కిక్ (రివ్యూ)

kick

kickటైటిల్ క్యాచీగా బాగుంది..రవితేజ కామిడి చేసాడంటున్నారు..నవ్వుకోవచ్చు..అందులోనూ అతనొక్కడే సురేంద్రరెడ్డి..సినిమా ధైర్యం చేయచ్చు..అనుకుంటూ కిక్ కోసం ధియోటర్స్ లోకి దూరాను. అయితే నేనూహించినంత కాదు కదా..అందులో సగం కూడా కిక్ నాకు దొరకలేదు.అందలోనూ ఇంటర్వెల్ అయిన తర్వాత మరీ ఘోరం. మరి మేము ధైర్యం చేయచ్చా అంటారా..ఫస్టాఫ్ లో రవితేజ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది..బ్రహ్మానందం కాంబినేషన్ లో మంచి నవ్వులు ఉన్నాయి. ఇలియానా కొద్దిగా ఒళ్ళు చేసి బావుంది..లక్కిగా సురేంద్రరెడ్డి ఫ్రేమ్స్ ఆపి వెనక్కి ముందుకు వెళ్లే కార్యక్రమం పెట్టుకోలేదు. అందులోనూ కథ మనకు అర్దం కాదేమోనని ఎప్పుడో చూసిన జెంటిల్ మెన్ ధ్రెడ్ తీసుకున్నారు. కాబట్టి..సో…

కధా ప్రారంభంలో మలేషియాలో నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(తమిళ హీరో శ్యామ్ )కి వెరైటీగా ట్రైన్ లో పెళ్ళి చూపులు. ఆమె మాటల్లో తన మాజీ ప్రేమికుడు కళ్యాణ్ (రవితేజ)ప్రస్తావన తెచ్చి అతనికి బుద్ది చెప్పాలనుకుంటున్నట్లు తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో రవితేజ చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవిస్తూండే క్యారెక్టర్. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు…కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు.దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమని సలహా ఇస్తుంది. దానికి మనవాడు కూడా కాస్త స్పీడుగా రియాక్టయి.. నువ్వు కూడా ఏ సానియా మీర్జానో అర్జెంటుగా అవమని సలహా ఇస్తాడు.దానికి ఒప్పుకోలేదని ఆమె బై చెబుతుంది.

ఇదంతా ఓపిగ్గా విన్న పెళ్ళికొడుకు శ్యామ్ ప్లాష్ బ్యాక్ కి ఫ్లాష్ బ్యాక్ సమాధానమన్నట్లుగా తన గతం..తన డ్యూటిలో తనని ఇబ్బంది పెడుతున్న ఓ ధూమ్ తరహా దొంగ గురించి చెప్పుకొస్తాడు. అయితే ఆ దొంగ ఎలా ఉంటాడో అతనికి తెలియదు. ఎందుకంటే అతను మాస్క్ పెట్టుకుంటాడు. అయితే శ్యామ్ ప్లాష్ బ్యాక్ చెప్తున్నడు మనకి ఆ దొంగ రవితేజ అని మనకు అర్దమవుతుంది.(ఎందుకంటే మనకు క్లియర్ గా కనిపిస్తాడు కాబట్టి). అతని పట్టుకోవటమే శ్యామ్ తన జీవితాశయంగా చెపుతాడు. ఇక ఇద్దరికి ఎదుటి వారు చెప్పేది తనకి తెలిసిన రవితేజ గురించేనన్న విషయం తెలియదు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ లోనే రవితేజ వారికెదురుకుండా ప్రత్యక్ష్యమవుతాడు. ఇంతకీ రవితేజను..ఆ పోలీస్ ఆఫీసర్ గుర్తించి పట్టుకుంటాడా..ఇలియానా మళ్ళీ ఎలా దగ్గరైంది…అసలు రవితేజ ఎందుకు దొంగగా మారాడు..అతని ప్లాష్ బ్యాక్ ఏమిటీ..అదెవరకు చెపుతాడు అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

