కమల్‌హాసన్-భారతీయ సినిమాకు సంబంధించి పరిచయం అవసరం లేని మహోన్నత నటుడు. కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఇంటలెక్చువల్ సినిమాని, డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు కలిగించిన మహా కళాకారుడు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, సినిమా కళలకు సంబంధించి బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన మూవీ జీనియస్- కమల్. దశావతారాల్లో అలవోకగా జీవించి నిరంతర కళాదాహంతో ఎవరికీ అంతుబట్టని ‘మర్మయోగి ‘ – కమల్‌హాసన్.
కమల్ అంటే సినిమా, సినిమా అంటే కమల్.ఇంతగా సినిమాతో పెనవేసుకుపోయిన బంధం కమల్‌హాసన్‌ది.భారతీయ సినిమాని, అందునా దక్షిణాది సినిమాని అంర్జాతీయ స్థాయికి, ఆస్కార్ అవార్డుల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కమల్‌ది. నవరసాలను వివిధ భావోద్వేగాలను సహజాతి సహజంగా, ప్రేక్షకులంతా తన్మయం చెందేలా తెరమీద ప్రదర్శించిన సహజనటుడు.
స్టార్‌డమ్, ఇమేజ్ ఇలాంటి ఇలాంటి ఫేక్ వాల్యూస్ ఆయనకు ఉండవు. కళాకారుడిగా, నటుడిగా, బహుపాత్రలను, ఆ పాత్రలలో క్యారెక్టర్‌లను మాత్రమే చూపించి, నటనలో పాత్రపోషణలో తన అస్తిత్వాన్ని తను కమల్‌హాసన్‌ని అన్న విషయాన్ని మర్చిపోయేలా చేసిన అసామాన్య నటుడాయన.
నటులు చాలా రకాలు.
కొంతమంది నటిస్తారు.
కొంతమంది ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు.
కానీ కమల్ మాత్రం పాత్రని ఆవహించుకుంటాడు. పాత్ర పూర్వాపరాలని ఆకళింపు చేసుకుంటాడు. స్టడీ చేస్తాడు. పాత్రని ప్రేమిస్తాడు. పాత్రే తానుగా తనని తాను శారీరకంగా, మాసికంగా అన్ని విభాగాలుగా మలుచుకుంటాడు. అలాంటి అరుదైన అంకిత భావం ఉన్న కళామతల్లి ముద్దుబిడ్డ-కమల్.
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అనే సామెత కమల్‌హాసన్ విషయంలో నిజమనే చెప్పాలి. కళాకారుల కుటుంబ నేపథ్యం వల్లనో ఏమో కానీ, తెలిసీ తెలియని లేత వయసులోనే కమల్ బాలనటుడిగా, తన నటనా ప్రతిభను ప్రదర్శించాడు. 1960లో ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే జెమినీ గణేషన్-సావిత్రి జంటతో నటించి వారికన్నా తానే సెంటర్‌ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆ తర్వాత బాలనటుడిగా కమల్ ‘పార్తల్ పసి తీరకు’ అనే అనే సినిమాలో శివాజీగణేషన్‌తోనూ, ‘ఆనందజోడి’ అనే సినిమాలో MG రామచంద్రన్‌తోనూ నటించారు. పిల్లాడిగా కమల్ అద్భుత ప్రతిభకి అప్పట్లో ఈ మహానటులంతా ఆశ్చర్యపోయేవారట.
అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. ఆయనలోని కళాతృష్ణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది…
ఆయనలోని నటనార్తి నిరంతరం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. కమల్‌హాసన్‌కు చదువు అంతగా అబ్బలేదు. బహుశా బాల్యంలోనే నటుడిగా తను పొందిన గుర్తింపు తన చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడానికి కారణమేమో!
జన్మతహా తమిళుడైనా, ఆయనకు హీరోగా తొలి బ్రేక్ మాత్రం మళయాళం సినిమాతోనే వచ్చింది. 1974లో వచ్చిన ‘కన్యాకుమారి’ చిత్రం కమల్‌ను సక్సెస్‌ఫుల్ హీరోను చేసింది. శివాజీగణేషన్, జెమినీగణేషన్, శివకుమార్, ముత్తురామన్ లాంటి మేటి నటులు ఎందరున్నా తమిళసినీ సామ్రాజ్యంలో తనదైన స్థానం కోసం కమల్ ఎంతో కృషి చేశాడు. తన సొంత ముద్ర కోసం, సొంత గొంతుకను వినిపించడం కోసం, తనదైన సినిమాలను తీయడం కోసం, ఆయన చేసిన శ్రమ, తపన, నిరంతర అధ్యయనం… ఒక సక్సెస్‌ఫుల్ స్టోరీకి ఏమాత్రం తీసిపోవు.
ఆయన ప్రయత్నాలన్నీ దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడేంతవరకూ అంతగా సక్సెస్‌కాలేదు. 1975లో వచ్చిన ‘అపూర్వరాగంగళ్’ సినిమాలో బాలచందర్ ఇచ్చిన పాత్ర కమల్ జీవితానికి టర్నింగ్ పాయింట్అయింది. తన కన్నా పెద్ద వయసు స్త్రీని ప్రేమించే యువకుడిగా అన్‌కన్వెన్షనల్ రోల్‌ను పోషించిన కమల్‌కు, విలక్షణ పాత్రల పట్ల ఆసక్తి తొలినాటి నుంచి ఉందని అర్థమవుతోంది.
కమల్ అంటేనే ప్రయోగాలు. సినిమాలో ఎన్ని ప్రయోగాలు చేయచ్చో అన్ని నవ్యప్రయోగాలు చేయడం ఆయనకు ఇష్టం. ఈ ప్రయోగాత్మక ధోరణే కమల్‌ను మిగతా హీరోలకన్నా వైవిధ్యమైన నటుడిగా తారాలోకంలో నిలిపింది. నాయకుడుగా నటించినా, బ్రహ్మచారిగా కనిపించినా, తెనాలిగా మెప్పించినా, ఇంద్రుడు-చంద్రుడు అనిపించుకున్నా కమల్‌కే చెల్లింది.
1977లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘పదహారు వయదినిలే’ చిత్రం కమల్‌హాసన్ నటవిశ్వరూపాన్ని తొలిసారిగా ఆవిష్కరించింది. తన మామ కూతురిని ప్రేమించే అమాయకపు, చదువుకోని వెర్రి బాగుల వికలాంగుడిగా ఆయన ప్రదర్శించిన నటన – అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమానే తెలుగులో పదహారేళ్ల వయసు గా రీమేక్ చేశారు. గమ్మత్తేమిటంటే ఈ సినిమాతో మొదలైన కమల్-శ్రీదేవి కాంబినేషన్ ఆ తర్వాత హిట్‌పెయిర్‌గా పేరుపొందింది. ఈ ఇద్దరూ బాలనటులుగా సినీపరిశ్రమలోకి ప్రవేశించడం వీరిమధ్య ఉన్న సారూప్యత.
కమల్ నట జీవితానికి సంబంధించి మరో టర్నింగ్ పాయింట్.. తన గురువు బాలచందర్ ద్వారానే మళ్లీ వచ్చింది. సరిగ్గా 30ఏళ్ల కిందట రూపొందిన ఆ సినిమా కమల్‌హాసన్‌ను తొలిసారిగా తెలుగు వెండితెరకు పరిచయం చేసింది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అనే తరహా సినిమాకు అంకురార్పణ చేసింది. ‘మరోచరిత్ర’నే సృష్టించింది!
అప్పటికాలం యువత మనోభావాలకు అద్దంపట్టే యంగ్ లవ్‌స్టోరీని ట్రాజెడీగా మలిచిన ఈ సినిమాలో- బాలుగా కమల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది…
తెలుగు సినీ చరిత్రలో లవ్‌స్టోరీలకు పునాది వేసిన సినిమాగా నిలిచింది. అప్పట్నించీ కమల్‌కు వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అంటే ఒక మహాకళాకారుడికి మహానీరాజనం తెలుగు సినిమాతోనే జరగడం కాకతాళీయమే అయినా ఇది తెలుగువారిగా గర్వపడాల్సిన విషయమే అనడంలో అతిశయోక్తి లేదు.
కమల్ యూత్‌ఫుల్ హీరోగా అప్పటి యువతరంలోని ఆలోచనలు, విలాసాలకు అనుగుణంగా ఉండే పాత్రల్లో నటించారు. ‘సొమ్మొకడిది-సోకొకడిది’,'వయసు పిలిచింది’, ‘అందమైన అనుభవం’ ఈ కోవలోనివే.!
1979లో వచ్చిన ‘ఇది కథ కాదు’ సినిమా మళ్లీ కమల్‌లోని నటుడ్ని, కళాకారుడ్ని వెలికితీసిన ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఇందులో మాట్లాడే బొమ్మ ద్వారా తన మనసులోని మాటల్ని చెప్పే మూగ ప్రేమికుడిగా ఆయన నటన ప్రశంసలందుకొంది. తన సినిమాలలో తన పాత్రలో ఏదో ఒక వైవిధ్యత, విలక్షణత, ఉండేలా చూసుకోవడానికి ఈ సినిమానే ఆలంబన అయింది.
కమల్ నటుడిగా చేయని ప్రయోగం లేదు. హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్న కాలంలోనే థ్రిల్లర్ తరహా సినిమాలలో యాంటీ హీరోగా నటించాడు.
‘టిక్ టిక్ టిక్’ సినిమాలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌గా క్రైమ్ థ్రిల్లర్‌లో నటించాడు. ఇక ఎర్రగులాబీ అనే సినిమాలో సైకో కిల్లర్‌గా యాంటీహీరో పాత్రని పోషించాడు. అందమైన అమ్మాయిలను ఆకర్షించి వారిని చంపివేసే కిల్లర్‌గా ఆయన ఆకాలంలో ఆ పాత్రను చేయడం ఒక సాహసమే. బహుశా హీరో ఇమేజ్‌ను బ్రేక్ చేయడం కోసమే ఆయనా సినిమాను చేశారేమో అని చెప్పాలి.
కమల్‌కు జేమ్స్‌బాండ్ తరహాలో హాలీవుడ్‌కు ధీటుగా మన సినిమాలు తీయాలని మొదట్నుంచి ఉండేది. తొలినాటి నుంచీ ఆయన తన స్థాయిని, తన సినిమాల స్థాయిని హాలీవుడ్ స్టాండర్డ్‌లో చూడడానికి ఇష్టపడేవాడు తప్ప ప్రాంతీయ పరిధులకు లోబడేవాడు కాదు.ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సినిమాలలో వస్తున్న అత్యుత్తమ చిత్రాలతో పరిచయం పెంచుకునే నిరంతర విద్యార్థి ఆయన.
ఆ ఆసక్తే ఆయనను జేమ్స్‌బాండ్ తరహాలో తన సొంత బ్యానర్‌లో ‘విక్రమ్-007′ అనే సినిమాను తీయడానికి ప్రేరేపించింది. ఇది భారతీయ గూఢచారి సినిమాలలో ఓ ప్రయోగమే.
డిఫరెంట్ రోల్స్‌కు నూతన భాష్యాన్ని చెప్పిన అసమాన కళాకారుడు కూడా కమల్! ఆయన నటించిన ‘అమావాస్య చంద్రుడు’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. ఇందులో ఆయన అంధుడిగా, వికలాంగుడిగా చూపించిన నటన, ఆయనకు నిజంగా చూపు పోయిందేమో అనేంత స్థాయిలో కనిపించింది.
ఆ మాటకొస్తే దక్షిణభారతంలో, మొత్తం భారతీయ సినీ చరిత్రలోనే పాత్రను పూర్తిగా ఆకళింపు చేసుకుని ఆర్టిస్టిక్, రియలిస్టిక్ సినిమా గ్లామర్‌ని, ప్యార్లల్ సినిమా ధోరణులని, కమర్షియల్ సినిమాలలో తీసుకువచ్చిన తొలిహీరో కమల్ అని చెప్పాలి. అందుకే ఆయన సినిమాలు మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలే అయినా … ఆ సినిమాలంతటా ఆర్ట్‌ఫిలిం ఛాయలే కనిపిస్తాయి.! అందుకే ఆర్ట్, కమర్షియల్ విభజనరేఖను చెరిపేసిన కళాకారుడు కమల్ అంటే ఆశ్చర్యం లేదు.
ఆయన నటించిన వసంతకోకిల సినిమానే దీనికి సాక్ష్యం.
కమల్‌హాసన్‌లోని ఎవర్‌లెర్నింగ్ ఆర్టిస్ట్‌ని పూర్తిస్థాయిలో తెరపై ప్రదర్శించిన మరో దర్శకుడిగా కాశీనాధుని విశ్వనాథ్ అని చెప్పాలి. వీరి కాంబినేషన్‌లోని మొదటిసారిగా వచ్చిన “”సాగర సంగమం”" సినిమా నృత్య ప్రధాన చిత్రాలలో క్లాసిక్‌గా మిగిలింది. అందులో భారతీయ శాస్త్రీయ నృత్యాలను ఔపోసన పట్టిన కళాకారుడిగా కమల్ నటన, చేసిన శాస్త్రీయ నృత్యాలు నభూతో నభవిష్యతి. స్వచ్ఛతకు, అమాయకత్వానికి, వయసు ఎదిగినా మనసు ఎదగని వెర్రిబాగుల మనస్తత్వానికి ఇప్పుడు మన వాడుకలో పర్యాయపదం అయిపోయిన పదం -స్వాతిముత్యం.!ఈ సినిమాలో అమాయకుడిగా పోషించిన పాత్ర కలకాలం నిలిచిపోయే పాత్ర. యువకుడిగా, భర్తగా, తండ్రిగా, వృద్ధుడిగా, కమల్‌హాసన్ ఈ సినిమాలో చూపించిన విభిన్నమైన షేడ్స్, నటనలోని మహోన్నతకి పరాకాష్టగా నిలిచాయి.
–ఇంకా వుంది
గీతాచార్య says:
Welcome. Anything about Kamal is… That’s all.
Analyse his acting prowess in Swathimutya, and Sagara Sangamam etc films. Good start.
కె.మహేష్ కుమార్ says:
కమల్ హాసన్ కమల్ హాసనే! ఇతడితో పోల్చదగ్గ నటుడుగానీ,నిర్మాతా-దర్శకుడుగానీ ప్రస్తుతానికి భారతదేశంలో లేరు. తమిళ సినీరంగాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళిన సినీదిగ్గజం కమల్.
తెలుగు చిత్రరంగంలో ఒక నటుడిగా కమల్ విరాజిల్లినా, ఒక ఫిల్మ్ మేకర్ గా తమిళ్ లోనే ఉండిపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ద్రోహి లాంటి తెలుగు-తమిళ్ ప్రయత్నాలు చేసినా లేక ప్రస్తుతం ‘A Wednesday’తియ్యడానికి ప్రయత్నించినా తెలుగు సినీరంగానికి తను చెయ్యదగ్గ contribution మనం రాబట్టుకోలేక పోయామేమో అనిపిస్తుంది.
pappu says:
నభూతో: న భవిష్యతి:
కమల్ హసన్ కమల్ హసనే అతనికి సాటి ఎవరూ లేరు.మంచి వ్యాసం అందించినదుకు ధన్యవాదాలు.మిగతా వాటికోసం ఎదురుచూస్తున్నాము.
baleandu says:
భారత దేశం గర్వించదగ్గ నటుల లో కమల హాసన్ ఒకడు. నవరసలను అతను అద్బుతన్గ నటించగల నవరస నాయకుడు. ప్రతి చిత్రంలో ఏదో ఒక విలక్షణ త చూపనీదే , ప్రేక్షకులకు ఆసక్తి కలిగించనిదే అతఃనీకి తృప్తి ఉండదు. That is Kamal Hassan. A great actor in Indian Cinema. He created some of trend setters as well as mile stones in Indian Cinema . It is pity that the Telugu Cine Industry has not offered him good roles, though he proved himself with K.Viswanadh ‘s Sagara Sangamam, Swathimuthyam, Subha Samkalpam etc., and utilised his potentiality . Telugu people are only have oppotunity to look his dubbing tamil cinemas since several years. No Producer or Director of Telugu industry are venture to do a cinema with him in Telugu. Why ????
Sowmya says:
Very well written article. Waiting for other parts.
Chandrasekhar says:
చాలా బాగుంది సర్! శైలి, విషయం రెండూ చక్కగా మేనేజ్ చేసారు. అభినందనలు!!!
kanakakrishna b says:
there is no doubt that, Kamal haasan is an excellent actor of world standards..the essay has succeeded in portrying the multiplicity and magnanimity of the journey of Kamal in a vivid manner..congrats to the author…n eagerly waiting for the remaining parts..
thanks
kanakakrishna b
M Sukruthi says:
thnks a lot..
m going through ur site for the long past…all these days, i have a feeling that, whether u r ignoring our own kamal by concentrating on world cinema …bt u proved me wrong by giving an excellent note on kamal…the dimensions that have been explained is also very informative n enable us to strengthen our admiration towards kamal..
thnks ones again
m jayakiran says:
after some gap, i visited the website..n felt myself very missing as i find the special essay on my fav hero- kamal..he is the perfectionist artist who knows pretty well about the importance of script and screen play in the art of film making..
btw, he is the first pioneer to organise a world class work shop on screen wrting in the campus of IIT chennai..
hats off to kamal…
thanks to the writer
sharma says:
super ga vraasaaru… chaala manchi vyaasam pretty good!
kamal natana kousalaaniki “Swaathimuthyam” “Naayakudu” ee rendu chaalu athanu entha goppa natudo cheppadaaniki.
vijaya bhaskar reddy says:
kamal is very best hero in south indian film industry, there is no alternate hero