Menu

సెలవుపెట్టి మరీ చూడ తగ్గ సినిమా దర్శకుడి గురించి…

999అది సాఫ్ట్ వేర్ బూం కి అప్పుడప్పుడే కోరలు వస్తున్న కాలం ….సాధారణంగా ఒక మంచి కుటుంబం లో పుట్టి B.Tech. శ్రధ్ధగ చదివి (ఇంజనీరింగు) కంప్లీట్ చేసి ఉన్నత విద్యలు చదివిన కుర్రోళ్ళు మంచి ఉద్యోగం ఉంటే మంచి కట్నం వస్తదనో ,లేక పోతే మంచి అమ్మాయి దొరుకుతుందనో ..హాయిగ షాది చేసుకోని సెక్యూర్ జిందగి కోసం ఎక్కడినుండో మైత్రివనం ఎగిరొచ్చి బయోడేటలు, జాబ్ అప్లికేషన్లు పట్టుకోని రెకమండేషన్తోనో,మన టాలెంటుతోనో ఒక మంచి జాబ్ సంపాదించుకోని, లేక పోతే జనని జన్మభూమిశ్చ లాంటి కొన్ని పాటలున్న సినిమా క్లాసిక్స్ బ్యాగ్ లో వేసుకోని విదేశాలకు ఏగురుతున్న కాలం.

అలాగే మరో వైపు…..హైదరాబాదు కొచ్చి సినిమా ప్రయత్నాలు చేస్తున్న నేను, నా లాగే సినిమా అంటే జునూన్ ఉన్న మిత్రుడు చారి, ముంబై కి హైదరాబాదు కి తిరుగుతు కమర్షియల్ ప్రకటనలకు కాపి రైటర్ గ చేస్తున్న కరీంనగర్ కు చెందిన మిత్రుడు ఆనంద్, పరిచయం చేయించిన మరో మిత్రుడు మహెందర్ మాకు దోరికిన పీ సి స్రీరాం లాంటి కెమెరామెన్ అన్నదేవర బ్రహ్మం ఇలా మిత్రులంతా కలిసి హైదరా బాదు డిజిటల్ ఫిల్మ్ ఫోరం ఒకటి పెట్టినప్పుడు చాలామంది డిజిటల్ ఫిల్ములా? అంటే ఏంది భాయ్? అని ఎక్కిరించినా జమాన! ఇంక డిజిటల్ ఫిల్మ్ అంటే ఏమిటో చాల మందికి తెలియని ఒకానొక కాలములో…….

నాలుగు గోడలమధ్య కర్టెన్ కప్పుకోని మంచి సినిమాలు లేక తెల్ల బోతున్న ధియేటర్ల తెరలు …. చక్కటి సినిమాలు వచ్చే రోజు మరెంతో దూరం లేదు అని ఎవరో ఒకరు దర్శక నిర్మాతలు తప్పక వస్తారని కలలు చూస్తు ఎదురుచూస్తున్నాయి…..కదా? అలా కలలు చూస్తున్న స్క్రీన్ ఆశయాలను మనం సాధించక పోతే మరెవరు సాధిస్తారు అని …

నగరం మొత్తం పోస్టర్లు వేసినట్లు
మైత్రివనం కేఫులు
అమీర్ పెట్ ఫ్రెండ్స్ రూం
ఎక్కడొ ఎంఎల్ఏ క్వార్టర్స్
ప్రతి చోట కేవలం డబ్బున్న నిర్మాత దొరికితే బాగుణ్ణు అని కాకుండ, కాస్త కామన్ సెన్స్ కూడా ఉన్న నిర్మాత దోరికితే బాగుణ్ణు అని అన్వేశిస్తూ ఎక్కడపడితే అక్కడ కధలు చెప్పుకుంటున్న తరుణం లో…

అదే మైత్రివనం లో చెప్పుకున్న ఎన్నో అందమైన సినిమా కధలలో ….” వీల్లంతా సెలవు పెట్టి మరీ చూసేటటువంటి నా రాబోయె సినిమా కధ చెప్తాను వినండి ” అంటూ మహెందర్ కూడ ఒక కధ చెప్పెవాడు.ఆ కధే “Rs . 999 మాత్రమే”

మహేందర్ గురించి మహేందర్ మాటల్లోనే…

సినిమా పిచ్చి గురించి..సినిమా ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ గురించి:

మనమంతా రాం గోపాల్ వర్మ గారి ఏక లవ్య శిస్యులం కదా
ఆయనే మనకు సర్కార్. (గాడ్ ఫాదర్ అన్నమాట)

ఫ్యామిలి సప్పోర్ట్?

ఇంట్లో సప్పోర్టా అసలు ఇంటర్ వరకు ఒక్క సినిమా చూడనివ్వలేదు, చూడలేదు
చిన్నప్పుడు టెన్త్ వరకు ఇంట్లో టీవి కూడ లేదు. ఇంటర్ కోసం బయటి కాలేజ్ కొచ్చినం. బస్ అంతే రాం గోపాల్ వర్మ దెయ్యం పట్టేసింది. after B.Tech అంతా దోస్తుల సప్పోర్ట్.

ముందునుంచే (ప్రియురాలు ఎవరు లేక పోయినా …) ఊహించుకోని పాటలు రాసుకోవడం అలవాటు. కానీ…సినిమా తీయకుండ చస్తే మాత్రం నా చావు చాల హీనంగ ఉండేది.
(కాసేపు గతం కళ్ళముందుకొచ్చింది … మా మధ్యలో ఒక నిశ్శబ్ధం … అదేంటి …మనం వర్మ ఏకలవ్య శిస్యులం కదా మన ఆలోచనలో కూడ ఓటమి ఉండకూడదు కదా మహి అంటే)

ఉండదు నిజమే! కాని చదువుకున్న వాడు సినిమ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ కాకపోతే
వాడి బతుకు ఫుట్ పాత్ మీద బతికేటోని కన్న హీనగా అవుతుంది కదా అంటాడు.

సినిమాకు ముందు:

అసిస్టెంట్ గా ఎక్కడైన చేద్దామని చాల తిరిగాను ప్చ్ దోరకలేదు

అప్పుడు…?

అనుభవం లేకపోయినా ఫర్వాలేదు కధ చెప్పడం వస్తే చాలు ఎవరైన డర్శకత్వం చెయ్యొచ్చు అని కొన్ని కోట్ల సార్లు వర్మ గారు ఇంటర్యూలలో చెప్తూ వస్తున్నారు కదా! ఆయన మాటలని పాటిస్తే పోలే అని దర్శకుడిగా అవకాశాలు ఇమ్మని కధలు పట్టుకోని తిరిగా…

అప్పుడు…?

ఒక ఫ్రెండ్ ద్వార వినయ్ అనే ఆయన కలిసారు ఆయనకు మంచి నిర్మాతకుండవలసిన అన్ని లక్షణాలు ఉండటం తో .. కధ ని ఆయనకు చెప్పడం తక్కువలో తక్కువ 35 లక్షల బడ్జెట్ వేసుకోవడం దానికి తోడు 15 రోజు ల అతితక్కువ సింగల్ షెడ్యూల్ ప్రణాలిక వేసుకోవడం
సినిమా తీసెయ్యడం జరిగిపోయింది

అనుకున్నట్లుగానే బడ్జెట్ లో అయ్యిందా?
జనరల్ ఖర్చులకే కాస్త పెరిగింది.అది నిర్మాతకు మొదటి సినిమా కాబట్టి.

నిర్మాత కొత్త వారు అయితే…సినిమా తియ్యడం తోటే దర్శకుడిగా పని అయిపోదు అది రిలీజు చెయించుకోవడం పెద్ద సక్సెస్.

సీనియర్ నటులు గురించి:

హీరో హీరోయిన్ కొత్తవారయినా , బ్రహ్మానందం, భగవాన్, జయప్రకాష్ రెడ్డి లాంటి పెద్ద నటీ నటులు సహకారం చాల చక్క గ ఇచ్చారు. ప్రత్యేకంగా సాయి కిరణ్ ఇచ్చిన సప్పోర్ట్ నేను మర్చి పోలేను. కాని ఏది ఏమయిన కొత్తగా వచ్చే నవ యువ దర్శకులు ఒక సినిమా తీసి తమని తాము నిరూపించుకోననత వరకు ఎక్కడైన సీనియర్లు గుర్తించడం కాస్త కష్టమే కదా ..?

సినిమా విడుల గురించి:
మొత్తం సినిమా మేము అనుకున్నట్లు గానే చాల చక్కగా వచ్చింది. కొత్త సినిమా కాబట్టి అందరికి ఉన్న బాక్స్ కష్టాలే మాకు కొన్ని ఎదురైనవి. చలన చిత్ర పరిరక్షణ సమితి వారి సహకారం తో మొదట ఒక 18 ప్రింట్స్ షేరింగ్ పద్ధతి పైన విడుదల చేస్తున్నాం.

అనుభవంతో ఒక సలహా:
ప్రోఫెషనలిజం , డేడికేషన్, డిసిప్లీన్ లేని వారు కేవలం డబ్బు పట్టుకోని వచ్చి సినిమా ఆగిపోయిందనో , రిలీజు ఆగిపోయిందనో అని బాధ పడవద్దు.

మరి కాస్త వివరంగా… చాలా విషయాలు తరువాత డిస్కస్ చెద్దామని లేచాం రిలీజు హడావుడి ఉంటది కదా.

NOTE:సెలవుపెట్టిమరి చూడవలసిన సినిమా మాత్రమె కాదండి ఇది తీరిక చేసుకోని మరి రివ్యూ రాయాల్సిన సినిమా. జర కోషిష్ చెయ్యండి

11 Comments
  • alibhai June 29, 2009 /
 1. pamanji June 29, 2009 /
 2. మేడేపల్లి శేషు June 29, 2009 /
  • alibhai June 29, 2009 /
 3. సుజాత June 29, 2009 /
 4. VEERNI SRINIVASARAO June 30, 2009 /
 5. jonathan June 30, 2009 /
 6. laxman July 4, 2009 /
 7. su August 10, 2009 /
 8. విజయవర్ధన్ August 10, 2009 /