ఇక మొదటే చెప్పుకున్నట్లు అర్జున్ జెంటిల్ మెన్ ని పూర్తి స్ధాయిలో గుర్తు చేసే ఈ సినిమాలో రవితేజ పాత్రను మాత్రం రెగ్యులర్ కి భిన్నంగా కొత్తగా చిత్రీకరించినందుకు రచయితను మెచ్చుకోవాలి. అయితే తనకు కిక్ వస్తుందంటే ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టే యువకుడు నిజమైన కిక్ మానవత్వంలోనే దొరుకుతుంది అనే పాయింట్ ని మరింత బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అనిపిస్తుంది. అలాగే కిక్ కావాలంటూ ముందుకెళ్లే హీరోకి తనకు తెలియకుండానే తన ద్వారానే జరిగిన ఓ సాయిం వల్ల ఎదుటి వాళ్ళ జీవితంలో ఆనందం కనపడితే దాంట్లోనే అతనికి నిజమైన కిక్ దొరికితే దాన్ని అనుసరించి కొనసాగిస్తే ఇంకా బాగుండేది. అలాచేస్తే హీరోలో మార్పు కోసం క్యాన్సర్ పాప(అల్టిమేట్ గిఫ్ట్ సినిమాలో) ఎపిసోడ్ ని బలవంతంగా చొప్పించినట్లు అన్పించదు.

ఇక సినిమాలో హీరో కంటిన్యూగా ఎక్కడా ఇరుకున పడకుండా సమస్యలు లేకుండా దూసుకుపోవటంతో టెన్షన్ పుట్టక స్క్రీన్ ప్లే లోపాలై నిలుస్తాయి. అలాగే హీరోయిన్ తో విడిపోయిన తర్వాత రవితేజ ఆమె లేకపోవటాన్ని ఎక్కడ ఫీలవడు. దానికి కారణం స్క్రీన్ ప్లే రచయితలు అతని మనస్సులో ఏముందో ప్రేక్షకులకు తెలియనివ్వకపోవటమే.అతని వైపు నుంచి కథ చెపితే తన మనస్సులో ఏముందో తెలిస్తే..అతనితో ప్రేక్షకుడు లీనమై గేమ్ మరింత రక్తి కట్టేది. ఎంతసేపు పోలీస్ ఆఫీసర్,ఇలియానా,మిగతా పాత్రల మనస్సులో ఏముందో తెలిస్తూంటుంది కానీ హీరో ఏం చేయబోతున్నాడో అర్ధం కాదు. అంటే అతని వైపు నుంచి కథ ప్రారంభించకపోవటంలోనే సమస్య వచ్చిదని స్పష్టంగా అర్ధమవుతుంది. దాంతో సెకెండాఫ్ లో వచ్చే మతిమరుపు ఎపిసోడ్, ఆ తర్వాత చిన్న పిల్లలని ఆరోగ్య వంతులు చెయ్యటం కోసం దొంగతనాలు చెయ్యటం,పోలీసు ఇన్విస్టిగేషన్ అనేది జరగటం క్యారెక్టర్ డ్రైవన్ డ్రామాలో లోపంగా అనిపిస్తుంది.ఇక హల్వా రాజ్ గా బ్రహ్మానందం,మొమరీ లాస్ పేషెంట్ గా అలీ,ఎస్సైగా జయప్రకాష్ రెడ్డి కథకు పెద్ద ఉపయోగపడకపోయినా నవ్వులు బాగానే పూయించారు. మై హూనా సినిమాలోంచి తీసుకున్న బ్రహ్మానందం పాత్ర వెనుక వచ్చే పియోనో వాయించే వాళ్ళు బావున్నారు.అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా త్రివిక్రమ్ ని గుర్తు చేస్తాయి. అలాగే పాటలు మరింత బాగుంటే వర్కవుట్ అయ్యేది.కెమెరా రసూల్..తన పనితనం మరోసారి చూపాడు. ఎడిటింగ్,సురేంద్రరెడ్డి దర్శకత్వం ఎక్సపెక్ట్ చేసిన రీతిలో లేవు గానీ నిరాశపరచవు.

ఏదైమైనా మరీ బోర్ కొట్టినప్పుడు కాస్సేపు నవ్వుకోవటానికి (అదీ ఎక్కువగా కాదు)ధియోటర్ వైపు అడుగులు వేయవచ్చు. అంతేగానీ మరీ ఎక్కువ ఎక్సెపెక్ట్ చేసి,లాజిక్ లు వెతుక్కుంటూ కూర్చుంటే కిక్ పోయి కక్కు మిగులుతుంది. అయితే గతంలో రవితేజ చాలా సినిమాలు(ఫ్లాఫ్ వి కాదు) ఇచ్చినంత కిక్ ఈ సినిమా ఇవ్వదు. అలాగే సురేంద్రరెడ్డి గత చిత్రం అతిధి కన్నా బాగుంది. అంతేగాక రవితేజ,ఇలియానా గతం కాంబినేషన్ ఖతర్నాఖ్ కన్నా చాలా బాగుంది. సెకెండాఫ్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పస్టాఫ్ చూసి ఆ కిక్ తో బయిటకు రావటం బెటర్ అనిపిస్తుంది(డబ్బులిచ్చాక అలా చేయలేం అనుకోండి). లేకపోతే మొత్తం కిక్ దిగిపోతుంది.

చిత్రం:కిక్
సంస్థ:ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌
నటీనటులు:రవితేజ, ఇలియానా, శ్యామ్‌, ఆషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, అలీ, సాయాజీ షిండే, చలపతిరావు, నళిని, ప్రభ తదితరులు
కెమెరా:రసూల్
కథ: వక్కంతం వంశి
సంగీతం:ఎస్.ఎస్.తమన్
ఎడిటింగ్: గౌతంరాజు
మాటలు: అబ్బూరి రవి
సమర్పణ: కె.అచ్చిరెడ్డి
నిర్మాత:వెంకట్‌
దర్శకత్వం:సురేందర్‌రెడ్డి
రిలీజ్ డేట్ :8 మే 2009

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

13 Comments to “కిక్ (రివ్యూ)”

  • జోస్యుల వారూ….! సినిమా “కిక్” ఇస్తు౦దో లేదో తెలీదు కాని, మీ రివ్యూ మాత్ర౦ మా౦చి “కిక్” ఇచ్చి౦ది.

  • hai bagundi

  • ఇది కూడా మలేసియాలో తీశారా… ఈ మధ్య ఇదొకటైపోయింది.

  • ఈ మలేసియా పిచ్చేంటో. అప్పట్లో మారిషస్, ఆ తర్వాత న్యూజిలాండ్, తర్వాత బ్యాంకాక్.. ఇప్పుడు మలేసియా.

  • నాకు మాత్రం సినిమా చాలా చండాలంగా వుంది అనిపించింది.

  • నేను మొదట kick సినిమా పేరు విన్నప్పుడు, ఇది కూడ ఏదో acronym అయుంటుంది అనుకున్నాను (కొంచెం ఇష్టం చాలా కష్టం). మీ రెవ్యూ చదివేక, సుమారు అలాగే అనిపిస్తొంది.

  • ఇక హల్వా రాజ్ గా బ్రహ్మానందం,మొమరీ లాస్ పేషెంట్ గా అలీ,ఎస్సైగా జయప్రకాష్ రెడ్డి కథకు పెద్ద ఉపయోగపడకపోయినా నవ్వులు బాగానే పూయించారు. మై హూనా సినిమాలోంచి తీసుకున్న బ్రహ్మానందం పాత్ర వెనుక వచ్చే పియోనో వాయించే వాళ్ళు బావున్నారు.అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా త్రివిక్రమ్ ని గుర్తు చేస్తాయి. అలాగే పాటలు మరింత బాగుంటే వర్కవుట్ అయ్యేది.కెమెరా రసూల్..తన పనితనం మరోసారి చూపాడు. ఎడిటింగ్,సురేంద్రరెడ్డి దర్శకత్వం ఎక్సపెక్ట్ చేసిన రీతిలో లేవు గానీ నిరాశపరచవు.

    ఏదైమైనా మరీ బోర్ కొట్టినప్పుడు కాస్సేపు నవ్వుకోవటానికి (అదీ ఎక్కువగా కాదు)ధియోటర్ వైపు అడుగులు వేయవచ్చు. అంతేగానీ మరీ ఎక్కువ ఎక్సెపెక్ట్ చేసి,లాజిక్ లు వెతుక్కుంటూ కూర్చుంటే కిక్ పోయి కక్కు మిగులుతుంది. అయితే గతంలో రవితేజ చాలా సినిమాలు(ఫ్లాఫ్ వి కాదు) ఇచ్చినంత కిక్ ఈ సినిమా ఇవ్వదు. అలాగే సురేంద్రరెడ్డి గత చిత్రం అతిధి కన్నా బాగుంది. అంతేగాక రవితేజ,ఇలియానా గతం కాంబినేషన్ ఖతర్నాఖ్ కన్నా చాలా బాగుంది. సెకెండాఫ్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పస్టాఫ్ చూసి ఆ కిక్ తో బయిటకు రావటం బెటర్ అనిపిస్తుంది(డబ్బులిచ్చాక అలా చేయలేం అనుకోండి). లేకపోతే మొత్తం కిక్ దిగిపోతుంది.

    మీరు వ్రాసని రివ్యూ చూస్తుంటే, ఎంతో చెత్త సినిమాని పర్వాలేదు అని వ్రాయడానికి ఎంతో కష్టపడినట్టువుంది. ఏ వర్గపువారైనా కోప్పడతారని భయమా? నవతరంగం స్థాపించినప్పుడు అనుకున్న ఒక వాక్యం మీకోసం, they can kill us but they can not kill our written word. అని గుర్తుతెచ్చుకొని, చెత్త సినిమాని చెత్తగా వుందనడంలో వెనుకాడవద్దు.
    అలానే సినిమాలో పలానా ఇద్దరి మధ్యన పలానా సీను బాగుంది, పలానా పాత చిత్రంతో పోల్చుకుంటే ఇది నయ్యమే అనేవికూడా ప్రక్కసైటుల్లో వినిపిస్తే పర్వాలేదు గాని, మన దగ్గర నుండి చదువరులు ఆశించరేమేనని నా భయం. నా అభిప్రాయం ఏంటంటే, విమర్శకులకు సానుభూతి విధినిర్వహణలో అడ్డంకి, దానిని కాస్త ప్రక్కనపెట్టాలి.

    అయినా, మరీ ఖత్తర్నాక్ తో పోలికేంటండీ బాబు ఏ సినిమాకైనా సరే. అక్కడే ఇది కూడా చెత్త సినిమా అని పరోక్షంగా చెబుతున్నట్టుంది.

    - రా.రా.

  • రాకేశ్వర రావు గారు..
    క్షమించండి.

  • సూర్య ప్రకాష్ గారు అసలు మీరు ఎందుకు సారి చెప్పారో నాకు అర్థం కావడం లేదు. రాకేశ్ గారు చెప్పినట్టే మీ మనసులో అనుకున్నది మీరు రాసారు దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదేమో.

    రాకేశ్ గారికి మీ రివ్యూ ఆ విదంగా అనిపిస్తే అది ఆయన ప్రాబ్లం మీది కాదు, దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు

    @రాకేశ్ గారు, ఒక సినిమా రివ్యూ రాస్తే అందులో బాగున్నవి బాగాలేనివి రెండు రాయాలి కదా లేక పోతే రివ్యూ ఎలా పూర్తి అవుతుంది. సూర్యప్రకాష్ గారి రివ్యూ కూడా అలానే వుంది. ఈ సినిమా లో తనకి నచ్చినవి, నచ్చనివి రెండు రాసారు అందులో ప్రాబ్లం ఏముంది. చివరగా సినిమా చూడచ్చ చూడకూడద అని చెప్పారు.

    చూడండి చూడద్దు అని అయ్యన జనరల్ గ చెప్పలేరు కదా, అందుకే మీకు కొంచం కామెడీ కావాలంటే వెళ్ళండి, లాజిక్ కావాలంటే వెళ్ళదు అని రాసారు, ఇందులో తప్పుగా రాయటానికి ఏముంది అసలు.

  • naku matram cinema pichi pichi ga nachesindi….asalu ilanti cinema only ravi teja ke set avutunnattanipinchindi….songs konchem boring gaa unna…

    halwaraj character, ali character, jp char baga pani chesayi…

    asalu cinema motham kickee kickuu….

    cinema chudandi chusi kick pondandi….

    life long kick praptirastu….

  • బాగా రాసారు. హల్వా రాజ్ పాత్రకి స్పూర్తి సరోజలో కమెడియంకి పాత్ర అని నా అభిప్రాయం.

  • పైన కామెంటులో “కమెడియన్”
    గా చదువుకోగలరు

  • ee chitram loni chala sanniveshalu entaku mundu chusinave! kottadanam korukoni velle variki ee cinema choosi nirasha chendaka tappadu. hero character ni elevate cheyyadaniki pata chintakaya scenlanni antincharu chivarlo…brahmanandam, ali characterlu akkadakka navvu puttinchay…mottam meeda edi “enko” cinemaa ante!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories