నవతరంగం:ఫోకస్-లేటయినా లేటెస్ట్ గా

focus

focusనిన్న రాత్రి ముగ్గురు ప్రముఖులు నా కలలోకొచ్చారు. “బాబూ మేమెక్కాల్సిన నవతరంగం రైలు ఓ జీవితకాలం లేట్ గా నడుస్తున్నట్టుంది” అన్నారు. వారే వచ్చి అడిగాక ఇక తప్పుతుందా? కాస్త ఆగండి. త్వరలోనే అన్నీ చక్కబడుతాయని వారిప్రయాణం సాఫీగా సాగుతుంని హామీ అయితే ఇచ్చాను గానీ చూద్దాం మరి ఏమవుతుందో.

సరే ఇక విషయానికి వస్తే గత నెలలో ఫోకస్ విభాగంలో ప్రచురించాల్సిన పరజనోవ్ వ్యాసాలు, అంతకు ముందు కేవలం ఒక్క పరిచయ వ్యాసంతో కుంటుపడిన Godard వ్యాసాలతో పాటు ఈ నెలలో నిర్వహించాల్సిన ఆంటొనియాని పై ఫోకస్ కలిపి చూసుకుంటే గంపెడు భారం కళ్ళముందు కనిపించడం నిజం. అయితే ఎవరో ఒకరు పూనుకుంటే తలో చెయ్యీ వెయ్యకపోరా అన్న నమ్మకంతో మూలన పడ్డ ఫోకస్ విభాగాన్ని పునరుజ్జీవం కలుగచేయాలని నా తపన.

ఇంకో వారం రోజుల్లోగా ఈ ముగ్గురు దర్శకుల గురించి పాఠకులు వీలైనన్ని వ్యాసాలు పంపిస్తే ఫోకస్ విభాగం బూజుపట్టకుండా ఉంటుంది. ఇప్పటికే ముగ్గుర్ని వైటింగ్ లిస్ట్ లో పెట్టేసున్నాం. ఈ వారం పది రోజులు గడిస్తే ఆ ముగ్గురు కాస్తా ఆ నలుగురు అవుతారు. అలా చూస్తూ పోతే మొత్తానికి అసలీ సెక్షన్ మూసెయ్యాల్సొస్తుందో ఏమో. కాబట్టి పాఠకులు, నవతరంగం సభ్యులు, అభిమానులు కాస్త వీలు చూసుకుని ఫోకస్ విభాగానికి మీరి నచ్చిన మెచ్చిన సినిమాలు, దర్శకుల గురిమ్చి వ్యాసాలు పంపిచాలని మనవి.

ఇంతవరకూ నవతరంగంలో ఫోకస్ విభాగంలో వచ్చిన వ్యాసాలు:

2008 వ్యాసాలు

2009 వ్యాసాలు

అలాగే ఈ సంవత్సరం ఏయే నెలలో ఏ దర్శకుని గురించి ఫోకస్ శీర్షిక నిర్వహించబడుతుందో ఇక్కడ చూడొచ్చు.

మరోమాట. ఈ మధ్యనే నవతరంగం కి కొత్త అందాలు దిద్దాము. మీ అభిప్రాయాలు, సలహాలు తెలియచేయగలరు. దాంతో పాటు రచయితల పేజీని కాస్త అందంగా తీర్చి దిద్దాము. చూసి మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే సభ్యులు వీలయితే మీ ప్రొఫైల్ ని అప్ డేట్ చేయండి.

చివరిగా సభ్యులు నెలకి కనీసం ఒక వ్యాసమైనా వ్రాయాలని మనవి.

4 Comments

4 Comments

 1. నా తరఫునుంచీ ఆంటొనియాని మీద ఒక వ్యాసం ఈ వారంలో.

 2. గీతాచార్య

  May 24, 2009 at 12:28 am

  ఆ చేత్తోనే ద రీడర్ ని ఓ పాలి రీవ్యూ చేయండి.

 3. సాయి బ్రహ్మానందం

  May 28, 2009 at 3:25 am

  ఎప్పట్నుంచో రాద్దామనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. నవతరంగానికి మునపటి కళ పోయింది. నా తరపునుంచి కొన్ని సూచనలు.

  1. వ్యాసాలు పల్చబడ్డాయి. చెప్పినవే మరలా మరలా చెబుతున్నారు. రాస్తున్నవే తిరగ రాస్తున్నారు. వేరే పత్రికల్లో వచ్చిన వ్యాసాలే కాస్త అటూ ఇటూ మార్చి వస్తున్నాయి.
  ఇంగ్లీషు వెబ్ సైట్లలో వచ్చిన వ్యాసాలు తెలుగులో తిరిగి రాయడం వల్ల చదవాలనిపించేలా లేవు. వెబ్ చూసే ప్రతీ ఒక్కరికీ ఇంగ్లీషు వచ్చు. వారికి గూగుల్ కూడా బాగా తెలుసు.

  2. వెబ్ డిజైన్ బాగోలేదు. బొమ్మలు పెద్దవయ్యి కలగాపులగంగా ఉంది. ముఖ్యంగా ఫాంట్ సైజు పెంచాలి. అలాగే వాడే రంగులు కంటికి ఆహ్లాదంగా ఉంటే బాగుంటుంది. సైటుకొచ్చిన తరువాత ఓ ఫారెస్ట్లో అడుపెట్టిన అనుభూతి. మొత్తానికి నవతరంగం సైటు గిజిబిజిగా ఉంది.

  ప్రస్తుతానికివే!

  -సాయి బ్రహ్మానందం గొర్తి

 4. గీతాచార్య

  June 23, 2009 at 8:25 pm

  @వెంకట్,

  Antonioni గురించైతే ఎలాగో కాస్త నాకర్థమైనంత వరకూ వ్రాయగలిగాను కానీ సినిమాల గురించి వ్రాయాలంటే కాస్త టైం పడుతుంది.

  మీరు ఈ నెలకి ఇన్ని అని కాకుండా ఒకరికి ఒక దర్శకుడిని గురించి అప్పచెప్పితే, వీలున్నప్పుడు రాస్తారు కదా. అసలు ఫోకస్ ఉండ బట్టె నాకు ఇలాంటి మంచి విషయాలు తెలిసింది. అది మూత పడకూడదని నా కోరిక.

  ఇంకో వారంలో The Adventure గురించి నేను పోస్టుతాను.

Leave a Reply

To Top