“విజయ విశ్వనాథం”: ఎంత మాటన్నాడు

vijaya-viswanatham

vijaya-viswanathamనా పేరు అనంతరామ శర్మ. మీకు తెలిసే ఉంటుంది. మీకందరికీ మీదైన ప్రపంచం, బాహ్య ప్రపంచం నాకు మాత్రం ఉన్నది ఒకటే ప్రపంచం. అదే సంగీతం.

ఈ ప్రపంచం లో హిమనగర, సాగర చందమున ఎన్నియో ఎత్తుపల్లములున్నవి. సంగీతమునండునూ స్వరములందు హెచ్చుతగ్గులున్నవి. అలాగే నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. కానీ నా జీవితం సంగీతమే కావటం నా అదృష్ట దురదృష్టమో లేక దురదృష్ట అదృష్టమో. నా జీవితంలోని అన్నిఎత్తులూ, ఉన్నా ఒకేఒక్క ఒక్క పల్లమూ, (నీరు పల్లమెరుగును అంటారు. ఒక సారి పల్లపు మార్గము పడితే ఎంత మాత్రం ఎగువకు చేరలేదు. జీవితంలో ఎగువకు వెళ్ళలేదు. నేనూ నీరైపోయాను. అసూయతో. ఇక నా జీవితం పల్లానికే దారి తీసింది. అదే నా పతనం.) సంగీతం వల్లనే.

ఆ కుర్రాడు ఎంత మాటన్నాడు. నన్ను పీటర్ కీటింగ్! అసలు వాళ్ళు తెలిసే అనగలిగాడా? ఆ మాటన్నప్పుడు నా సహధర్మచారిణి కూడా అవాక్కయింది. నాకైతే ఒక పిడుగు నా నెత్తిన పడినట్టయింది. ఈ అనంతరామశర్మ కీటింగ్? అదే ఒకప్పుడైతే ఎవరన్నా నా ముందు నిలబదాలంటేనే భయపడేవారు. నాకు సన్మాన సత్కారాలు చేసేటందుకు వేచి చూసేవారు. అచ్చు శంకర శాస్త్రి మాదిరిగానే. నేనూ ఆయన మాదిరిగానే సంగీతంలో మునిగిపోయాను. నా సర్వశక్తులూ దానిమీదే ఒడ్డాను. శంకర శాస్త్రి కన్నా నేను ఎందులో తక్కువ? ఆయన Roark. మరి నేను కీటింగ్? ఎంత అవమానం?

జీవితంలో పతనమైయ్యాను కానీ, మరీ ఇంతలానా?

అసలు సంగీతమంటేనే తెలియని ఒక సాధారణ యువకుడు నన్నంత మాట అంటాడా? సరిగమలు తెలుసునోలేదో? కీటింగ్! కీటింగ్! కీటింగ్! This is cheating. ఒకసారి తప్పు చేసినంత మాత్రాన ఎప్పుడూ తప్పు చేస్తారని నియమేమన్నా ఉన్నదా? అని నన్ను ప్రశ్నించిన వాడు! ఇప్పుడిలా అంటాడా? అవునులే. ఒకసారి పతనమైన మనిషంటే అందరికీ చులకన. ఎన్ని వత్సరములు గడచినా… అనంతరామ శర్మ అంటే… ఒక అసూయా పరుడు. ఒక చిన్న పిల్లాడి మరణానికి కారణమైన నీచుడు. అంతే కానీ నా సంగీత పరిజ్ఞానం, అపరిమిత విజ్ఞానం ఎవరికీ పట్టవు. అసలు ఎవరూ తప్పులే చేయనట్టు.

నాకు పద్మ అవార్డు వచ్చినప్పుడు నేను దానిని తిరస్కరించటమే తెలుసు మీకు. కానీ నాకు కలిగిన ఆవేదన ఎవరికనా పట్టినదా? నాకన్నా అర్హతలు తక్కువ ఉన్న వ్యక్తులతో పాటూ నాకు ఇస్తే నేను ఎలా స్వీకరిస్తానని అనుకున్నారు?

