ఈ మధ్య ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరిగిన వర్ణవివక్షతా పూర్వకమైన దాడుల నేపధ్యంలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒక సంచలనాత్మకమైన, సంవేదనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్రిస్బన్, ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ యూనివర్సిటీ పాఫ్ టెక్నాలజీ సినిమా రంగంలో అమితాబ్ సేవలకుగానూ ఇవ్వజూపిన గౌరవ డాక్టరేట్ తిరస్కరించారు. అమితాబ్ తన బ్లాగులో ఈ విషయం వివరిస్తూ “I mean no disrespect to the Institution that honors me, but under the present circumstances, where citizens of my own country are subjected to such acts of inhuman horror, my conscience does not permit me to accept this decoration from a country that perpetrates such indignity to my fellow countrymen.” అన్నారు. ఈ విషయంపై అమితాబ్ పూర్తి వ్యాఖ్యానం ఈ లంకె ద్వారా తన బ్లాగులో చూడండి.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు నవతరంగం అభినందనలు తెలియజేస్తోంది. భారతీయుల్ని అవమానించే దేశం ఇచ్చే గౌరవం తనకు అఖ్ఖరలేదన్న అమితాబ్ కు గౌరవాభినందనాలు తెలియజేస్తోంది.
chetana says:
Sorry, help me understand the following..
1. Australiaలో జరుగుతున్న దాడులు ఆ దేశం చేసినట్లు ఎలా అవుతుంది? దాడి చేసిన వ్యక్తి/వ్యక్తులది అభిజాత్యం ఔతుంది కాని, ఆ దేశం మొత్తానికి ఎలా ఆపాదించలగరు ఆ లక్షణం.. ? ఎవరో వ్యక్తి/వ్యక్తులు తమ racismయే గాని ఇంకేదైనా కారణం వల్ల కాని దాడి చేస్తే “Australia” అనే దేశం “Indians”ని అవమానించినట్లు ఎలా అవుతుంది? I feel this is a very immature observation/conclusion.
2. Mahesh, ఈ అభినందన మీ తరపునుంచా, నవతరంగం తరపునుంచా? నవతరంగం తరపునుంచి అంటే వెంకట్‌ది, రాజేంద్రది, and all other contributors/owners/moderators, whoever they are, అందరిదీనా? ఒకవేళ కాకపోతే మీ వ్యక్తిగతాభిప్రాయల్ని నవతరంగం పేరు మీద ఎలా ప్రచురించగలరు?
chavakiran says:
Good Job, Amitab!
This will surely increase pressure over Aus and Ind govt to do something constructive and meaningful things instead of eye-washing statements.
Aus from the begging is more racist than any other country, I thought they changed with the world- looks like it is not the case.
http://en.wikipedia.org/wiki/Stolen_Generations
http://en.wikipedia.org/wiki/Truganini
కె.మహేష్ కుమార్ says:
@చేతన:1) ఆస్ట్రేలియా ఈ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు ఎవరికీ సంతృప్తిజనకంగా లేదు. అంటే పరోక్షంగా వివక్షను సమర్ధించినట్లే లెఖ్ఖ. ఆస్ట్రేలియా Diplomatic pressure తీసుకురావడానికి భారతదేశం చాలా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో సివిల్ సొసైటీ తరఫున అమితాబ్ వంటి వారు తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ముదావహం.
ఆస్ట్రేలియా భారతీయుల్ని అవమానించినట్లుగా నేను కాదు. అమితాబ్ భావించారు (నేను వారితో ఏకీభవిస్తాను). వారి మాటల్లోనే చెప్పాలంటే,”my conscience does not permit me to accept this decoration from a country that perpetrates such indignity to my fellow countrymen.”
2)నవతరంగం అందరిదీ. ఇక్కడ రాసే అభిప్రాయాలు సొంతమేగానీ ఈ వేదిక అందరిదీ. వేదిక మీదనుంచీ నా అభిప్రాయం చెబుతే అది వేదిక అభిప్రాయం అవుతుంది.ఒకవేళ ఈ అభిప్రాయం అభ్యంతరకమైతే మీలాగా విభేధించొచ్చు. నిర్వాహకులకు అభ్యంతరకరమనిపిస్తే మొత్తం వ్యాసాన్ని లేదా ఆ అభ్యంతరకరమైన భాగాన్ని తీసెయ్యొచ్చు.
andhramass says:
To all,
Just think before you post,
India lo yentha mandhi caste basis meedha kottukovatham ledhu, pocukovatham ledhu chanipovatham ledhuuu
sontha dessam lo jarughutha unthey emmi cheyalenni valluu, parayyi dessam lo jaruguthanthey matram okka godavalu chestharuu
I feel all the indians who react to this issue are immature
కె.మహేష్ కుమార్ says:
@ఆంధ్రా మాస్: మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి? మన భారతీయులు కుల వివక్ష పాటిస్తారు కాబట్టి ఆస్ట్రేలియాలో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా మాట్లాడకూడదంటారా! ఇక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతాయి కాబట్టి అక్కడ భారతీయుల్ని కత్తితో పొడిచినా ఫరవాలేదంటారా!
