మిత్రుడు(రివ్యూ)
రాజేంద్రప్రసాద్ రాంబంటు చూసారా…పోనీ తారకరత్న భద్రాధ్రి రాముడు చూసారా..మంచి పాయింటు బాగుంది కదా ..అవి సరిగ్గా తీయక వర్కవుట్ అవలేదు..మళ్ళీ ఆ పాయింట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది..మంచి ఐడియా..ఈ మధ్య హాలీవుడ్ కామిడీ సమ్ ధింగ్ ఎబౌట్ మేరి చూసా..చాలా బాగుంది..ముఖ్యంగా ఆ హీరోయిన్ ని పడేయిటం కోసం ఒకడు వికలాంగుడులా నటిస్తూంటాడు..భలే క్యారెక్టర్. అయితే అతన్ని విలన్ గా అనుకుని,ముందునుకున్న ఆ పాయింట్ ని మార్చి చేసేద్దాం..అని అనుకుంటే పుట్టినట్లున్న చిత్రం మిత్రుడు. సాధారణంగా కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారంటే ఏదో కొత్తదనం ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే అంతొద్దు..మేం పేరుకు కొత్తే గానీ మా ఆలోచనలు మరీ ఎనభైల నాటివే అని నిరూపిస్తూ సినిమాలు వస్తున్నాయి. ఆ కోవలోకి చేరిందే రాజమౌళి మరో శిష్యుడు(ఆల్రెడి ఒక శిష్యుడు ధ్రోణ అనే చిత్రం ఇచ్చి పగ తీర్చుకున్నాడు)మహదేవ్ తీసిన ఈ మిత్రుడు చిత్రం. ప్రేక్షకులను శత్రువుల్లా భావిస్తూ చేసినట్లున్న ఈ చిత్రం చివరకు టైటిల్ జస్టిఫికేషన్ కూడా జరగదు. ఎక్కడా స్నేహం గురించి కానీ మిత్రుడు గా ఓ మనిషి ఎలా ఉంటాడన్నది కానీ మచ్చుకైనా కన్పడదు. పోనీ ఇలాంటి అధ్బుతాలు తెలుగు ఫీల్డ్ లో మామూలే కదా అని ఫిక్సయి సినిమా చూసినా..తృప్తి కలిగించదు.
ఇందు(ప్రియమణి) ఓ పెద్దింటి అమ్మాయి. మలేషియాలో ఉన్నామెకు జాతకం చూపించుకుంటుంది(ఇంట్లో పెద్దలు చూపించరు..ఆమే చూపించుకుంటుంది). దాంట్లో ఆమెకు పెళ్ళయితే …భర్త నెల లోపలే చస్తాడు అని ఉంటుంది. అయితే అప్పటికే ఆమె దీపక్ తో ప్రేమలో ఉంటుంది. దాంతో ఓ బకరాని పట్టుకుని వాడిని పెళ్ళి చేసుకుని తన నష్ట జాతకానికి బలిపెడదామని ప్లాన్ చేస్తుంది. అలా ఆమె బకరా కోసం వెతుకుతున్న సమయంలో ఎదురౌతాడు ఆదిత్య (బాలకృష్ణ). అతను ఎప్పుడూ ఎప్పుడూ తాగుతూ,ఒంటరిగా ఏదో పోగుట్టుకున్నట్లు నిరాశ,నిస్పృహలతో ఉంటాడు. అతన్ని సెలెక్టు చేసుకున్న ఆమె రకరకాల సినిమాటెక్ విన్యాసాలతో ప్రేమలో పడేసి ఒప్పించి పెళ్ళిచేసుకుంటుంది. అప్పుడు ఏం జరిగింది..ఆదిత్య నిజంగానే మరణిస్తాడా..ఆమె ప్రేమించిన దీపక్ ఏమయ్యాడు..ఇంతకీ ఆదిత్య నీరసంగా అలా నిర్వేదంతో ఉండటానికి కారణం ఏమిటి అన్న విషయాలుపై ఆసక్తి కలిగిన వాళ్ళు తెరపై చూడాల్సిందే.
ఇక పై విధంగా కథ చెప్పినా(ప్రియమణి పెళ్ళాడబోయే వ్యక్తి మరణిస్తాడు) విషయం తెలిసి ప్రేక్షకులకు కొద్దో గొప్పో ఆసక్తి ఉండేది. అయితే సినిమాలో ఇంటర్వెల్ కి కానీ ఆ అసలు విషయం చెప్పి కథలోకి రారు. దాంతో అప్పటివరకూ హీరోకి సమస్య అనేది ఎటువైపు నుంచి లేక పరమ బోర్ గా తయారైంది. అందులోనూ ఎక్కడో సెకెండాఫ్ చివర్లో చెప్పే ప్లాష్ బ్యాక్ కోసం హీరో పాత్ర(బాలకృష్ణను) ఎప్పుడూ నీరసంగా,నిర్వేదంగా చేసేసారు. పోనీ ఇంత బిల్డప్ ఇచ్చిన బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ ఏమన్నా గొప్పగా ఉంటుందా అంటే అత్యంత పేలవంగా ఉంటుంది.ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఓ సమస్య పుట్టి అది కథను లేదా హీరోని వెంబడించదు. ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా కథ నడుస్తుందనే భరోసా ఇస్తుంది. సాధారణంగా ఇలాంటి కథల్లో ప్లాష్ బ్యాక్ లో జరిగిన సంఘటనకి సంభంధించిన విలన్లు సినిమా మొదటి నుంచి కనపడుతూ ..తిరుగుతూ..ఎదర ఏదో ఉందనే ఆసక్తి గొలుపుతూంటారు.
పోనీ ప్రియమణి వైపు నుంచి ఉన్న విలన్స్ ( దీపక్ ,ప్రదీప్ రావత్) విలనీ చూద్దామన్నా అది అస్సలు పండలేదు. వారికి హీరో ట్వీస్ట్ లివ్వటం వంటివి లేకుండా పోయాయి. హాలీవుడ్ సినిమా సంధింగ్ ఎబౌట్ మేరీలో లాగ దీపక్ పాత్రను వికలాంగుడుగా నటించటం పెట్టారు. అలాగే మెయిన్ లైన్ జాతకాలుది భద్రాద్రి రాముడు,రాంబంటు చిత్రాలను పూర్తిగా గుర్తుకు తెస్తుంది. వీటన్నటికీ తోడు ఎక్కడా మిత్రుడు అనే టైటిల్ జస్టిఫికేషన్ ఉండదు. ఇక చిత్ర రచన వైపు ఎంత నిర్లక్ష్యం అంటే బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విప్పే కృష్ణ భగవాన్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడా కనపడడు. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రియమణి పై చేసిన లెస్బియన్ కామిడీ,బాలకృష్ణ..వయాగ్రా సన్నివేశాలు దర్శక,రచయితల చీప్ టేస్ట్ తెలియచేస్తాయి.
సంగీత పరంగా మణిశర్మ క్లైమాక్స్ సాంగ్ తప్ప ఏదీ బాగా ఇవ్వలేదు..ఆర్.ఆర్ .స్పెషలిస్ట్ అయిన ఆయన ఈ సినిమాలో అదీ ఫెయిల్యూర్ కావటం దురదృష్టం. ఎడిటింగ్,కెమెరా కథకు,దర్శకుడు టేస్ట్ కి తగ్గట్లే ఉన్నాయి. కొత్త దర్శకుడుగా మహదేవ్ ఏమీ మెరుపులు మెరిపించలేకపోయాడు. అంతకుముందు అతని సహచరుడు ద్రోణ దర్శకుడు రూట్ లోనే వెళ్ళాడు. నటీనటుల్లో బాలకృష్ణ ఎమోషన్ సన్నివేశాల్లో బాగా చేసారు. ప్రియమణి తన అందాలను ఆరబోద్దామని ప్రయత్నించింది కానీ ద్రోణ బికినీ సీన్ చూసిన వారికి అవి ఆనని పరిస్ధితి వచ్చేసింది. ఇక బ్రహ్మానందం,కృష్ణభగవాన్ ఉన్నంతలో నవ్వించాడు. ధర్మవరపు,శ్రీనివాసరెడ్డి వంటి హాస్య నటులు ఉన్నా వినియోగించుకోలేదు.
ఏదైమైనా ఈ సినిమా చూస్తే ఒకటే సందేహం కలుగుతుంది. అసలు కొంత కాలంగా బాలకృష్ణ దగ్గరకే ఇలాంటి ఫ్లాఫ్ కధలు ఎందుకు చేరుతున్నాయని. అయితే బాలకృష్ణ ఇన్ని ప్లాప్ ల తర్వాత కూడా మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం ఆయన స్టామినాను తెలియచేస్తుంది. కాబట్టి మంచి కథ ఎన్నుకుంటే ఇప్పటికీ బాలకృష్ణ ముందువరసలో ఉంటాడనిపిస్తుంది. ఇక రాజమౌళి శిష్యులు కాస్త తమ గురువులా కథల మీద కూడా శ్రధ్ద పెడితే వర్కవుట్ అవుతారు. అలాగే రచయిత విజయేంద్రప్రసాద్ గారిని తన కొడుక్కి మంచి కథలు ఇస్తారు..బయిట వాళ్ళకు నా అల్లుడు ,మిత్రుడు అంటూ విచిత్రమైన కథలు ఎందుకిస్తారో ..అడగాలి. ప్రియమణి కూడా తానే పరుత్తి వీరన్ అనే చిత్రంలో చేసి జాతీయ అవార్డు పొందిందనే విషయం అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటే మేలు. ఇవన్నీ ఎలా ఉన్నా మిత్రుడు చిత్రానికి మాత్రం మీ మిత్రులును మాత్రం తీసుకెళ్ళకండి..వారు ఇలాంటి సినిమాకు తీసుకెళ్ళావంటూ..శత్రువులుగా మారతారు.
సినిమా: మిత్రుడు
సంస్థ: వైష్ణవి సినిమా
నటీనటులు: బాలకృష్ణ, ప్రియమణి, చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, హేమ, ఝాన్సీ తదితరులు.
కెమెరా: బాల మురగన్
ఎడిటింగ్ : కోలా భాస్కర్
ఆర్ట్స్ : ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
రచన: విజయేంద్ర ప్రసాద్
మాటలు: ఎం రత్నం
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: మహాదేవ్
రిలీజ్ డేట్: మే ఒకటి,2009
Filed Under: featured • lead • తెలుగు • భారతీయ సినిమా • సమీక్ష
http://navatarangam.com/2009/05/mitrudu-telugu-review/
http://navatarangam.com/2009/05/mitrudu-review/
పై రెండు పోస్టుల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయ్. సూర్యప్రకాశ్ బాగోలేదు అంటె, ఇంకోఅతను బాగుందీ అని. ???
@భాస్కర్ రామరాజు: ఒకరే చెబితే కాంట్రడిక్షన్ వేరువేరు మనుషులు చెబితే భిన్నాభిప్రాయం. అదే నవతరంగం భిన్నత్వం. It has space for all point of views. ఎంచుకోవలసింది మీరు.
మహేశ్ గారు భలే చెప్పారు….హ..హ..!!
రాజశేఖర్
హి హి……..భలే నవ్వారు.
మహేశ్
భిన్నత్వం!! బాగా చెప్పారు…
[...] రివ్యూస్ ! http://navatarangam.com/2009/05/mitrudu-telugu-review/ http://navatarangam.com/2009/05/mitrudu-review/ ఈరోజు బాలయ్య బాబు [...]
అస్సలు బాలక్రిష్ణ కి హిట్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటినట్లు వుంది.
ఇప్పుడే a2zdreamsకి ఈ విషయం గురించో సమాధానమిచ్చి ఇటొస్తున్నా.
నవతరంగం నేపధ్యం ఈ సైట్ వీక్షకులందరికీ తెలిసుండాల్సిన అవసరం లేదు కదా. సినిమా విడుదలైన రోజే ఇటువంటి పరస్పర భిన్నమైన రెండు రివ్యూలు ప్రచురించి చదివే వాళ్లని గందరగోళంలోకి నెట్టటం అంత సమంజసంగా అనిపించలేదు. ఇటువంటి ‘భిన్నత్వం’ వల్ల నవతరంగం క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడెంత విలువైన వ్యాసాలున్నా, సినిమా సమీక్షల కోసం మాత్రమే వచ్చే సాధారణ పాఠకుల సంఖ్యా తక్కువుండదు. అసలు – వాళ్ల సంఖ్యే అధికమని నా నమ్మకం. అటువంటి వాళ్లని తికమక పెట్టటం భావ్యమా?
@అబ్రకదబ్ర: ఇందులో క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఎక్కడుందో నాకు అర్థం కాని విషయం. చెత్త సినిమానుకూడా బ్రహ్మాండం, కళాఖండం, హిట్, సూపర్ హిట్ అని చెప్పుకునే టీవీ ఛానళ్ళకు పోని క్రెడిబిలిటీ, ప్రేక్షకుల భిన్నాభిప్రాయాలకు స్థానం కల్పించే నవతరంగానికి ఎలా పోతుంది?
డబ్బులు తీసుకుని ఏకపక్ష సినిమా సమీక్షలు రాసే పత్రికలూ వెబ్న్సైట్ల కన్నా, రెండు మూడు పార్శ్వాలను ఒకే సారి పరిచయం చేసే open forum మంచిదనే నా నమ్మకం. ఒకటి సినిమా ఎందుకు బాగుందో చెబితే, మరొకటి ఎందుకు బాగా లేదో చెప్పిన సమీక్షలివి. అలాంటప్పుడు సినిమాని చూడాలా వద్దా అని ఎన్నుకునే ప్రేక్షకుడిగా, am I not much empowered? ఇది తికమక ఎట్లా అవుతుంది?
ఈ నిరసనలూ, అభిప్రాయబేధాలకుకూడా నవతరంగం స్థానం కల్పిస్తోంది. అంతకన్నా ఒక “వేదిక”కు కావలసిందేమిటి!
nenu cineam chusanu…bagane undi. Balakrishna cinema laga ledu if your review is abt that. simple screen play and simple movie.
the other review is much more accurate.
అబ్రకదబ్ర వారు తెలిపిన a2zdreams వారి అభ్యర్ధన ఎంతో కొంత సమంజసమైనదే.
ఉదాహరణకు అరుంధతి సినిమా తీసుకుందాం. మహేశ్ గారికి ప్రకాశ్ గారికి ఈ సినిమా బాగా నచ్చింది. కానీ నేను చాలా విమర్శిస్తూ వ్రాసాను. కాబట్టి నవతరంగం మంచి తెలుఁగు సినిమా ప్రమాణాలను పెంచాలని పూనుకున్న సైటు అయినా, అందులో కూడా భిన్న అభిప్రాయాలు వుండడం జరుగుతుంది.
కాబట్టి నవతరంగం రివ్వూ అని దేనిని అనకుండా, నవతరంగంలో జోస్యుల రివ్వూ అనో మహేశ్వరరివ్వూ అనో, రాకేశ్వరివ్వూ అనో చూడాలి. నేను బాగాలేదు అన్నానంటే నా విమర్శలు నచ్చే వారు అది చూడరు. మహేశ్ గారు బాగుందంటే, వారి అభిరుచులు నచ్చేవారు ఆ సినిమా చూడవచ్చు అని. ఇక అతిథి సమీక్షలు సరేసరి.
ఈ విషయంలో నవతరంగం కూడా కొంత శ్రద్ధ వహించాలి. నేను ఈ విషయాన్ని సైటు పెట్టిన కొత్తలోనే ప్రస్తావించాను.
నా సూచన ఏంటంటే, సమీక్ష ప్రచురించేడప్పుడే, ఇది జోస్యుల రివ్వూ అని శీర్షిక లోనే కొట్టొచ్చేట్టు వ్రాస్తే బాగుంటుంది.
ఐడిల్ బ్రెయిన్ జీవీ రివ్వూలా, తరచూ ప్రచురించే జోస్యుల వారి రివ్యూ కూడా ఒక ప్రత్యేక ఫీచర్‌గా సమర్పించాలి.
ఈ విషయమై కొంత ఆఫ్ లైన్ చర్చ జరపవలసివుంది నవతరంగంలో.
ఎంతైనా సమస్యను మాకు తెలియపరచినందుకు కృతజ్ఞతలు.
- రాకేశ్వర రావు.
@రాకేశ్వర రావు : నవతరంగం parochial “పత్రిక” కాదు. ఇదొక “వేదిక”. వేదికలకు సభామర్యాదలుంటాయేగానీ ఎడిటోరియల్ నియమాలు కాదు.
వ్యాసంతో పాటూ రచయిత పేరుంటుంది కాబట్టి కొత్తగా “కొట్టొచ్చేట్టు”రాయాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉందంటారా? అరుంధతి విషయంలోనూ ఈ చిత్రం విషయం లోనూ మీరు ఇతర పాఠకులూ గమనించాల్సింది ఒకటుంది. నేను అరుధంతి గురించి రాసింది సమీక్ష, జోశ్యులవారు రాసింది ప్రేక్షకుడి తరఫున ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వేసిన ఒక సెటైర్ (వ్యంగ్యం). మీరు రాసింది విమర్శ.
‘మిత్రులతో మిత్రుడు’ అంటూ కృష్ణ బాబు గారు రాసింది personal anecdote ఐతే, జోస్యుల గారు “రివ్యూ” అని తమ వ్యూ చెప్పారు. ఇందులో పాఠకుడూ ప్రేక్షకుడూ తికమక పడే అవకాశం కన్నా, వీలైనన్ని ఎక్కువ(భిన్నమైన) అభిప్రాయాల్ని తెలుసుకునే అవకాశాలే ఎక్కువ. ఈ “విపరీతాలు” సాధారణంగా జరిగేవే. ప్రతి సినిమా గురించీ దాదాపు పదిరకాలైన అభిప్రాయాలు మన చుట్టూ మౌత్ పబ్లిసిటీలో తిరిగేవే. అలాంటప్పుడు నవతరంగం అందుకు విపరీతంగా ఎందుకుండాలి?
నవతరంగం monolithic cinema కల్పన చెయ్యడం లేదు. ప్రస్తుతం ఉన్న monotony ని ప్రశ్నిస్తోంది. అలాంటప్పుడు భిన్నత్వానికి, భిన్నాభిప్రాయానికీ తావు లేకుండా “ఒకేరకమైన” అభిప్రాయాలకు వేదికైతే, మూల ఉద్దేశానికి భంగం కాదంటారా?
Same site lo rendu different opinions aa…..mee personal opinions unte….vatini just comments kinda pettukondi….anthe kani site lo Movie review ani petti mee personal opinion’s andhari medha Impose cheyatanaki try cheyakandhi……ainaaa K.Mahesh Kumar appudu BalaKrishna ki against gaa rastadu.If u want to run a site for the entire Be IMPARTIAL …. ledhu nenu BalaKrishna ki anti ani anukunte….site lo Anti Balayya ani oka section peti andhulo vesuko….anthe kani….ela cheyaku….andhariki nachinaa Cinema neku endhuku nachaledho cheppu…..Balayya ki unna Image nunchi….bayatiki vachi tesina movie edhi…..Movie ki eme kavalo avvi untai……athe…kani Specially Balayya Image kosam aa scene undadhu…Just a Family movie done by Balayya….Not a Balayya Movie….Dialogues unte unnai eppudu routine antaru….Leka pothe Balayya Movie lo Mass elements levu…avi levu ani dobbutaru entidhi…. asalu nuvvu aa standards use chesi review rastunavu….MR. NAVATARANGAM site owner..
Ee tokkalo Discussions oka week tarvata pettukuntae better….
ఈ ప్రశ్నాపత్రం ఏంటండీ బాబూ… ఏదో పరిభాష వాడతారు… తర్కాన్ని, చర్చోద్ధేశాలనీ గగనతలానికి లాక్కెళతారు… ఇదేమి మహేశ్వర తాండవమో… మీకు విమర్శ, వ్యంగ్యం, సమీక్ష వంటివి చూపించన మీ జ్ఞాననేత్రం అమోఘం…
(నేను వ్రాసింది సమీక్షే అనుకున్నాను నేను… సమీక్ష కూడా కాదు సమీక్షలో పదోవంతు అని నేననుకున్నాను… ఇకది విమర్శించాల్సినంత మంచి సినిమా ససేమిరా కాదని నా ఉద్ధేశం.. చూశారా పారిభాషిక పదాల వల్ల ఎంత కష్టం వచ్చిపడ్డదో… చదువరులకు కనిపించేది మూడు వ్యాసాలు అంతే… అంటే మీ లాంటి ముక్కంటి మహదేవుళ్ళకి తప్ప….)
నేను చెప్పవచ్చేదేమిటంటే, నా దగ్గర ప్రశ్నలకు సమాధానం లేదు. ఎవరికి ఇష్టంవచ్చినవి వారు వ్రాసుకోవచ్చు. ఖచ్చితంగా. అనాదిగా చేస్తున్నదే. సైటు పెట్టిందీ అందుకే, సైటు పెట్టక ముందు ఎవరైనా అలాంటి సైటు పెడితే బాగుంటుంది అన్నదీ నేనే (అది వేంకట చెవిన పడలేదనుకోండి అది వేఱే విషయం).
పాపం చదువరులు, మన ఇంటికి వచ్చిన అతిథులు కష్టం అవుతుందంటున్నారు, వారి సౌకర్యార్ధం మన సైటుని బాగా ఎలా సమర్పించుకోవచ్చు అన్నది నా తపన. దానికైమైనా సూచనలుంటే చెప్పండి. వినయంగా వింటాను. నా మటుకు నేను రాకేశ్వరివ్యూ అని ట్యా’గించు’కుంటాను.
- మిత్రుడు (వెల్ యఱ్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్) రాకేశ్వర
నాకు నవతరంగం తెలియకముందు సినిమా రివ్యూ కోసం దట్స్ ఇండియా, తెలుగు సినిమా చదివేవాడిని. ప్రతిసారి భిన్నమైన రివ్యూస్ చదివేవాడిని. ఒకళ్ళు బాగుందంటే మరొకళ్ళు బాగాలేదనే వారు. రెండింటిని చదివిన తర్వాత ఎసెన్స్ గమనించి ఇది హిట్ లేక ఫట్ అనేది నేను ఆలోచించుకునేవాడిని. తర్వాత ట్రేడ్ టాక్ చదివేవాడిని. ఎవరి అభిప్రాయాలు వారివి జడ్జ్ మెంట్ మనదే గదా!! నవతరం మనది గనుక రాయగలుగుతున్నాము. లేకపోతే మన ఘోష వినేదెవరు!!
నాకైతే సినిమా బానే ఉంది అనిపించింది. బాలయ్య మార్కు సీన్లు కొన్ని ఉన్నా.. (బాలయ్య introduction scene, కడియం scene, climax scene..) మరీ అంత overగా లేకుండా బానే ఉండింది. అక్కడక్కడా కామెడి కూడా పండింది .. flashback వచ్చినప్పుడు, అంత పెద్ద familyని చంపటానికి ఎంత time పడుతుందో అనుకున్నా కానీ, తొందరగానే ముగించేశారు.. మొత్తానికి average సినిమా.
సినిమా బాగున్నా బాగోలేకున్నా
రివ్యూ రాసేవాళ్ళు, ఎవరికోసం రివ్యూరాస్తున్నాం, ఈ వేదిక ఎవరికీ అనే విషయాలతోపాటు, చదువరులను కూడా మనసులో పెట్టుకురాయాలి. మేము రాసాం చదివితే చదువ్ లేకపోతే నీ ఖర్మ అనే “వ్యంగ్య” పూరిత సమాధానాలు “నవతరంగం” యొక్క అసలు ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టిస్తాయ్.
అబ్రకదబ్ర అన్నట్టు – “ఇటువంటి ‘భిన్నత్వం’ వల్ల నవతరంగం క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది.” ఇది అక్షరాలా నిజం.
ఇలాంటి వ్యంగ్య సమాధానాలు ఇదే మొదటిసారి కాదు.
కాబట్టి రాసేవాడికి చదివేవాడు లోకువ అన్న రచయిత దృష్టి సరైనది కాదు అని నా అభిప్రాయం.
రెస్పెక్ట్ రీడర్స్ ఆల్వేస్.
@భాస్కర్ రామరాజు: “రాసేవాడికి చదివేవాడు లోకువ” అనేది రచయిత దృష్టో లేక నవతరంగం ఉద్దేశమో అయ్యుంటే వ్యాఖ్యలకు అవకాశమే ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా moderation లో పెట్టుండేవారు. సినిమాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలకీ విభిన్నధృక్కోణాలకీ చోటు ఉండాలన్నదే ఇక్కడ మూల ఉద్దేశం. అందుకే ఈ స్వేఛ్ఛ.
ఇక్కడ రాసేవాళ్ళు ఎవరూ “రచయితలు” కాదు. సినీఔత్సాహికులు మాత్రమే. తమ passion పంచుకోవడానికి తమ ఆసక్తిని పెంచుకోవడానికీ రాస్తుంటారు. సినిమా మీద ప్రేమతో రాస్తుంటారు. తెలుగు సినిమా గౌరవప్రదమైన చిత్రసీమగా వెలుగొందాలనే ఆకాంక్షతో రాస్తుంటారు.
అందుకే ఇక్కడ రచయితలూ పాఠకులూ/ప్రేక్షకులూ అనే తేడా లేదు. సినిమాని ప్రేమించే ఎవరైనా ఎటువంటి భావాన్నైనా, అభిప్రాయాన్నైనా వ్యక్తపరచచ్చు. ఇలా ఉండటమే నవతరంగం “క్రెడిబిలిటీ”. ఆ భిన్నత్వం, స్వేఛ్ఛ లేని రోజున నవతరంగం లేదు.
రాసేవాడు రచయిత. పైన మీరు చెప్పినవన్నీ ఎవడికి లేవూ? అందరికీ ఉన్నాయి. ఒక సలహా పడేసా(సాం), చదివేవాడిని కన్ఫ్యూజు చెయ్యొద్దు అని. నవతరంగం ఆడియన్స్ గా, దాని అబివృద్ధికి చెయ్యి అందించినవాడిగా. వింటే మీ ఇష్టం లేకపోతే మీ ఇష్టం. నాకేముంది నష్టం కేవలం నా డొనేషను తప్ప. ఇకపై ఇవ్వం. అంతే.
నవతరగంగం లాంటి సైట్లు కోకొల్లలు. అక్కడె చదువుతాం. ఇక్కడే దేనికి చదవడం. రాసేవాడికే కాదూ చదివేవాడికీ ప్యాసన్స్ ఉంటాయ్.
ఒక చదువరిగా నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి అని నెచెప్పొకోవాల్సిన అగత్యం రావటం, ఇక్కడ రాసేవాడి “వ్యూ” ని ప్రశ్నించటమే. నేనైతే, నన్ను ప్రశ్నించటం ఒక పెద్ద ఛాలెంజ్ గా స్వీకరించి తిరిగి ఆ తప్పును చెయ్యను.
కాబట్టి, నవతరంగానికీ, ఇక్కడి రచయితలకీ కాదు కాదు ఇక్కడి ప్యాషనబుల్ పీపుల్ కీ నా నమస్కారాలు
గుడ్బాయ్!!!
Ctrl+Alt Delete
@భాస్కర్ రామరాజు: దయచేసి http://passionforcinema.com/ చూడండి.
rediff, yahoo లాంటి అన్ని సైట్లలోనూ ఏదైనా ముఖ్యమైన సినిమా రిలీజైన మధ్యాహ్నమే ఒక పాజిటివ్ రివ్యూ, ఒక నెగిటివ్ రివ్యూ వీలైతే అటూఇటూకాని ఒక రివ్యూలు కనిపిస్తాయి. ఇన్నేళ్ళుగా దాదాపు ప్రతి ముఖ్యమైన సినిమా గురించీ విభిన్నమైన కోణాల్ని వింటూకూడా, నాకు నచ్చినట్లే నేను సినిమాలు ఎంచుకుంటూ వచ్చాను. నాలాంటి ఎందర్నో నేను చూశాను.
ఒక దర్శకుడో, నటుడో, నటో, సంగీతమో, సినెమాటోగ్రాఫరో ఎవరో ఒకరి కోసం సినిమాలు చూసే మనస్థత్వం సినీప్రేమికులది.కేవలం సినిమా చూడ్డంకోసం కూడా సినిమాలు చూసిన పిచ్చి. చెత్త సినిమా అని ఎవరైనా అంటే “అది ఎందుకు చెత్త?” అని తెలుసుకోవడానికి సినిమా చూసే ఉన్మాదం మనది. అలాంటప్పుడు రెండు సాధికారికమైన విభిన్నధృక్కోణాల్ని ముందుంచడం ద్వారా పాఠకుల్ని/ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నది, పాఠకులని అవమానించడమే!
Doubting the intelligence of the readers is much more insulting than all this discussion.
>>ఒకరే చెబితే కాంట్రడిక్షన్ వేరువేరు మనుషులు చెబితే భిన్నాభిప్రాయం. అదే నవతరంగం భిన్నత్వం. It has space for all point of views. ఎంచుకోవలసింది మీరు
ఓకరే చెప్తే అది స్టేట్మెంట్. ఇద్దరు చెప్తే, అవి రెండు స్టేట్మెంట్స్. రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే అది కాంట్రడిక్షన్. మీ బ్లాగులో మీరు చంద్రబాబు దొంగని రాస్తే, నా బ్లాగులో నేను చంద్ర బాబు దేవుడు అని రాస్తే అవి పరస్పరం వ్యతిరేక స్టేట్మెంట్స్ ఐతే, ధృక్పదాలు, కాంటెక్స్ట్స్ వేరు. అనగా నా బ్లాగు, మీబ్లాగు, మన కాంటెక్స్ట్ వేరు. కానీ, ఒకే వేదికపై ఇద్దరు వ్యక్తులు కేవలం “ధృక్పదం” కాంటెక్స్ట్ తో రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం – చర్చనీయాంశం.
దీనికి మీరు ఇచ్చే సమాధానం “భిన్నత్యం”.
>>అలాంటప్పుడు రెండు సాధికారికమైన విభిన్నధృక్కోణాల్ని ముందుంచడం ద్వారా పాఠకుల్ని/ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నది, పాఠకులని అవమానించడమే!
Doubting the intelligence of the readers is much more insulting than all this discussion.
అలాకాదు, ఇలా ఇవ్వద్దు అని ప్రశ్నిస్తే మీరిచ్చే సమాధానం “పాఠకులని అవమానించడమే”.
మీకు మీరే కాంట్రడిక్షన్ గా అనిపిస్తున్నారు.
అదే భిన్నత్వం అంటే.
రిడిఫ్ లేక యాహూ లాంటి వాటిని మీరు కనిపెట్టకముందే జనాలు కనిపెట్టారు. కాబట్టి మీ సూచనలకి నా ధన్యవాదాలు.
ఇక ఈ చర్చ ఇక్కడతో నేను ఆపేస్తున్నా కారణం, నవతరంగం కి మళ్ళీ రావద్దూ అనుకున్న నేను, తమరు ఇచ్చిన భాషణ చూసి, మీకు సమాధానం ఇచ్చి వెళ్దాం అని ఆగాను.
Family entertainer and good one in balakrishna movies.
how ever the movie was flop…due to lack of entertainment…i m disappointed with that..
mithrudu,
happy tht ppl are speaking about films. taking time to write a review about a film, from amny days i have a question, does a film need a review. once the film is made and released, few see it and few dont. few like some films and few dont.
i like few films which didnt work at the box office whcih doesnt mean that the film is a bad one at the same ground a good film is not a film which brings money to the producer. film is nothing but a thought process of a person he may be right in his own way or he couldnt think more than taht but where in no one has right to speak why such films are made.
the hard work, the dedication that the director or a producer brigs forth to release a film is the most difficult thing. many have a idea that making a film is easy or why directors make such film and i heard from many poeple taht telugu films are not good etc etc. when you dont like telugu films dont see it and try to spend your time at soem other place and to the people who have commented on film, sorry to say that make a film, relaese it, see your own film in teh theater and then start commenting on other films.
i dont know i can write this in this particular page or not but this is my openion.
i request the ediot to avoid the section of review on films.
sorrry
i have few spelling mistakes that i realised after posting my previous comment , the last line is
I REQUEST THE EDITOR TO REMOVE THE REVIEW SECTION FROM THE SITE
@చైతన్య: మీకు సమాధానం జోస్యుల సూర్యప్రకాష్ ఒక సమీక్షలో ఇచ్చేసారు. కానీ మరో సారి చెబుతాను. ఆమ్లెట్ తిని రుచి చెప్పేవాడికి గుడ్డు పెట్టడం తెలియనఖ్ఖరలేదు.అలాగే టికెట్టుకొని సినిమా బాగుందో లేదో చెప్పే సమీక్షకుడికి సినిమా తియ్యడం వచ్చుండఖ్ఖరలేదు. BTW సినిమా గురించి రాయడం కూడా ఒక సాధనే.
మహెష్ గారు ఆమ్లెట్ తిని రుచి చెప్పేవాడికి గుడ్డు పెట్టడం తెలియనఖ్ఖరలేదు.అలాగే టికెట్టుకొని సినిమా బాగుందో లేదో చెప్పే సమీక్షకుడికి సినిమా తియ్యడం వచ్చుండఖ్ఖరలేదు,నేను ఇది ఒప్పుకుంటాను, కాని వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఆమ్లెట్ తిన్నవాడు దాని రుచి చెబితే బాగుంటది, కాని ఇక్కడ ఆమ్లెట్ వాసన చూసిన వాడు కూడా దాని రుచి గురించి చెప్పుతున్నాడు (ఇక్కడ వాసన చూసినవాడు అంటే సినిమా చూడకుండా సమీక్ష చదినివ వాడు అని అర్థం చేసుకోగలరు).
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవ్వరని కించ పరచాలని రాయలేదు, లేట్ గా రేఅప్లీ ఇచ్చిన దానికి సారీ.
hi mahes kumar, thanks for the reply
i am shocked that you compared cinema with am omlet.
and but atleast you should know what an omlet is and why you are eating it. as you said there is egg in an omlet and that what i meant. how could you ocme to know that there is egg in omlet and in the same way cinema is not a word to be given a meaning in english language. making a film is discovering live and so commenting on once life is not correct according to me. i am not giving any statement but just my openions. action,cut, story hero heroine is not defined as film, hard work behind it 16 hr of long day and night schedules behind it, the pen that moves in the writers hand which is not as easy as writing about what the writer has written and more over acting is not an easy butter on your bread . i just told the blog readers to respect films and give a possitive approach instead of judjing them. if you keep on judging and arguing you loose the basic line of seeing a film as a film and enjoying it as a drama.
@చైతన్య: సినిమాల గురించీ సినిమాలు తీసేవాళ్ళ గురించీ ఇక్కడ చులకన భావం ఎవరికీ లేదు. (ఎంత చెత్తదయినా)సినిమా తియ్యడమే గొప్ప అని నమ్ముతాను నేను. కాబట్టి నా ఉద్దేశంలో ఎటువంటి “కుతి” లేదు.
కానీ,సినిమా ప్రేమికుడిగా (ఇక్కడున్నవాళ్ళందరూ వందశాతం సినీ ప్రేమికులే) గుడ్డిప్రేమను నటించమంటే కుదరదు. సిన్సియర్గా ప్రేమించేవాడు ప్రేయసి అందంతోపాటూ తన లోటుపాట్లని కూడా ఎత్తిచూపిస్తాడు. అదే ఇక్కడ జరుగుతోందిక్కడ. ఇక సమీక్షకుల పనే ఎలా అనిపించింది అలా చెప్పడం. అందుకే నచ్చినోళ్ళూ నచ్చనోళ్ళూ తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇందులో వాళ్ళు సినిమా చూస్తూ పడిన కష్టమో ఆనందమో కనిపిస్తాయితప్ప, తీసినోడి కష్టం కాదు. తీసినోళ్ళు తమ కష్టం చెప్పుకోవాలంటేకూడా నవతరంగంలో స్థానం ఉంది. రమ్మనండి. చెప్పమనండి. విని చదివి మెచ్చుకుంటాం. కానీ చెత్త సినిమాని మెచ్చుకోమంటే మాత్రం కుదరదు. సినిమా సినిమానే కష్టం కష్టమే!
చిన్న సందేహం.
గుడ్డు దర్శకుడు పెడితే, ఒకరు ఆమ్లెట్ రుచిచూశారు. మధ్యలో, గుడ్డును ఆమ్లెట్ గా మార్చిందెవరు?
ఒకరు సినిమా బావుందన్నారు. ఇంకొకరు బాలేదన్నారు. ఊ..భిన్నాభిప్రాయం. గౌరవిద్దాం. కొంతమందికి ఇలా చెప్పటం నచ్చింది. ఇంకొందరికి నచ్చలేదు. మళ్ళీ భినాభిప్రాయం. ఈ సారీ గౌరవించొచ్చు. ఎప్పటి నుండో అంటున్నారు కదా, ఇది వేదిక మాత్రమేనని. అంటే బాక్సింగ్ బరి కాదు కదా.., ఆదిపత్యం ప్రదర్శించటానికి, ముక్కులు పగిలిందాకా దెబ్బలాడటానికి.సో..అభిప్రాయాలు చెప్దాం. మర్యాదగా దిగి పోదాం.
@హనుమంతరావు: ఈ “ఆధిపత్యం” మధ్యలో ఎక్కడొచ్చింది?
@chaitanya
it seems dat u r a highly frustrated balakrishna fan…dont argue here..the ppl here are well knowledged abt cinema and dont insult them wid ur words…if u hav any points..just comment on the topic written and i respect who give respect to my navatarangam members
కిక్ రివ్యూ పంపుదామనుకున్నా..కానీ..మళ్ళీ ఎవరన్నా ఇప్పటికే పంపి ఉంటే దానిమీద …ఆగుతున్నా..భలే అనిశ్చితి
పంపండి సార్.మీరు మరీనూ….ఇలాంటి కాంట్రవర్శీలు సహజమే….మనపని మనం చేసుకుంటూ వెల్దాం. అయినప్పటికీ పాఠకులు అసౌకర్యం అన్నారు కాబట్టి ఒకే సినిమా మీద రెండు రివ్యూలు ఒక దాని తర్వాత ఒకటికాకుండా (రెండు విభిన్న అభిప్రాయాలు అయినప్పుడు మాత్రమే) కాస్తా గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేద్దామనుకుంటున్నా…మీరు ముందు కిక్ రివ్యూ పంపండి.
సూర్యప్రకాశ్ గారికి
మీరు రాసే ప్రతీ పోష్టు చదువుతా నేను. ఇక్కడ మీరు రాసింది తప్పు ఒప్పు అనేది అసలు ప్రశ్నే కాదు. ఎందుకిలా అని అడిగిన పాపానికి భిన్నత్వం అని హహహిహి అని ఒక పాఠకుణ్ణి ఉడికించటం అనేది ముఖ్య ప్రశ్న.
>>ఆగుతున్నా..భలే అనిశ్చితి
క్షమించండి.
1992లో రౌడీ ఇన్‌స్పెక్టర్ తర్వాత మళ్లీ ధియేటర్లో చూసిన మొదటి బాలయ్య సినిమా ఇది (అంటే మిగతావసలు చూళ్లేదని కాదు. డీవీడీల్లో చూశా
) భయం భయంగా వెళ్లా కానీ భద్రంగానే తిరిగొచ్చా. చెత్త సినిమా ఏమీ కాదు. బాలకృష్ణ సినిమాల్లో ఇదో వెరైటీ. తొడ చరుపుళ్లు, అరుపులు, సూమోలు, సోది ఫ్లాష్‌బ్యాకులు, వగైరా వగైరా ఏమీ లేవు. మలుపులన్నీ ఊహించగలిగేవే కానీ సినిమా తలనొప్పి తెచ్చుకోకుండా చూసెయ్యొచ్చు. ముఖ్యంగా బాలయ్య తల ఊపుడు ఓవర్ యాక్షన్ లేదు
సాధారణంగా అతని సినిమాల్లో మచ్చుకైనా కనపడని భావుకత్వం ఇందులో అక్కడక్కడా తొంగిచూడటం పెద్ద విశేషం. బాలయ్యని ఒప్పించి మూసకి దూరంగా తీసుకుపోగలగటం దర్శకుడి గొప్పే – ఆ విగ్గుల విషయంలో మాత్రం ఆయన్నెవరూ మార్చలేరు. ఇక కధలో లొసుగులంటారా – అవి లేని తెలుగు సినిమాలెన్ని – భీకరంగా ఆడిన పోకిరితో సహా? మొత్తానికి జోస్యుల గారు చెప్పిన స్థాయిలో తీసిపారేయాల్సిన సినిమా కాదు.
Please look at the double standards of this reviewer. He liked Hollywood “comedy” There is something about Mary, which is one of the most vulgar movies I had ever seen. And he thinks the lesbian humor and the viagra scene in this movie (which come to less than 10 minutes in the total movie) show the cheap taste of the director. Please buddy, have one preference. If you like gross comedies, enjoy them in any langauge. If not, criticize them. Dont think it is hip to enjoy hollywood vulgarity and detest the Telugu one. But, I agree with this review that Mithrudu is a terrible movie.
అన్నయ్య కృష్ణ భగవాన్ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడ ఉండదు అని చెప్పిన ఎదవ ఎవడు భే
మూవీ చూసి రివ్యూ రాయాలి ర నకోదకల్లర
కృష్ణ భగవాన్ ఫ్లాష్ బ్యాక్ లో లేకపోతే నేను గుండు కొట్టించుకుంతర మీరు రెడీ న?