అవును నేను సంగీతంలోనే మునిగిపోయాను. నిజంగానే మునిగిపోయాను. బయట ప్రపంచం తెలియనంత. Child prodigy కావలసిన వాడిని నేను నా అసూయతో అంతం చేశానని అసూయ అంటే తెలియదని చెప్పుకున్న ఆ కుర్రాడు అన్నాడా? అనలేదు. కానీ జనం అన్న ఆ మాటని నేనంత మరిచిపోజూసినా కుదరని పరిస్థితులు. కానీ నేనొక child prodigy ని కాదా?

కీటింగ్ కి అసలు వాస్తునిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం లేదే? అతడు ఒక పరాన్న భుక్కు. కానీ నేను ఎన్నో, ఎన్నెన్నో గీతాలనూ, క్రుతులనూ కూర్చాను. ఎందరినో నా గాత్ర మాధుర్యం తో అలరించాను. ఏ గంగాధరం మరణానికి నేను కారణమయ్యానో… (హత విధీ…! నన్ను నేనే నిందించుకుంటున్నానే…? ఎంతలా దిగజార్చారు నన్ను జనులు?) కాదు కాదు, కారణమని నిందలు ఎదుర్కున్నానో ఆ గంగాధరాన్ని చేరదీసినది నేను కాదా? కోతికొమ్మచ్చులాడే వాడిని ఒక దారిలోపెట్టింది నేను కాదా? అవన్నీ…. ఎందుకులే.

నా జీవితాన్ని చెపుతాను. వినండి ముందు. నా బాల్యం అంతా సంగీతోపాసనలోనే గడచినది. నా యౌవ్వనమంతా కూడా అందులోనే కరగిపోయింది. నాకు సంగీతం తప్ప వేరేదీ లేనంత గా అది నా జీవితంలో పెనవేసుకుని పోయింది. ఎంత శ్రమ పడ్డాను. ఎంత పరిశ్రమ చేసి నిర్మించుకున్నాను నా సంగీత సామ్రాజ్యాన్ని? అందులో మకుటం లేని మహా రాజు లా ఎదిగిపోవాలని ఎన్ని కలలని కన్నాను? (మకుటం ఉన్న మహా రాజైతే ఏమన్నా ఇబ్బందా అనే ఆ కొంటె కోణంగా నన్ను కీటింగ్ అన్నది!)

వివాహం అయినది. సహధర్మ చారిణి వచ్చింది. సంగీత పరమపద సోపానంలో నిచ్చేనలని ఎక్కే పని మీద ఉన్న నేను నా వయసునీ దాని హోరునీ పట్టించుకోనేలేదు. అలా నా జీవితం గోదారిలా, నిండు గోదారిలా ఉరకలు పరుగుల మీద సాగిపోతున్న తరుణంలో నాకు ఒక అడ్డు ఎదురైంది. గంగాధరం. నా సంగీత స్వరగంగా ప్రవాహానికి అడ్డుకట్టలా అవతరించాడు వాడు. గరళ కంఠుని పేరు పెట్టుకున్న వాడు నాలో నిలువెల్లా అసూయ అను విషమును నింపాడు. ఎందుకు? ఎందుకలా?

ఆ అసూయే నా జీవిత గమనాన్ని ఛిద్రం చేసింది. అసలు నాకు సంగీతమే తప్ప వేరొకటి తెలియనప్పుడు అసూయ ఎందుకు కలిగింది? ఎందుకలా? ఏమైంది నాకు. గొంతు తడారి పోతున్నది. వళ్ళంతా మంటలు పుట్టుచున్నది. మెదడు మొరాయిస్తున్నది. మనస్సంత సెగలు. హృదయం దహించుకుని పోతున్నది.
పైకి గాంభీర్యం. లోన అసూయ సెగలు. అసూయ నా మీద తన ప్రభావాన్ని చూపించటం మొదలెట్టింది. ఎందుకలా?

Hellow! Hellow! Dear Venkat! Let me speak. Let me speak for a while. Gimme a breathing space. ఆయన ప్రశ్నల పరంపరని నేను ఎదుర్కోగలను. నన్నూ మాట్లాడనీ. Don’t let him to blame me for calling him Peter Keating. I have my strong reasons. I wanna share my reasons. That’s why I came here. Hellow! Hell….

కాస్త ఆగమ్మా! పెద్దాయన కదా ఆయనని చెప్పనీ. నీకవకాశం ఎప్పుడూ ఉంటుంది. చెప్పక పోతే రాయొచ్చు. ఆయన మన అతిథి. తన భావాలని మనతో పంచుకునేటందుకు ఇక్కడకి వచ్చారు. Let him do it. Then you will be given your time.

