Menu

Monthly Archive:: May 2009

7 days in slow motion

కోడి కూయక ముందే లేచి, ప్రైవేట్లు, ట్యూషన్లకు పోయి, రాత్రి పదికో, పదకొండుకో ఇల్లు చేరే పిల్లలు. వాళ్ళతో పాటు వాళ్ళ చదువులు, తాము కూడా చదివినంతగా కష్టపడే తల్లిదండ్రులు. ఒకోసారి పిల్లలు పుస్తకాల మీద నుంచి దృష్టి కూడా కదపని పరిస్థితుల్లో వాళ్ళకు అన్నం కలిపి, ముద్దలు చేసి నోట్లో పెట్టి తినిపించి, వాళ్ళ పుస్తకాలు సర్ది ఇచ్చి, వాళ్ళ బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చి, చదువు మాత్రమే వాళ్ళ ఏకైక బాధ్యతగా పెంచే

అలిసింటే అన్వేషణమ్

విడిపోవడం, దుఖఃపడడం, వేచి చూడడం, వెతుకులాడడం ఇవాళ్టి జీవితాల్లో అంతర్భాగమైపోయాయి. ఏ ఇద్దరు మనుషుల మధ్యా సంపూర్ణ స్నేహమూ, పరి పూర్ణ ప్రేమ ఆశించడం ఈ రోజుల్లో అత్యాశే అవుతుంది. చివరికి జీవితాంతం కలిసి జీవించనున్నామనుకునే భార్యాభర్తల నడుమా పూడ్చలేని అగాధాలూ, అందుకోలేని దూరాలు ఇవాళ వాస్తవాలై ఉంటున్నాయి. సంక్షోభాలతో నిండిపోయిన బతుకులు సంక్లిష్టమై ఒకరినొకరు అర్ధం చేసుకోవడం అటుంచి తమని తాము అర్ధం చేసుకోలేని స్థితి నేటి జీవిత విధానమై కూర్చుంది. ముక్కలు చెక్కలుగా విచ్చిన్నమవుతున్న

ఆవకాయ బిర్యాని-స్క్రీన్ ప్లే

నవతరంగం పాఠకులు మరియు సభ్యులకు నమస్కారం. గతంలో వినాయకుడు స్క్రీన్ ప్లే ని పాఠకులు ఉచితంగా డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నవతరంగం చరిత్రలో అదో మైలు రాయి. అయితే ఆ ప్రయత్నం అంతటితో ఆపెయ్యకుండా ఈ సారి మరో తెలుగు సినిమా స్క్రీన్ ప్లే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము. గత సంవత్సరం విడుదలైన ’ఆవకాయ బిర్యాని’ స్క్రీన్ ప్లే ను నవతరంగం పాఠకుల కోసం

పెడ్రో ఆల్మడోవర్-ఒక పరిచయం

స్పెయిన్ దేశపు సాంస్కృతిక ప్రతినిధి-పెడ్రో ఆల్మడోవర్ పెడ్రో ఆల్మడోవర్ ప్రజాస్వామ్య స్పెయిన్ దేశపు సాంస్కృతిక ప్రతినిధిగా విశ్వవిఖ్యాతి గాంచాడు. లూయిస్ బునియల్ తర్వాత అంతటి ఖ్యాతిని, ఆమోదాన్ని, ఆదరణని పొందిన సినిమా దర్శకుడు ఆల్మడవోర్. నాలుగు దశాబ్దాలు మిలిటరీ నిరంకుశ పాలనను చవిచూసిన అనంతరం ప్రజాస్వామ్య బావుటాను ఎగరవేసిన స్పెయిన్ నుంచి ప్రపంచ సినిమా యవనిక పైన తనదైన సొంత చలన చిత్రబాణి, వాణిలతో అలరిస్తున్నాడాయన. చలన చిత్రకారుడుగానే కాకుండా ప్రజాస్వామ్య వాదిగా కూడా ఆల్మడోవర్ వినుతికెక్కాడు.

The Three colours – Blue

Fade in తెర ని౦డా చీకటిని తలపి౦చే నలుపు. కొద్ది కొద్దిగా లేత నీల౦ ర౦గు కా౦తి అలా మెరుస్తూ….అ౦తలోనే అదృశ్యమయిపోతూ ఉ౦టు౦ది. ఏదో మోటారు ఇ౦జిన్, రణగొణ ధ్వని చేస్తూ వస్తు౦దో పోతు౦దో తెలీనట్టుగా ఉ౦టు౦ది. ఇ౦తలో కొ౦చె౦ కొ౦చె౦గా తెర మీద కాస్త లే లేత నీలి ర౦గులో వెలుతురు విరజిమ్ముతూ౦డగా…..ఓ చక్ర౦ తిరుగుతూ ఉ౦టు౦ది, అక్కడక్కడ వచ్చే మలుపులకు అనుగుణ౦గా తన దిశ మార్చుకు౦టూ పరుగెడుతున్న ఆ చక్రాన్ని, దానితో పాటు వస్తున్న