Menu

Monthly Archive:: May 2009

వర్ణవివక్షతకు వ్యతిరేకంగా ఒక నటుడి నిరసన

ఈ మధ్య ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై  జరిగిన వర్ణవివక్షతా పూర్వకమైన దాడుల నేపధ్యంలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒక సంచలనాత్మకమైన, సంవేదనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్రిస్బన్, ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ యూనివర్సిటీ పాఫ్ టెక్నాలజీ సినిమా రంగంలో అమితాబ్ సేవలకుగానూ ఇవ్వజూపిన గౌరవ డాక్టరేట్ తిరస్కరించారు. అమితాబ్ తన బ్లాగులో ఈ విషయం వివరిస్తూ “I mean no disrespect to the Institution that honors me, but under the present circumstances, where

కిరా కనుమరుగైందా?

Kira Argounova. Ayn Rand వ్రాసిన ‘We the Living‘ అనే నవలలోని హీరోయిన్. ఆ నవలని సినిమాగా ఒక ఇటాలియన్ దర్శకుడు Ayn అనుమతి లేకుండా తీశాడు. అది తరువాత ఎలాగో Ayn కి తెలిసింది. చాలా కాలం తరువాత. దాని గురించి చాలా చోట్ల ఉంది. కనుక నేనా విషయాలను ప్రస్తావించ బోను. ఒక లింక్ ఇస్తే చాలు కదా. అందుకే నేను వేరే విషయాలని ప్రస్తావిస్తాను. కాస్త నవల గురించి, కాస్త సినిమా

అసామాన్య నటుడు-కమల్‌ హాసన్-2

కమల్‌హాసన్‌ ఒక నిరంతర నటతపస్వి. ఆయనలోని నటనార్తి తీర్చుకోవడానికి బహుపాత్రలను పోషించాడు. ఒకే సినిమాలో డబుల్‌రోల్స్‌ని, ట్రిపుల్‌రోల్స్‌ని పోషించినా, ప్రతీ పాత్రలో కంప్లీట్‌ డిఫరెన్స్‌ని చూపించి నటనకే, నటించడం నేర్పిన హీరో. కమల్‌ – సినిమాలలో మొదట కొరియోగ్రాఫర్‌గానే రంగప్రవేశం చేశాడు. మన తెలుగు సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావుకు సినిమాలలో స్టెప్పులేయించాడు కూడా. ఆయనలోని డాన్సింగ్‌ స్కిల్స్‌ని ఆధునిక తరహాలో చూపించే అవకాశం. డ్యాన్స్‌మాస్టర్‌ సినిమాలో వచ్చింది. ఇందులో ఆయన చేసిన మోడ్రన్‌ డ్యాన్సులకు మంచి పేరొచ్చింది.

యం.యస్.సత్యూ-ఒక పరిచయం

స్వాతంత్ర్యానంతరం దేశ విభజన కాలంలో ముస్లిం ప్రజల మానసిక స్థితి, ఆ సమయంలో తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలిపోవడంలో వారు పొందిన బాధ, స్వార్థ రాజకీయపు ఎత్తుగడలకు బలయిపోయిన ఆనాటి ముస్లింల జీవన స్థితిగతులు, వారి సంస్కృతి అన్ని కలగలిసి ఆనాటి చారిత్రక సంఘటనల్ని వాస్తవంగా హృద్యంగా మన కళ్ళ ఉమ్దుంచుతుంది ఉర్దూ చిత్రం ’గరమ్ హవా’. ఆనాడు ప్రజలందరిలోనూ కదలాడిన సమైక్యతా భావాన్ని ’గరం హవా’ ఆద్యంతమూ చూపిస్తుంది. ఉర్దు రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్

Cannes 2009-అవార్డులు

ఈ నెల 13 నుంచి ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు తో ముగిసింది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు మరియు నటీ నటులకు ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించబడ్డాయి. 2001 లో Piano Teacher సినిమాకి గ్రాండ్ ప్రి అవార్డ్ అందుకున్న మైఖేల్ హనికి ఈ సంవత్సరం వైట్ రిబ్బన్ సినిమాకి గానూ ప్రతష్టాత్మకమైన Palme d’Or అవార్డు అందుకున్నారు.