అవును సంగీతమే నా ప్రపంచం. అందులోనే నా సర్వస్వాన్నీ ఒడ్డాను. కానీ గంగాధరం? అతిచిన్న వయసులోనే… నేను సాధనలో మునిగిన వఆయసులోనే ఆ స్వరగంగా ప్రవాహాన్ని, తన మస్తిష్క జటాజూటంలో బంధించటమే కాక… ప్రేక్షక, శ్రోత భగీరధులకి పంచనారంభించాడు. ఆ స్వర విపంచిని చూశాక నాలో ఒక అభద్రతా భావం వెన్నాదనారంభించింది. నా సంగీత ప్రపంచపు పునాదులు కదలనారంభించినాయి. మకుటం లేని మహారాజైన నాకు నా కిరీటం జారునేమో అన్న భావం ఎప్పుడు కలిగిందో నాకు విచక్షణ నశించనారంభించింది.

విచక్షణ లేని మానవడు పశువుతో సమానం. అంటే నేను ఆ రోజులలో పశువునయ్యాను. నాకు సంగీతమే ప్రపంచమెలాగో… ఆ గంగాధరానికీ అంతే. కానీ మా ఇద్దరి మధ్య తేడా ఎక్కడి నుంచీ వచ్చింది? ఎక్కడ మా మధ్య తేడా?

అందుకే గిమ్మీ ఏ ఛాన్స్ తో స్పీకే వర్డ్. మీకు సంగీతమే ప్రపంచం. అందులోకి మీరు కోరి వచ్చారు. పరిశ్రమ చేసి సాధించారు. అందుకే మీకు అహం పెరిగింది. ఎక్కువ తక్కువ లు కనిపించ సాగాయి. అంటే మీరు జనానికి విలువ కట్టటం ప్రారంభించారు. అంటే మీరు ఇతరులని లెక్క చేయటం ప్రారంభించారు. మీ స్వీయ గౌరవాన్నీ, … What I mean to say is that, you lost your sense of self respect, and were valuing yourself by taking others as standards. అదెప్పుడు మొదలైందో అప్పుడే మీరు మిమ్మల్ని కోల్పోసాగారు. మీ ఆలోచనలంతా గంగాధరమే నిండాడు. అతనికి జనం కొట్టే చప్పట్లే మీ చెవులలో ప్రతిధ్వనించసాగాయి. ఇక మీలో సంగీత జ్ఞానానికి స్థానం ఎక్కడ ఉన్నది?

స రి గ మ లు మీలోంచీ బయటకు రాగా వాటి స్థానం లో గంగాధరం అనే నాలుగాక్షరాలూ చేరాయి. అం..టే… అక్కడ అనంత రామ శర్మ లేదు. ఉన్నది గంగాధరమే. అంత మాత్రాన మీరిద్దరూ ఒకరిలో ఒకరు ఏకమై త్వమేవాహం అని అనుఉంనారా? అంటే అదీ లేదు. అతని సంగతి నాకు తెలియదు కానీ ఈ కొద్ది పాటి పరిచయం లో మీ గురించి నాకు అర్ధమైన దానిని బట్టీ… మీలో రెండు పార్శ్వాలు బయట పడ్డాయి. గంగాధరం. అనంతరామ శర్మ. అనంతరామ శర్మ native place లో గంగాధరం ఒక వైపూ, ఉల్టాగా మరో వైపూ… ఇది చాలదూ సంఘర్షణ మొదలవటానికి? మీలోని అహంకారి ఆ గంగాధరాన్ని తరమ లేక పోయాడు. అందుకే ఆ అనంతరామ శర్మ బయట ఉన్న గంగాధరం మీద పడ్డాడు. మీరా గంగాధరం లా ఉండలేరు. (ఒక సెలయేరులా… పిల్ల తెమ్మెరలా… ఆ ఈజ్ మీలో లేదు. రాదు. ఎందుకంటే మీరు సంగీతాన్ని కశతపది సాధించగా, ఆతనిలో అది అలవక గా వచ్చి చేరింది. మీది సంగీత ప్రపంచం, ప్రపంచమే ఆతని సంగీతమైనది. అదుకే చెట్లూ, పుట్టలూ, అన్నీ, ఈ ప్రకృతంతా ఆతని నేస్తం. అందుకే మీకు అతని మీద అసూయ కలిగింది..

అగ్గి రగిలింది. ఏదోకటి కాలకుండా ఆగాడు. మీ వ్యక్తిత్వం కాలనారంభించింది. దాన్ని ఆర్పుకోవాలంటే మీకు సెలయేటి లాంటి గంగాధరం కావాలి. అందుకే అతనిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడే…

You know? Happy men are the free men. And if youwant to destroy a person of his happiness, first you gotta destroy his source of happiness.

అందుకే గంగాధరానికి మీరొక పనిని అప్పగించారు. అతను అలవోకగా సాధించగానే, మీరు అతనిని తప్పు పట్టారు. He knew that he did that work his heart out. He knew, what he did was the best possible thing. కానీ మీ వల్ల అతనిలో ఒక దోషం ఏర్పడింది. అంతకుమునుపు అతనికి అతనే జడ్జ్. కానీ ఇప్పుడు అతనికి మీరొక ప్రమాణం అయ్యారు.అతనికి మిమ్మల్ని సంతృప్తి పరచటమే ప్రయారిటీ అయ్యింది. సంగీతం బ్యాక్ సీట్ తీసుకున్నది.

(సశేషం)


గమనిక: అనంతరామ శర్మ మాటలన్నీ తెలుగు వ్రాశాను. నా మాటలుగా వచ్చిన వాటిని నా జనరల్ టోన్ లో వ్రాశాను. అందుకే ఆంధ్రాంగ్ల సమ్మేళనం జరిగింది. కనుక మన్నించగలరు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

గీతాచార్య

రచయిత:

A wrong entrant at the right time, but belong everywhere ;-)

12 Comments to ““విజయ విశ్వనాథం”: ఎంత మాటన్నాడు”

  • దిద్దుబాటు.

    “మీది సంగీత ప్రపంచం అతనికి, మిమ్మల్ని సంతృప్తి పరకాహ్తం అతనికి మిమ్మల్ని అని అతనికి అసూయ కలిగింది.” అని ఉన్న చోట నిజానికి…

    “మీది సంగీత ప్రపంచం, ప్రపంచమే ఆతని సంగీతమైనది. అదుకే చెట్లూ, పుట్టలూ, అన్నీ, ఈ ప్రకృతంతా ఆతని నేస్తం. అందుకే మీకు అతని మీద అసూయ కలిగింది.” అని ఉండాలి.

    I’m sorry for the error.

  • సూపర్.
    ఒకటి. ఫౌంటెన్ హెడ్ పాత్రలను విశ్వనాథ సినిమాలోని పాత్రలోతో పోల్చడం ఒక ఎత్తు. అయితే అది ఒక హై కాన్సెప్ట్. వినడానికి బావుంటుంది. కానీ అది కేవలం హై కాన్సెప్ట్ కాదని మీ వ్యాసాలు ఒక్కొక్కటి నిరూపిస్తున్నాయి. మీమీదున్న ఒకే ఒక్క కంప్లైంట్ ఏంటంటే మీరు ఒక్కో వ్యాసానికి చాలా గ్యాప్ ఇస్తున్నారని. ఇది నా కంప్లైంట్ కాదు. నాకైతే ఈ గ్యాప్ బావుంది. మీకూ ఆలోచించడానికి టైమ్. మీ వ్యాసాలు బాగా అర్థం చేసుకోవడానికి మాకు టైమ్.
    కంటిన్యూ….
    వీలైతే ఈ వ్యాసాలన్నీ కెవి కి చూపిద్దాం త్వరలో…

    • మొత్తానికీ చాలా బాగా పట్టుకున్నారు. విశ్వనాథానికి చూపిస్తే అతనికి మంచి ప్రోత్సాహం అవుతుంది.మరిన్ని మంచి వ్యాసాలని అందించగలడు. కాస్త టైం తీసుకున్నా విషయం బాగా తేవటమే కాదు. శైలినీ presentation slyle నీ మార్చేసి రాయటం అతని capability ని చూపెడుతున్నది.

  • At some times going beyond expectations. That’s also a problem for the gap in between the posts. Am I right? Excellently constructed views. A good sequencial progression of the events. Meeting Anantharama Sharma, talking to him, ఆయన అంతర్మధనం.

