Menu

Monthly Archive:: April 2009

“విజయ విశ్వనాథం”: ఎంత మాటన్నాడు

నా పేరు అనంతరామ శర్మ. మీకు తెలిసే ఉంటుంది. మీకందరికీ మీదైన ప్రపంచం, బాహ్య ప్రపంచం నాకు మాత్రం ఉన్నది ఒకటే ప్రపంచం. అదే సంగీతం. ఈ ప్రపంచం లో హిమనగర, సాగర చందమున ఎన్నియో ఎత్తుపల్లములున్నవి. సంగీతమునండునూ స్వరములందు హెచ్చుతగ్గులున్నవి. అలాగే నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. కానీ నా జీవితం సంగీతమే కావటం నా అదృష్ట దురదృష్టమో లేక దురదృష్ట అదృష్టమో. నా జీవితంలోని అన్నిఎత్తులూ, ఉన్నా ఒకేఒక్క ఒక్క పల్లమూ, (నీరు పల్లమెరుగును అంటారు.

భూమిక

ఆమె జీవితాన్ని ప్రేమించింది. ప్రేమకోసం తపించింది. గాఢమయిన ప్రేమ కోసం ఆమె జీవితాంతం పరుగులుతీసింది. కాని ఆమె ఆశించినంత గొప్ప ప్రేమ, గొప్ప ఆలంబన ఆమె జీవితయాత్రలో తారసపడలేదు. కాని సినిమా తెరపైన మెరుపులు మెరిపిస్తూ అసలు జీవితంలో అనంతమయిన దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, నిరాశ నిస్పృహల్ని తోడుగా చేసుకొని గడ్డిపరకలాంటి ఆలంబన లభించినా ఆశగా, ఉద్వేగంగా అందుకుంది. కాని ఆమె ఆశలకు, స్వేచ్చాభిలాషకు, వాస్తవ అనుభవానికి మధ్య అగాధం లాంటి అంతరంతో ఆమె తన జీవితాన్ని గడిపింది.

మాస్కో,బెల్జియం

అప్పుడెప్పుడో చూసిన Man Bites Dog అనే సినిమా తప్ప వేరే బెల్జియన్ సినిమాలేవీ చూసినట్టు నాకు గుర్తులేదు. Man Bites Dog కాకుండా నాకు పరిచయున్నఇంకొక బెల్జియన్ సినిమా L’Enfant. ఈ సినిమాకి 2005 లో Cannes లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు తప్ప బెల్జియన్ సినిమాల గురించి ఏమీ తెలియని నాకు మొన్న బుకరెస్ట్, రొమానియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒకేసారి రెండు బెల్జియన్ సినిమాలు చూసే

గోడలు బద్దలు కొట్టేవారు కావాలి.మీరేమంటారు?

ఈ వ్యాసం రాయడానికి కారణాలు: టీ వీ ల లో సినిమా ట్రయలర్స్ గురించి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ ప్రధాన కార్య దర్శి శ్రీ టీ .వి. డి. ప్రసాద్ గారు ఇచ్చిన ప్రకటన ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టిమరీ లోక్ సత్తా పార్టీ జాయప్రకాష్ నారాయణ మీడియా ని దుమ్మెత్తిపోయడం యుధ్ధం లొ పాలుపంచుకోండి అని నేను రాసిన వ్యాసం. గత కొన్ని నెలలుగా మా మిత్రుల మధ్య జరిగిన

Monsieur Morimoto

1999,జపాన్. నలభై ఏళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైరయిన ఒక ముసలాయన రిటైరయ్యాక కృష్ణా,రామా అనుకుంటూ మూల కూర్చుని ఉంటే నేనీ పోస్ట్ రాయడం ఇక్కడే ఆగిపోయుండేది. కానీ ఆయనలా చెయ్యలేదు. మిగిలిన జీవితాన్ని తనకిష్టమొచ్చినట్టు గడపాలనుకున్నాడు. అంతే జపాన్ టు అమెరికా. అమెరికా టు Tahiti. అక్కడ్నుంచి ఇంకెక్కెక్కడికో. చివరిగా ఫ్రాన్స్ లోని పారిస్ చేరుకున్నారు. 2001, ప్యారిస్. ప్రపంచ కళల (కలల) రాజధాని చేరుకున్న ఆ పెద్దాయన ప్యారిస్ తో ప్రేమలో