Menu

వర్మ నిర్మాతగా మీ దర్శకత్వంలో…

రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మీరు దర్శకుడు కావాలనుందా .. అయితే ఇది మీకోమే అంటున్నారు వర్మ.ఆయన తాజా చిత్రం అజ్ఞాత్ (తెలుగులో అడవి)సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను అందిస్తున్నారు. యు.టివి వారితో కలిపి రూపొందించిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే మీరు చేయవల్సిందల్లా కేవలం ఓ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించటమే. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ భయపెట్టాలి లేక షాక్ కు గురిచెయ్యాలి లేదా ఆశ్చర్యపరచాలి అంటున్నారు వర్మ. మీరు అలా చేయగలిగితే మీకు వర్మ బ్రేక్ ఇస్తానంటున్నారు.

“ఇక ధ్రిల్లర్ జెనర్ ఎందుకు తీసుకున్నానంటే ఇవి మీడియంలో ఉన్న అంశాలన్నిటినీ పూర్తి స్ధాయిలో వినియోగించుకునే అవకాశం ఇస్తాయి. చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తయారు చేసుకోవచ్చు,గొప్ప కెమెరా మూమెంట్స్,అద్బుతమైన కెమెరా టెక్నిక్స్..ఇలా ఎంత కావాలంటే అంతలా ప్రయోగం చెయ్యవచ్చు. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను ఓ వ్యక్తి సినిమా డైరక్టర్ అవ్వాలంటే అసెస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించనవసరం లేదని నమ్ముతాను కాబట్టి అంటున్నారు. ఓ కథ చెప్పాలన్న విపరీతమైన కాంక్ష,ఆ కథపై స్పష్టత,మీరు నటులుకి చెప్పి చేయించుకోగల సామర్ధ్యం,టెక్నీషియన్స్ కి మీకు షాటులో ఏం కావాలో చెప్పటం తెలిస్తే చాలు డైరక్టర్ అర్హత అని నమ్ముతాను” అంటున్నారు వర్మ.

“అందుకే ఫిల్మ్ కి సంబంధించి ఏ ట్రైనింగ్ తీసుకోని వారు,సినీ పరిశ్రమతో సంభందం లేనివారే ఈ కాంటెస్ట్ లో పాల్గొవాలి అనే కండిషన్ పెడుతున్నాను. వారి కాంటెస్ట్ వివరాలు(యధాతధంగా) పోటీ పేరు: అజ్ఞాత్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ షార్ట్ ఫిల్మ్ నిడివి: పది సెకెండ్ల నుంచి రెండు నిముషాల దాకా ఎంతైనా ఉండవచ్చు. బహుమతి :ఏ ఫిల్మ్ నాకు(రాము),యు.టివి వారికి నచ్చుతుందో వారికి మేము నిర్మాతలుగా దర్శకత్వం ఆఫర్ ఇస్తాం .అది షార్ట్ పిలిమ్ కావచ్చు. కాబట్టి మీకు దర్శకుడుగా ధ్రిల్లర్ తీయాలనే కోరిక ఉంటే మంచి అవకాశం. అలాగే ప్రత్యేకంగా చెప్తున్నాను ..మీరు తీసే ఈ ధ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ కి కథ అవసరం లేదు.అంతేగాదు మొదలు,చివర అనే స్క్రిప్టు రూల్స్ లేవు..ఓ మూమెంట్ ని తీసి మమ్మల్ని ధ్రిల్ చేస్తే చాలు. ఓ చిన్న షాట్ లో ఆ ధ్రిల్ అందించినా సరిపోతుంది. అయితే మొదటే చెప్పుకున్నట్లు షాక్ కొట్టడమో, ఆశ్చర్యపరచటమో,ఏదైనా ఎమోషన్ ని మాత్రం కలిగించాలి. అంతే గాక అది మీరు స్వంతంగా తీసిన ఫిల్మ్ అయ్యుండాలి. ఎలా పంపాలి :మీరు తయారు చేసిన షార్ట్ ఫిల్మ్ ని agyaatshortfilms@utvnet.com కి మెయిల్ చేయండి. లేదా మీ సీడీ లేదా డీవీడిని Aasif Ahmed, UTV Motion Pictures, 1181-82, Solitare Corporate , Guru Hargovindji Marg, Chakala, Andheir E, Mumbai – 400 093 ఎడ్రస్ కి పంపండి

చివరి రోజు : అజ్ఞాత్ రిలీజ్ రోజు జూలై 17,2009 లోపు పంపించాలి. మేము మీ ఎడ్రస్ కి ఏ విషయం సమాచారం తెలియ చేస్తాం ఇక మీ కెమేరాలు ఆన్ చేయండి..బెస్ట్ ఆఫ్ లక్ ”

ఈ వివరాలు వర్మ మాటల్లోనే…ఇక్కడ

3 Comments
  1. రాజశేఖర్ June 15, 2009 /
  2. ceenu June 17, 2009 /