Menu

Monthly Archive:: April 2009

చక్ర

మహానగరాల్లో భవంతుల నీడన విస్తృతంగా పరుచుకున్న మురికివాడల్లో నివసించే జనజీవితాన్ని సూటిగా, స్పష్తంగా రికార్డు చేసిన చిత్రం “చక్ర”. ఆ మురికివాడల్లో నివసించే ప్రజల మధ్య సజీవంగా నిలిచి ఉన్న సంబంధాల్ని కుహనా విలువలకు తావులేని వారి స్త్రీ పురుష సంబంధాల్ని “చక్ర” అత్యంత నిజాయితీగా విశదం చేసింది.ముఖ్యంగా “చక్ర”లో స్మితాపాటిల్ పాత్ర (అమ్మ) అన్ని ముసుగుల్ని తగులబెడ్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా జీవించడాన్ని ఆ పాత్ర అనుసరిస్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా భుక్తికోసం జీవనం కోసం

కమల్ స్క్రీన్ ప్లే వర్క్ షాప్

కమల్ హాసన్ సినీ ప్రియులకోసం ఓ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ ప్లాన్ చేసారు. ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో ఈ వర్క్ షాప్ మే ఇరవై తొమ్మిదవ తేదీ నుంది జూన్ మూడవ తేదీ వరకూ జరగుతుంది. ఈ వర్క్ షాప్ లో బెస్ట్ స్క్రీన్ రైటర్స్,ఫిల్మ్ మేకర్స్ ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత Jean Claude Carriere వీడియో కాన్ఫెరెన్స్ ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కమల్

జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు

నేను మళ్ళీ జానకి గారి గురించి రాస్తున్నా. 🙂 ఏప్రిల్ 23 ఆవిడ పుట్టినరోజు. కనుక ఇది శుభాకాంక్షల వ్యాసం అనమాట. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళం సినిమాల పాటలు వినేవరెవరికైనా ఈ పేరు పరిచయమక్కర్లేనిది. అంటే, అక్కడికి జాబితా ఐపోయిందనుకునేరు – హిందీ, ఒరియా, కొంకణి, బెంగాలి, తుళు వంటి మనభాషలే కాక, సింహల, జర్మన్, బడుగ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారంటే ఇక అర్థం చేసుకోండి ఆవిడ నేర్పును. ఇంకోరు పాడలేరని కాదు, భాషరాకుండా ఆ

చలనచిత్రాలలో ఛాయాగ్రహణ౦

ఒక వ్యాఖ్యాన్ని చక్కటి అర్థ౦ వచ్చేటట్టు కూర్చాల౦టే, దానికి స౦బ౦ధి౦చిన పదాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. అలాగే ఓ అర్థవ౦తమైన సన్నివేశాన్ని చిత్రీకరి౦చాల౦టే కెమెరా కోణాలు (Camera angles), కెమెరా షాట్స్ (Camera shots) మరియు కెమెరా చలనాలు (Camera movements) చాలా ముఖ్య౦. వీటన్ని౦టిని కలగలిపితే వచ్చేదే ఛాయాగ్రహణ౦. కెమెరా కోణాలు (Camera angles) నిర్ణయి౦చడానికి ము౦దు ఈ క్రి౦ది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అ) ఫ్రేము మరియు షాట్ యొక్క నిడివి. ఆ)

ఇండియా క్యాబరే

అత్యంత ప్రతిభావంతమైన దృశ్య శ్రవణ మాధ్యమమైన ‘ సినిమా ‘ తెరపైన స్త్రీని వినియోగ వస్తువుగానూ, వినోద సాధనంగానూ చిత్రించడం మొదట్నించీ వస్తుంది. అనేక సామాజిక, ఆర్ధిక కారణాల నేపధ్యంలో వ్యభిచార వృత్తిలోనూ, డాన్సింగ్ గర్ల్ గానూ, కోఠేవాలీగానూ మారిన స్త్రీల జీవిత ఇతివృత్తాలతో భారతీయ సినిమా రంగంలో అనేక సినిమాలు వచ్చాయి. మూకీయుగం నుంచి కూడా ఆ ఒరవడి మనకు కనిపిస్తుంది. ‘ మొగల్ ఎ అజం, పాకీజా, దేవదాస్ ‘ లాంటి సినిమాల్లో ఉదాత్తమయిన