Menu

Bakha satang – పిప్పరమెంటు బిళ్ళ లాంటి సినిమా

peppermint-candyఉపోద్ఘాతం

మీకెప్పుడైనా  ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందా? కనీసం చావు మీదకి మనసు మళ్ళిందా? అసలు ఒక మనిషికి చావాలనే కోరిక ఎందుకు కలుగుతుందో అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా?

మీరెప్పుడైనా నిద్ర లేవగానే  పిప్పరు మెంటు బిళ్ళ తిన్నారా? న్యూటను గమన సూత్రాలని ఒక పసి పిల్లవాడితో ఆడుకుంటం ద్వారా మీ విద్యార్థులకి మరింత బాగా చెప్పొచ్చనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా?

జీవితం మీద విరక్తి అంటే ఏమిటో మీకెప్పుడైనా అవగతమైందా? కడుపులో దేవేసే సన్నివేశాలని ఎప్పుడన్నా ఎదుర్కున్నారా? ఎప్పుడన్నా ఒక హత్యని కళ్ళారా చూసారా? కనీసం ఒక మనిషి మరణావస్థని, మరణవేదనని గమనించారా? నిరాశా నిస్పృహలలో కూరుకునిపోయారా? ఎందుకీ జీవితం అని తరచుగా మీకు అనిపిస్తుందా?

పొద్దునేలేచి ఎప్పుడన్నా పక్షుల కిలకిలారావాలని తనివితీరా అనుభవించారా? మీపిల్లలతో కల్సి స్వేచ్ఛగా చల్లటినీటిలో జలకాలాడారా? మీరు అనుకున్నప్పుడు హాయిగా వళ్ళు విరుచుకుని ఉత్తనేల మీద పడుకోవాలనే కోరికనైనా తీర్చుకోగలరా? మృత్యు ముఖంలో కూడా నేను నవ్వగలను. ఆ సందర్భాన్ని కూడా నేను ఎంజాయ్ చేయగలననే నమ్మకం మీకుందా?

ఇంకొంచం సేపటిలో పిల్లలకి అత్యంత ముఖ్యమైన పాఠం చెప్పాలి. అప్పుడు మీకు ఐస్‍క్రీమ్ తినాలని అనిపించింది. హాయిగా ఐస్‍క్రీం చీక్కుని అలా క్లాసులోకి వెళ్ళబోయే ముందు ఆ పుల్లని డస్ట్‍బిన్ లో వేసి, మూతి తుడుచుకుంటూ క్లాసులోకి వెళ్తుంటే కలిగే మజాని అనుభవించారా? (You must be at least in position of the Head of a Department. If you are a principal, it’s more better).

కథ మొదలు:

యాంగ్-హో ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అలా ఇలా కాదు. మనని చాలా disturb చేసి. కనీసం అరడజను flash-back లను చెప్పి. అదీ ఆషామాషీగా కాదు. reverse chronological order లో. ఈలోపుల మనకి రెండే రకాల అనుభూతులు కలుగుతాయి.

ఒకటి… రెండు, నాలుగు పేరాలలో లాంటి తరహా జీవితాన్ని రెగ్యులర్ గా అనుభవించే వారైతే ఈ సినిమా మీకు మీరెంత అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో, మీకు చెప్పి, మిమ్మల్ని అలాంటి జీవితాన్ని పొందలేని వారి పట్ల ఎలా మెలగాలో చూపుతుంది.

peppermintcandy___4రెండు… అదే మొదటి, మూడవ పేరాలలో తరహా వ్యక్తులైతే, మీరెంత వేదన అనుభవిస్తున్నారో చెప్పి, చూపి, ఇక్కడా రెండు కోణాలు. ఒకటి… ఇలాంటి జీవితం మనకి ఇక వద్దు అని నచ్చజెప్పి, మన న్యూనతా, నిర్లిప్తత, rate-race- తరహా జీవితానికి స్వస్తి పలకమని ఉపదేశామృతం అందిస్తుంది. రెండు… నాయనా జీవితం ఇంతే. ఇక నీకు చావే గతి. పాడుజీవితమూ… బ్రతకడమూ… అని పాడుకోమంటుంది. ఎందులో ఐనా దూకేయమంటుంది.

ఇక ఐదవ పేరాలో తరహా అయి, జీవితంలోని high-end applictions (కాస్త చెప్పటం కష్టం. అర్థం చేసుకోమని మనవి) పెద్ద పెద్ద ఆశయాలని కలిగి, వాటిని సాధిస్తూ, అవసరం అయినప్పుడు చిన్న చిన్న ఆనందాలని అనుభవిస్తూ, జీవితాన్ని గడపకుండా, అనుభవిస్తూ, ఆనందాన్ని ఆస్వాదిస్తూ, పది మందికి పంచగలిగే… ఎలాంటి పనైనా చేయగలిగే guts ఉంటే కనుక ఈ సినిమాతో మీకు పనిలేదు. ఒకవేళ reverse chronology type of movie, some political issues, ఒక morern master-piece ని చూడాలనుకుంటే, నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎలా చూసినా ఇది ఒక చూడదగ్గ సినిమా. An essential movie.

సినిమా గురించి:

యాంగ్ హో 1999 లో తన గతకాలపు మిత్రులని కలుస్తాడు. ఒక నదీతీరాన. కాని వారితో తన పాత, అందమైన ఙ్ఞాపకాలని పంచుకోకుండా, ఒక రైల్ రోడ్డు బ్రిజ్ మీదకి వెళ్ళి ట్రైన్ కి ఎదురుగా నులుచుంటాడు. లిప్తపాటులో అతను ఆ రైలు చేత గుద్దబడి శాశ్వత విశ్రాంతి తీసుకొన బోయే ముందు “I’m going back…” అంటూ మననీ తనతో తన గతానికి తీసుకుని వెళ్తాడు.

peppermint4యాంగ్ హో ఎవరు? ఎందుకతడు తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటాడు? దానికి ముందు అతను ఏమి చేయాలని అనుకుంటాడు? అన్న ప్రశ్నలకి సమాధానం మనకి మొదటి ఫ్లాష్‍బ్యాక్ లో తెలుస్తుంది. డబ్బు కోల్పోయి, పీకలోతు అప్పుల్లో కూరుకుని చద్దామని ఒక తుపాకిని కొనుక్కున్నయాంగ్ హో తన చిన్ననాటి ప్రేయసి మృత్యు ముఖం లో ఉందని తెలుసుకుంటాన్ని మనం ఈ భాగం లో చూస్తాం.

ఈ కొన్ని సన్నివేశాలని చూస్తేనే మనం ఆ దర్శకుని ప్రతిభకి అచ్చెరువొంది అభిమానిగా మారిపోతాం.

క్రమక్రమంగా సన్నివేశాలనీ, కథనీ, అతని జీవితాన్నీ, వెనకకి నడిపిస్తూ భలే ఉందే అనిపించేలాగా కథనాన్ని అల్లుకున్న విధానం మనని అబ్బురపరుస్తుంది.

ఇక రెండో భాగం లో మనం అతని మానసిక అశాంతికి కారణభూతమైన మరో అంశాన్ని తెలుసుకుంటాం. ఇబ్బందుల్లొ ఉన్న అతని వ్యాపార, వైవాహిక జీవితాన్ని, అతని భార్యకి అక్రమ అంబంధం ఉన్నా, తనకి ఉన్న లోపాల వల్ల ఆమెని ఏమీ నిలదీయలేని నిస్సహాయస్థితిలో ఉన్న యాంగ్ ని మనం చూస్తాం.  ఒక రోజున అతనికి కనిపించిన వ్యక్తి వల్ల అతని జీవితంలో ని మరో ముఖ్య సంఘటనని మనం తెలుసుకుంటాం. ఆ సమయంలో యాంగ్ తనకి కావలసిన సమాచారం తెలుసుకోవటానికి ఎంతకైనా తెగబడే, చిత్రహింసలకి గురిచేసైనా నేరస్తుల నుంచీ (ప్రభుత్వ వ్యతిరేకుల) ఒప్పుకోలు రప్పించే పోలీసు అధికారి. అప్పుడు అతని భార్య గర్భవతి. వారికో కూతురు కూడా. ఆ సన్నివేశాలలోనే మనకి యాంగ్ వివాహం పతనమౌతుందనే సంకేతాలని దర్శకుడు అందిస్తాడు.

తరువాత ఘట్టం అతని పోలీసు జీవిత తొలి రోజులు. ఒక నేరస్తుని నుంచీ విషయాన్ని రాబట్టటానికి కొట్టినందుకే తల్లడిల్లే వ్యక్తిగా అతనిలో ఉన్న మానవత్వపు పొరని మనకి చూచాయగా చూపిస్తుంది.

చివరిగా మనకి అతను కథా ప్రారంభానికి ఇరవై సంవత్సరాల క్రితం తన స్నేహితులతో మొదట చెప్పుకున్న నదీతీరాన విహార యాత్రకి వస్తాడు. అక్కడి సన్నివేశాలలో అతను ఎంత అమాయకుడో, అతనికి ఉన్న చిలిపి ఊహలూ, చిన్ని చిన్ని ఆనందాలూ, కోరికలూ లక్ష్యాలూ, తన తొలిప్రేమ లో ఉన్న ఆనందం, అతని ప్రియురాలు (ఆమెని వివాహం చేసుకోడు) సునిమ్, ఫొటోగ్రాఫ్హర్ కావాలని అతను కన్న కలలు మనం చూస్తాము.

వీటి మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు అప్పటి కొరియన్ మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఉద్యమం, ఆ సందర్భంలో జరిగిన హింస, అమాయకులు కాల్పులలో మరణించటం, వీటి ప్రభావం యాంగ్ మీద ఎలా పడింది? మొదలైన సంఘటనల సమాహారం.

అప్పటి మిలిటరీ ప్రభుత్వ హయాం లో ఛిద్రమైన ఆశలూ, సామాన్యుల కలలు మొదలైన వాటిని మనకి యాంగ్ రూపంలో తెలుస్తాయి. అప్రెషన్ ఒక మనిషిని ఎంతలా దెబ్బతీస్తుందో, ఇంతకన్నా బాగా చెప్పిన సినిమాని నేనెప్పుడూ చూడలేదు. Noi Vivi లో కూడా కాస్త ఈ విషయం చర్చించినా, అది రాండియన్ తరహా.

సినిమా చూశాక:

నా స్నేహితుడు అమెరికాలో ఉద్యోగం పోగొట్టుకుని ఇండియాకి తిగిరి వచ్చే సందర్భంలో (నిజం చెప్పాలంటే తనంతట తనే స్వయంగా విభేదించి రాజీనామా చేసి వచ్చాడు. జనం ఫీలవుతారని ఇలా అంటుంటాడు) వెంటేసుకుని వచ్చిన అనేకానేక వతువులలో ప్రపంచ సినిమా కి సంబంధించిన సీడీలు కొన్ని. ఆ మధ్య తను చైనా వెళ్ళబోయే ముందు నాకు ఈ సినిమా సీడీ ఇచ్చి చూడమన్నాడు. పేరు చూసి (Peppermint Candy) ఇదేదో చక్కని హాస్య చిత్రమో, లేదా romantic comedy నో అనుకున్నా. నీకీ మధ్య ఇలాంటి సినిమాలు చూసే అలవాటు తగ్గిపోయింది. ఓ లుక్కేయి అన్నాడు. సరే అన్నయ్యా! అని నేను తీసుకున్నాను. చూశాను.

