Cannes 2009-అవార్డులు

awards-cannes

awards-cannes

ఈ నెల 13 నుంచి ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు తో ముగిసింది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు మరియు నటీ నటులకు ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించబడ్డాయి.

2001 లో Piano Teacher సినిమాకి గ్రాండ్ ప్రి అవార్డ్ అందుకున్న మైఖేల్ హనికి ఈ సంవత్సరం వైట్ రిబ్బన్ సినిమాకి గానూ ప్రతష్టాత్మకమైన Palme d’Or అవార్డు అందుకున్నారు.

గతంలో తన సినిమా పల్ప్ ఫిక్షన్ తో Cannes లో సంచలనం సృష్టించిన టారంటినో సరికొత్త సినిమా Inglorious Basterds సినిమా లో నటించిన Christoph WALTZ ఉత్తమ నటునిగా ఎన్నుకోబడ్డాడు.మ్

ఈ సంవత్సరం Cannes లో సంచలనం సష్టించిన I kille My Mother సినిమా Director’s fortnight విభాగంలోని ఐదు అవార్డ్స్ లో మూడింటిని కైవసం చేసుకుంది. కెనడాకి చెందిన Xavier Dolan ఈ సినిమా కి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా ఈ సినిమాలో నటించి దర్శకత్వం వహించాడు. ఇంతకీ ఈయన వయస్సు ఇరవై లోపేనట!

ఈ చిత్రోత్సవంలో ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు Alain Resnais ని లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు.

62 వ Cannes చలనచిత్రోత్సవం పూర్తి అవార్డుల జాబితా:

Feature films

Short films

Un Certain Regard

Cinéfondation

Golden Camera :

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

1 Comment to “Cannes 2009-అవార్డులు”

  • Thank you for the information. Will u share info about those movies?

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories