ప నటి.

ఈ సినిమా ఒక ప్రేమ లేని ప్రేమ కథ. యుద్ధం లేని యుద్ధపు కథ.

కానీ కేట్ అందం ఉన్న నటి. నటన ఉన్న అందగత్తె.

21 Comments
   • Manjula June 6, 2009 /
 1. సుజాత June 5, 2009 /
  • david July 2, 2009 /
 2. Manjula June 5, 2009 /
   • Manjula June 6, 2009 /
 3. Dhanaraj Manmadha June 6, 2009 /
 4. salimkhan June 7, 2009 /
 5. సుజాత June 7, 2009 /
  • Dhanaraj Manmadha June 9, 2009 /
 6. Priya Iyengar June 7, 2009 /
 7. sujata June 9, 2009 /
 8. sujata June 9, 2009 /
  • Priya Iyengar July 16, 2009 /