Menu

ప్రశ్నాంటోనియోని

People don’t like questions. They don’t want to imagine. Because to imagine you need to think. Thinking is what people hate to do.

– RAMANUJAN

జనాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు సముద్రాల నీళ్ళు (అసలే మన ప్రశ్నాంటోనియోనీ గారిది ఇటాలీ ఆయే మూడు వైపులా సముద్రమేగా) త్రాగించటంలో కొందరికి ప్రావ్యీణ్యం ఎక్కువ.

హాస్యం కాదు కానీ అతడులో ఎమ్మెస్ అన్నట్టు, కనిపించీ కనిపించకుండా, వినిపించీ వినిపించకుండా, చూపించీ చూపించకుండా, చెప్పీ చెప్పకుండా, నడిపించీ నడిపించకుండా (కాళిదాసు పైత్యం కొంత, మన కవిత్వం కొంతా… తిరగబడిందా? ప్రశ్నాంటోనియోని మహత్తు అది) జనాన్ని ఏడిపించటం వీరి నైజం.

ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఎక్కడికో గంతులేస్తూ, తనదైన శైలిలో కోతి కొమ్మచ్చి  ఆడుకుంటాడు. అందుకే కొందరు జనానికి అతనంటే అదోరకమైన కసి. అసలు మనకీ ఈయనెవరో కూడా తెలియదు నెల క్రితం వరకు. ఆ మధ్య మన వెంకట్ గారికి కల్లోకి వచ్చేదాకా అసలు ఇలాంటి బ్రహ్మ పదార్థం ఒకడుంటాడాని కూడా నేనూహించలేదు.

అసలు హాస్యంగా తలుచుకునే రకంకాదు వీరు. ప్రశ్నలు రేకెత్తించి (పూతరేకులు కాదు), మనని మన ఊహలకి బందీలని చేసి, మన ఇమాజినేషన్ కి పదును పెట్టుకోండి నాయనలారా అంటూ, అద్భుతాలని చేయటం ఆయనకే చెల్లు. ఈ మధ్యే అందిన ప్రపంచ సినిమాల డీవీడీల కలక్షన్‍లో ఇతని సినిమాలు కూడా ఉన్నాయి. అసలే మనకి కొన్ని సార్లు మాస్టర్లంటే కూసింత భయం. భయపెట్టి, నిరాశలో ముంచి, డిస్టర్బ్ చేయకుండా వదలరని. అది వారి లక్షణం. అందులోనూ మ’నవతరంగం’లో ఫోకస్ అన్నారంటే చచ్ఛామే 😀 మెదడు విరిచి, హృదయం పిండి, మతి భ్రమింపజేసే సినిమాల దర్శకులే వాళ్ళు అని ఢంకా బజాయించకుండానే చెప్పొచ్చు. ఒక రోజు కాస్త ఉషారెక్కువై, దాన్ని దించుకోందే కాళ్ళు నేలపైన ఆనవని ఆ కొన్ని దిగ్దర్శకుల సినిమాల పైన బడ్డాను. పాలబడ్డాను అంటేనే బావుంటుందేమో మరి. L’avventura (The Adventure) నేను చూసిన వాటిలో అతిసుదీర్ఘమైన చిత్రరాజం (చిత్రరాజం. నిజంగానే. వెరీ సీరియస్. మనలో మాట! సీరియస్ ని తెలుగులో ఏమంటారు? కోపం కాదు. 😉 నాకు ఇప్పుడు చాలా నచ్చింది ఈ సినిమా).

తెలిసిన వాళ్ళెవరైనా దీని నిడివి కేవలం 143 నిమిషాలే కదా అనొచ్చు. నిజమే. కానీ నేనీ సినిమా చూసింది మాత్రం అక్షరాలా పదమూడున్నర రోజులు. అలా సుదీర్ఘంగా సా..గి, సా…గి, సా….గి చివరికి మొన్నామధ్యనే అంటే జూను పన్నెండో తారీఖున ముగిసి నన్ను బ్రతికించింది. పూర్తిగా అర్థం కానిదే వదిలి పెట్టకూడదని, ’నాకు అర్థం అయింది!’ అనుకునేదాకా వదలేదు. అందుకే అంతలా సుదీర్ఘంగా వీక్షించాను. కానీ అలా చూస్తుండగానే నేను నాకు తెలుస్తూనే ప్రశ్నాంటోనియోనీ గారి సినిమాలతో ప్రేమలో పడిపోయాను. దాంతో వరుసగా మిగిలిన రెండు సినిమాలూ చూసి, మరో సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను.

అప్పటి కాలానికి ఉన్న కన్వెన్షన్స్ ని కాదని, తనవైన ప్రత్యేకమైన కన్వెన్షన్స్ ని సృష్టించుకుని, అతి డ్రామానే కాదు, అసలు డ్రామానే (లాజికల్ కంక్లూజన్లూ,కాన్‍ఫ్లిక్ట్ డెవలప్మెంట్) లేకుండా   కేవలం కొన్ని రేఖామాత్రమైన ప్రెమిజెస్ ని చూపుతూ, బలమైన ముద్ర వేశాడు ప్రశ్నాంటోనియోనీ. సాధారణమైన చిన్న చిన్న కంక్లూజన్లకి రాలేము మనం ఇతని సినిమాలలో. చాలా విభిన్నమైన, నిగుఢమైన భావ, అర్థ రహితమైన (చూసే వాళ్ళకి. తనకి కాదు),   ప్రశ్నాంటోనియోనీ సినిమాల్లో మనం గమనిస్తాము.

దీనికి కారణాలుగా అతని గురించి ఇలా చెప్పుకోవచ్చు. దానికన్నా ముందే ఒకానొక సందర్భంలో అతను అన్న మాటలని చూద్దాం. “I want the audience to work.” అంటే అతని ఉద్దేశ్యం, జనం తను ఇచ్చిన ఆ కాస్త సన్నివేశాల సమాహారాన్ని బట్టి మిగతా కథని ఊహించుకోవాలని. జనం అలా ఊహించుకోగలరా లేదా అతని సమస్య కాదు. చాలా డెలిబరేట్ గా, తాను చెప్పాలని అనుకున్న దానినే పొర్ట్రే చేయగలిగిన సామర్థ్యం అతని సొత్తు. ప్రేక్షకులకి ఇది ఒక సమస్య. అతను తనకోసం తీసుకున్నాడో, వారికోసం తీశాడో కూడా సందిగ్ధమే.

ఆకస్మికత అతని నైజం. చిత్రమైన నేపథ్య సంగీతం, అందమైన ఫొటోగ్రఫీ అతని సినిమాల్లో మనం చూడగలం. ఉన్నట్టుండి కొన్ని సన్నివేశాలని వదిలేశాడా అన్నట్టు ఐపిస్తుంది. దీనికి ఉదాహరణలు బోలెడు. (వీటి గురించి అతని సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను).

ప్రశ్న + ఆంటోనియోనీ = ప్రశ్నాంటోనియోనీ

ప్రశ్నాంటోనియోనీ చాలా సందర్భాలలో తను చెప్పాలని అనుకున్న, చూపించాలని అనుకున్న సన్నివేశాలమీద ఎక్కువ దృష్టి పెట్టి మధ్యలో కథాగమనానికి ఉపయోగపడే intermediate scenes ని వదిలేస్తుంటాడు. దీన్ని గురించి చాలా మందికి అభ్యంతరాలున్నాయి. ఇతనికి చిన్నతనం నుండీ చిత్రలేఖనం, వయొలిన్ అంటే మక్కువ ఎక్కువ. తన టీనేజ్ లో సినిమాలు పరిచయం అయ్యాక వయొలిన్ ని వదిలేసినా చిత్రలేఖనం మాత్రం అతనిని వదలలేదు.

ఒకానొక సందర్భంలో అతను “I have never drawn, even as a child, either puppets or silhouettes but rather facades of houses and gates. One of my favourite games consisted of organising towns. Ignorant in architecture, I constructed buildings and streets crammed with little figures. I invented stories for them. These childhood happenings – I was eleven years old – were like little films.” (వికిపెడియా నుంచీ) అంటాడు.

సాగదీసినట్టుండే సన్నివేశాలతో విసిగిస్తాడని కొందరు ఎంత విసుక్కున్నా, Michelangelo Antonioni (నాకు మాత్రం ప్రశ్నాంటోనియోనీ నే. అన్ని ప్రశ్నలని మిగిల్చాడు మరి!) అతను మాత్రం ఒక మాస్టర్.

If a thing or a person, or a work disturbs you and and leaves you with gaps to be filled you will never forget it. That’s all.

My journey continues…

8 Comments
  1. రాజశేఖర్ June 15, 2009 /
  2. Kabir June 17, 2009 /
  3. Dhanaraj Manmadha June 18, 2009 /
  4. Priya Iyengar July 16, 2009 /
  5. jagan March 18, 2010 /
  6. chakri January 18, 2011 /