Menu

Monthly Archive:: June 2009

అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

శశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి” సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.” భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు

సెలవుపెట్టి మరీ చూడ తగ్గ సినిమా దర్శకుడి గురించి…

అది సాఫ్ట్ వేర్ బూం కి అప్పుడప్పుడే కోరలు వస్తున్న కాలం ….సాధారణంగా ఒక మంచి కుటుంబం లో పుట్టి B.Tech. శ్రధ్ధగ చదివి (ఇంజనీరింగు) కంప్లీట్ చేసి ఉన్నత విద్యలు చదివిన కుర్రోళ్ళు మంచి ఉద్యోగం ఉంటే మంచి కట్నం వస్తదనో ,లేక పోతే మంచి అమ్మాయి దొరుకుతుందనో ..హాయిగ షాది చేసుకోని సెక్యూర్ జిందగి కోసం ఎక్కడినుండో మైత్రివనం ఎగిరొచ్చి బయోడేటలు, జాబ్ అప్లికేషన్లు పట్టుకోని రెకమండేషన్తోనో,మన టాలెంటుతోనో ఒక మంచి జాబ్ సంపాదించుకోని,

పసంగ (తమిళ్) – పిల్లలు: పిడుగులు

సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు.

ఆర్.డి. బర్మన్

27 June, 1939 – 4 January,1994 1986 బొంబాయిలోని ఒక మ్యూజికల్ సిట్టింగ్. సినిమా దర్శకుడు పాటల రచయిత గుల్జార్ ఒక కాగితాన్ని సంగీతదర్శకుడికి ఇచ్చాడు. కళ్ళద్దాల్లోంచీ ఆ కాగితంలోని వాక్యాల్ని చదివి “మంచి సీను. చాలా కవితాత్మకంగా ఉంది” అని క్రిందపెట్టేసాడు ఆ సంగీత దర్శకుడు. “సీను కాదు అదే నేను రాసిన పాట. నువ్వు కంపోజ్ చెయ్యాలి” అన్నాడు గుల్జార్. “నీ కేమైనా పిచ్చిపట్టిందా! రేపు టైంమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకొచ్చి

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం)

సినిమా చూడటం అంటే చిన్నప్పుడు ఓ సరదా. అంతకుమించి మరేమీ లేదు. కాని ఆ బాల్య, కౌమారావస్థలు దాటి ఒక విధమైన మానసిక పరిణితి వచ్చిన తర్వాత, సినిమా అనే కాదు, ఏ విషయం పట్లైనా మన అభిప్రాయాలు మారిపోతాయి (మారాలి కూడా). ఎన్నిరోజులని, సంవత్సరాలని ఈ కాకమ్మ కథలతో తయారయ్యే చిత్రాలు చూస్తూ కూర్చుంటాం? కొత్త విషయాలు తెలుసుకోవటంలో మన చుట్టూ ఉండే వాతావరణం, మనకు లభించే వనరులు మొదలైనవి కూడా ప్రధానపాత్ర వహిస్తాయి. అయితే,