ఇక్కడైనా ఎక్కడైనా అన్యాయం అన్యాయమే. దానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన బాధ్యత మనుషులుగా మనందరిదీ. ఈ భావన “immature” కాదు. సంకుచితత్వం అంతకంటే కాదు.
sasank says:
@మహేష్, అంటే ఇండియా లో ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎవ్వరు ఇంత లా మాట్లాడలేదు, సో కాల్ల్ద్ మీడియా కూడా దీనికి పెద్ద ప్రాధాన్యతని ఇవ్వలేదు,కాని ఇప్పుడు ఎందుకు. అంటే వాళ్ళని పొడిచింది మన వాడు కాదు పక్కోడు అన్న బాధా!. మన వాడు పోడిచుంటే స్పందన ఇంకొక లాగ వచ్చేది ఏమో?
మహారాష్ట్ర లో ఇటువంటివి జరిగినప్పుడు అమితాబ్ అస్సలు స్పందించలేదు, అప్పుడు తన రాష్ట్రం వాళ్ళ పైన జరిగిన దాడులు గుర్తు రాలేదా!
దానికి నిరసనగా బాలీవుడ్ని వదిలి వెళ్లలేదు కదా.
దేశం లో గొడవలపై ప్రశ్నించని ఎవ్వరు పక్క దేశం లో జరిగిన వాటి పై ఎలా స్పందించగలరు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా! దేశం లో వున్నవాళ్ళని ఎవ్వరు పట్టించుకోవడం లేదు కాని దేశం వదిలి వెళ్లి పోయిన వాళ్ళ పై ఎందుకు ఇంత మమకారం.
జరిగిన దాడులపై నిరసన తెలియచెయ్యడంలో తప్పు లేదు కాని మన దేశంలో ఇంతకన్నా ఎక్కువ జరిగాయి , జరుగుతున్నాయి మరి వీటి మీద ఎందుకు మాట్లాడారు (Especially celebrities, leaving one or two).
ఏదో NRI మీద దాడులు జరిగిలోపల దౌర్జన్యంపై నిరసన అంటున్నాము, ఇక్కడ దేశంలో జరిగిన దాడులపై ఏమి చెయ్యడం లేదు, వలస వెళ్ళిన వాళ్ళ పై జరిగితే్ ఎందుకు ఇంత రాద్ధాంతం . (I am not against to any NRI’s).
కత్తి మహేష్ కుమార్ says:
@శశాంక్: ఇది మరీ అన్యాయమైన ఆరోపణ. మహరాష్ట్రలో ఉత్తర భారతీయులపై జరిగిన దాడులను అమితాబ్ ఖండిస్తే MNS సృష్టించిన రభస అంతాఇంతా కాదు. మొత్తం అమితాబ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇంటిపైన దాడికూడా చేశారు.
సామాజిక విషయాలపై స్పందించే అతికొద్ది మంది భారతీయ నటుల్లో అమితాబ్ ఒకరు. యునిసెఫ్, యునెస్కో వంటి సంస్థలతో కలిసి అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొంటున్న నటుల్లో ఒకరు. కాబట్టి జరిగిన అన్యాయానికి తనదైన “స్థాయి” లో అమితాబ్ స్పందించడానికి ఇలాంటి భాష్యాలు చెప్పడం అన్యాయం.
baleandu says:
Hates off Amitabji.
రాజ మల్లేశ్వర్ కొల్లి says:
అవును, అమితాబ్ నిర్ణయం అభినందించకుండా ఉండలేక పోతున్నాను.
@చేతన: మహేష్, చావా కిరణ్ లతో ఏకీభవిస్తూ…, మనకి ఆగ్లంలో “diplomatic pressure” అనే పదం ఉంది. వ్యక్తులు గానీ దేశాలు గానీ సమయోచితం గా వాడుకోవటం మామూలే. ఇది కూడ అటువంటి చర్యే. I fully support his act and it is quite matured decision..!! This act is not to humiliate Australia / the University, Just to show his displeasure with the recent brutal incidents. తోలుమందం కాని Australian authorities కి దీని విషయతీవ్రత బాగానే అర్థమవుతుంది.
chetana says:
Mahesh, With no disrespect to you or your “వ్యక్తిగత అభివ్యక్తి”, ఎవరి బ్లాగుకి వాళ్ళే సుమన్ కావచ్చేమోగానీ, నవతరంగంకి కాదేమో. నవతరంగం అందరిదీ అయ్యీ, అందరూ తమ అభిప్రాయాలు చెప్పగలిగే వేదిక అయినంత మాత్రానా ఆ వేదిక తరపున individuals వ్యాఖ్యానాలు చేయలేరు అని నా అభిప్రాయం. ఉదాహరణకి మీరు వ్రాసిందాన్ని “నా feeling”, “నా అభిప్రాయం” అని నేను ఖండించగలను/విభేదించగలను కానీ, నవతరంగం అందరిదీ, నాది కూడా అని చెప్పి మహేష్‌కుమారు అభిప్రాయం అపసవ్యంగా ఉంది అని నవతరంగం భావిస్తుంది, ఆయన అభిప్రాయాన్ని నవతరంగం ఖండిస్తుంది నేను వ్రాసేయ్యలేను కదా. నా అభిప్రాయం నాదిగా చెప్తాను అంతే, సమర్ధించేవాళ్ళు వందమంది ఉండొచ్చు, ఖండించేవాళ్ళు వెయ్యిమంది ఉండొచ్చు.
ఇక రెండు, just wanting to make myself clear, బచ్చన్ తనకి ఇవ్వాలనుకున్న పురస్కారాన్ని వద్దనటం, తీసుకోవటం ఆయనిష్టం, నేను దాని గురించి మాట్లాడలేదు. అలా అని దాడులు హేయమైనవి కాదు అని కానీ (as an ex-student in a foreign country, and as a non-resident Indian living in a foreign country for the last few years, I feel I know the pain a little more), తగిన చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలన్న అన్నదాన్ని ఖండించటం కానీ నేను చేయటంలేదు. కానీ వ్యక్తుల చర్యలు దేశమ్మొత్తానికి ఆపాదించటం sweeping generalization అని “నాకు” అనిపించింది.
కె.మహేష్ కుమార్ says:
@చేతన: నవతరంగం కూడా వ్యక్తిగత అభిప్రాయాలకు చోటునిచ్చే “open forum”మే.ఇక్కడెవరూ professional రచయితలు లేరు. సినిమాపై ఆసక్తినీ, అనురక్తినీ,ప్రేమనూ వ్యక్తపరుచుకోవడమే ఇక్కడి లక్ష్యం కూడా. నవతరంగం విధానం అన్ని గొంతుకలూ స్థానం కల్పించడం.
అలాంటప్పుడు నవతరంగం policy ఇలా ఉండాలి లేదా ఇలా ఉంటే బాగుంటుంది అనే సూచనలేతప్ప వాదనలు చెయ్యడం తగదు. నవతరంగం అనేది ఒక సైద్ధాంతిక నేపద్యం నుంచీ ఒక నిర్ధిష్టమైన వాదాల నుంచీ పుట్టిన “పత్రిక” కాదు.కాబట్టి నవతరంగానికి తనదంటూ ఒక ప్రత్యేక ధృక్పధం అంటూ ఉండదు. ఈ వేదిక మీదనుంచీ ఎవరైనా ఎటువంటి అభిప్రాయాన్నైనా భారతీయ చట్టాలకు లోబడి చెయ్యొచ్చు. వ్యక్తిగత విమర్శలు, బూతులు రాస్తే తొలగించడంతప్ప మొత్తంగా రెగ్యులేట్ చెయ్యడం గానీ ఎడిట్ చెయ్యడంగానీ నవతరంగం చెయ్యదు.
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరిగిన దాడుల్లో జాతివివక్ష ఒక ముఖ్యకారణమని నేను కాదు, Indian high commissioner to Australia అన్నారు. కొన్ని వేల మంది విధ్యార్థులు గతవారం రోజులుగా తమపై జరుగుతున్న వివక్షపై పెద్దస్థాయిలో ధర్నాలు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఆస్ట్రేలియా అత్యంత జాతివివక్షాపూరితమైన దేశంగా చెప్పుకొస్తున్నారు. ఈ మాటలు మీరు ఒకసారి టివి పెట్టి చూస్తే వినిపిస్తాయి, కనిపిస్తాయి. ప్రతి వార్తాపత్రికలోనూ కొన్ని వేలపెజీల కథనాలు చదవడానికి లభిస్తాయి. అక్కడ కనిపించని “sweeping generalization” మీకు ఇక్కడ అభ్యంతరకరంగా కనిపించడం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది.నా అభిప్రాయంలో ఉన్న పసవ్యతేమిటో నాకు అర్థం కాకుండా ఉంది.
Srikanth says:
@ Mahesh,
I have been living in Melbourne for the last 1 yr. There is no doubt that these acts are condemnable and appalling. I have been keenly following the reporting in the Indian media. We (some our Indian friends) feel that the Indian media is blowing the issue out of proportions and projecting the whole of Australia as a racist country which is not true.
Most of us have never faced any sort of discrimination here.
Moreover, these attacks are done by a bunch of teens (mostly dropouts from schools, mana bhashalo “awara gallu”).
In the protest yesterday, some Indians threw stones at windows of nearby buildings and broke some glasses. (http://www.theage.com.au/photogallery/national/indian-student-protest/20090531-brj1.html). On the whole what I am trying to say here is what Indian media is presenting there is not “complete” reality.
Chetana says:
Thanks Srikanth! With this, I rest my case. The rest is for the people to know the actual truth, whoever they are, media or AB or anybody else.
Itlu
Navatarangam
Kishore says:
I appreciate Amitabh. He has done right thing at right moment.
ramesh reddy says:
really we need to appreciate amitabh as he is showing the spirit of indians and protesting the acts of australians