Menu

మిత్రులతో ’మిత్రుడు’

mitruduమే 1 – కార్మికుల దినోత్సవం సందర్భంగా నాతో పాటు మా స్నేహితులందరికి ఆఫీసులకి శెలవు కారణంగా, అంతా కలిసి ‘ మిత్రుడు ‘ సినిమాకి వెళ్ళాము.ఉదయం ఆట 10:30 కి అని ప్రకటించటంతో ముందుగానే అక్కడికి చేరిన మాకు షో 11 గంటలకి అనిచెప్పటంతో కొంత నిరాశ ఎదురయినా ఆ కాస్త సమయంలో మరికొందరు స్నేహితులు హాలుకి రావటంతో కొంత తృప్తిచెందాం.ఇక సినిమాలోకి వస్తే ‘ మిత్రుడు ‘ అందరికి ఎక్కడ శత్రువు అవుతాడో అన్నభయంతో ఉన్న నాకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఒక్క మాటలో : కధ కొత్తగా లేకపోయినా కధనంలో మలుపులు, కధానాయక వలపులు, హాస్యంలో చెణుకులు, మలేషియా మెరుపులూ, బాలయ్య నెమ్మదయిన అరుపులూ మొత్తానికి మనకి ‘ మిత్రుడు ‘ అయ్యాయి.

ఈమద్య కొత్తగా పరిచయమవుతున్న అందరి దర్శకులమాదిరిగా ‘ మహాదేవ్ ‘ కూడా కధకన్నా కధనానికే పెద్దపీట వేశారనిపించింది.ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడిగా మొదటి అవకాశమే బాలయ్యవంటి పెద్దహేరోతో వచ్చినా కూడా కధ కధనాలపైననే అసక్తి కనబరిచారనిపించింది. ఎందుకంటే బాలయ్య బ్రాండు సినిమాలలో కనిపించే పదునైనా, పొడుగైన సంభాషణలూ ఈ సినిమాలో కనపడలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలం తర్వాత వర్షాకాలం కోసం ఎదురుచుసే ఆశాజీవుల్లా, బాలయ్య అసాధ్యమైన (తొడ కొడితే ట్రైను వెన్నక్కి వెళ్ళిపోయే) సన్నివేశాలకై ఎదురుచూసే అసామన్య ప్రేక్షకులకు కొంత గొడ్డలిపెట్టు ఈ ‘ మిత్రుడు ‘. ఎందుకంటే ఇందులో అటువంటి అసందర్బ, అసాద్యమైన సన్నివేసాలు ఎమీ లేవు కాబట్టి.

ఈ సినిమా బాలయ్య కాకుండా ఏ కధానాయకుడు చేసినా సామాన్య ప్రెక్షకుడు ఒకేలా రంజింపబడతాడు. బాలయ్య, ఆదిత్యా అనే పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు గాని, ఆ పాత్ర బాలయ్యకి పిసరంతైనా న్యాయం చెయలేదు అనిచెప్పొచ్చు.

కధ ప్రధమాంకం అంతా మలేషియాలో సాగుతుంది. కేవలం మలేషియా అందాలని చుపించాలనే అలోచనలేకుండా కధానుగుణంగా మాత్రమే ముఖ్య సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారనిపించింది.బాలయ్య పదునయిన సంభాషణలకే కాదు, కేవలం హావాభావలతో కూడి తక్కువ మాటలు గలిగిన అభినయం కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ప్రియమణి తన ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకుంటే తన జాతకరిత్యా అతనికి మృత్యుగండమున్నదని తెలియడంతో మృత్యుగండమున్న బాలయ్య(ఆదిత్య)ని పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నించి విజయంసాదిస్తుంది. కాని తను నిజానికి ప్రేమించిన వాడు మంచివాడు కాదని, తన తండ్రి నిశ్చయించిన వరుడు బాలయ్యే అని తెలియడంతో ప్రియమణి ఇంకా తండ్రి రంగ నాధ్ అనందిస్తారు. ఇకపోతే రంగనాధ్ కి సంఘంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టని చూసి ప్రియమణిని తన కోడలు చేసుకోవాలని అశించే విలన్ పాత్రలో ప్రదీప్ రావత్ బాగానే నటించారు. అదేవిందంగా కధలో మలుపులలో భాగంగా నమ్మకంగా రంగనాధ్ పక్కనే ఉండే సెక్రెటరీ పాత్రలో చంద్ర మోహన్ అలాగే చంద్ర మోహన్ కొడుకుగా ప్రియమణిని మోసగించి ప్రేమించే పాత్రలో దీపక్ నటన కూడా బాగుంది.

ద్వితియార్దంలో వచ్హే చాలా పాత్రలు కొద్ది క్షణాలే కనపడినా కూడా “ఆకాశం నుంచి …” అనే పాటలో బాగానే అలరించారు.ఆదిత్య పాత్రకి తాతయ్య గా బాలయ్య(పాత నటుడు), మిగిలిన బందువుల పాత్రలలో సన,ఆహుతి ప్రసాద్,సురేఖ,చలపతి రావు, శ్రీనివాశ్ రెడ్డి తదితరులు కేవలం గతం సన్నివేశాలలోనే కనపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణ భగవాన్ మరియూ బ్రహ్మానంధం కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు అన్నీ బాగున్నాయి.మణి శర్మ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి దోహదం చేస్తుంది.ప్రియమణికి స్నేహితురాలిగా తమిళ అమ్మాయిగా ముద్దు ముద్దు గా తమిళం తెలుగు కలిపి మాట్లాడుతూ తక్కాలీ(తమిళంలో టమోటా అంట!) పాత్రలో శ్రీలత బాగ నవ్వించింది.

సినిమా ఇంకా బాగుండాలంటే : బాలయ్య కేశాలంకరణ, దుస్తులు ఇంకా మెరుగుపరిచుంటే బాగుండేది.

కొస మెరుపు: సినిమా కి ‘ మిత్రుడు ‘ అన్న పేరు ఏవిధంగా పెట్టారో మాకెవరికీ అర్ధంకాలేదు !బాలయ్య దరించే కడియం అతన్ని కాపాడటం మాత్రం కొంచెం కామెడీనే.

సూచన : ఎన్నికలు వేడి తగింది కాబట్టి ఎండల వేడి తట్టుకోవటానికి ఇంకా వేసవి సెలవల్ని అస్వాదించటానికైనా ఒక్కసారి ‘ మిత్రుడు ‘ సినిమా చూడొచ్చు .

–కృష్ణబాబు

5 Comments
  1. krishna May 5, 2009 /
  2. chaitanya May 7, 2009 /
  3. krishna May 13, 2009 /