సినిమాలో యాంగ్ ఒక యువతిని పొరబాటున కాలుస్తాడు. ఆ సంఘటన నన్ను కొంసేపు వెంటాడింది. ఇదేదో సహజ సంఘటన లాగా ఉందే అనిపించి కాస్త నా బుర్రకి పనిపెట్టాను. ఒకసారి కొరియా చరిత్రని పలకరిస్తే ఎప్పుడో నేను చదివిన్న (చదివిన కాదు) Kwangju Massacre గుర్తొచ్చింది. ఎవరితోనో మిలిటరీ, కమ్యూనిస్టు తరహా ప్రభుత్వాల గురించి వాదిస్తున్నప్పుడు తెలుసుకున్న, ఈ ఉద్యమం కొరియా చరిత్రలో చాలా ముఖ్యమైన సంఘటన. ఆ డేశపు ప్రజాస్వామ్యానికి దారితీసిన ఉద్యమమిది. ఆ దుర్ఘటనలో అమాయక ప్రజలు కనీసం 150 మంది మరణించారని అంచనా. ఇదే సంఘటన యాంగ్ జీవితం మీద అమితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. The film comes a full circle when we see that Yang dies at the same place where we were introduced to a ‘live’ Yang.

నిర్బంధం, అసంతృప్తి, చేసేపనిలో ఆనందం కోల్పోవటం, మనిషిని ఎంత భయంకరమైన డిప్రెషన్ లోకి నెడతాయో, ఎలా అతనిలో జీవన సారాన్ని పీల్చి పిప్పిచేస్తాయో తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూసి తీరాల్సిందే.

దర్శకుడు, నటుడు:

లీ చాంగ్ డాంగ్ (Lee Chang Dong). అనుకున్న దానిని చాలా గొప్పగా తెరకెక్కించగలిగాడు. ఏమాత్రం మనకి సానుభూతి కలగని రీతిలో మొదలై, తన ఆశలతో, అమాయకత్వంతో మనని ఆకట్టుకుని చివరి చివరిలో మన సానుభూతిని పుష్కలంగా పొందే యాంగ్ గా సోల్ క్యుంగ్ గు (Sol Kyung-gu)ఆకట్టుకుంటాడు. ఒకసారి అతనిని సినిమా చివరి ఫ్లాష్‍బ్యాక్ సన్నివేశాలలో చూస్తే మర్చిపోవటం అసాధ్యం.

కాలక్రమంలో మనిషి లో అమాయకత్వం, ఆసలు ఎలా అడుగంటి పోతాయో, మానవ హృదయ దుర్బలత్వాన్ని ఈ సినిమా మనకి పట్టిచూపుతుంది.

చివరగా: ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఒక్కటే. జీవితం ఎంతో విలువైంది. అసలు మనిషి పుట్టిందే ఆనందంగా జీవించటానికి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలగాలే కాని, బెంబెలెత్తకూడదు. నిరాశాలో అసలే కూరుకుని పోకూడదు. లేకపోతే మనకీ యాంగ్ గతే పడుతుంది.

నాకయితే ఎప్పుడూ ఇలా ఉండాలని అనిపిస్తుంది. అది ఈ సినిమ చూశాక మరింత బలపడింది.

I don’ wanna live my life…

I wanna lead it…

so that It must wonder

What I’m gonna give it.

రేటింగ్: 4.5 out of 5.

చూస్తే అంటారు… వెల్ వెల్ వెల్.

13 Comments
  1. మేడేపల్లి శేషు June 11, 2009 /
    • Dhanaraj Manmadha June 11, 2009 /
  2. dnchari June 11, 2009 /
  3. విహారి June 11, 2009 /
  4. Dhanaraj Manmadha June 14, 2009 /
  5. Priya Iyengar July 16, 2009 /
  6. G March 20, 2010 /
  7. Srujana Ramanujan May 31, 2010 /