    The only doubt is that…. you wrote, “ఆ కుర్రాడు ఎంత మాటన్నాడు. నన్ను పీటర్ కీటింగ్! అసలు వాళ్ళు తెలిసే అనగలిగాడా? ఆ మాటన్నప్పుడు నా సహధర్మచారిణి కూడా అవాక్కయింది.”

    Where has she gone after that? Or you are going to use her for another side of the issues? Nice views.

  • The last five paragraphs are well written.

    “మీమీదున్న ఒకే ఒక్క కంప్లైంట్ ఏంటంటే మీరు ఒక్కో వ్యాసానికి చాలా గ్యాప్ ఇస్తున్నారని. ఇది నా కంప్లైంట్ కాదు. నాకైతే ఈ గ్యాప్ బావుంది. మీకూ ఆలోచించడానికి టైమ్. మీ వ్యాసాలు బాగా అర్థం చేసుకోవడానికి మాకు టైమ్.”

    కళ్ళు తెరిపించారు వెంకట్ గారు. ఇక లేట్ గురించి నో కంప్లైంట్స్. I used to make fun of that heavy gap.

    Still, I can not wait for the next episode.

  • ఏమీ రుజువు చేయకపోయినా ఈ వ్యాసాలు చదవడానికి సరదాగా, కొత్త వరవడిలో వున్నాయి. అయాన్ రాండ్ ని చదివిన వాళ్ళ ప్రపంచంలోకి తొంగి చూసినపుడల్లా నాకు కాస్త జాలి, కాస్త భయమూ కలుగుతుంది. వాళ్ళు ప్రపంచాన్ని రోర్కుల్లోకీ, కీటింగుల్లోకి విడగొట్టి చూస్తారు. ఈ విశాలమైన ప్రపంచాన్ని చెమట పట్టిన ఇరుకు పిడికిళ్ళలో బిగించాలని ప్రయత్నిస్తుంటారు. నాకీ వ్యాసాల్లో అదే కనిపిస్తుంది. స్నేహితుడు త్వరగా బయటకొచ్చి స్వేచ్ఛాగాలులు పీల్చుకోవాలని ఆశిస్తున్నాను.

    • @ Meher,

      Thank you for the comment, which is entirely in a new way.

      “అయాన్ రాండ్ ని చదివిన వాళ్ళ ప్రపంచంలోకి తొంగి చూసినపుడల్లా నాకు కాస్త జాలి, కాస్త భయమూ కలుగుతుంది.”

      నాకూ అలాగే అనిపిస్తుంటుంది మరి. అలా విడగొట్టి చూసే నాకు ఈ మధ్య చాలా విషయాల్లో లోకజ్ఞానం కలిగి కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. I’m now atleast understanding the motives behind other people’s actions. Also, I got an answer for why people have ‘అసూయ’.

      My aim is not to completely compare the Ayn’s characters with that of KV’s. But to study an interesting equivalancy between those two types of charachers, and as I said in my first post, a case study of the Gurus. (The decreasing status in his movies. And also try to evaluate on my own the motives behind those characters.

      చదవడానికి సరదాగా, కొత్త వరవడిలో వున్నాయి.

      Many thanks for this comment. I always try to generate a new style for each of my essay.

  • @Venkat,

    I hope you know what I’m going to say.

  • నవతరంగం అక్షరాలు సరిగా కనిపించడం లేదు. మిగిలిన వెబ్ పత్రికలు, బ్లాగులు సరిగానే కనిపిస్తున్నాయి. సలహా ఇవ్వండి.

    • సరిగా కనిపించటం లేదంటే….అక్షరాలు చిన్నవిగా కనిపిస్తున్నాయా?లేక పిచ్చి పిచ్చి సింబల్స్ కనిపిస్తున్నాయా?

  • అక్షరాల గుణింతాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు విడివిడిగా ముక్కలై కనిపిస్తున్నాయి. ఈ సమస్య కొన్ని బ్లాగులు, వెబ్ పత్రికల్లో మాత్రమే.

  • Very nice. Am going to read the old ones. The last five paragraphs are gripping!!! Right.

    @Meher,

    Good joke.

    @Srujana Ramanujan,

    Interesting question.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories