Menu

అసామాన్య నటుడు-కమల్‌ హాసన్-2

kamal2కమల్‌హాసన్‌ ఒక నిరంతర నటతపస్వి. ఆయనలోని నటనార్తి తీర్చుకోవడానికి బహుపాత్రలను పోషించాడు. ఒకే సినిమాలో డబుల్‌రోల్స్‌ని, ట్రిపుల్‌రోల్స్‌ని పోషించినా, ప్రతీ పాత్రలో కంప్లీట్‌ డిఫరెన్స్‌ని చూపించి నటనకే, నటించడం నేర్పిన హీరో.

కమల్‌ – సినిమాలలో మొదట కొరియోగ్రాఫర్‌గానే రంగప్రవేశం చేశాడు. మన తెలుగు సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావుకు సినిమాలలో స్టెప్పులేయించాడు కూడా. ఆయనలోని డాన్సింగ్‌ స్కిల్స్‌ని ఆధునిక తరహాలో చూపించే అవకాశం. డ్యాన్స్‌మాస్టర్‌ సినిమాలో వచ్చింది. ఇందులో ఆయన చేసిన మోడ్రన్‌ డ్యాన్సులకు మంచి పేరొచ్చింది.

ఆయన నటించిన పుష్పక విమానం ఆధునిక కాలంలో భారతదేశంలో వచ్చిన తొలి మూకీ చిత్రంగా సంచలనం సృష్టించింది. మాటలు, డైలాగులు ఏవీ లేకుండా కేవలం సన్నివేశాలు, అభినయం ద్వారానే అందమైన కథను ప్రేక్షకులకు ఓ ప్రయోగంగా, ఓ కొత్త అనుభూతిగా అందించిన ప్రయోగశాలి-కమల్‌.

కమల్‌హాసన్‌ హీరో ఇమేజ్‌ను ఆకాశానికి తీసుకెళ్లిన సినిమా ‘నాయకుడు’! ముంబాయి మాఫియా నేపథ్యంగా నిజజీవిత గాథ స్ఫూర్తితో వచ్చిన ఈ సినిమాలో కమల్‌ నటన అద్భుతం.!!

బయోగ్రాఫికల్‌ స్కెచ్‌ తరహాలో నడిచిన ఈ సినిమాలో యువకుడి నుంచి వృద్ధుడి వరకూ అన్ని వయసులలో ఆయన ప్రదర్శించిన నటన కమల్‌ను అంతర్జాతీయ నటుడ్ని చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ వంద చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాను టైమ్‌ మ్యాగ్‌జైన్ ఎంపిక చేసింది. దీనికి కమల్‌ నటనే కారణమని వేరే చెప్పనక్కరలేదు.

కళాకారుడన్నవాడు అన్ని రకాల పాత్రలూ పోషించాలి. ఆ పాత్రలను ఆయా పాత్రల బాడీ లాంగ్వేజ్‌ను ఆకళింపు చేసుకుని అందులో మమేకం కావాలి…
ఈ సత్యాన్ని కమల్‌ – భామనే -సత్యభామనే సినిమాలో మధ్యతరహా బ్రాహ్మణ మహిళగా నటించి నిరూపించాడు. ఈ చిత్రం కమల్‌ పాత్ర పోషణలో తీసుకున్న శ్రద్ద, అంకితభావానికి నిలువుటద్దంగా నిలిచింది.

కమల్‌ బేసికల్‌గా ఎంటర్‌టైనర్‌! అయినా సోషల్‌ మెసేజ్‌ ఉండే ఎన్నో సినిమాల్లో పూర్తి రీసెర్చితో కూడిన నటనతో ఆ సినిమాలకు జీవాన్ని తీసుకువచ్చాడు. మహానది, సత్యమేశివం సినిమాలే దీనికి ఉదాహరణ! ఇక ఆకలి రాజ్యం సినిమా నిరుద్యోగ భారతానికి నిలువెత్తు నిదర్శనమే..

కమల్‌ నటనా ప్రతిభను ఎవరెస్ట్‌ శిఖరానికి చేర్చిన సినిమాల్లో క్షత్రియపుత్రుడు, భారతీయుడు చెప్పుకోదగిన సినిమాలు! లండన్‌లో చదువుకుని వచ్చి అనివార్య కారణాల వల్ల గ్రామానికి పెద్దగా ఉండాల్సిన పరిస్థితి. ఇందులో విదేశీ ప్రభావం, వారసత్వాల మధ్య నలిగిన పాత్రలో భిన్నత్వాన్ని చూపించిన తీరు అద్భుతం. ఇక ప్రస్తుత వ్యవస్థలోని కలుపు మొక్కల్ని ఏరిపారేయాలనుకునే స్వాతంత్ర్య సమరయోధుడి గెటప్‌లో, మేకప్‌లో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించిన భారతీయుడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.

kamal-hassan_2కల్యాణరాముడు సినిమాతో ప్రారంభమైన ఈ బహుపాత్రా పిపాస ఇంద్రుడు-చంద్రుడు, విచిత్రసోదరులు సినిమాతో బలపడింది. మరుగుజ్జు సర్కస్‌వాడి పాత్రలో కమల్‌ నటన అందుకు తీసుకున్న శ్రద్ధ చేసిన హోమ్‌వర్క్‌, నటులందరికీ గైడ్‌ లాంటిదనడంలో ఆశ్చర్యం లేదు!

మైఖేల్‌ మదన కామరాజు సినిమాలో నాలుగు పాత్రలను పోషించి ఆశ్చర్యపడేలా చేశాడు. ఆ ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోకముందే ఈమధ్యే దశావతారం సినిమాలో పది విభిన్నమైన పాత్రలను పోషించి భారతీయ వెండితెరపై అతి ఎక్కువ పాత్రలను పోషించిన తొలినటుడుగా రికార్డు సృష్టించాడు.

ప్రతీపాత్రను దానికి తగిన బాడీలాంగ్వేజ్‌ని, వైవిధ్యాన్ని చూపించిన కమల్‌ నటనను ఒక యజ్ఞంలా భావిస్తాడంటే అతిశయోక్తి కాదు.

చార్లీ చాప్లిన్‌ని అమితంగా ఇష్టపడే కమల్‌ – సీరియస్‌ కన్నా కామెడీ సినిమాలు చేయడమే కష్టం అని నమ్ముతాడు. అందుకే క్లిష్టమైన కామెడీని అందంగా ప్రజెంట్‌ చేసి, పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో మంచి కామెడీ సినిమాలను సైతం రూపొందించాడు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు, సతీ లీలావతి, తెనాలి, బ్రహ్మచారి, పంచతంత్రం దీనికి ఉదాహరణ. ఒకరాధ ఇద్దరు కృష్ణులు సినిమాలో ఆయన పాట కూడా పాడడం విశేషం.

కమల్‌ బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు బహుభాషా నటుడు కూడా . దక్షిణ భారతీయ భాషలన్నింటితో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి కళకు హద్దులు లేవని నిరూపించాడు. హిందీలో ‘ఏక్‌ దూజ్‌ కేలియే’, ‘సనమ్‌ తేరీ కసమ్‌’, ‘సద్మా’, ‘గిరఫ్తార్‌’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సాగర్‌లో భగ్నప్రేమికుడిగా ఆయన ప్రదర్శించిన నటన ఆ సినిమాకే ఆయువుపట్టులా నిలిచింది. సినిమాని సూపర్‌హిట్‌ చేసింది.

అలాగే ఆయన ‘కవిత; అనే బెంగాలీ సినిమాలో సైతం నటించడం విశేషం. ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న కమల్‌ను ఎన్నో అవార్డులు సైతం వరించాయి. జాతీయస్థాయిలో ఉత్తమనటుడిగా ఆయన నాలుగుసార్లు అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. కాగా అందులో ఒకసారి తన తొలి చిత్రానికి, జాతీయ ఉత్తమ బాలనటుడిగా, ఉత్తమ నటుడిగా రెండు వైవిధ్యమైన అవార్డులను సాధించిన క్రెడిట్‌ దేశం మొత్తం మీద ఒక్క కమల్‌దే

పద్మశ్రీ వంటి పురస్కారం కమల్‌ కీర్తికిరీటంలో ఒక మణిరత్నమే. ఇక ఫిలింఫేర్‌ అవార్డుల విషయానికి వస్తే ఇప్పటివరకూ… దాన్ని అతి ఎక్కువసార్లు అందుకున్న ఒకే ఒక్క నటుడు కమల్‌. వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నిరంతర కళారాధకుడాయన!

23 Comments
 1. సాయి బ్రహ్మానందం May 30, 2009 /
  • abhimaani May 30, 2009 /
   • Brahmanandam Gorti May 31, 2009 /
   • Ravi June 2, 2009 /
   • Dhanaraj Manmadha June 2, 2009 /
   • సాయి బ్రహ్మానందం June 3, 2009 /
 2. Manjula May 30, 2009 /
  • Yadgiri June 6, 2009 /
 3. M Sukruthi May 30, 2009 /
 4. venkat May 30, 2009 /
 5. sameera May 30, 2009 /
 6. baleandu May 30, 2009 /
 7. రాజశేఖర్ May 31, 2009 /
 8. m jayakiran June 1, 2009 /
 9. Priya Iyengar June 1, 2009 /
  • Dhanaraj Manmadha June 2, 2009 /
  • baleandu June 8, 2009 /
   • ramesh reddy June 20, 2009 /
 10. Swaminathan May 7, 2010 /