…and the show goes on

show-kamal

show-kamalమొన్నీ మధ్యనే ముగిసిన చెన్నై అంతర్జాతీయ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ గురించి ఒక వ్యాసం ప్రచురించడం జరిగింది. అయితే ఈ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ 3 వ తేదీతో ముగిసిపోదని, ఇందులో పాల్గొన్న 250 మందిలో 30 మందిని ఎన్నుకొని వారి చేత 30 లఘు చిత్రాల కోసం స్క్రీన్ ప్లే రచన చేయింది, ఆ తర్వాత ఆ 30 మందిలో ఇద్దరు లేదా ముగ్గురిని ఎన్నుకొని వారిని పూర్తి స్థాయి చలనచిత్ర రచయితలగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని కమల్ ఈ వర్క్ షాప్ లో చెప్పారు.

అయితే ఈ వర్క్ షాప్ ముగిసి పది రోజులు కావొస్తుంది. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి, అలాగే ఈ వర్క్ షాప్ గురించి తెలుసుకుని ఆసక్తి గా గమనిస్తున్న వారికి భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఒక రకమైన ఆసక్తి ఉండడం సహజమే.

ఈ రోజు అనగా జూన్ 11 న ఈ వర్క్ షాప్ కి అనుబంధంగా నడిచే వెబ్ సైట్ లో కొన్ని అప్ డేట్స్ పెట్టారు. వాటి వివరాలు:

Come back to class!

గత వారం జరిగిన వర్క్ షాప్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఫ్రెంచ్ రచయిత Jean Claude Carriere తో మరో కార్యక్రమం నిర్వహించనున్నారు కమల్. చెన్నై లోని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఈ నెల 19 న మధ్యాహ్నం రెండింటికి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చ జరగనుంది. అలాగే ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న 250 మంది నుంచి ముప్ఫై మందిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా స్క్రీన్ ప్లే రైటింగ్ కాంపిటీషన్ కోసం థీమ్ ప్రకటించనున్నారు. ఇది వరకు వర్క్ షాప్ లో పాల్గొన్న ఔత్సాహిక రచయితలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవొచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని లఘు చిత్రాలు కూడా ప్రదర్శించనున్నారు.

Kamal Haasan Writes…

గత వారం ముగిసిన వర్క్ షాప్ గురించి తన అభిప్రాయాలు, ఆలోచనలు కమల్ ఈ వ్యాసంలో ప్రచురించారు.

Kamal Haasan Recommends

కమల్ తనకు నచ్చిన అంతర్జాతీయ సినిమాలతో పాటు కొన్ని తమిళ్ సినిమాలను ఇక్కడ ప్రస్తావించారు. చూడండి.

ఈ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ గురించి మరిన్ని వివరాలు, అప్ డేట్స్ కోసం screenwritingindia.com వెబ్ సైట్ చూడండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

5 Comments to “…and the show goes on”

  • కమల్ ని అభినందించాల్సిందే. మీకు thanks + best wishes for the top 30 list.

  • హ్మ్మ్ so true!

  • evaraina author ALFRED HITCHCOCK gari cinemaalu gurinchi leka aayana gurinchi gaani vyaasaalu raasthe chaala baaguntundhi ani naa abipraayam. Alfred Hitchcock garu world cinema lo thanakantu oka prathyekamaina sthaanam sampaadinchukunna vaaru. andukani evarainaa aayana works gurinchi vyaasaalu raasthey baaguntundhi ani naa abhipraayam. Thanks once again for all your contributions for this good website

  • nenu raastanu..twaralo !!

  • సినిమాకు స్క్రీన్ ప్లే రాయటం అనేది గొప్ప కళ. అదే సినిమాకు వెన్నెముక అని చెప్పవచ్చు. ఇప్పటి తెలుగు సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎంత ప్రతిభావంతంగా ఉందొ నాకైతే తెలియదు. ‘నవతరంగం’ లో ఒకటి రెండు స్క్రీన్ ప్లేలు పెట్టినా, అవి తెలుగులో కాకుండా, ఇంగ్లీషులో ఉన్నందుకు బాధేసి చదవలేదు. తెలుగు సినిమాలకు తెలుగులో స్క్రీన్ ప్లే రాసుకోవటం సాధ్యం కాదా? నేను చూసిన ఈ simplyscripts.com అనే సైటులో మంచి హాలీవుడ్ చిత్రాల స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. హాలీవుడ్ లో ఇప్పటికీ నెంబర్.1 గా చెప్పుకునే Citizen Kane దగ్గిరనుంచీ, నిన్న మొన్నటి Slumdog Millionnaire వరకూ చాలా చిత్రాల స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. మన తెలుగు చిత్రాలవి కూడా ఇలా అంతర్జాలంలో అందిస్తే చాలా బాగుంటుంది కదా. మొత్తంమీద స్క్రీన్ రైటింగ్ పైన కమలహాసన్ వర్క్ షాప్ నిర్వహించటం హర్షించదగిన విషయం. ఈ విషయంపై కూడా ‘నవతరంగం’ లో అవగాహన ఉన్నవారు ఒక వ్యాసం రాస్తే బాగుంటుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories