డేరింగ్ డాక్యుమెంటరి ఫిల్మ్ మేకర్

anand-patwardhanసొంత ఇంటి దొంగలెవరో, ద్రొహులెవరో చాల చక్కగా  చూపిన నిర్మాత దర్శకుడు ఆనంద్ పట్వర్థన్. సెన్సారింగ్ మరియు దూరదర్శన్ లో ప్రసారం విషయం లో కొన్ని సంవత్సరాలు అప్పటి ప్రభుత్వపు నిరంకుశ నిషేదాజ్ఞలకు బలయి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి చివరకు గెలిచినది బహూశా ఈయనే మొదటి వాడయి వుంటారు.

ఏన్నొ నదులు, ఉపనదులు.మూడుకాలాల్లో పండే అన్ని రకాల పంటలు, అవసరమొస్తే మొత్తం ప్రపంచపు ఆకలి తీర్చగల సత్తా ఉన్నా సస్యశ్యామల అన్నపూర్ణ అయిన మనదేశపు రాజకీయ వాతావరణం ఇలా ఎందుకు మారిపొయి అసలు సమస్యలు మరిచేలా ఉగ్రవాదం మతతత్వం ఎలా ఎందుకు ఎవరి చేత ప్రబలుతుందో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న అసలైన వారెవరో భారతీయ వర్తమాన సమాజం అసలు రంగుని ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లుగా ఏంతో కష్టపడి ఎంతోమంది రాజకీయ గూండాల ఎన్నో బెదిరింపులకు ఎటువంటి భయాలకు లొంగకుండా తను అనుకున్నది సాధించారు. వాస్తవాలను సర్వ ప్రపంచం ముందుంచారు.

చంద్రయాన్ తో ఒక వైపు మన భారతదేశం వైజ్ఞానికంగా చిన్న చిన్నగా అడుగులు వేస్తుంటే దానికి పూర్తి విరుద్ధంగా అజ్ఞాన మూఢ విశ్వాసాలు, కుల మతతత్వాలతో లోనుంచి ఎలా తయారవుతున్నదో…మీరు నిజంగా…వాస్తవ దేశాన్ని చూడాలి అని అనుకుంటే…తప్పక చూడండి.

నిజంగా…ఇదిగో ఇలాంటి వారు,ఇలాంటి ఆలోచనలున్న వారు ఈ రోజు మన దేశ రాజకీయాలలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో టీచింగ్ ప్రొఫెషన్ లొ పొలీసులో ఉంటే ఈదేశం చాలా చక్కగ ఉంటుందనిపిస్తుంది.

ఏదో ఒక పక్షానికి లొంగకుండా వాస్తవాలను దృశ్యీకరించి మొత్తానికి అసలు రంగు ని ప్రపంచానికి చూపిన అరుదైన అద్భుత గుండె బలం ఉన్న దర్శకుడు,మానవతావాది ఆనంద్ పట్వర్ఢన్.

ఎటూ కాని సమయంలో ఒకట్రెండు సార్లు ఈయన డాక్యుమెంటరీ చిత్రాలను దూరదర్శన్ ప్రసారం చేసి, ప్రసారం చేసినం అని అనిపించుకుంది. ఆయన డాక్యుమెంటరీలను చూసాక ఎంతో మంది ఆలోచనలు మారిపొయినవి అనడంలో ఆశ్చర్యం లేదు.

ఆయన గురించి, ఆయన జీవితం, ఆయన డాక్యుమెంటరీల గురించి చాల చెప్పాలనిరాయాలని ఉంది. కాని మొదట మీరు www.patwardhan.com సైట్ ని చూడండి. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆయన డాక్యుమెంటరీలను చూడండి. చూసిన తరువాత లేక కనీసం ఆయన సైట్ ని చూసిన తరువాత మనసు కి అనిపిస్తే…కాస్త మీ స్పందనలను ఆయనకు మెయిల్ చేయ్యండి.

దేశం మీదున్న ఆయన ప్రేమకు ఆయన పడిన కస్టానికి కాస్త సంతోషమేస్తుంది. ఎందుకంటే వాస్తవాలని రాసే, వాస్తవాలని ప్రచురించే, వాస్తవాలని ప్రసారం చేసే, “గట్స్” లేని సోకాల్డ్ ఒక వర్గపు భారతీయ ఉన్నత మేధావి వర్గానికి చెందిన ఎడిటర్లు కొంతమంది చానల్ ల అధిపతులు
ఆయన గురించి అంతగ రాయలేదు. ఈ అసమాన చలనచిత్రకారున్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేయ్యలేదు. అతని చిత్రాలను చూపే సాహసం చెయ్యడం లేదు.

ఈయన చలన చిత్రాలు ఇప్పటికే చూసి వుంటే లేదా చూసినాక చర్చకు వస్తారని అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.

Filed Under: featuredleadపరిచయంప్రముఖులు

Tags:

Comments (13)

Trackback URL | Comments RSS Feed

  1. మేడేపల్లి శేషు says:

    సైఫ్ గారూ, అభినందనలు. మనందరం గుర్తు చేసుకోవలసిన మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గురించి ప్రస్తావించారు. ఆనంద్ పట్వర్ధన్ ప్రముఖ డాక్యుమెంటరీలలో ఒకటైన ‘జంగ్ ఔర్ అమన్’ ను చూసే అవకాశం నాకు ఒకసారి కలిగింది. పోఖరాన్ అణుపరీక్షల నేపధ్యంలో నిర్మించిన ఈ డాక్యుమెంటరీని చూసిన ఎవరైనా, సమయం, సందర్భం లేకుండా అప్పటి ప్రభుత్వం నిర్వహించిన అణుపరీక్షలను, అబ్దుల్ కలాం వంటి ఉన్నతభావాలుగల (వ్యక్తిగా) శాస్త్రవేత్తను అలాంటి పనికి ఉపయోగించుకోవటాన్ని సమర్థించరు. ఇండియాలోనూ, పాకిస్తాన్లోనూ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ రెండు దేశాల్లోని సామాన్య ప్రజల యుద్ధ వ్యతిరేకతను, కొన్ని రాజకీయ వర్గాల చవకరకపు దేశభక్తి భావాలను బాగా ఎండగట్టింది (దాన్నే ఇంగ్లీషులో jingoism అంటారు). అణుపరీక్షల వల్ల ఆ ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజల ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో కూడా చూపించారు. ‘నవతరంగం’ లో ఎప్పుడూ ఫీచర్ ఫిల్మ్స్ గురించేగాని, మంచి డాక్యుమెంటరీల గురించిన ప్రస్తావన ఎందుకుండదని నేనెప్పుడూ అనుకునేవాడిని. దానికి మీరు మంచి ప్రారంభం చేశారు. కొన్నేళ్ళక్రితం ఢిల్లీలో జరిగిన India Social Forum లో నేను చాలా మంచి డాక్యుమెంటరీలు చూశాను. డాక్యుమెంటరీల గురించి కూడా, ‘నవతరంగం’ లో రాయాల్సిన అవసరం ఉంది.

    • నవతరంగంలో త్వరలోనే డాక్యుమెంటరీ సినిమాల గురించి ఒక సీరీస్ రాబోతుంది. తెలుగు యూనివర్శిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న జయధీర్ తిరుమల రావు గారు వ్రాసిన డాక్యుమెంటరీ చిత్రాలు అనే పుస్తకం నవతరంగంలో ప్రచురించడానికి ఈ మధ్యనే అనుమతి దొరికింది. త్వరలోనే ఆ వ్యాసాలు ప్రచురిస్తాము.

      • Very nice to know. congrats for acquiring permission

        • థాంక్స్ గీతాచార్య. మీకు తెలుసో లేదో ఇలా పెర్మిషన్ లు సంపాదించనవి చాలానే ఉన్నాయి. కొన్నింటిన అనువాదించడానికి, కొన్నింటిని పుస్తకంగా ప్రచురించడానికి, కొన్నింటిని టైప్ చేసి నవతరంగంలో ప్రచురించడానికి ఇలా అనుమతులు సంపాదిస్తూనే ఉన్నాను. కానీ అనువదించడానికి, టైప్ చెయ్యడానికి man power కావాలి. పుస్తకాలు ప్రచురించడానికి ఫండ్స్ కావాలి. చూద్దాం ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ వద్దాం.

          • వెంకట్,

            నేను తెలుగు బాగానే వ్రాయగలను. ఆంగ్లం మీద పట్టు కూడా ఫైర్లీ గుడ్. ఏమన్నా అనువాదపు పని ఉంటే నాకు కాస్త షేర్ చేయండి. ఇంజినియరింగు విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేదాకా (కౌన్సిలింగ్ పూర్తయేదాకా) నాకు కాస్త వెసులుబాటు ఉంటుంది. నేనెటూ ఖాళీగా కూచోలేను. రీసెర్చి వర్కు మధ్యలో రిలాక్స్ అవటానికి ఏదన్నా ప్రొడక్టివ్ పని పెట్టుకునే ఆలోచనలో ఉన్నాను.ఎంత లేదన్నా రోజుకి రెండు గంటల ఖాళీనే ఉంటుంది. అది ఈ విధంగా ఉపయోగ పడితే బాగానే ఉంటుంది.

          • వెంకట్ గారు, మంచి కార్యక్రమం చేపట్టారు. మీరు అనుమతులు తీసుకున్న, తీసుకోబోతున్న పుస్తకాల list ఇవ్వగలరా? నాకు చేతనైనది చేయడానికి ప్రయత్నిస్తాను.

  2. ‘రామ్ కే నామ్’ చూసి నేను పట్వర్ధన్ ఫ్యాన్ అయిపోయా. కానీ తరువాత కేవలం నర్మదా డైరీ తప్ప మరే డాక్యుమెంటరీలూ చూడలేకపోయాను. రామ్ కే నామ్ కాపీ ఒకటి మా యూనివర్సిటీలో ఉంటే సంపాదించగలిగాను.

  3. సైఫ్ గారు,
    ఆనంద్ పట్వర్ధన్ ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నేను కాలేజీలో వున్నపుడు Father, son and holy war (1994)వారితో చూసే అవకాశం లభించింది. ఆయన అంకితభావం, media power ఏంటో అప్పుడు అర్థం అయ్యింది. ఈ మధ్యనే ఆయన నాలుగు డాక్యుమెంటరీలు చూసాను.
    War and peace (Jang aur aman) (2002)
    Fishing in the sea of greed (1998)
    In the name of God (1991)
    Bombay, our city (1985)

    చూసినవాళ్ళులో ఆలోచనా విధానాన్ని మారుస్తుంది అనడంలో సందేహం లేదు.

  4. మేడేపల్లి శేషు says:

    వెంకట్ గారూ, జయధీర్ తిరుమలరావు గారి పుస్తకాన్ని మీరు ‘నవతరంగం’లో అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. మహేష్ గారూ, పట్వర్ధన్ గారి డాక్యుమెంటరీల డివిడిలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే చెప్పండి. నేనూ అంతర్జాలంలో వెతుకుతున్నాను.

  5. Very good article. I donno abt him. But use this to know more abt him.

  6. చాలా బాగుంది . ఈ డాక్యుమెంటరీ లు ఎక్కడ చూడవచ్చో కాస్త చెబుదురు!!

    • Father, Son And Holy War (Pita Putra Aur Dharamyudh) DVD గా విడుదల అయ్యింది. (ఇండియాలో) Planet M లో ప్రయత్నించండి. Video library BigFlix లో కూడా దొరకొచ్చు.

  7. saif ali gorey says:

    ముందుగా
    వెంకట్ జి కో సలాం
    అలాగె నవతరంగం మిత్రులందరి కి కూడ

    రాయడానికి బోలెడు ఆలోచనలు కాని సరిగా సమయం దోరకడం లేదు అని అనడం కన్నా
    టైం మేనేజిమెంట్ లో నేనె విఫలం అవుతున్నాను అని చెప్పటం భావ్యంగా ఉంటది

    సైట్ లు …
    మౌనంగా చదువుకుంటూ వెల్తున్నాను అంతే
    కాని ఎలాగైన రాయలి అని రెండు మూడు మొదలెట్టా..
    త్వర్లో మల్లి యుద్ధం కంటిన్యూ చెయ్యాలి

    షుక్రియ.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.