కబూలి కిడ్

kabuli-kid

చిత్రం: కబూలి కిడ్

దేశం:ఆఫ్ఘనిస్తాన్

దర్శకుడు: బర్కం అక్రం.

అఫ్ఘనిస్తాన్ లో యుద్ధాల పుణ్యమా అని పెద్దగా చిత్రాలు తియ్యలేదు. San Francisco Film Festivalలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.నేను చూసిన మొట్టమొదటి అఫ్ఘానీ చిత్రం ఇది.

కధ: ఒక అమ్మయి ఒక చంటిపిల్లవాడిని ఒక టాక్సీలొ వదిలి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవరుకు ఆ పిల్లవాడిని ఏమి చెయ్యాలో తెలియదు. ఆ పిల్లవాడి తల్లిని వెతకాడనికి ఇంకా ఆ పిల్లవాడిని వదుల్చుకోవడానికి పడే పాట్లే ఈ చిత్రం.

కధనం: కధ simple గానే ఉన్నా, ఈ చిత్రంలో దర్శకుడు అఫ్ఘనిస్తాన్ జనజీవితాన్ని, యుద్ధం ఇంకా తాలిబాన్ ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేసాడు. యుద్ధాలు ప్రజల జీవితాలని ఎలా అతాకుతలం చేసాయో చూడవచ్చు. ఎక్కడ పెద్దగా డ్రామా లేకుండా వాటిని చిత్రీకరించడం ఈ చిత్రంలోని విశేషం.

నటన: ఈ చిత్రంలో పనిచేసినవారెవరూ కూడ వృత్తి నటులుకారు. అయినప్పటికీ నటన చాలాబావుంది. కాకపోతే దర్శకుడు పాత్రధారులను ఎన్నుకున్నప్పుడు వారి జీవితానుభవాలు కూడ పరిగణలోకి తీసుకోవడం విశేషం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అన్న యుద్ధంలో చనిపోతాడు. ఆ పాత్రధారి అన్న కూడ అతని కళ్ళముందే మరణించాడట.

సంగీతం: నేపధ్యసంగీతం చాలా మటుకు అఫ్ఘాని సాంప్రదాయ సంగీతమే. దర్శకుడే ఈ చిత్రానికి సంగీతం రచించాదు.

ప్రభావం: ఈ చిత్రంలో నాకు చాల మటుకు ఇరాని దర్శకుల ప్రభావం కనపడింది. ఈ దర్శకుడు, అబ్బాస్ ఖిరొత్సమి కి మిత్రుడు అవడం విశేషం.

అఫ్ఘనిస్తాన్ జనజీవితాన్ని అర్ధం చేసుకోవాలి అంటే ఈ చిత్రం తప్పకుండా చూడాలి. ఇతను ఇంకొన్ని చిత్రాలు నిర్మిస్తాడని ఆశిద్దాం.

–మంజుల

 

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

1 Comment to “కబూలి కిడ్”

  • ఇంతకీ అతనికి పెళ్ళైందా లేకపోతే పెళ్ళి కాని తండ్రా?

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories